అల్లు అర్జున్‌కు అండగా బండి సంజయ్‌ | Minister Bandi Sanjay Key Comments On Allu Arjun Over Sandhya Theatre Controversy, More Details Inside | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌కు అండగా బండి సంజయ్‌

Published Sun, Dec 22 2024 1:02 PM | Last Updated on Sun, Dec 22 2024 1:37 PM

Minister bandi Sanjay Key Comments Over Allu Arjun

సాక్షి, ఢిల్లీ: తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ నేతలకు ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని కామెంట్స్‌ చేశారు.

కేంద్రమంత్రి బండి సంజయ్‌.. సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌కు బాసటగా నిలిచారు. తాజాగా బండి సంజయ్‌ మాట్లాడుతూ..‘అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సంధ్య థియేటర్‌ వద్ద ఘటనలో మహిళ మరణాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించారు. శ్రీతేజ్ కోలుకోవాలని అందరూ కోరుకోవడంతోపాటు ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.

సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని మరీ.. సినిమా లెవల్‌లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గు చేటు. ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోంది. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచింది. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్‌ పార్టీకి అదే గతి పడుతుంది. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చనిపోతుంటే ఏనాడైనా పరామర్శించారా?. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ఎవరైనా బాధ్యత వహించారా?. మీకో న్యాయం.. ఇతరులకు ఒక న్యాయమా?. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. లేనిపక్షంలో బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement