వాషింగ్టన్ : ధరిత్రి మరువని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిరస్మరణీయులు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నవిషయం అందరికీ తెలిసిందే. వైఎస్సాఆర్ 10వ వర్ధంతి పురస్కరించుకొని అమెరికాలోని వైఎస్సార్సీపీ యూఎస్ఏ, వాషింగ్టన్ డీసీ మెట్రో ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఆయన వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు అమెరికాలోని స్టెర్లింగ్ సిటీ, వర్జీనియా,యూఎస్‌ఏ లోని ఇనోవా బ్లడ్ డోనర్ సెంటర్ లో రక్త దాన కార్యక్రమాలు నిర్వహించి ఘనమైన నివాళి అర్పించారు.
ఈ రక్తదాన కార్యక్రమానికి మేరీల్యాండ్, వర్జీనియా, వాషింగ్టన్ డీసీ నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.వైఎస్సార్‌సీపీ అమెరికా ఎన్ ఆర్ ఐ కమిటీ అడ్వైసర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ వల్లూరు రమేష్ రెడ్డి, వర్జీనియా రీజినల్ ఇంచార్జి శశాంక్ రెడ్డి అరమడక, శ్రీ సత్య పాటిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా పాల్గొనగా, 50 మంది రక్తదానం చేశారు.
'ఆరోగ్యప్రదాత, అన్నదాతల కల్పతరువు, పేదల దివ్యదాత ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత. తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోని మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కార్యక్రమానికి హాజరైన పలువురు పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే "రాజన్న పరిపాలన"కు చిరునామాగా నిలిచారాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి ప్రసన్న కాకుమాని, మేరీల్యాండ్ స్టేట్ ఇంచార్జి పార్థ బైరెడ్డి, వర్జీనియా స్టేట్ ఇంచార్జి ఆంజనేయ రెడ్డి, దొందేటి శ్రీని గోపన్నగారి, వినీత్ లోక , రఘునాథ్ రెడ్డి , సుజిత్ మారం, మదన గళ్ళ, అనిత ఎరగంరెడ్డి , శ్రీరేఖ సంగీతం, శిరీష భీమిరెడ్డి, సుమంత్ మోపర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment