YSRCP NRI wing
-
కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
కాలిఫోర్నియా: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా.వైఎస్‌రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా అమెరికాలో కాలిఫోర్నియా, బే ఏరియాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం జులై 10వ తేదీ ఉదయం,ఆహా ఇండియన్ హోటల్లో జయంతి వేడుకలను నిర్వహించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం,. ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న మహానేత అని వైఎస్సార్సీపీ అమెరికా గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కేవీరెడ్డి గుర్తు తెచ్చుకున్నారు. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. విద్యార్థుల సంక్షేమం కోసం ఫీజు రీ ఎంబర్సుమెంట్, రైతులకు రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి అని నిరంతరం తపించిన వ్యక్తి ఆయన అన్నారు . వైఎస్సార్ స్పూర్తి, ఆశయాలతోవారి కుమారుడు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదర్స పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్సీపీ అమెరికా కమిటీ ముఖ్య సభ్యులు సురేంద్ర అబ్బవరం, కిరణ్ కూచిభట్ల , సహదేవ్ బోడె , తిరుపతిరెడ్డి , వెంకట్ , అంకిరెడ్డి , ఆనంద్ బందార్ల, అశోక్, ప్రశాంతి, అమర్ బడే తదితరులు వైఎస్సార్ సేవలను, సంక్షేమ పాలనను వారితో గల అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. వారి తనయుడు ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమలో బే ఏరియా వైస్సార్ అభిమానులు హరి, కొండారెడ్డి , త్రోలోక్ , సుబ్బారెడ్డి , రామిరెడ్డి , నరేంద్ర కొత్తకోట, వినయ్, ఇతర వైఎస్సార్సీపీ స్టూడెంట్ విభాగం నాయకులూ పాల్గొన్నారు. -
పట్టాభి తీరు సమర్థనీయం కాదు.. పార్టీలకతీతంగా ఖండించాలి
షికాగో: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నేతలు వాడిన అసభ్య పదజాలాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అమెరికాలోని షికాగోలో జనాగ్రహదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకుడు కొండపల్లి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ... మీ కార్యకర్తలు, మీ కుటుంబ సభ్యులను బోషిడికే అనే పదంతో పిలుస్తారా అంటూ టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్‌ని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు తప్పు చేస్తే నాయకుడిగా సరిదిద్దాల్సి పోయి చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తి ఆ బూతులను సమర్థించడం దారుణమన్నారు. ఆఖరికి ఉన్నత విద్యావంతులమని చెప్పుకునే ఎన్ఆర్ఐ వింగ్ సైతం ఆ బూతులను వంతపాడటం దారుణమన్నారు. వైఎస్సార్ కుటుంబంపై జరిగినటువంటి నీచమైన దాడులు రాజకీయాల్లో ఏ ఫ్యామిలీపైనా జరగలేదని, కేవలం ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతోనే వైఎస్ జగన్ అన్నింటిని భరిస్తూ ముందుకు సాగుతున్నారని యత్తపు శరత్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో పట్టాభి అనుసరించిన నీచ పద్దతిని పార్టీలకు, మతాలకు, దేశాలకు అతీతంగా అంతా ఖండిచాలని ఈ దీక్షలో పాల్గొన్న నాయకులు కోరారు. ఈ జనాగ్రహ దీక్షలో భీమ్‌రెడ్డి అల్వాల, వెంకటేశ్వరరెడ్డి, వెంకట్ ముమ్మడి, శ్రీధర్‌రెడ్డి అలవాల, విజయ్‌రెడ్డి సంకెపల్లి, రమేశ్ తుమ్మూరి, పవన్, సోహిత్, రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
న్యూజిలాండ్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు
ఆక్లాండ్ (న్యూజిలాండ్) : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 72 వ పుట్టినరోజు వేడుకలు న్యూజిలాండ్‌లో ఘనంగా జరిగాయి. వైయస్ఆర్సీపీ నాయకుడు బుజ్జే బాబు నెల్లూరి ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లో జులై 10న ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. వీరితో పాటు న్యూజిల్యాండ్ నుంచి అతిధులుగా పారిశ్రామికవేత్త కృష్ణారెడ్డి, వ్యాపారవేత్త నరేంద్రరెడ్డిలు కూడా హాజరయ్యారు. భారతదేశం నుంచి వైయస్ఆర్ మేధో వేదిక తరఫున ఎన్. శాంతమూర్తి , నెల్లూరి మదన్ మోహన్, తాళ్లూరి లతలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్‌కి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కిలారి శివ, శామ్యూల్ రెజినాల్డ్, ప్రతాప్ రెడ్డి , డాక్టర్ రవి ముసుగు, ప్రవీణ్, జాన్ బాబు, కృష్ణ చైతన్య, దిలీప్ కుమార్, ఆనంద్ కిరణ్, విపుల్ బాబు, కోడమల దీపక్, శ్రీధర్ బాబులు హాజరయ్యారు. -
యూఎస్‌లో ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు
వాషింగ్టన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే ఊపిరిగా.. రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియాలలో శనివారం మార్చి 13వ తేదీన దశాబ్ది ఉత్సవాలను వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొన్నారు. ఈ కార్యక్రమానికి యూఎస్ఏ కన్వినర్ చంద్రహాస్ పెద్ధమల్లు , గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కేవీ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతల పునాదులపై పార్టీ పుట్టిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఇడుపులపాయలో మొదలై ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్ర ద్వారా జనం గుండె చప్పుడులోంచి వైఎస్సార్సీపీ మేనిఫెస్టో రూపొందించిందన్నారు . ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే నవరత్నాలు, సంక్షేమ పధకాలు, ఇదివరకెన్నడూ ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో సంస్కరణలకు నాంది పలికారన్నారు. "నాడు–నేడు" కార్యక్రమంల వల్ల ప్రభుత్వ సూళ్ల రూపు రేఖలే మారిపోతున్నాయి చెప్పారు. వైద్య రంగం, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగాలలో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ కమిటీ సభ్యులైన సురేంద్ర అబ్బవరం, నరేంద్ర కొత్తకోట , హారిన్ద్ర శీలం , కిరణ్ కూచిబొట్ల , ప్రశాంతి ,సుబ్బారెడ్డి, దిలీప్ , రామచంద్ర రెడ్డి , అంకిరెడ్డి, ఇతర వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
వాషింగ్టన్ డి.సిలో వైఎస్సార్‌కు ఘనమైన నివాళి
వాషింగ్టన్ : ధరిత్రి మరువని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిరస్మరణీయులు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నవిషయం అందరికీ తెలిసిందే. వైఎస్సాఆర్ 10వ వర్ధంతి పురస్కరించుకొని అమెరికాలోని వైఎస్సార్సీపీ యూఎస్ఏ, వాషింగ్టన్ డీసీ మెట్రో ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఆయన వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు అమెరికాలోని స్టెర్లింగ్ సిటీ, వర్జీనియా,యూఎస్ఏ లోని ఇనోవా బ్లడ్ డోనర్ సెంటర్ లో రక్త దాన కార్యక్రమాలు నిర్వహించి ఘనమైన నివాళి అర్పించారు. ఈ రక్తదాన కార్యక్రమానికి మేరీల్యాండ్, వర్జీనియా, వాషింగ్టన్ డీసీ నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ ఆర్ ఐ కమిటీ అడ్వైసర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ వల్లూరు రమేష్ రెడ్డి, వర్జీనియా రీజినల్ ఇంచార్జి శశాంక్ రెడ్డి అరమడక, శ్రీ సత్య పాటిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా పాల్గొనగా, 50 మంది రక్తదానం చేశారు. 'ఆరోగ్యప్రదాత, అన్నదాతల కల్పతరువు, పేదల దివ్యదాత ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత. తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోని మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కార్యక్రమానికి హాజరైన పలువురు పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే "రాజన్న పరిపాలన"కు చిరునామాగా నిలిచారాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి ప్రసన్న కాకుమాని, మేరీల్యాండ్ స్టేట్ ఇంచార్జి పార్థ బైరెడ్డి, వర్జీనియా స్టేట్ ఇంచార్జి ఆంజనేయ రెడ్డి, దొందేటి శ్రీని గోపన్నగారి, వినీత్ లోక , రఘునాథ్ రెడ్డి , సుజిత్ మారం, మదన గళ్ళ, అనిత ఎరగంరెడ్డి , శ్రీరేఖ సంగీతం, శిరీష భీమిరెడ్డి, సుమంత్ మోపర్తి తదితరులు పాల్గొన్నారు. -
‘జ్యోతి ప్రజ్వలన’పై సీఎం రమేశ్‌కు గట్టి కౌంటర్
సాక్షి, అమరావతి : అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డల్లాస్‌లో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని.. ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సభలో జ్యోతి ప్రజల్వన చేయడానికి నిరాకరించి.. హిందువులను కించపరిచారంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ట్విటర్ వేదికగా దుష్ర్పచారానికి ఒడిగట్టారు. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఆయన ట్విటర్లో చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జ్యోతి ప్రజ్వలన విషయమై ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా సీఎం రమేశ్, బీజేపీ శ్రేణులు చేసిన ట్వీట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. సీఎం రమేశ్ అజ్ఞానంతో, హిందువులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే దురుద్దేశంతో ఈ ఆరోపణలు చేశారని నెటిజన్లు అంటున్నారు. నిజానికి అమెరికాలోని స్టేడియంలలో జ్యోతి ప్రజ్వలన లాంటిది చేయనివ్వరని, అగ్నిప్రమాదాలు జరిగే అవకాశముండటంతో స్డేడియం లోపల లైటర్ కానీ, అగ్గిపెట్టెను కానీ వాడటానికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించబోరని, అయినా, మైదానంలోకి ప్రవేశించే ముందే సీఎం వైఎస్ జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారని, వారి నుంచి హారతి తీసుకొని, బొట్టు పెట్టుకొని ఆయన స్టేడియంలోకి ప్రవేశించారని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. గతంలోనూ పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి.. సీఎం రమేశ్ దుష్ప్రచారాన్ని బట్టబయలు చేస్తున్నారు. సీఎం రమేశ్‌కు కౌంటర్ సీఎం రమేశ్ ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎన్నారై వింగ్ అధ్యక్షుడు కడప రత్నాకర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అమెరికాలోని స్టేడియంల లోపల జ్యోతి వెలిగించడానికి అక్కడి భద్రతా సిబ్బంది అనుమతివ్వలేదని, స్టేడియం లోపల ఎలాంటి నిప్పు వెలిగించరాదని కఠిన నిబంధనలు ఉన్నాయని ఆయన తెలిపారు. అందుకే స్డేడియంలో వేదిక మీద ఉన్న ఎలక్ట్రికల్ క్యాండిల్స్ వెలిగిస్తున్నట్లు చంద్రబాబులా వైఎస్ జగన్ యాక్టింగ్ చేయలేదని వివరించారు. అందుకే స్టేడియం లోపలికి వెళ్లేముందే సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు చేసి లోపలికి వచ్చారని తెలిపారు. కానీ కావాలని బీజేపీ, టీడీపీ నేతలు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భక్తి, మతం ముసుగులో రాజకీయాల కోసం మాఫియా ముఠాలు చెలరేగుతున్నాయని, వీరిని అరికట్టకపోతే మతాన్ని భ్రష్టుపట్టిస్తారని ఆయన మండిపడ్డారు. -
లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
లండన్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు సోమవారం లండన్ లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ యూకే అండ్ యూరప్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రిటన్ పర్యటనలో ఉన్న దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజానేత వైఎస్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ విభాగం ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యూకే అండ్ యూరప్ వింగ్ కన్వీనర్ సందీప్ రెడ్డి వంగల, పీసీ రావ్, ప్రదీప్ కత్తి, మన్మోహన్ రెడ్డి, అమరనాథ్ కల్లం, రవీంద్రారెడ్డి, ఎన్ఆర్ రెడ్డిలతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
పాల కన్నయ్య రెడ్డికి నివాళి
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ ఎన్నారై నేత పాల త్రివిక్రమ భానోజి రెడ్డి తండ్రి కన్నయ్యరెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు నివాళి అర్పించారు. కన్నయ్య రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్ హజరవాల్సిఉండగా.. అసెంబ్లీలో పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వల్ల రాలేకపోయారని భానోజిరెడ్డి పేర్కొన్నారు. అంతకు ముందు భాజోజి రెడ్డి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, నాగిరెడ్డిలను మర్యాదకపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. -
దుబాయ్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
దుబాయ్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మెహన్ రెడ్డికి గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్(యూఏఈ) సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ భారీ విజయాన్ని పురస్కరించుకుని లేబర్ క్యాంపుల్లో పనిచేస్తున్నవారికి ఆహారాన్ని వితరణ చేశారు. 250 ఆహారం పొట్లాలను పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. యూఏఈలో ఉంటున్న కార్మికులకు ఏ సమస్య వచ్చినా తమను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేశ్ రెడ్డి, సోమిరెడ్డి, అక్రమ్, నాజీర్, రమణ, బ్రహ్మానంద్ రెడ్డి, కుమార్ చంద్ర, దిలీప్, కోటి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రావులు పాల్గొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
దుబాయ్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవం
-
ఘనంగా వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం 9వ ఆవిర్భావ వేడుకలు
-
ఘనంగా వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం 9వ ఆవిర్భావ వేడుకలు
వాషింగ్టన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం 9వ ఆవిర్భావ వేడుకలు (ఏప్రిల్ 30, 2011లో ఆవిష్కరణ) వర్జీనియాలోని పెర్సిస్ (బంజారా) ఇండియన్ గ్రిల్, అష్బర్న్ సిటీలో ఘనంగా జరిగాయి. ఏనిమిది వసంతాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా వాషింగ్టన్ డిసి మెట్రో ప్రాంతములో వైఎస్సార్సీపీ సలహాదారు, గవర్నింగ్ కౌన్సిల్ (యూఎస్ఏ) వల్లూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియా నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ నుంచి గురజాల మాజీ ఎమ్మెల్యే మందపాటి నాగి రెడ్డి మనువడు శరత్ మందపాటి, నాటా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొదటగా వైఎస్సార్సీపీ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సభకు విచ్చేసిన ముఖ్య అతిధిని శాలువా, పుష్పగుచ్చాలతో వాషింగ్టన్ డీసీ మెట్రో పార్టీ ఎన్నారైలు సత్కరించారు. అనంతరం ఆంజనేయ రెడ్డి అతిధులను సభకు పరియం చేసి సభ యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీడీపీతో చేతులు కలిపి వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైలుకు పంపినా అధైర్యపడకుండా ప్రజా సంక్షేమం కొరకు పోరాడుతున్నారని ప్రశంసించారు. 2014 ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను, లోక్ సభ సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా అదరకుండా, బెదరకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారన్నారు. మే 23 తర్వాత భారీ మెజారిటితో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, మళ్లీ రాజన్న రాజ్యం చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నీతి మాలిన ప్రభుత్వానికీ చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడాలంటే వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్ జగన్ పాలనకై ఆంధ్ర ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని, వైఎస్ జగన్‌ను సీఎం చేసే బాధ్యత ప్రవాసాంధ్రుల అందరిపై ఉందన్నారు. అమెరికా లో ఉన్న ప్రతి వైఎస్సార్ అభిమాని, పార్టీ కార్యకర్తలు తమ నియోజకవర్గాలకు వెళ్లి పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. వీలు కాని వాళ్లు ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యలకు, సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ రెడ్డి మాట్లాడుతూ..‘ విశ్వసనీయతే మన బలం, ఎన్నికల్లో చేతకాని హామీలిచ్చి తీరా అధికారమొచ్చాక మాట తప్పి నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేయడం బాబు నైజం, ఒక మాటంటూ ఇస్తే ఆ మాట కోసం ఎందాకైనా వెళ్ళడం మన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇజం. మాట తప్పం, మడమ తిప్పం..ఇదే వైఎస్సార్ మనకు నేర్పిన సిద్ధాంతం’ అన్నారు. 2019 ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్సీపీ జెండా ఎగురు తుందని ఘంటాపథంగా అన్నారు. కలిసికట్టుగా ప్రయాణం చేసి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెర్సిస్ ఇండియన్ గ్రిల్ ఓనర్ శ్రీనివాస్ గొలుగూరి అందరికి కమ్మనైన విందు భోజనాన్ని పంచారు. ముఖ్యంగా వర్జీనియా, మేరీలాండ్, న్యూ జెర్సీ, నార్త్ కరోలినా, డెలావేర్, వాషింగ్టన్ డి.సి. ప్రాంతాల నుంచి దాదాపు 200 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐల బస్సుయాత్ర ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం బస్సు యాత్రను ప్రారంభించింది. ఈసారి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఎన్ఆర్ఐ విభాగం రంగం సిద్ధం చేసింది. రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెలుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖపట్నం వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద బస్సుయాత్రను ప్రారంభించారు. ఈ బస్సును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. యూఎస్, యూకే, సింగపూర్, మలేషియాలతో పాటూ వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు అందరూ కలిసి ఒక వింగ్‌గా ఏర్పడి వైఎస్ జగన్‌కు మద్దతుగా బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు గురవ్వకుండా వైఎస్సార్సీపీని గెలిపించాలని ఎన్ఆర్ఐలు కోరారు. ప్రత్యేక హోదా తీసుకు వచ్చే సత్తా కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ విభాగం నుంచి వెంకట్, వివిధ దేశాలనుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎన్నారై ప్రతినిధుల ప్రచారం.. అనూహ్య స్పందన!
సాక్షి, రాజమండ్రి: కొవ్వూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్నారై ప్రతినిధులు చేపట్టిన ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వైఎస్సార్సీపీ ఎన్నారై కో ఆర్డినేటర్ హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎన్నారై ప్రతినిధులు ఇంటింటికి తిరిగి.. ప్రజలను కలుసుకొని.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించాలని, ఫ్యాన్‌ను గుర్తుకు ఓటువేసి.. వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో వైఎస్సార్సీపీ గల్ఫ్, కువైట్ కన్వీనర్ ఇలియాస్ బీహెచ్, ముమ్మడి బాలిరెడ్డి, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, గల్ఫ్ ప్రతినిధులు షేక్ నాసర్, జీఎస్ బాబు రాయుడు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు లలితరాజ్, సలహాదారులు అబూ తురాబ్, యూత్ ఇన్చార్జ్ మర్రి కళ్యాణ్, వైస్ ఇన్చార్జ్ సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎన్నారైలు వజ్ర శేఖర్‌రెడ్డి, బాలరాజు, సత్తార్, ఇంతియాజ్, మురళీమోహన్ నాయుడు, గంగాధర్ రెడ్డి, ఆనంద్, భరత్, సిద్ధూ, వెంకట్ రెడ్డి, రమణారెడ్డి, రాజు, డానీ, జయకర్ రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇలియాస్, బాలిరెడ్డి, హర్షవర్ధన్ మాట్లాడుతూ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగం మళ్లీ రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గోవింద్ నాగరాజు, నరసారెడ్డి మాట్లాడుతూ ఎన్నకల సమయంలో అబద్ధాలు చెప్పడం చంద్రాబుకు అలవాటు అని, 2014 ఎన్నికల్లోనూ ఎన్నో అబద్ధాలు చెప్పి ఆయన అధికారంలో వచ్చి.. రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. -
దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
దుబాయ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్(యూఏఈ) తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు స్థానిక నాయకులు రమేశ్ రెడ్డి, సోమి రెడ్డి, దిలీప్‌కుమార్‌లు చెప్పారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఒక పార్టీని నడిపించాలంటే ఎన్నో వ్యవప్రయాసలతో కూడుకున్నదని, ఎంతో ఓపిక ఉండాలని అది వైఎస్ జగన్‌కే సాధ్యమైందన్నారు. సుమారు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి నిరంతరం ప్రజాసమస్యలు తెలుసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. ఇన్ని రోజులు కష్టాలు పడ్డాం.. ఇంకొక 30 రోజులు కష్టపడండి.. ఆ తర్వాత జగనన్న రాజ్యం వస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మీ ఊళ్లలో, మీ కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ఓటు హక్కు లేకపోతే దగ్గరుండి వారికి ఓటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలకు నాయకులు సూచించారు. అలాగే వైఎస్ జగన్ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఏపీలో అవినీతి రాజ్యమేలుతుందని, మనం చేతగాని వాళ్లలా ఊరుకుంటే మరో ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఉత్సాహమున్న కార్యకర్తలు సంప్రదించాలని ఎన్ఆర్ఐ విభాగం నాయకులు కోరారు. -
దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
-
సింగపూర్‌లో వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశం
సింగపూర్ : సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బనగానపల్లె మాజీ శాసన సభ్యులు కాటసాని రామి రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా సహకార బ్యాంక్ మాజీ ఛైర్మన్ గుండం సూర్య ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువత కార్యదర్శి పోచ శీల రెడ్డిలు పాల్గొన్నారు. కాటసాని రామి రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక యుద్ధం లాంటిదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా..పేదల జీవితాల్లో అలనాటి 'రాజన్న' పాలన వెలుగులు చూడాలన్నా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వేల సింగపూర్‌లో ఉండే ఎన్నారై కార్యకర్తలు చేయవలసిన కార్యక్రమాల మీద విధి విధానాలను వివరించారు. సింగపూర్ లో పార్టీ ఎన్నారై శాఖ చేస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఎన్నికల సమయంలో కచ్చితంగా తమ సొంత స్థలాలకి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంత ఆవశ్యకమో ప్రజలకు ఎలా వివరించాలో చెప్పారు. ఇలాంటి సమావేశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నివసిస్తున్న ప్రతి దేశంలో జరగాలని, అక్కడ నివసించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై శాఖను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపు సూచించారు. జై జగనన్న..జోహార్ రాజన్న.. జిందాబాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదాలతో సమావేశంలో అభిమానులు హోరెత్తించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు..ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తెలుగు వారందరికీ సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం అభినందనలు తెలిపింది. -
జగన్‌పై దాడిని ఖండించిన చికాగో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్
చికాగో : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని చికాగో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులు ఖండించారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు జరిగిన సంఘటనని ఖండించక పోగా తక్కువ చేసి చూపుతున్నారని వెకిలి చేష్టలతో కామెడీ ముఖ్యమంత్రిగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమని నమ్మించడానికి ఈ హత్యాప్రయత్నం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరిగిందని ఎన్ఆర్ఐలు ధ్వజమెత్తారు. ఆపరేషన్ గరుడలో భాగమని శివాజీ ముందే చెబితే, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శివాజీ ని అరెస్టు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అంతమొందించాలనే పథక రచన ప్రభుత్వం చేసిందన్నారు. దాడి చేసిన వ్యక్తి దగ్గర దొరికిన 10 పేజీలు అతను రాసింది కాదని, ప్రభుత్వమే పోలీసుల చేత రాయించారని విమర్శించారు. ఆ పేజీలను జేబులో ఉంచుకుంటే కనీసం నలిగిపోయినట్టుగా కనిపించాలని, కానీ అవి నలిగిపోయినట్టుగా కనిపించడం లేదు కాబట్టి దానిని ఎవరో రాసినట్టుగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలోకి దుండగుడు కత్తితో ఎలా ప్రవేశించాడని, తీవ్రవాదులు బాంబులతో ప్రవేశిస్తే రాష్ట్ర ప్రభుత్వంగాని కేంద్ర ప్రభుత్వంగానీ ఇక ఏం చేయగలరని ఎన్ఆర్ఐలు ప్రభుత్వాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించడం వల్లనే తనను చంపేయాలని అనుకున్నారని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు మూడు రకాలుగా కుట్ర పన్ని వైఎస్ జగన్‌ని అంతమొందించాలనుకున్నారని కానీ వారి పథకాలు పారలేదని విమర్శించారు. హత్య చేసి అల్లర్లు సృష్టించాలని లేదా స్లో పాయిసన్ ఇచ్చి నిర్మూలించి అభిమాని చేతిలో చనిపోయాడని చిత్రీకరించాలనుకున్నారని ధ్వజమెత్తారు. తెలుగు దేశం పార్లమెంట్ సభ్యులు, మంత్రులు వాడిన భాష నాగరికంగా లేదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకే చెందుతుందని చికాగో ఎన్ఆర్ఐలు విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని, పోలీసు అధికారులు తెలుగుదేశం కార్యకర్తలలాగా పనిచేస్తున్నారని, అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా పనిచేయడం మానుకుని ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాప్రయత్నం కేసుని నీరు గార్చకుండా నిజాయితీగా విచారణ జరిపి, బాధ్యుని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలన్నారు. ఈ నిరసనలో చికాగో వైఎస్సార్సీపీ రీజనల్ ఇంచార్జ్ రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, రాంభూపాల్ కందుల, శ్రీనాధ రెడ్డి అంకిరెడ్డి పల్లె, శరత్ యట్టెపు, పరమేశ్వర్ యర్రసాని, రవి కిషోర్ ఆళ్ళ, రామిరెడ్డి పెద్దిరెడ్డి, ప్రమోద్ ముత్యాల, మనోజ్ సింగం శెట్టి, హారీందర్ పుల్వాయి, సంజీవ్ కాప, జానకీ రాం, రమాకాంత్ జొన్నల, వెంకట్, మోహన్ గారి కృష్ణా రెడ్డి, వెంకట్ తూడి, మహిపాల్ వంచా, సుమన్ శనివారపు, గోపి పిట్టల, శ్రీనివాస్ సరికొండ, లింగారెడ్డి, సందీప్, రవి కిషోర్, భీమా రెడ్డి, శ్రీధర్, రమణారెడ్డి, మోహన్ పిట్టల, రామలింగం కొండూరు, మల్లారెడ్డి, తేజేశ్వర్, సుధాకర్, రమణ అబ్బరాజు, నరసింహా రెడ్ది, శివ, మనోహర్, రామ్ దొనపాటి, సురేన్ మొరుకువాటి, వెంకట సుబ్బారెడ్డి, ధీరజ్, సురేందర్ రెడ్డి, వెంకట్ కొండూరు, బక్త ప్రియా, వెంకట్ యర్రా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌పై దాడిని ఖండించిన ప్రవాసాంధ్రులు
కాలిఫోర్నియా : వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఐ బే ఏరియా విభాగం ఖండించింది. బే ఏరియా లోని ఫ్రీమాంట్‌లో సమావేశమైన ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కన్వీనర్ మధులిక మాట్లాడుతూ కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా నిందితుడు వైఎస్ జగన్ అభిమాని అని, పలానా కులం అని హడావిడిగా ప్రకటించడం చూస్తుంటే విచారణ సరిగ్గా జరగుతుందనే విశ్వాసం పోయిందని, ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేపించాలని డిమాండ్ చేశారు. కన్వీనర్ చంద్రహాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దాడిని ఖండించకుండా, ఖండించిన వారిపై విమర్శలు చేయడం ద్వారా తన రాక్షసత్వాన్ని మరోసారి భయటపెట్టుకున్నారని మండిపడ్డారు. హత్యాయత్నానికి వాడిన ఆయుధాన్ని ఎయిర్‌పోర్టు క్యాంటిన్‌లోకి తీసుకురావడానికి ఎవరు సహకరించారో పూర్తి స్థాయి విచారణ చేపించాలని వైఎస్సార్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కే వి రెడ్డి డిమాండ్ చేశారు. హత్యాయత్నం వెనుక ఉన్న అసలు కుట్ర దారులు ఎవరో బయట పెట్టాలన్నారు. అలాగే మానవతా దృక్పథంతో పరామర్శించిన వారిపైన రాజకీయ బురద చల్లడం ముఖ్యమంత్రి హోదాకి సరికాదన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే మానవతా కోణంలో చూడాల్సింది పోయి చంద్రబాబు రాజకీయాలు చేయడంపై తెలుగు వారు అందరూ అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్సీపీ ముఖ్య సభ్యులు హరింద్ర శీలం అన్నారు. ముఖ్యమంత్రి గ్రామస్థాయి నేతలా చౌకబారు పదాలతో ప్రతిపక్ష నేతని సంబోధించడం ఆయన సంసృతికి నిదర్శనం అని వైఎస్సార్సీపీ బే ఏరియా కమిటీ సభ్యులు హరి మొయ్యి అన్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని మరో ముఖ్య సభ్యులు విజయ్ ఎద్దుల తెలిపారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ఈ ఘటనపై బాధ పడుతుంటే చంద్రబాబుకు మాత్రం ఇది డ్రామాలా కనిపిస్తోందని, మానవత్వం మరిచి 40 ఏళ్ల అనుభవం ఉన్నా అది వ్యర్థం అని ధ్వజమెత్తారు. వైస్ జగన్‌కి వస్తున్న విశేష ప్రజాధరణ చూసి తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడి పోతుందని అభద్రతా భావం పెరిగి ఇలాంటి హత్యాయత్నానికి పాలుపడుతున్నారని శ్రీధర్ తోటరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్లు మధులిక, చంద్రహాస్, గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కే వి రెడ్డి, వైఎస్సార్సీపీ ముఖ్య సభ్యులు నరేష్ కొండూరు, అమర్, హరి మొయ్యి, హరింధ్ర శీలం, శ్రీధర్ తోటరెడ్డి, విజయ్ ఎద్దుల, శివా రెడ్డి, ప్రవీణ్, సురేంద్ర అబ్బవరం, నరేంద్ర అత్తానురి, శ్రీని కొండా, రవి గాలి, వైఎస్సార్సీపీ స్టూడెంట్ విభాగం నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌పై దాడిని ఖండించిన సౌతాఫ్రికా ప్రవాసాంధ్రులు
జోహాన్స్‌బర్గ్ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ సౌతాఫ్రికా విభాగ నేతలు, తెలుగువారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సౌతాఫ్రికా నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన స్వార్థం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ అడ్డు వస్తారని ప్రణాళిక ప్రకారం హత్య చేయించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కుట్రలో పోలీసు వ్యవస్థను భాగం చేసి ప్రభుత్వ సంస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. దాడి జరిగిన వెంటనే టీడీపీ మంత్రులు ప్రవర్తించిన తీరు చాలా హేయంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దాడిని ఖండించకుండా, ఖండించిన వారిపై విమర్శలు చేయడం ద్వారా తన రాక్షతత్వాన్ని చంద్రబాబు మరోసారి భయటపెట్టుకున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసును రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తే నిజాలు భయటకు రావని, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హత్యాయత్నం వెనుక ఉన్న అసలు కుట్ర దారులు ఎవరో బయట పెట్టాలన్నారు. వైస్ జగన్ త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సౌతాఫ్రికా వైఎస్సార్సీపీ అభిమానులు కల్లా నరసింహ రెడ్డి,కొత్త రామకృష్ణ,కుమార్ రెడ్డి మల్రెడ్డి,సూర్య రామిరెడ్డి,మురళీ సోమిశెట్టి, అంజిరెడ్డి సానికొమ్ము,రామ్మోహన్ పూల బోయిన, రాంబాబు తిరుమల శెట్టి,శ్రీ క్రిష్ణారెడ్డి, వెంకటరెడ్డి నల్ల గుండ్ల, అరుణ్ రెడ్డి,నరేంద్ర మోహన్ కేసవరపు, దుర్గా ప్రసాద్ చింతపల్లి,దినేష్ రెడ్డి, సౌతాఫ్రికా తెలుగువారు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌పై దాడిని ఖండిస్తున్నాం
టెక్సాస్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఆ పార్టీ అమెరికా విభాగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైఎస్ జగన్‌పై దాడిని ఆస్టిన్, టెక్సాస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సబ్బారెడ్డి చింతగుంట, పుల్లారెడ్డి ఎదురు, పరమేశ్వర రెడ్డి నంగి, మల్లిఖార్జున రెడ్డి ఆవుల, రవి బల్లాడ, నారాయణ రెడ్డి గండ్ర, కుమార్ అశ్వపతి, అశోక్ గూడూరు, వెంకట శివ నామాల, మురళి బండ్లపల్లి, కొండారెడ్డి ద్వారసాల, స్వాదీప్ రెడ్డి, ప్రవర్ధన్ చిమ్ముల, వంశి, రమణ రెడ్డి కిచ్చిలి, శివ ఎర్రగుడి, యశ్వంత్ రెడ్డి గట్టికొప్పుల, శ్రీనివాస్ సలుగుటి, శివ శంకర్ వంకదారు, ప్రవీణ్ కర్నాటి, సుజిత్, దిలావర్, శ్రీకాంత్ రెడ్డి ఐనాల, తదితరలు ఖండిస్తున్నామని తెలిపారు. ఒక ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. దాడి వెనుక ఎవరెవరు ఉన్నారో సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండే వైఎస్ జగన్‌కు భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ దాడికి నిరసనగా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌పై దాడి పిరికిపంద చర్య
కాన్బెర్రా : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ఆ పార్టీ ఆస్ట్రేలియా విభాగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా సోషల్ మీడియా ఇంచార్జ్ రమ్య యార్లగడ్డ, రాజేశ్ సక్కమురి, వైఎస్ఎన్ ప్రసాద్, కౌషిక్ మామిడి, ధనుష్, శరణ్ అన్నారు. ఒక ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. దాడి వెనుక ఎవరెవరు ఉన్నారో సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండే వైఎస్ జగన్‌కు భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
వైఎస్ జగన్‌పై దాడి పిరికిపంద చర్య
-
కాలిఫోర్నియాలో మహానేత వర్ధంతి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా (బే ఏరియా) ప్రాంతంలో ఉన్న సంక్రాంతి రెస్టారెంట్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మహనేతకు ఘనంగా నివాళులు అర్పించారు. బేఏరియా వైఎస్సార్ సీపీ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూఎస్ వైఎస్సార్ సీపీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు కె. వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, బే ఏరియా ప్రముఖులు డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వైఎస్సార్‌ఆర్ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అంతకుముందు మద్దూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బేఏరియా టీమ్ సురేంద్ర అబ్బవరం, మధు వంగా, గోపిరెడ్డి, శ్రీధర్, త్రిలోక్ ఆరవ, సహదేవ్, అమరనాథ్ రెడ్డి, కొండారెడ్డి, చంద్రహాస్, నరేష్, శివ, రమాకాంత్, చెన్నకేశవ, వీర, అమర్, నరేంద్ర అట్టునూరి, వెంకట్, విజయ్ ఎద్దుల, శ్రీధర్, కోటిరెడ్డి, డాక్టర్ రాఘవ, సుగుణ, ప్రవీణ, హరీంద్ర, రామచంద్ర, ఆదిత్య, రాంకీ, రవి, సురేంద్ర వల్లూరి, నరేంద్ర కొత్తకోట, నారాయణ, పెంచలరెడ్డి, సురేష్‌లతో పాటు ‘నాటా’ సభ్యులు విజయ్ చవ్వా(టీసీఏ), ధనిరెడ్డి అరికట్ల, సూర్య కురలి, చంద్ర కావలి, రవి కర్రి, సురేంద్ర పులగం, లోకేష్, సునీల్, శేషాద్రి పోలిశెట్టి, విశ్వనాధ్, శేషారెడ్డి, ధర్మేంద్ర జంబుల, సత్య బండారు, సంకీర్త్, వైఎస్సార్ సీపీ యూఎస్ స్టూడెంట్ నాయకులూ పాల్గొన్నారు. -
అమెరికా వ్యాప్తంగా వైఎస్సార్ వర్థంతి సభలు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్థంతి సభలను అమెరికాలోని అన్ని ముఖ్యపట్టణాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జన హృదయ నేత రాజశేఖర రెడ్డికి నివాళు అర్పించడానికి అమెరికా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు భారీగా తరలివచ్చి వైఎస్సార్ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ యుఎస్ఏ విభాగం, రాజశేఖర రెడ్డి అభిమాన సంఘం పిలుపునిచ్చింది. వైఎస్సార్ వర్థంతి సభలతోపాటూ మెగా రక్త దాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 3న మేరీల్యాండ్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్యారడైజ్ ఇండియన్ క్యూసిన్లో, సెప్టెంబర్7న శుక్రవారం సాయంత్రం డల్లాస్‌లో ఇర్వింగ్‌లోని అల్టిమేట్ బీబీక్యూలో, సెప్టెంబర్ 9న ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు కాలిఫోర్నియాలో సన్నీవెల్లోని సంక్రాంతి రెస్టారెంట్లో వైఎస్సార్ వర్థంతి సభలు నిర్వహించనున్నారు. కాలిఫోర్నియా, డల్లాస్, మేరీల్యాండ్‌లలో జరిగే వర్థంతి సభలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, సామినేని ఉదయభానులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. టెక్సాస్‌లోని జార్జిటౌన్లో పార్క్‌సైడ్ కమ్యునిటీ సెంటర్లో సెప్టెంబర్ 9న ఆదివారం 10 గంటలకు వర్థంతి సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డా.వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8, శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు కింగ్ ఆఫ్ ప్రష్యాలోని రాడిసన్ హోటల్ వ్యాలీ ఫోర్జ్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్, డల్లాస్ వైఎస్సార్సీపీ సంయుక్తంగా సెప్టెంబర్ 2, ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇర్వింగ్‌లోని ఎలిమెంట్స్ డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ నార్త్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేసిన వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తారని ఈ సందర్భంగా ఎన్నారైలు ఆకాంక్షించారు. ప్రజల అండతో 2019లో వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహానేత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రజలకు అందించేందుకు కృషి చేశారని ఎన్నారైలు పేర్కొన్నారు. పరిపాలన దక్షతకు, రాజనీతిజ్ఞతకు మహానేత వైఎస్ఆర్ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వీరందరి నుంచి నేటికి దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ నిత్య నీరాజనాలు అందుకుంటున్నారని తెలిపారు. -
ప్రత్యేక హోదా కోసం ప్రవాసాంధ్రుల నిరసన
ఒహియో : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకి మద్దతుగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో అమెరికాలో ఒహియోలోని కొలంబస్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని అని నినదించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఒకే ఒక్క నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. మీపై కేసుల మాఫీ కోసం ఆంధ్రప్రదేశ్ హోదాను తాకట్టు పెడతారా అంటూ చంద్రబాబు నాయుడుపై ఎన్ఆర్ఐలు నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో టీపీ రెడ్డి, రామ్మోహన్ సనెపల్లి, విప్పాల కొమాల్ రెడ్డి, చంద్ర కొండూరు, లచ్చిరెడ్డి కొత్తేరపు, జగన్ బుచ్చిరెడ్డి, తిరు గయం, రాజేంద్ర గంగసాని, వేణు మోడుగుల, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సింగపూర్ నూతన కార్యవర్గ భేటీ
సాక్షి, సింగపూర్ : వైఎస్సార్సీపీ సింగపూర్ ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్లు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, దక్కట జయప్రకాష్, వత్సవాయి పృధ్వీరాజ్‌ల అధ్యక్షతన నూతన కార్యవర్గం సమావేశమైంది. సింగపూర్‌లోని లిటిల్ ఇండియా ప్రాంతంలోని అమరావతి రెస్టారెంట్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి 100 మందికి పైగా పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రతో ప్రజలకు మరింత చేరువ అవుతున్నారని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ నేతలు అన్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని, వైఎస్సార్సీపీ మాత్రమే ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటాలు చేస్తుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తామంతా సింగపూర్ నుంచి వచ్చి పార్టీ కోసం తమవంతుగా పూర్తి సహాయసహకారాలు అందించి, పార్టీ గెలుపు కొరకు కష్టపడతామని ఎన్ఆర్ఐలు ప్రతిజ్ఞ చేశారు. 2000 మందికి పైగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సింగపూర్ లో నివసిస్తున్నారని, తామంతా కలిసి 2019 ఎన్నికలకు తమ సంపూర్ణ మద్దతు ప్రత్యక్షంగా అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతిని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చేస్తామని చెప్పారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం, తిరిగి వైఎస్ జగన్‌తోనే సాధ్యం అవుతుందని సింగపూర్ ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. పార్టీ ముఖ్యనేతలతో చర్చించి త్వరలోనే ఎన్ఆర్ఐ మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభింస్తామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకువచ్చి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసేంత వరకు అహర్నిషలు కష్టపడతామని చెప్పారు. ఈ సందర్భంగా జోహార్ వైఎస్ఆర్ జై జగనన్న నినాదాలతో సభ దద్దరిల్లింది. నూతన కార్యవర్గ సమావేశం రోజునే సింగపూర్ లో నివసిస్తున్న రామకృష్ణ (కొండా) ముసుకు సత్యనారాయణ రెడ్డి , పవన్ కుమార్ , బాబులు పార్టీలో చేరారు. వారిని వైఎస్సార్ సీపీ పార్టీ కండువాతో సింగపూర్ కన్వీనర్ లు పార్టీలోకి ఆహ్వానించారు. తమపై ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించి వైఎస్సార్సీపీ అభ్యున్నతికి పాటుపడే అవకాశం కల్పించిన వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ రెడ్డికి సింగపూర్ ఎన్ఆర్ఐ వింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్లు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, దక్కట జయప్రకాష్, వత్సవాయి పృధ్వీరాజ్, సెక్రెటరీలు మరక మహేశ్వరరెడ్డి, గుంటి రామ్ మల్లయ్య, అలినేని సతీష్ రావు, చల్లబోయిన లక్ష్మీపతి, పడాల వీర్ రెడ్డి, తిప్పల ధుర్యోధన్, జి. కృష్ణారెడ్డి, బీఎస్ రాజు, సుధా లక్ష్మీరెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి, ట్రెజరర్ ఎన్ వేణుగోపాల రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంటర్స్ దిల్లి వినయ్ కుమార్, వెండ్ర శ్రీమురళి, పాటి అంజిబాబు, అరిగెల శ్రీనివాసరావు, మిత్తన చిన్న అబ్బాయి, కందుల శివమోహన్ రెడ్డి, చల్లబోయిన వీర వెంకట శివ నాగరాజు, గొల్లపల్లి లింగారెడ్డి, నమ్మితేజ వెంకట లక్ష్మీప్రసన్న కుమార్, తమనంపూడి మోహన్ శంకర్, రాజారపు దేవేంద్ర, సిరిగిరెడ్డి అంకాలరెడ్డి, పసుపులేటి సందీప్, గార్లపాటి ప్రసాద్, నీలమ్మగాలి సింహాచలరెడ్డి, యాపర్ల సుదీప్, ఉడుముల ఆంజనేయ రెడ్డి, గుడిపల్లి సురేష్ బాబు, సిరిపురపు హరిరావు, సంకే శ్రీనివాసరావు, వెన్న వీరారెడ్డి, భూమ్ రాజ్ రుద్ర, చంద్ర సుబ్బిరెడ్డి, సుధా రామమోహన్ రెడ్డి, రాపేటి జనార్ధన్ రావు సోషల్ మీడియా టీమ్ సభ్యులు పిల్లి సంతోష్ కుమార్ రెడ్డి, నక్కా దొరబాబు, దువ్వూరు మురళీకృష్ణ, నయాబ్ రసూల్, దుగసాని సంజయ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. -
లాస్ఏంజెల్స్లో 'ప్రజా సంకల్పయాత్ర' శతదినోత్సవం
లాస్ఏంజెల్స్ : అమెరికాలోని లాస్ఏంజెల్స్లో ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో ప్రజాసంకల్పయాత్ర శతదినోత్సవాన్ని వైఎస్ఆర్సీపీ ప్రవాసాంధ్ర కార్యకర్తల సమక్షంలో జరిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన నవరత్న పథకాలపై ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్త ఈ ఏడాది మరింత కష్టపడాలని సూచించారు. ప్రజాసంకల్పయాత్ర శతదినోత్సవ వేడుకలో భాగంగా కేక్ కట్ చేశారు. ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ వైఎస్ జగన్ స్వయంగా రాస్తున్న పాదయాత్రడైరీ చదువుతుంటే.. ప్రజలు, నిరుపేదలు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, రైతులు, రైతుకూలీలు పడుతున్నకష్టాలు తెలుస్తున్నాయన్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన అబద్దపు హామీలతో ప్రజలు మోసపోయిన విధానం ఎంతో బాధ కలిగిస్తోందని, రాష్ట్రం 20 సంవత్సరాల వెనక్కు వెళ్లిందని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 70 నుంచి 80 శాతం పూర్తి చేసిన సాగునీటి, త్రాగునీటి పథకాల్లో మిగిలిన కొద్దిశాతం కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయకపోవడం ఎంతో ఆవేదన కలిగిస్తుందని ప్రవాసాంధ్రులు అన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియకుండానే రాష్ట్ర అప్పులు రెండున్నర లక్షలకు ఎలా పెరిగిపోయాయో చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. సోషల్ మీడియా వేదికగా రోజుకి కొంత సమయం కేటాయించి, వైఎస్ఆర్సీపీ ప్రకటించిన సంక్షేమ, అభివృద్ధిపథకాలపై ప్రజలకు అవగాహనకల్పిస్తామని ప్రవాసాంధ్రుల తెలిపారు. ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న పోరాటాలను అభినందించారు. తిరుపతిలోని అభయ క్షేత్రం అనాథ పిల్లల కోసం, వైఎస్ఆర్సీపీ లాస్ ఏంజెల్స్ సభ్యులు వెయ్యి డాలర్లను విరాళంగా ఇచ్చారు. -
వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగాలకు కొత్త సభ్యులు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో వివిధ కార్యక్రమాలను మరింత ఉధృతం చేయడానికి వీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వివిధ దేశాలకు చెందిన ఎన్ఆర్ఐ విభాగాల్లో కార్యవర్గాలను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో అమెరికా, ఖతార్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాల ఎన్ఆర్ఐ విభాగాల్లో పార్టీకి చెందిన ప్రవాసాంధ్యులను వివిధ పదవుల్లో నియమించినట్టు తెలిపారు. యూఎస్ఏ ఎన్ఆర్ఐ వింగ్ : కన్వీనర్లు : మధుళిక చవ్వా, రత్నాకర్ పండుగాయల, డా. వాసుదేవ నలిపిరెడ్డి, డా. శ్రీధర్ కొర్సపాటి గవర్నింగ్ కౌన్సిల్ : రమేష్ రెడ్డి వల్లూరి, సుబ్బారెడ్డి చింతగుంట, శివ అన్నపురెడ్డి, డా. రాఘవరెడ్డి గోషాల, రామిరెడ్డి ఆళ్ల, హరిప్రసాద్ లింగాల, ప్రతాప్ రెడ్డి బీమ్ రెడ్డి, గోపినాథ్ రెడ్డి, కేవీ రెడ్డి కోర్ కమిటీ - రీజినల్ ఇంచార్జీలు : సురేంద్ర బత్తినపట్ల, కృష్ణ కోడూరు, డా. రామి ఆర్ బాచిపూడి, డా. ధనుంజయ గడ్డం, రమణ పుట్లూరి, చిన్నబాబు రెడ్డి, రఘు అరిగ, రవి బల్లడ, చందూరెడ్డి చింతల, వెంకట్రామ్ చింతమ్, సుబ్బారెడ్డి మేక, రమణ కృష్టపతి, పమ్మి సుబ్బారెడ్డి, పుల్లారెడ్డి యెదురు, డా.పవన్ పాముదుర్తి, సాయి ప్రభాకర్ యర్రప్రగడ, సుచి ముట్లూరు, నంద్యాల వీరారెడ్డి, రాంగోపాల్ దేవపట్ల, డా.కొండా మోహన్, దేవులపల్లి రమణా రెడ్డి, టీ ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి చినెపల్లి, రంగేశ్వర్ కోన, శ్రీనివాసరెడ్డి యెర్రబోతుల, ప్రసాద్ మల్లు, - ఈ కమిటీతో పాటు స్టేట్, సిటీ ఇంచార్జీలుగా 85 మందిని, స్టేట్, సిటీ టీమ్ సభ్యులుగా మరో 80 మంది సభ్యులను నియమించారు. ఖతార్ ఎన్ఆర్ఐ వింగ్ : కన్వీనర్ : శశికిరణ్ దొండపాటి కో-కన్వీనర్ : రవిప్రకాశ్ రావు, జాఫర్ హుస్సేన్, బి.గిరిధర్ అడ్వయిజర్ : సుంకర సాంబశివరావు గవర్నింగ్ కౌన్సిల్ : వర్దనపు ప్రకాశ్, ఎన్ నాగేశ్వరరావు, ప్రశాంత్ ముత్తబత్తుల, షాహబుద్దీన్ సయ్యద్ ట్రెజరర్ : నేమాని లియోపాడ్ కింగ్ అసిస్టెంట్ ట్రెజరర్ : తమలపాకుల అరుణ్ కుమార్, యర్రంశెట్టి భార్గవ కుమార్ స్పోర్ట్ (ఇంచార్జీ) : వర్దనపు ఏసురత్నం స్పోర్ట్ మెంబర్ : ఎం.సందేశ్ కుమార్, నవీన్ నల్లి, రాజు మట్ట, సోషల్ మీడియా : చంటి గెడ్డం (ఇంచార్జీ), ఇంజేటి శ్రీను, వెంకట రామసాగర్ కోల యూత్ ఇంచార్జీ : ఆరోణ్ మనేష్ ఆర్, యూత్ మెంబర్స్ : సిరింగల మణిబాబు, మంద పెద్దిరాజు, చిలకపాటి చిట్టిబాబు, లంకపాటి వినోద్ కుమార్, మత్తి సురేష్ కుమార్, రాజశేఖర్ మేడిది, బాలం శ్రీనివాసరావు, బీసీ మెంబర్ : పిల్లి మురళి మోహనకృష్ణ ఐటీ ఇంచార్జీ : ఎన్. గణేష్ (హేమంత్) సింగపూర్ ఎన్ఆర్ఐ వింగ్ : కన్వీనర్లు : బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వత్సవాయి పృధ్వీరాజ్, దక్కట జయప్రకాష్, సెక్రెటరీస్ : మరక మహేశ్వరరెడ్డి, గుంటి రామ్ మల్లయ్య, అలినేని సతీష్ రావు, చల్లబోయిన లక్ష్మీపతి, పడాల వీర్ రెడ్డి, తిప్పల ధుర్యోధన్, జి. కృష్ణారెడ్డి, బీఎస్ రాజు, సుధా లక్ష్మీరెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి, ట్రెజరర్ : ఎన్ వేణుగోపాల రెడ్డి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంటర్స్ : దిల్లి వినయ్ కుమార్, వెండ్ర శ్రీమురళి, పాటి అంజిబాబు, అరిగెల శ్రీనివాసరావు, మిత్తన చిన్న అబ్బాయి, కందుల శివమోహన్ రెడ్డి, చల్లబోయిన వీర వెంకట శివ నాగరాజు, గొల్లపల్లి లింగారెడ్డి, నమ్మితేజ వెంకట లక్ష్మీప్రసన్న కుమార్, తమనంపూడి మోహన్ శంకర్, రాజారపు దేవేంద్ర, సిరిగిరెడ్డి అంకాలరెడ్డి, పసుపులేటి సందీప్, గార్లపాటి ప్రసాద్, నీలమ్మగాలి సింహాచలరెడ్డి, యాపర్ల సుదీప్, ఉడుముల ఆంజనేయ రెడ్డి, గుడిపల్లి సురేష్ బాబు, సిరిపురపు హరిరావు, సంకే శ్రీనివాసరావు, వెన్న వీరారెడ్డి, భూమ్ రాజ్ రుద్ర, చంద్ర సుబ్బిరెడ్డి, సుధా రామమోహన్ రెడ్డి, రాపేటి జనార్ధన్ రావు, సోషల్ మీడియా టీమ్ : పిల్లి సంతోష్ కుమార్ రెడ్డి, నక్కా దొరబాబు, దువ్వూరు మురళీకృష్ణ, నయాబ్ రసూల్, దుగసాని సంజయ్ కుమార్ రెడ్డి, మలేషియా ఎన్ఆర్ఐ వింగ్ : కన్వీనర్లు : మహేష్ బాబు కనమాల, విజయభాస్కర్ రెడ్డి లెబ్బాక, బాజిబాబా షేక్, రేవంత్ రాజు తిప్పరాజు, సురక్షిత్ రెడ్డి ఆకెపాటి, జనరల్ సెక్రెటరీ : గోపాలకృష్ణ సత్తిరాజు, రామకృష్ణారెడ్డి, సురేంద్రా రెడ్డి, రాంబాబు రేమల్లి, అవినాశ్ పెనుకొండ, విష్ణు, సెక్రెటరీ : వాసుదేవరెడ్డి తాటిరెడ్డి, నూక చంగల్ రెడ్డి, జయపాల్ రెడ్డి, కోటిరెడ్డి ఏకే, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ : నవీన్ రెడ్డి, సాంబిరెడ్డి, రాజశేఖర్ గునిగంటి, ట్రెజరర్ : నారాయణ బత్తిని, సాంబశివ చింతా, రామారావు పెనిగలపాటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ : కొయిదల సాం శివ, రమణారెడ్డి, మురళీధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కరీం, ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ వింగ్ : మీడియా ఇంచార్జీ : భార్గవ్ రెడ్డి భవనం -
డాలస్‌లో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు
డాలస్ : డాలస్ మహానగరంలో స్వామి వివేకానంద 155వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ సీపీ ఎన్నారై వింగ్ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత హాజరై స్వామి వివేకానందుల వారు యువతకి ఎలా ఆదర్శప్రాయులు అయ్యారో.. ఎలా దిశా నిర్దేశం చేశారో గుర్తు చేసుకున్నారు. డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి మాట్లాడుతూ స్వామి వివేకానందుల వారు భారతదేశం ఒక మెల్టింగ్ పాట్ లాగా అన్ని మతాలను తనలో ఇముడ్చుకోగలిగింది అని 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత పార్లమెంట్ సదస్సులో చెప్పారని తెలిపారు. అలాగే స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం కష్టపడితేనే అది జీవితమన్న స్వామి సూక్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిస్వార్థంగా ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. గరికపాటి రాము మాట్లాడుతూ యూనివర్సల్ ఆక్సెప్టేన్సీ, సహనం గురించి స్వామి ఆనాడే చెప్పారని అన్నారు. కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ స్వామి వివేకానంద నేటి యువతకి ఆదర్శ ప్రాయులని, బలమే జీవితం, బలహీనతే మరణం అన్న స్వామి వివేకానందుల వారి సూక్తిని యువత ఆదర్శవంతంగా తీసుకోవాలని కోరారు. దేహం బలంగా వుంటే ఆలోచించే మెదడు కూడా బలంగా ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా భారతదేశంలో ఉన్నంత యువ శక్తి లేదని యువతకి దేశ భవిష్యత్‌ని మార్చే శక్తి ఉందని, యువత రాజకీయ రంగంలో కూడా దృష్టి పెట్టాలని కోరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని అన్నారు. కృష్ణ మోహన్ రెడ్డి కుందూరు మాట్లాడుతూ భారతదేశం అన్ని మతాల ఆచార వ్యవహారాలను గౌరవిస్తుందని స్వామి వివేకానందుల వారు ఏనాడో మనకి చెప్పారని గుర్తు చేశారు. రమణ పుట్లూరు మాట్లాడుతూ స్వామి వివేకానంద చేపినట్లుగానే ఏ పని చేసినా అందులో ధ్యాస పెట్టాలని యువతని కోరారు. సుబ్బారెడ్డి కొండూరు కార్యక్రమానికి విచ్చేసిన యువతకు ధన్యవాదాలు తెల్పి కార్యక్రమాన్ని ముగించారు. రాం గరికపాటి, సుబ్బారెడ్డి కొండూరు, ఉమా కుర్రి, శరత్ యర్రం, ఉదయ్, భాస్కర్, కులశేఖర్, ఉమా మహేష్, కిషోర్, జయచంద్ర, వెంకట్, వివేక్ తదితరులు కూడా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. -
అమెరికాలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
కనెక్టికట్(అమెరికా) : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అమెరికా కమిటీ సభ్యులు గురువారం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కనెక్టికట్ స్టేట్ హిందూ దేవాలయంలో వైఎస్ జగన్ పేరు మీద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించామని కమిటీ కన్వీనర్ రత్నాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు కూడా హాజరైనట్లు వెల్లడించారు. -
ఆ వజ్రాయుధమే చంద్రబాబుపై బ్రహ్మాస్త్రం
ఫ్లోరిడా: ఏపీలోని చంద్రబాబునాయుడు సర్కార్ సోషల్ మీడియాపై సైతం ఆంక్షలు విధించేందుకు యత్నించడంపై ఖండాంతరాల నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా కార్యకర్తలకు తమ మద్ధతు తెలుపుతూ అమెరికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్ధతుదారులు, తెలుగు కమ్యూనిటీ నేతలు సమావేశమయ్యారు. ఫ్లోరిడాలోని జాక్సన్విల్లేలో జరిగిన భేటీలో ఏపీలో సోషల్ మీడియాపై ప్రస్తుత పరిస్థితులను చర్చించారు. తక్షణమే ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ ను, బెంగళూరులో అరెస్ట్ చేసిన రవీంద్రను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు డాక్టర్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి మాట్లాడుతూ.. అధికారం అనేది శాశ్వతం కాదని, వినాశకాలే విపరీత బుధ్ది అని హితవు పలికారు. సోషల్ మీడియా మీద మీ అరాచకాలు ఇకనైనా ఆపేయాలని సూచించారు. సోషల్ మీడియా సామాన్యుడి వ్రజాయుధమని.. ఈ ఆయుధాన్ని బ్రహ్మాస్త్రంగా చేసుకుని మీపై యుద్ధం చేసి మీ అధికారానికి స్వస్తి చెబుతారని హెచ్చరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న రవికిరణ్‌ను, రవీంద్రను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన మీడియాను ఎల్లో మీడియాగా చేసి అబద్ధాన్ని నిజం చేయాలని తాపత్రయపడుతున్నారని, అది ఎంతో కాలం సాగదన్నారు. ఏపీ ప్రభుత్వం అరాచకాలను భయటపెట్టేలా నెటిజన్లు పోస్టులు చేయడాన్ని ప్రజాభిప్రాయంగా స్వీకరించాలని వారు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు డా.వాసుదేవరెడ్డి, డాక్టర్ శ్రీదర్‌రెడ్డి కొర్సపాటి, వెంకట్ పులి, మల్లికార్జునరెడ్డి, కేశవ్, మాదవ్, సంజీవరెడ్డి, నారాయణరెడ్డి, రవి, సుబ్బారెడ్డి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొని ఏపీ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు. -
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌లు అప్రజాస్వామికం
న్యూయార్క్: సోషల్ మీడియాలో విమర్శించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటలం పట్ల చంద్రబాబు ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం, వేధింపులకు పాల్పడటాన్ని వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ విభాగం తీవ్రంగా ఖండించింది. తప్పుడు ఆరోపణలతో సోషల్ మీడియా కార్యకర్తలు రవికిరణ్, రవీంద్రలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ కన్వీనర్ రత్నాకర్ అన్నారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వం రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. -
ప్రత్యేక హోదా కోసం నినదించిన ప్రవాసాంధ్రులు
నార్త్ కరోలినా (ఛార్లెట్) : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటానికి అమెరికాలోని ఉత్తర కరోలినా ఛార్లెట్ నగరంలో ప్రవాసాంధ్రులు తమ మద్ధతుగా గళమెత్తారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం తీరును, రాష్ట్రంలో తలెత్తుతున్న పరిణామాలపై వైఎస్ఆర్ సీపీ విభాగం నేతలు నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మాట మార్చి, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఛార్లెట్ నగరంలో శనివారం వైఎస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. 'మీ కేసుల మాఫీ కోసం.. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతారా?', 'ప్రత్యేక హోదా బిక్ష కాదు.. 5 కోట్ల ఆంధ్రుల హక్కు' అని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరును వైఎస్ఆర్ సీపీ ఛార్లెట్ టీమ్ ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి, ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఆ విషయాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా హోదా ఇస్తామని చెప్పారని, రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో అంశాలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేక హోదాకు మద్ధతు కరువైందని, ఇది ఇలాగే కొనసాగితే తెలుగు సినిమాలను బాయ్ కాట్ చేస్తామని ఎన్ఆర్ఐలు హెచ్చరిస్తున్నారు. ఓ మంచి కారణం కోసం మద్ధతు తెలపాల్సిందిగా టాలీవుడ్ ఇండస్ట్రీని కోరారు. ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉపాధి అవకాశాలొస్తాయన్నారు. స్పెషల్ ప్యాకేజీ కంటే స్పెషల్ స్టేటస్‌తోనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఈ టీమ్ అక్కడి ప్రవాసాంధ్రులకు వివరించింది. 'ఏపీకి ప్రత్యేక హోదా కావాలి' అనే నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. సుబ్బారెడ్డి మేక, కె.రాధాక్రిష్ణరెడ్డి, పి.సంజీవరెడ్డి, సబ్బసాని వెంకట్, సింగల్రెడ్డి శ్రీనివాస్, రోహిత్, రామక్రిష్ణ, కైపు, మదం బోయనపల్లి, అనిరుద్‌రెడ్డి, వెంకట్ వరప్రసాద్, ఛార్లెట్ లోని తెలుగు విద్యార్థులు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటానికి తమ మద్ధతు ప్రకటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. -
ప్రత్యేక హోదా ఏపీ హక్కు : ప్రవాసాంధ్రులు
వాషింగ్టన్ డీసీ: ప్రత్యేక హోదా-ఆంధ్రప్రదేశ్ హక్కు అంటూ ప్రవాసాంధ్రులు నినదించారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో యువత చేస్తున్న కొవ్వొత్తుల ర్యాలీకి ప్రవాసాంధ్రులు మద్దుతుగా నిలిచారు. వర్జీనియాలోని ఫ్రైయింగ్ పాన్ పార్కు దగ్గర కొవ్వొత్తులతో ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని ప్రవాస ఆంధ్రులు నిరసన తెలిపారు. వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలో ఉన్న తెలుగు వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అన్నది ఏదో ఓ పార్టీకి చెందిన అంశం కాదని, ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికి సంబంధించిన విషయం అని ఎన్ఆర్ఐలు తెలిపారు. తిరుమల దేవ దేవుని సమక్షంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన మాటను నిలుపుకొని, మాట తప్పని వాడిగా చరిత్ర పుటల్లో మిగిలి పోవాలని వారు పేర్కొన్నారు. జల్లికట్టు ఆటని సుప్రీం కోర్టు రద్దు చేస్తేనే కేంద్ర ప్రభుత్వాన్ని తమిళ సోదరులు కదిలించగాలేనిది... మనకు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన ప్రత్యేక హోదాని తెలుగువారందరం కలిసి సాధించుకోలేమా? అని ఎన్ఆర్ఐలు ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఏపీకి అన్యాయం చేయాలనుకుంటున్న ప్రభుత్వాలను నిలదీద్దాం. నిలదీసేవారికి మద్దతుగా నిలబడదాం. రండి కదిలిరండి ప్రత్యేక హోదా సాధన కోసం అని గళం విప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కార్య నిర్వాహకులు సురేంద్ర బత్తినపట్ల, వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ మిడ్ అట్లాంటిక్ సలహాదారు, రీజినల్ ఇంచార్జీ రమేష్ రెడ్డి వల్లూరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
హోదా కోసం YSRCP NRI విభాగం ఉద్యమం
-
కాలిఫోర్నియాలో వైఎస్సార్‌కు ఘన నివాళి
కాలిఫోర్నియా: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏడవ వర్ధంతిని వైఎస్సార్ సీపీ ఎన్నారై యూఎస్ఏ కమిటీ ఘనంగా నిర్వహించింది. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో సెప్టెంబర్ 2న ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు, పలువురు అమెరికన్లు.. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రక్తదానం చేశారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వందలాది మంది అభిమానుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి, కొద్దిసేపు మౌనం పాటించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ హనిమిరెడ్డి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు, సాధన, వైఎస్సార్ సీపీ ఎన్నారై శాఖ కన్వీనర్లు మధులిక, రత్నాకర్, రాజ్ కేసిరెడ్డిలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పేద ప్రజల పట్ల వైఎస్సార్ కు ఉన్న ఆప్యాయత, అభిమానాలను, మహానేత పాలనలో చేపట్టిన పలు సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు. మహానేత కలలుకన్న సువర్ణ పాలనను ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అందించగలరని, వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారు కృషి చేయాలని పార్టీ ఎన్నారై కమిటీ కన్వీనర్లు మధులిక, రాజ్ కేసిరెడ్డి, పండుగాయల రత్నాకర్ లు అన్నారు. కేవీ రెడ్డి, సురేశ్ ఉయ్యూరు, సురేంద్ర అబ్బవరం, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగార్జున, నాటా ప్రతినిధులు ప్రసూనా రెడ్డి, నాప్తా ప్రతినిధులు శౌరి ప్రసాద్, సిలికానాంధ్ర ప్రతినిధులు కొండారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డివారి, శ్రీనివాస్, ఉమా శంకర్, శివ, పెంచల్ రెడ్డి, నరేశ్, హరిప్రసాద్ మొయ్యా, శంకర్ రెడ్డి, సురేంద్ర పులగం, దినేశ్, విద్యార్థి విభాగం నాయకులు సాత్విక్, దినేశ్, రవీంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
యూకేలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
మిల్టన్ కేయ్నేస్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 67వ జయంతి వేడుకలను ఈ నెల పదో తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూకే వింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యూకే, యూరప్ లలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన 150 మంది మహానేతకు నివాళులు అర్పించారు. వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం కన్వీనర్ వెంకట్ మేడపాటి ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసగించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ యూకే, యూరప్ వింగ్ లకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యారు. -
మేరీలాండ్‌లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు
ఏలికట్ సిటీ, మేరీలాండ్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి వేడుకలు అమెరికాలోని ఏలికట్ సిటీ పాటపాస్కో వ్యాలీ స్టేట్ పార్క్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు వందకు పైగా తెలుగు ఎన్నారై కుటుంబాలు ఒకచోట చేరి వైఎస్ఆర్ పుట్టినరోజు వేడుకను పండుగలా చేసుకున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు మాట్లాడుతూ...మళ్లీ రాజన్నరాజ్యం రావాలని, వైఎస్ జగన్ వస్తేనే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజల కష్టాలు తీరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మహానేత తనయుడు జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యం అని మహానేత వైయస్సార్ పాలన మళ్లీ రావాలని, వైయస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబు మాయమాటలతో నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేసిన టీడీపీని ప్రజలే త్వరలో సాగనంపుతారన్నారు. అధికారమే లక్ష్యంగా అమలు కాని హామీలతో ప్రజలను వంచించిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ అండగా నిలిచి వారి తరపున పోరాడుతున్న ఏకైక ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు రోజురోజుకు ప్రజాధారణ పెరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. ‘వ్యవసాయం దండగ కాదు పండగ’ అని రుజువు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
లండన్‌లో జగన్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ యూకే, యూరోప్ విభాగం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి లండన్‌లోని హాన్స్లో నగరం 764 గ్రేట్ వెస్ట్ రోడ్‌లోని భుకారా బాంకెట్ హాలులో ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ విభాగం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలందరు తప్పకుండా పాల్గొనాలని ఈ సందర్భంగా ఆ కమిటీ కోరింది. ఈ నెల 21న జగన్ పుట్టినరోజు కాగా ఆ రోజును పురస్కరించుకుని ఈ నెల 12 సాయంత్రం 4.30 గంటలకు హాన్స్లో నగరంలో వేడుక జరుపుతున్నట్టు ఆ విభాగం సభ్యులు వాసు, ఓబుల్‌రెడ్డి, సురేష్‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, లోక్‌సభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్ కె రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చలమలశెట్టి సునీల్ తదితరులు పాల్గొంటున్నారు. -
వైఎస్ఆర్ సీపీ ఎన్నారై కమిటీ నియామకం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఎన్ఆర్ఐ కమిటీల్లో భాగంగా యూకె, యూరోప్, సింగపూర్ కమిటీలను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీలను నియమించారు. యూకే-యూరోప్ కమిటీలో శివకుమార్ చింతన్, వెంకీ, అబ్బయ్య చౌదరి కొటారి, సందీప్ వంగల, పున్నారెడ్డి భీమానందం కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. రవీంద్ర కందుల, పెరికల కనకాయ్, నవీన్‌రెడ్డిలను సలహా కమిటీ సభ్యులుగా నియమించారు. వీరితో పాటు 12 మందితో కార్యనిర్వహక కమిటీని ఏర్పాటు చేశారు. పీసీ రావు (కోశాధికారి) వాసుదేవరెడ్డి మైరెడ్డి (గ్రేటర్ లండన్ ఇంచార్జీ), కిరణ్ పప్పుల (ఆపరేషన్ ఇంచార్జీ), కోటిరెడ్డి కల్లం (ఆపరేషన్స్ సపోర్ట్ సెల్), ప్రదీప్ చింత (కమ్యునికేషన్స్ ఇంచార్జీ), సతీష్ వనహరం (సోషల్ నెట్వర్క్ ఇంచార్జీ), భాస్కర్ మైలపాటి (టెక్నాలజీ సెక్రెటరీ), రవి మోచెర్ల (ఆర్గనైజింగ్ సెక్రెటరీ), సురేష్ ముదిరెడ్డి, ఓబుల్ రెడ్డి (యూత్ సెక్రెటరీ), జయంతి ఎస్ (మహిళా విభాగం), ప్రదీప్ కథి (మెంబర్షిప్ ఇంచార్జీ), రిజ్వాన్ దేవరకొండ (మైనారిటీ సెల్ ఇంచార్జీ) గా వ్యవహరిస్తారు. ఈ కమిటీకి తోడుగా ఏడుగురిని ప్రాంతీయ కో-ఆర్డినేటర్లుగా, మరో ఆరుగురిని కోర్ టీమ్‌గా ఏర్పాటు చేశారు. ప్రాంతీయ కో-ఆర్డినేటర్లుగా విజయభాస్కర్ వైకుంఠం (హాంస్లో కో-ఆర్డినేటర్), మనోహర్ నక్కా (ఫెల్తం కో-ఆర్డినేటర్), భగవాన్ యనమల (ఈస్ట్ లండన్ కో-ఆర్డినేటర్), సుబ్బారెడ్డి ముప్పిడి (సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్ కో-ఆర్డినేటర్), మహేష్ వాసిపల్లి (కేంబ్రిడ్జి కో-ఆర్డినేటర్), సునీతా ముక్కు (ఆక్స్ఫర్డ్ వుమెన్ సెల్ ఇంచార్జీ), చింతపంటి జనార్ధన్ (మిల్టన్ కీనెస్ ఇంచార్జీ) నియమితులు కాగా కోర్ టీమ్‌లో తాటిరెడ్డి, కృష్ణమోహన్, శ్రీకాంత్ అడుసుమల్లి, భాస్కర్ అరుణ్‌కుమార్ పెట్ల, శివారెడ్డి సింగంరెడ్డి, రవి కిరణ్ చింతలు ఉన్నారు. 20 మందితో సింగపూర్ కమిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 20 మందితో కూడిన సింగపూర్ కమిటీ కార్యవర్గాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించినట్టు పార్టీ ఒక ప్రకటనతో తెలియజేసింది. సింగపూర్ కమిటీ కన్వీనర్లుగా (త్రిసభ్య కమిటీ) కోటిరెడ్డి కొమ్మిరెడ్డి, డి.జయప్రకాష్, వత్సవాయి పృధ్వీరాజ్లు ఉన్నారు. కార్యదర్శులుగా రుద్ర భూంరాజ్, పేస మురళి, సుధాకర్ మారంరెడ్డి, వీరారెడ్డి వెన్న, బుచ మోహన్‌లను నియమించారు. కోశాధికారిగా చింతలపూడి గంగాధర్‌కు బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా మరో 11 మందిని జాయింట్ సెక్రెటరీలుగా నియమించారు. డి.ప్రకాష్, పి.వేణుగోపాల్, గుంటి రామ్, ఎ.సురేష్, ప్రదీప్‌కుమార్, శ్రీనివాస్ మెరుగుమాల, శివరామిరెడ్డి వి, చినపన వెంకటేష్, సుగ్గు నీలాద్రి, శ్రీకాంత్‌రెడ్డి కల్లం, కె.లక్ష్మణ్‌లు నియమితులయ్యారు. -
ఎన్నారైల రక్తదానం.. అన్నదానం
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా అమెరికాలో పలు నగరాల్లో వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఐలు రక్తదాన, అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా అమెరికాలోని అలబామా రాష్ట్రం బర్మింగ్‌హామ్ నగరంలో చర్చ్ ఆఫ్ రీకాన్సిలెర్లో అన్నదాన సేవ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ అలబామా కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి యర్ర బోతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో నీరజరెడ్డి యర్రబోతుల, బసివిరెడ్డి కళ్లం, సుజనేంద్ర ఎరబోలు, శోభన్ అన్నెపు, రమణ మెట్ట, ధీరజ్ శర్మ, ఇంకా.. కృష్ ఎరబోలు, హేమంత్ కళ్లం పాల్గొని సేవచేశారు. -
వైఎస్ఆర్ సీపీ ఎన్నారై కమిటీ నియామకం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...ఆస్ట్రేలియా, మలేసియా దేశాల్లో పార్టీ ఎన్నారై విభాగానికి సంబంధించిన పలు నియామకాలు చేపట్టినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియా ఎన్నారై కమిటీ కన్వీనర్‌గా రమణారెడ్డి కుంజుల, కో-కన్వీనర్‌గా రాజశేఖర్ లంకెల నియమితులయ్యారు. వీరితో పాటు ప్రాంతీయ ఇన్‌ఛార్జిలను నియమించారు. మలేషియా ఎన్నారై కమిటీ కో-కన్వీనర్లుగా విజయభాస్కర్ రెడ్డి లేబాకు, గోపాల్ సత్తిరాజు, మహేష్ బాబు కనమల, రక్షిత్ కుమార్ ఆకేపాటి, కోటిరెడ్డి ఆళ్ల నియమితులయ్యారు. ఇంకా పలువురిని వివిధ కమిటీల్లో నియమించారు. -
వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగంలో నియామకాలు
హైదరాబాద్ సిటీ: వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగంలో పలు నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. గల్ఫ్, యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్ (యుఏఇ), కువాయిత్ ఎన్నారై కమిటీల్లో జరిగిన నియామకాలు కింది విధంగా ఉన్నాయి. గల్ఫ్ కౌన్సిల్ లీడర్షిప్ టీమ్ కన్వీనర్‌గా బీహెచ్ ఇలియాస్(కువాయిత్)ను, కువాయిత్ విభాగం ఎన్నారై కమిటీ కన్వీనర్‌గా ఎం.బాలిరెడ్డి నియమితులయ్యారు. ఆయా దేశాల ప్రతినిధులుగా షేక్ ఫయాజ్ (కువాయిత్), మంత్రాల న్యామతుల్లా(సౌదీ అరేబియా), నాసర్ వలీ సయ్యద్, జి.విజయభాస్కర్‌రెడ్డి(యూఏఇ), ఆనంద్ ఈద, మందల వర్జిల్బాబు (ఖతార్), కుంతం దేవేందర్ (బహరిన్), షేక్ అల్లాఉద్దీన్ (ఎమెన్) నియమితులయ్యారు. వీరు కాక గల్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా జీఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి నియమితులయ్యారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఎన్నారై కమిటీ
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైఎస్సార్సీపీ ఎన్నారై యూఎస్ఏ కమిటీ సభ్యులు కలిశారు. ఆదివారం లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసంలో ఎన్నారై కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అక్కడ వైఎస్ జగన్ సమక్షంలో కడప మేయర్ సురేశ్ బాబుకు రూ.2.50 లక్షల చెక్కు అందజేశారు. కడప కార్పొరేషన్ పరిధిలోని 25 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తగిన సదుపాయాల అందించేందుకు ఆ చెక్కు అందించినట్టు ఎన్నారై కమిటీ కన్వీనర్ రత్నాకర్ తెలిపారు. ప్రస్తుతం తాము చేసిన సాయం తొలి విడతలో భాగమేనని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుకు మరిన్ని సౌకర్యాలకు సాయం చేస్తామని వైఎస్సార్సీపీ ఎన్నారై కమిటీ తరఫున కన్వీనర్ రత్నాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు. -
వైఎస్సార్సీపీ అమెరికా శాఖకు కొత్త కమిటీ
సాక్షి, హైదరాబాద్: వైభ్యుల సంఖ్య 107. నలుగురు కన్వీనర్లు, నలుగురు అడ్వయిజరీ కమిటీ సభ్యులు, ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులతోపాటు ఆరుఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమెరికా (ఎన్నారై) శాఖకు కొత్త కమిటీని నియమించారు. ఇందులో మొత్తం స ఉప ప్రాంతీయ కమిటీలతో కూడిన కొత్త కమిటీకి పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. మధులిక సీ, గురువారెడ్డి పుణ్యాల, రత్నాకర్ పండుగాయల, రాజశేఖర్ కేశిరెడ్డిలు కమిటీ కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. డాక్టర్ రాఘవరెడ్డి (డల్లాస్), ర మేష్ వల్లూరు, డాక్టర్ రాఘవరెడ్డి (ఫిలా), చప్పిడి విజయభాస్కర్‌లు అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. రామి.ఆర్. ఆళ్ల (నార్త్ ఈస్ట్), రమేష్ వల్లూరు (మిడ్ అట్లాంటిక్), డాక్టర్ వాసుదేవ నలిపిరెడ్డి (సౌత్), హరిప్రసాద్ లింగాల( మిడ్ వెస్ట్), సురేంద్ర బత్తినపట్ల (సెంట్రల్), పవన్ నారం (వెస్ట్)లను అమెరికాలో ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసిన ఆరు ప్రాంతీయ కమిటీలకు ఇన్చార్జులుగా నియమించారు. ఎనిమిది మందితో ఏర్పాటు చేసిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సుబ్బారెడ్డి చింతగుంట, డాక్టర్ రామి. ఆర్. బూచిపూడి, డాక్టర్ ధనుంజయ గడ్డం, రంగరాజు ఓంకారం, శ్రీనివాస్ వంగాల, రాజశేఖర్ చప్పిడి, విశ్వనాథ్ కిచ్చిల, డాక్టర్ దర్గా నాగిరెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. నార్త్ ఈస్ట్ ప్రాంతీయ కోర్ టీంలో 25, మిడ్ వెస్ట్ ప్రాంతీయ కోర్ టీంలో ఎనిమిది, సెంట్రల్ ప్రాంతీయ కోర్ టీంలో ఎనిమిది, వెస్ట్ ప్రాంతీయ కోర్‌టీంలో 16, మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ కోర్ టీంలో 14, సౌత్ ప్రాంతీయ కోర్‌టీంలో 14 మంది సభ్యులుగా నియమితులయ్యారు. -
అమెరికాలో సమైఖ్య శంఖారావంకు మద్దతు
హార్ట్ఫోర్డ్ సిటి: అమెరికాలోని హార్ట్ఫోర్డ్ సిటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులు సమైఖ్య శంఖారావంకు మద్దతుగా సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వారు మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని వారు కోరారు. రత్నాకర్.పి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీకి చెందిన కృష్ణ మోహన్, శ్రీను వాసిరెడ్డి, రమేష్ బాబు, జితేంద్ర రెడ్డి, శ్రీధర్ చాగరి, జగన్మోహన్ పులిమి, గోపాల సుబ్బయ్య, సురేష్ రెడ్డి, భక్తియార్ ఖాన్, విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఎన్.ఆర్.ఐ. వింగ్ ఉదారత
ఈ మధ్య ఉత్తరాఖాండ్‌లో సంభవించిన ఘోర ప్రకృతి వైపరీత్య నష్టాన్ని పూడ్చడానికి, ఛారధామ్ పుననిర్మాణం కొరకు తమ వంతు సహాయం రూ.5 లక్షలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్.ఆర్.ఐ వింగ్, వివిధ దేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు విరాళాలను వింగ్ కన్వీనర్ మేడపాటి వెంకట్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారి ద్వారా ఉత్తరాఖండ్ సి.ఎం. రిలీఫ్ ఫండ్‌కు అందజేయడం జరిగింది. విరాళాలు అందజేసిన దాతలు: అమెరికా నుండి.. మేడపాటి వెంకట్, రమేష్ రెడ్డి వల్లూరు, పవన్ నరమ్ రెడ్డి, సి. సుబ్బారెడ్డి, డా. వాసుదేవ్ రెడ్డి, దయాకర్ రెడ్డి, విశ్వనాథ్ కిచిలి, రఘు పాడి, సుబ్బారెడ్డి షమ్మి, శ్రీనివాస్ చిట్టలూరు, కుమార్ అశ్వపతి, ప్రవర్థన్ చెమ్ముల, నారాయణరెడ్డి, మురళి బండ్లపల్లి, రఘు సిద్ధపురెడ్డి, రవి బల్లాడ, ప్రసాద్ గురిజాల, స్వదీప్రెడ్డి కువైట్ నుండి.. వై.లలితరాజా, యమ్.బాలిరెడ్డి, దాసరి సంక్షేమ సంఘం, కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, కె.రమణయాదవ్, టి.జి. భాస్కర్ రెడ్డి, ఆకుల ప్రభాకర్, రహిమాన్ ఖాన్, దుర్గరెడ్డి, వైఎస్ లాజరస్, చింతల చంద్ర శేఖర్‌రెడ్డి, నాయని మహీశ్వర్ రెడ్డి, యమ్, వి.నరసారెడ్డి, గోవింద్ నాగరాజు, తెట్టురఫి, మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, వి.పి.రామచంద్ర రెడ్డి, చింత శివారెడ్డి,వినోద్ కుమార్ దేవా, రక్కసి శ్రీను, పి.సత్తార్ ఖాన్, రవి నాయుడు, సురేంద్రబాబు నాయుడు, నూర్ భాషా, షేక్ ఇనియత్, కె.వాసుదేవారెడ్డి, ఎ.వెంకట సుబ్బారెడ్డి, మల్లు వెంకట రెడ్డి, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పి. సురేష్ కుమార్ రెడ్డి, మర్రి కళ్యాణ్, షేక్ అజీజ్, ఓ.పి.శివారెడ్డి, సుదర్శన్ రెడ్డి, యస్.మున్నా, డి.గంగాధర్, దిబ్బి రెడ్డి సుబ్బారెడ్డి. యూ.కె. నుండి.. సందీప్ రెడ్డి