
ఒహియో : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకి మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో అమెరికాలో ఒహియోలోని కొలంబస్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్‌కు
సంజీవని అని నినదించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఒకే ఒక్క నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. మీపై కేసుల మాఫీ కోసం ఆంధ్రప్రదేశ్ హోదాను తాకట్టు పెడతారా అంటూ చంద్రబాబు
నాయుడుపై ఎన్‌ఆర్‌ఐలు నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో టీపీ రెడ్డి, రామ్మోహన్ సనెపల్లి, విప్పాల కొమాల్ రెడ్డి, చంద్ర కొండూరు, లచ్చిరెడ్డి కొత్తేరపు, జగన్ బుచ్చిరెడ్డి, తిరు గయం, రాజేంద్ర గంగసాని, వేణు
మోడుగుల, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment