
అమెరికాలో సమైఖ్య శంఖారావంకు మద్దతు
హార్ట్ఫోర్డ్ సిటి: అమెరికాలోని హార్ట్ఫోర్డ్ సిటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులు సమైఖ్య శంఖారావంకు మద్దతుగా సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వారు మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని వారు కోరారు.
రత్నాకర్.పి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీకి చెందిన కృష్ణ మోహన్, శ్రీను వాసిరెడ్డి, రమేష్ బాబు, జితేంద్ర రెడ్డి, శ్రీధర్ చాగరి, జగన్మోహన్ పులిమి, గోపాల సుబ్బయ్య, సురేష్ రెడ్డి, భక్తియార్ ఖాన్, విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.