
షికాగో: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నేతలు వాడిన అసభ్య పదజాలాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అమెరికాలోని షికాగోలో జనాగ్రహదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకుడు కొండపల్లి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ... మీ కార్యకర్తలు, మీ కుటుంబ సభ్యులను బోషిడికే అనే పదంతో పిలుస్తారా అంటూ టీడీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు తప్పు చేస్తే నాయకుడిగా సరిదిద్దాల్సి పోయి చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తి ఆ బూతులను సమర్థించడం దారుణమన్నారు. ఆఖరికి ఉన్నత విద్యావంతులమని చెప్పుకునే ఎన్‌ఆర్‌ఐ వింగ్ సైతం ఆ బూతులను వంతపాడటం దారుణమన్నారు.
వైఎస్సార్ కుటుంబంపై జరిగినటువంటి నీచమైన దాడులు రాజకీయాల్లో ఏ ఫ్యామిలీపైనా జరగలేదని, కేవలం ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతోనే వైఎస్ జగన్ అన్నింటిని భరిస్తూ ముందుకు సాగుతున్నారని యత్తపు శరత్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో పట్టాభి అనుసరించిన నీచ పద్దతిని పార్టీలకు, మతాలకు, దేశాలకు అతీతంగా అంతా ఖండిచాలని ఈ దీక్షలో పాల్గొన్న నాయకులు కోరారు. ఈ జనాగ్రహ దీక్షలో భీమ్‌రెడ్డి అల్వాల, వెంకటేశ్వరరెడ్డి, వెంకట్ ముమ్మడి, శ్రీధర్‌రెడ్డి అలవాల, విజయ్‌రెడ్డి సంకెపల్లి, రమేశ్ తుమ్మూరి, పవన్, సోహిత్, రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment