వాషింగ్టన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే ఊపిరిగా.. రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియాలలో శనివారం మార్చి 13వ తేదీన దశాబ్ది ఉత్సవాలను వైఎస్సార్ సీపీ ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొన్నారు. ఈ కార్యక్రమానికి యూఎస్‌ఏ కన్వినర్ చంద్రహాస్ పెద్ధమల్లు , గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కేవీ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతల పునాదులపై పార్టీ పుట్టిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఇడుపులపాయలో మొదలై ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్ర ద్వారా జనం గుండె చప్పుడులోంచి వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో రూపొందించిందన్నారు .
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే నవరత్నాలు, సంక్షేమ పధకాలు, ఇదివరకెన్నడూ ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో సంస్కరణలకు నాంది పలికారన్నారు. "నాడు–నేడు" కార్యక్రమంల వల్ల ప్రభుత్వ సూళ్ల రూపు రేఖలే మారిపోతున్నాయి చెప్పారు. వైద్య రంగం, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగాలలో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ కమిటీ సభ్యులైన సురేంద్ర అబ్బవరం, నరేంద్ర కొత్తకోట , హారిన్ద్ర శీలం , కిరణ్ కూచిబొట్ల , ప్రశాంతి ,సుబ్బారెడ్డి, దిలీప్ , రామచంద్ర రెడ్డి , అంకిరెడ్డి, ఇతర వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment