YSRCP Formation Day
-
Tadepalli: ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అని, అంతే తప్ప ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం ప్రేమ లేదన్నారు. ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని జగన్ అంటున్నారు. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదు. తన పాదయాత్రలో జనం చెప్పినవన్నీ జగన్ నోట్ చేసుకున్నారు. ప్రజా అవసరాల మీదనే జగన్ పాదయాత్ర చేశారు. జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదన్నారు. ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్. ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలని ఉమ్మారెడ్డి పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: YSRCPకి 13 ఏళ్లు పూర్తి.. విశ్వసనీయతకు ప్రతీక పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ‘‘జగన్ అంటేనే విశ్వసనీయత. చెప్పిన మాట ప్రకారం మ్యానిఫెస్టో అమలు చేదిన ఘనత జగన్‌ది అని కొనియాడారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, జగన్ లాంటి సీఎం మాకూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. చరిత్ర సృష్టించటం జగన్‌కే సాధ్యం.. కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్‌ని ఓడించి తీరుతాం. గుంట నక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ ఐదేళ్లలో ఎన్నో మేళ్లు చేసినందునే ధైర్యంగా ఓటు అడగుతున్నాం. అన్ని వర్గాల ప్రజలు మన వెంట నడుస్తున్నారు. వారికి అండగా నిలవాలంటే మళ్లీ జగన్‌ను సీఎం చేసుకోవాలన్నారు. -
ఊరూరా సందడే సందడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, నేతలు పండగలా నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించి.. వైఎస్సార్సీపీ జెండాలనూ ఊరూరా ఆవిష్కరించారు. భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి.. పార్టీ కార్యాలయాల్లో భారీ కేక్‌లు కట్ చేశారు. నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసి.. అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివంగత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా.. ప్రజాభ్యుదయమే ధ్యేయంగా 2011 మార్చి 12న వైఎస్సార్సీపీని సీఎం వైఎస్ జగన్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ప్రస్థానంలో 12 ఏళ్లు పూర్తి చేసుకుని ఆదివారం 13వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి, మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సాగిస్తున్న సంక్షేమాభివృద్ధి పాలనను గుర్తుచేస్తూ యువకులు జై జగన్ నినాదాలు చేశారు. ► విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ► అనంతపురం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. తిరుపతిలోని తన నివాసంలో మంత్రి పెద్దిరెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. నగరి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి ఆర్కే రోజా కేక్ కట్ చేశారు. తిరుపతిలో ఎంపీ గురుమూర్తి జెండా ఎగురవేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కేక్ కట్ చేశారు. ► గుంటూరులో పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి, కేక్‌ను కట్‌చేశారు. 500 మీటర్ల వైఎస్సార్సీపీ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్, కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ పతాకం రెపరెపలాడింది. ► ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి, ఏలూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని వేడుకల్లో పాల్గొన్నారు. ► ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి వేణు, హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్‌రామ్ పాల్గొన్నారు. ► విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరులో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పార్టీ జెండాను ఎగురవేశారు. వైఎస్సార్సీపీ రోల్ మోడల్ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు వైఎస్సార్సీపీ ఓ రోల్ మోడల్ అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, పార్టీని ఏమీ చేయలేరని, ఓటమి అనేదే ఉండదన్నారు. వైఎస్సార్సీపీని దేశంలోనే ఆదర్శవంతమైన పార్టీగా తీర్చిదిద్దిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. పార్టీ పతాకంలోని రంగుల బెలూన్లను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ 12 ఏళ్ల ప్రస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగిందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసి ప్రజలతో మమేకమైన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. పరిపాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా పాలన సాగిస్తున్నారని చెప్పారు. అధికారం అంటే బాధ్యత, సేవ అని చాటి చెప్పిన నేత వైఎస్ జగన్ అని తెలిపారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ విప్లవాత్మకం అని, ప్రజల ఇంటి గడప వద్దకే పరిపాలన అందుతోందన్నారు. ఏ సమస్య అయినా సచివాలయం ద్వారా పరిష్కరించే పరిస్థితి తీసుకువచ్చారని చెప్పారు. మరో అడుగు ముందుకేస్తూ.. త్వరలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం మొదలు పెడుతున్నామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజాభివృద్ధే లక్ష్యం.. సామాజిక సాధికారతే ఎజెండా: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు దుస్తుల పంపిణీతో పాటు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏనాటికీ ఓటమి లేదని, అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే ఘన విజయం అని సజ్జల అన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..: ఆదర్శంగా 12 ఏళ్ల ప్రస్థానం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజలతో మమేకం అవుతోంది. అందుకే ప్రజలంతా తమ హృదయాల్లో పార్టీని పదిలపర్చుకున్నారు. 12 ఏళ్లుగా సీఎం జగన్ పార్టీని అంత ఆదర్శంగా నడుపుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారు. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా పరిపాలిస్తున్నారు. సీఎం జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ అందుకు నిదర్శనం. తండ్రి బాటలో నడుస్తున్న వైఎస్ జగన్, ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారు. బాధ్యత, నిబద్ధతతో పరిపాలన: ప్రజలే లక్ష్యం. ప్రజలే గమ్యం. పేదల అభివృద్ధే ప్రధాన ఆశయం. సామాజిక సాధికారితే ఎజెండాగా సీఎం ముందుకు వెళ్తున్నారు. 75 ఏళ్లుగా నినాదాలకే పరిమితమైన అనేక అంశాలను ఆయన ఆచరణలోకి తీసుకొచ్చారు. అలాగే ఎన్నికల హామీల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావిస్తామని చెప్పి, అందులో చెప్పిన ప్రతి మాటను అమలు చేశారు. అలా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోయారు. గత ఎన్నికల్లో 151 స్దానాల్లో గెలిపించిన ప్రజలు, తమపై అచంచల విశ్వాసాన్ని చూపితే.. దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, తాము సరైన పార్టీకి, సరైన నాయకుడుకి పాలనా పగ్గాలు అప్పగించామని ప్రజలు గర్వపడేలా సీఎం పని చేస్తున్నారు. వినూత్న, విప్లవాత్మక నిర్ణయాలు: పలు పథకాలు, కార్యక్రమాల ద్వారా అవినీతి రహితంగా.. మధ్యవర్తులు లేకుండా, దాదాపు రూ.2 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశారు. 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు, గతంలో పేదలు, బడుగు, బలహీన వర్గాలకు దూరమైన విద్య, వైద్య రంగాలను వారికి చేరువ చేశారు. సచివాలయ వ్యవస్ధ ద్వారా ప్రజల ముంగిటనే పాలన అందిస్తున్నారు. ఆ వ్యవస్థ ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా వివిధ శాఖల్లో మరో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ఏ సమస్య అయినా సచివాలయం ద్వారా పరిష్కరించే పరిస్దితి తీసుకువచ్చారు. మరో అడుగు ముందుకేస్తూ.. ‘జగనన్నకు చెబుదాం’ మొదలు పెడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది అత్యంత సాహసోపేతమైనది. సీఎం ఆ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్నారు. అది మామూలు విషయం కాదు: నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం.. వాటన్నింటిలో 50 శాతం మహిళలకు ఇస్తూ ఏకంగా చట్టం చేయడం నిజంగా ఒక గొప్ప నిర్ణయం. అది మామూలు విషయం కాదు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అలా చేయడానికి సాహసించ లేదు. అలాగే మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 70 శాతం పదవులు ఇవ్వడం దేశంలో ఎక్కడా జరగలేదు. అది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది. ఇన్ని మంచి పనులతో సీఎం జగన్, వైస్సార్సీపీకి చెందిన ప్రతి కార్యకర్త గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా చేశారు. దీన్ని మేం గర్వంగా చెప్పుకోగలం. పార్టీకి ఓటమి లేదు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, నేతలు.. ఎవరైనా సరే అందరూ కార్యకర్తలే. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎలా ఉండాలి.. ఎలా పరిపాలించాలి.. అనేది ఆదర్శవంతంగా చూపింది వైఎస్సార్సీపీ. అందుకే పార్టీకి ఓటమి లేదు. అది ఒక జీవ ప్రవాహంలా ముందుకు వెళ్తుంది. తమ ప్రచార శక్తులుగా ఉన్న పచ్చ మీడియా ద్వారా చంద్రబాబు వంటి వారు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజల్లో వేళ్ళూనుకున్న మా పార్టీని ఏ మాత్రం కదిలించ లేరు. ముఖ్యంగా మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబు, ఇతర శక్తులు ఎన్ని కుట్రలు పన్నాలో అన్నీ చేస్తాయి. మారీచులుగా పథకాలు పన్నుతాయి. మనం అన్నింటినీ ఎదుర్కోగలం. ఎందుకంటే ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పార్టీ ముందుకు వెళ్తోంది. అందుకే విజయం మనల్నే వరిస్తుంది. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి మారీచుల కుట్రలు ఎదుర్కోవాలి. నమ్మకం–విశ్వాసం పార్టీ ప్రధానాంశాలు: లేళ్ల అప్పిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగు పెడుతోంది. మహానేత వైఎస్సార్ హఠాన్మరణాన్ని ఎవరూ ఊహించ లేదు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ప్రజలు కోరుకున్న విధంగా జగన్‌గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్ధాపించారు. నమ్మకం, విశ్వాసం ప్రధాన అంశాలుగా పార్టీ ముందుకు వెళ్తోంది. గత ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ విజయం సాధించిన పార్టీ, వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలు గెల్చుకుంటుంది. మంత్రుల మేరుగ నాగార్జున, జోగి రమేష్, మండలి ఛీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి, ప్రభుత్వ సలహాదారులు ఎస్ఎం జియాఉధ్దీన్, నారమల్లి పద్మజ, బత్తుల బ్రహ్మానందరెడ్డి, గ్రంధాలయ పరిషత్ రాష్ట్ర ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ వరప్రసాదరెడ్డి, పండుగాయల రత్నాకర్, నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తితో పాటు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరక్టర్లు, పార్టీ నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చదవండి: మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి.. సీఎం జగన్ ట్వీట్ -
మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని నేడు 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: ఆత్మగౌరవానికి ప్రతీక.. సవాళ్లే సోపానాలుగా.. ‘‘గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ ఓ రోల్ మోడల్: సజ్జల గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. 2/2#YSRCPFormationDay #YSRCPForAll — YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2023 -
తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-
12 ఏళ్లుగా పార్టీని సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతంగా నడుపుతున్నారు : సజ్జల
-
వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
-
ఏపీ: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
అనంతపురం జిల్లా: పెనుకొండలో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం
-
వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి?: సజ్జల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రస్తకే లేదని,కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు తమకు ఐదేండ్లు పరిపాలన కోసం గెలిపించారని, దానిని తగ్గించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని అన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. ముందస్తు ఊహాగానాలపై స్పందించారు. ప్రజలను మోసం చేసేవారు, భ్రమలో ఉంచేవారే ముందస్తుకు వెళ్తారని, చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నారని వ్యాఖ్యనించారు. ‘‘మా పార్టీ కార్యకర్తల డీఎన్ఏ వేరు. వైఎస్ కుటుంబంతో ముడిపడిన బంధం వాళ్లది. మా వాళ్లను వేరే వాళ్ల పార్టీవాళ్లు తీసుకోవాలనుకోవడం వారి భ్రమ. డిమాండ్ ఎక్కడ ఉంది. మీ పార్టీలోకి వచ్చి ఏం చేస్తారు?’’ అంటూ సెటైర్లు వేశారు సజ్జల. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ తమకు కీలకమేనని అన్నారు. అవసరాలను బట్టి మంత్రులుగా ఉండే వాళ్లను వినియోగించుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే రెండున్నర సంవత్సరాలకు కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారని వెల్లడించారు. త్వరలోనే ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అన్నారు. -
మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రజాభీష్టంతో మొదలైన పార్టీ.. నేడు సుపరిపాలన అందిస్తూ ప్రజాదరణతో ముందుకెళ్తోంది. ఇందుకు కారణం వైఎస్ జగన్ నాయకత్వం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైఎస్సార్సీపీ.. 11 వసంతాలు పూర్తి చేసుకుని నేడు(మార్చి 12న) 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి! అని ట్వీట్ చేశారు సీఎం జగన్. దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి! — YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2022 -
ఈరోజు పార్టీ పండుగ: సజ్జల రామకృష్ణారెడ్డి
-
వైఎస్సార్సీపీ అంటే ఒక నమ్మకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షల దిశగా అడుగులు వేసిన పార్టీ ఇది. ప్రజల ఆశలకు ఒక రూపం ఇచ్చిన ఘనత పార్టీ సభ్యులది. ఈ మూడేళ్ళలోనే.. మూడు దశబ్దాల అభ్యుదయం కన్పిస్తోంది. అధికారం కోసం కొట్లాడే రాజకీయం కాకుండా సేవ చేయడంలో పోటీ చూపిస్తోంది కాబట్టే ఇంత ప్రజాదరణ దక్కుతోంది అన్నారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించారు. ‘‘బడ్జెట్ సందర్భంగా నిన్న బుగ్గన ‘నాలుగు మూల స్తంభాలు’ అన్నారు. మహానుభావుల కల ఏడు దశబ్దాల అయినా కాలేదు. కానీ మన పాలనలో రెండేళ్లలోనే గట్టి పునాది వేశాం. అది మన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. ప్రతి కుటుంబం కుంగిపోతున్న తరుణంలో.. విద్యా, వైద్యం అందిస్తూ సమగ్ర మార్పునకు కృషి చేశారు. చదువు కొనాల్సిన అవసరం లేకుండా.. చదువుకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. రాజకీయంగా అన్ని వర్గాలకు సాధికారత తీసుకొచ్చాం. మహిళలకు నిజమైన సాధికారత దిశగా అడుగులు వేశాం’’ అని పేర్కొన్నారు సజ్జల. టీడీపీ ఏడ్పుగొట్టు రాజకీయాలు.. ‘మౌలిక వసతుల విషయంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. గర్భంలో ఉన్న శిశువు దగ్గరి నుంచే చేయి పట్టుకుని ప్రభుత్వం నడిపిస్తోంది. ప్రభుత్వ స్కూల్లో సీటు కోసం సిఫార్సులకు వస్తున్నారంటే వాస్తవ అభివృద్ది కనిపిస్తోంది. కింది స్థాయిలో అన్ని వర్గాలు వారి కాళ్ళమీద వారు నిలబడే దిశగా సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు. కానీ, చంద్రన్న కానుక లాంటి స్కాంలు చేసిన ఘనత ఉన్నవాళ్లు.. ఇప్పుడు ఏడ్పుగొట్టు రాజకీయాలు చేస్తున్నారు. కుప్పంలో కూడా ఓడిపోయి.. నిన్న అండమాన్ గెలిచామని పండుగ చేసుకునే దుస్థితికి వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీకి మూడింతలు చేశాడని ప్రజలు నమ్మారు కాబట్టే స్థానిక సంస్థలలో విజయభేరీ మోగించాం. అందుకే అప్రమత్తంగా ఉండాలి... మనకు ప్రత్యర్థులు ఎవరూ లేరు...ప్రజల్ని మోసం, దగా చేసే వారే ప్రజలకు ప్రత్యర్థులు. అటువంటి వారి కుయుక్తులకు చెక్ పెట్టాలి. మిగిలిన పార్టీలకు మనకు పొంతన లేదు. శాశ్వతంగా ప్రజల మన్ననలు పొందేలా నిలబడే పార్టీ మనది. మానవాభివృద్ధితో కుటుంబాలన్నీ పైకి వచ్చేలా మనం అవకాశాలు సృష్టిస్తున్నాం. మాయలు, చేతబడులు చేసే వారిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. ఒక అరిష్టంలా మారిన టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలి. నిన్న కూడా 160 సీట్లు అంటున్నారు.. ఇప్పటికీ అబద్దాలు చెప్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయి నుంచే సిద్ధంగా ఉండండి ఈ సారి ప్లీనరీ జరుగుతుంది...సభ్యత్వ నమోదు ఉంటుంది. నిజంగా చంద్రబాబు అయితే కోవిడ్ అవకాశంగా పథకాలన్నింటికీ గుండుసున్నా చుట్టేవాడు. ఎంత ఆదాయం తగ్గినా మాట కోసం మన నాయకుడు పడుతున్న కష్టాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు పెడుతున్న ప్రతి పైసా లబ్దిదారుడికి చేరాలి అనేది మన లక్ష్యం. జగనన్న పథకాల అమలుపై ప్రతిఒక్క కార్యకర్త అందరికీ అందుతున్నాయా లేదా అనేది చూడాలి. అది మీకు పార్టీ మీకు ఇచ్చిన బాధ్యత...అది మీ హక్కు.. ప్రత్యర్థులు చేస్తున్న మాయా మంత్రాలను క్షేత్ర స్థాయిలో తిప్పికొట్టాలని కోరుకుంటున్నాను. ప్రజల జీవితంలో మమేకం అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
12వ వసంతంలోకి ప్రవేశించిన వైఎస్ఆర్సీపీ
-
వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-
వైఎస్సార్సీపీ@12: ప్రతి క్షణం ప్రజల కోసమే..
12th Formation Day Of YSR Congress Party 2022: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 సెప్టెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందడం కోట్లాది మందిని నిశ్చేష్టులను చేసింది. ఆయన మరణించడం తట్టుకోలేక వందలాది మంది గుండె పగిలి మృతి చెందారు. అలా చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని వైఎస్ జగన్ ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడినందుకు కాంగ్రెస్ అధినేత్రి తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఓదార్పు యాత్ర చేయకూడదని హూంకరించారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆ హూంకరింపులకు భయపడకుండా ఓదార్పు యాత్ర చేపడతానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఆ ప్రస్థానం ఇలా సాగింది.2010: మొగ్గలోనే తుంచేసేందుకు కుట్రలుప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఓదార్పు యాత్రను ఆపేయాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం తెగేసి చెప్పడంతో.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం.. నైతిక విలువలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నుంచి సంక్రమించిన కడప ఎంపీ పదవికి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలు రాజీనామా చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్ జగన్ ఉద్యమబాట పట్టారు. దీంతో వైరిపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ అధిష్టానం కుమ్మక్కై తప్పుడు కేసులు పెట్టించింది.2011: ప్రజాభ్యుదయమే ఆశ, శ్వాస ప్రజాభ్యుదయమే పరమావధిగా.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీని వైఎస్ జగన్ స్థాపించారు. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ జగన్, పులివెందుల శాసనసభ స్థానం వైఎస్ విజయమ్మలు వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. తమ కోసం నిలబడిన వారిద్దరినీ రికార్డు మెజార్టీతో జనం గెలిపించారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. కాంగ్రెస్ నుంచి సంక్రమించిన పదవులకు రాజీనామా చేస్తేనే వైఎస్సార్సీపీలో చేరడానికి అవకాశం ఇస్తామని షరతు పెట్టారు. తద్వారా రాజకీయాల్లో మాయమవుతున్న నైతిక విలువలను పరిరక్షించేందుకు నడుం బిగించారు. 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి.. వైఎస్సార్సీపీలో చేరారు.2012: అణగదొక్కేందుకు అక్రమ నిర్బంధంఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగారు. వారి తరఫున ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్‌ను విచారణ కోసమని పిలిచిన సీబీఐ.. అరెస్టు చేసింది. తమ కోసం నిలబడిన వైఎస్ జగన్‌ను అరెస్టు చేసినా.. ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 17 శాసనసభ, ఒక లోక్‌సభ స్థానంలో రికార్డు మెజార్టీతో గెలిపించి.. కాంగ్రెస్, టీడీపీ కుట్రలను జనం చిత్తు చేశారు. వైఎస్ జగన్‌ను సీబీఐ అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ ‘జగన్ కోసం జనం’ పేరుతో కోటి సంతకాలు చేశారు. 2013: ప్రజా క్షేత్రంలోకిదాదాపు 16 నెలల అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన వైఎస్ జగన్.. ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను గౌరవిస్తూ రాష్ట్ర విభజనలో కేంద్రం తీరును నిరసిస్తూ ఉద్యమబాట పట్టారు. ఆమరణ దీక్ష చేశారు. లోక్‌సభలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. 2014: కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో..విభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే.. వైఎస్సార్సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఓట్ల కోసం టీడీపీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తే.. అమలు చేయగలిగే హామీలను మాత్రమే వైఎస్ జగన్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో 67 శాసనసభ, ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది. 2015: ప్రతిపక్షం.. ప్రజాపక్షంరైతులను, డ్వాక్రా మహిళలను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఉద్యమించారు. విభజన సమయంలో పార్లమెంట్లో ప్రధాని ఇచ్చిన హామీ ద్వారా రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమబాట పట్టారు. 2016: అలుపెరగని పోరాటంప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదా కోసం రాజీ లేని పోరాటం చేశారు. కానీ.. నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి.. ప్రత్యేక సహాయానికి అంగీకరించారు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్‌ను బలహీనపర్చాలనే కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు.2017: అసెంబ్లీ నుంచి ప్రజాక్షేత్రంలోకిటీడీపీ సర్కార్ దోచుకుంటోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఓ వైపు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను 23 మందిని కొనుగోలు చేసిన చంద్రబాబు, వారిలో కొందరిని మంత్రివర్గంలోకి తీసుకుని విలువలకు వలువలు వదలడం మరో వైపు.. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బహిష్కరించారు. ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.2018: పాదయాత్రకు బ్రహ్మరథంవైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. ప్రజల్లో వైఎస్ జగన్‌కు.. వైఎస్సార్సీపీకి ఆదరణ నానాటికీ పెరుగుతుండటంతో నాటి అధికార టీడీపీ దాన్ని తగ్గించేందుకు చేయని కుట్ర లేదు.. కుతంత్రం లేదు.2019: దేశ చరిత్రలో తిరుగులేని విజయంవైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. సాధారణ ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని అఖండ విజయం సాధించింది. 2019 మే 30న అధికారం చేపట్టిన తొలి రోజే సంక్షేమాభివృద్ధి పథకాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసి.. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపారు. గిరిజన మహిళను డిప్యూటీ సీఎంగా.. ఎస్సీ మహిళను హోంమంత్రిగా నియమించారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకూ.. మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ దేశంలో చట్టం చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2020: సుపరిపాలనలో నంబర్ 1అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఎన్నికల మేనిఫెస్టోలో సింహభాగం హామీలను అమలు చేసి రాజకీయాల్లో సరి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి.. ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. కరోనా సమయంలోనూ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా చర్యలు తీసుకున్నారు. దాంతో దేశంలో స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచింది.2021: మరింత పెరిగిన జనాదరణసంక్షేమాభివృద్ధి పథకాల అమలుతోపాటు సుపరిపాలన అందిస్తుండటంతో ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయం సాధించింది. తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యల వల్ల దేశంలో స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో రాష్ట్రం వరుసగా రెండో ఏడాది నంబర్ వన్‌గా నిలిచింది. సంక్షేమాభివృద్ధి ప్రదాత, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సరిగ్గా 11 ఏళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మలతో మొదలైన వైఎస్సార్సీపీ.. ఇంతింతై వటుడింతై అన్న రీతిలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సమస్యలు.. సవాళ్లు, దాడులను ఎదుర్కొంది. వాటిని తట్టుకుని నిలవడమే కాకుండా మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడింది. తమ కోసం నిలబడిన, తమ కోసం రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ వెంట జనం అడుగులేస్తూ నీరాజనాలు పలుకుతున్నారు.– ఆలమూరు రామగోపాలరెడ్డి -
యూఎస్‌లో ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు
వాషింగ్టన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే ఊపిరిగా.. రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియాలలో శనివారం మార్చి 13వ తేదీన దశాబ్ది ఉత్సవాలను వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొన్నారు. ఈ కార్యక్రమానికి యూఎస్ఏ కన్వినర్ చంద్రహాస్ పెద్ధమల్లు , గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కేవీ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతల పునాదులపై పార్టీ పుట్టిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఇడుపులపాయలో మొదలై ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్ర ద్వారా జనం గుండె చప్పుడులోంచి వైఎస్సార్సీపీ మేనిఫెస్టో రూపొందించిందన్నారు . ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే నవరత్నాలు, సంక్షేమ పధకాలు, ఇదివరకెన్నడూ ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో సంస్కరణలకు నాంది పలికారన్నారు. "నాడు–నేడు" కార్యక్రమంల వల్ల ప్రభుత్వ సూళ్ల రూపు రేఖలే మారిపోతున్నాయి చెప్పారు. వైద్య రంగం, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగాలలో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ కమిటీ సభ్యులైన సురేంద్ర అబ్బవరం, నరేంద్ర కొత్తకోట , హారిన్ద్ర శీలం , కిరణ్ కూచిబొట్ల , ప్రశాంతి ,సుబ్బారెడ్డి, దిలీప్ , రామచంద్ర రెడ్డి , అంకిరెడ్డి, ఇతర వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
చరిత్రలో ఈ ప్రస్థానం ప్రత్యేకం
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం చాలా ప్రత్యేకమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీని సరికొత్త రాజకీయ విధానాలతో నడిపిన చరిత్ర సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. వైఎస్సార్ మరణించినప్పుడు ప్రత్యేక పరిస్థి తుల్లో ఒంటరిగా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఆరోజు నుంచి నిరంతరం జగన్ ప్రజల్లో మమేక మయ్యారు.. ప్రజల్నే నమ్ముకున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా జగన్ సాగిస్తున్న ప్రస్థానం దశాబ్దాలపాటు ముందుకు సాగుతూనే ఉంటుందన్నారు. జగనన్న దగ్గర్నుంచి.. జగన్ మామ, జగన్ తాతగా కూడా ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. వైఎస్సార్సీపీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడు తూ.. వైఎస్సార్సీపీని జగన్ అన్నీ తానై నడిపించా రన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా తీర్చిదిద్దార న్నారు. జగన్ ధైర్యానికి, పోరాటానికి పదేళ్ల రాజకీయ ప్రస్థానమే ఉదాహరణని చెప్పారు. జగన్ రాజకీయ నిర్ణయాల్లో ఎక్కడా దాపరికాలు ఉండవని, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఆయన శైలి అని తెలిపారు. 21 నెలల పాలనతో చరిత్ర సృష్టించారన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నిక ల్లో సీఎం జగన్ పాలనకు ప్రజలు మద్దతు తెలపడమే దీనికి నిదర్శనమన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ విజయం వైఎస్సార్సీపీదే నన్నారు. సీఎం జగన్ అంటే లక్షలాదిమంది అభిమానులు, వేలాదిమంది నాయకులు అనే విషయం ఎవ్వరూ మర్చిపోరాదన్నారు. పార్టీ ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను సజ్జల తెలిపారు. వైఎస్సార్ ఆలోచన, స్ఫూర్తితో వైఎస్ జగన్ పార్టీని స్థాపించారని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మొండితోక జగన్మోహన్రావు, ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు. పండుగలా.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో పండుగ వాతావరణం నెల కొంది. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగుర వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణుల తో కలసి భారీ కేక్‌ను కట్ చేశారు. పేద మహి ళలకు చీరలు పంచిపెట్టారు. వైఎస్సార్ జిందా బాద్, మహానేత వైఎస్సార్ ఆశయాలు నెరవే రుస్తాం, జగనన్న నాయకత్వం వర్థిల్లాలి, జై జగన్.. జైజై జగన్ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నేతలు చల్లా మధుసూదన్‌రెడ్డి, పండుగాయల రత్నాకర్, చిల్లపల్లి మోహన్‌రావు, నందమూరి లక్ష్మీపార్వతి, నారాయణమూర్తి, శివశంకర్‌రెడ్డి, నారమల్లి పద్మజ, కావటి మనోహర్ నాయుడు, బొప్పన భవకుమార్, రాము, కుంభా రవిబాబు, సోమినాయుడు, క్రిస్టినా, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
'ఆ పార్టీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి'
గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు 11వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్బంగా గుంటూరులో నిర్వహించిన సమావేశంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యేతో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిన దిన ప్రవర్ధమానంగా ఎదిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ మీద పోరాటం చేసి 151 స్థానాలను కైవసం చేసుకొని ఇవాళ రాష్ట్రంలో అధికారం చేపట్టింది అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ‘ఈ సందర్బంగా ఒక విషయాన్ని చాలా స్పష్ట్టంగా చెప్పాలి మేనిఫెస్టోకు పవిత్రత ఇచ్చిన పార్టీ ఏదైనా దేశంలో ఉంది అంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. ఏపీలో వైఎస్సార్ పార్టీ చాలా గొప్పగా ఎదిగింది. ఈ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పాలనతో భవిష్యత్ లో జగన్ ను ఓడించే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదు’ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ ఎన్నికల తరువాత టీడీపీ ఉనికి లేకుండా పోతుంది. ఆ పార్టీకి రాబోయే శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడనుంది. ఓటమి కంటే పోటి చేయకుండా ఉండటమే మేలనుకుంటారు. సత్తెనపల్లిలో పది సీట్లకు అభ్యర్థులు దోరకని దుస్థితి టీడీపీది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తెనపల్లిలో ప్రశాంత వాతావరణం చెడగొట్టానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారు. రాజకీయ శత్రువులు వ్యక్తిగతంగా శత్రువులుగా మారకుడదు. పోలింగ్ జరిగే సమయంలో బూత్ దగ్గరకు టీడీపీ నాయకులు రావటం సమంజసం కాదు. దీనికి మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు సమాధానం చెప్పాలి. అన్ని రాజకీయ పార్టీలు ప్రశాంతంగా పోలింగ్ చేసుకోవటానికి సహకరించాలి. గొడవలు పడతాం ఘర్షణ పడతాం అంటే చూస్తు ఉరుకోం’ అని అంబటి స్పష్టం చేశారు. చదవండి: పదేళ్ల ప్రయాణం.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ -
పదేళ్ల ప్రయాణం.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, అమరావతి: విశ్వసనీయత, విలువలకు విశ్వమే అండగా నిలుస్తుందని చాటి చెప్పి.. ఈ సిద్ధాంతాలే ఊపిరిగా ప్రజా క్షేత్రంలో పురుడు పోసుకున్న వైఎస్సార్సీపీ నేడు 11వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్సీపీ పురుడు పోసుకుందన్నారు. పదేళ్ల ప్రయాణంలో కష్టసుఖాల్లో తనకు అండగా నిలిచిన ప్రజలకు, కలిసి నడిచిన నాయకులకు, వెన్నంటి ఉన్న కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్.. ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. చదవండి: పింగళి వెంకయ్య కుటుంబాన్ని సత్కరించిన సీఎం జగన్ పండుగలా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు -
వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
-
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
-
పదకొండవ వసంతం: కొన్ని ముఖ్య ఘట్టాలు
సాక్షి, అమరావతి: రాజన్నగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ఆయన లక్ష్యాలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఉద్భవించిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తన తండ్రి సంక్షేమ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేసి, తమను నమ్ముకున్న ప్రజల కోసం రాజన్న తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన సరికొత్త ప్రయాణంలోని ఈ ముఖ్యఘట్టానికి నేటితో పదేళ్లు నిండాయి. ఈ పదేళ్ల కాలంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, రాజకీయ కుట్రలతో తనను ఇబ్బందులకు గురిచేసినా.. ఆయన మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు. ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వాటికి పరిష్కారం చూపించే దిశగా నవరత్నాలతో మేనిఫెస్టో రూపొందించారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి విలువలు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజారంజక పాలన కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్ సీపీ పదకొండో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, జగనన్న పోరాట పథంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను పరిశీలిద్దాం. పోరాట పథంలో కొన్ని ముఖ్య ఘట్టాలు 02.09.2009: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతి 08.07.2010: గుండె పగిలిన కుటుంబాలను ఓదార్చేందుకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఓదార్పుయాత్ర 29.11.2010: కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి వైఎస్ జగన్ రాజీనామా 21.12.2010: రైతులు, చేనేతలను ఆదుకోవాలని విజయవాడ కృష్ణా నదీ తీరాన 48 గంటల నిరాహార దీక్ష 12.03.2011: వైఎస్సార్సీపీ ఆవిర్భావ ప్రకటన 14.06.2012: ఉప ఎన్నికల్లో 19 స్థానాలకు 17 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానంలో గెలుపు. 21.12.2012: రాజకీయంగా పెట్టిన అక్రమ కేసులు, సీబీఐ పక్షపాత ధోరణికి వ్యతిరేకంగా ‘జగన్ కోసం జనం’ పేరుతో కోటి సంతకాల సేకరణ 05.10.2013: రాష్ట్ర సమైక్యత కోరుతూ లోటస్‌పాండ్‌లో దీక్ష 18.12. 2013: సమైక్య నినాదం కోరుతూ వైఎస్సార్సీపీ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం 16.05.2014: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 67 స్థానాలు. 20.06.2014 : అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌కు గుర్తింపు 21.02.2015: అనంతపురంలో రైతు భరోసా యాత్ర 03.03.2015: రాజధాని అమరావతి ప్రాంతంలో వైఎస్ జగన్ తొలి పర్యటన. 10.08.2015: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఒక రోజు ధర్నా 29.08.2015: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర బంద్ నిర్వహించిన పార్టీ 08.12.2015: మద్య నియంత్రణపై ప్రకటన 26.01.2017: ప్రత్యేక హోదా కోరుతూ విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన జగన్‌ను విమానాశ్రయం రన్‌వే మీదే అరెస్టు చేసిన ప్రభుత్వం. 01.05.2017: గుంటూరులో రైతు దీక్ష. మద్దతు ధరలు ఇవ్వాలని డిమాండ్ 06.11.2017: ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర 25.10.2018: వైఎస్ జగన్‌పై ఓ వ్యక్తి హత్యాయత్నం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత 09.01.2019: ఇచ్చాపురం వద్ద ప్రజా సంకల్ప యాత్ర పూర్తి. 3,648 కిలోమీటర్లు పూర్తి. 30.05.2019: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చదవండి: నాటి నుంచి నేటి వరకు.. ప్రజాపథమే అజెండా -
వైఎస్ఆర్ కలల్ని సాకారం చేయాడానికి పుట్టిన పార్టీ
-
పండుగలా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆశయాలు అంబరాన్ని తాకితే ప్రజాదరణే పునాదిగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ నిరూపించింది. ఆకాంక్షల ఉన్నతికి జనాభిమానమే బ్రహ్మరథం పడుతుందని.. విశ్వసనీయత, విలువలకు విశ్వమే అండగా నిలుస్తుందని చాటి చెప్పింది. ఈ సిద్ధాంతాలే ఊపిరిగా ప్రజా క్షేత్రంలో పురుడు పోసుకున్న వైఎస్సార్సీపీ నేడు 11వ వసంతంలోకి అడుగు పెట్టింది. దేశ చరిత్రలోనే వైఎస్ఆర్సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకం తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే జోగి రమేష్, ఎంపీ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే వైఎస్సార్సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకమని, పార్టీని సరికొత్త రాజకీయ విధానాలతో నడిపిన చరిత్ర వైఎస్ జగన్‌దన్నారు. వైఎస్సార్ మరణించినప్పుడు ప్రత్యేక పరిస్ధితుల్లో ఒంటరిగా పార్టీ పెట్టారని.. ఆ రోజు నుంచి నిరంతరం వైఎస్ జగన్.. ప్రజల్లో మమేకమయ్యారన్నారు. ‘‘ఇతర పార్టీల్లా కాకుండా.. వైఎస్సార్సీపీని అన్నీ తానై నడిపించారు. జగన్ ధైర్యానికి, పోరాటానికి పదేళ్ల రాజకీయ ప్రస్థానమే ఉదాహరణ. రాజకీయ నిర్ణయాల్లో ఎక్కడా దాపరికాలు ఉండవు.. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మా నాయకుడి శైలి. పార్టీ నడిపే ప్రస్థానంలో అక్రమ కేసులతో జైలుకు పంపినా ఎక్కడా చెక్కు చెదరలేదు. ఆటుపోట్లతో వైఎస్ జగన్ ఉక్కు మనిషిలా ఆవిష్కృతమయ్యారు. 2014లో ఓడిపోయినప్పుడు అందరూ డీలాపడ్డా జగన్ మాత్రం అధైర్యపడలేదు. ఆ క్షణం నుంచి ప్రతిపక్ష నేతగా ప్రజలతో మరింత మమేకం అయ్యారు. అందుకే ఈరోజు 20 నెలల పాలనతో చరిత్ర సృష్టించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ పాలనకు ప్రజలు మద్దతు తెలపడమే నిదర్శనమని’’ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఆలోచన, స్ఫూర్తితో.. వైఎస్సార్ ఆలోచన, స్ఫూర్తితో వైఎస్ జగన్ పార్టీని స్థాపించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నో ఇబ్బందులు పడి తండ్రి ఆశయం కోసం పోరాడారన్నారు. వైఎస్ జగన్ పోరాటానికి నిదర్శనమే 2019 ఎన్నికల ఫలితాలని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన నాయకుడు దేశంలోనే మరొకరు లేరు.మేనిఫెస్టోను ఇంత పక్కాగా అమలు చేసిన నాయకుడు ఎవరూ లేరని మంత్రి బొత్స అన్నారు. సీఎం జగన్ వెనకడుగు వేయలేదు.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సీఎం జగన్ వెనకడుగు వేయలేదన్నారు. వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర చేశారని.. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ఆయన నెరవేర్చారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ ఆడిటోరియం వద్ద పార్టీ జెండాను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే పార్థసారధి.. కృష్ణా జిల్లా: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ పోరంకి సెంటర్లో పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధే వైఎస్సార్సీపీ లక్ష్యం.. చిత్తూరు: తిరుపతిలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ జెండా జనం గుండెల్లో నిలిచిపోయిందన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి సీఎం జగన్.. ప్రజల మన్ననలు పొందారన్నారు. కొత్త పాలక వర్గాలతో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధే వైఎస్సార్సీపీ లక్ష్యమన్నారు. ప్రజల కోసం పుట్టిన పార్టీ.. విశాఖపట్నం: విశాఖ నగర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అదీప్ రాజు, పార్టీ నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ .. పార్టీగ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేకే రాజు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, రెహమాన్, తైనాల విజయ కుమార్, చొక్కాకుల వెంకటరావు, చింతలపూడి వెంకట రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీని స్థాపించారని తెలిపారు. వైఎస్ జగన్‌ను సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మకై ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు.వారి కుట్రలను సీఎం జగన్ ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: నాటి నుంచి నేటి వరకు.. ప్రజాపథమే అజెండా పాలనలో, పార్టీలో మానవీయ ముద్ర -
పదకొండవ వసంతంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం
-
వైయస్సార్సీపీ ఆవిర్భావం
-
నాటి నుంచి నేటి వరకు.. ప్రజాపథమే అజెండా
సరిగ్గా పదేళ్ల క్రితం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ. తొలి ఎనిమిదేళ్లలో ఈ పార్టీ ఎదుర్కొన్నన్ని సమస్యలు, కుట్రలు, కుయుక్తులు బహుశా ఏ పార్టీ కూడా చవిచూసి ఉండకపోవచ్చు. నిరంతరం పోరాటమే. ఊపిరి సలపనివ్వని రీతిలో ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి చేసినా ధైర్యంగా అడుగులు ముందుకు వేసింది. అసలు సిసలు పోరాటం అంటే ఇదేననే రీతిలో ప్రజా సమస్యలపై యుద్ధమే చేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ కృషి, పట్టుదల, కార్యదక్షతతో దాదాపు రెండేళ్ల క్రితం అత్యధిక శాతం ప్రజల మద్దతుతో అధికారం చేపట్టింది. ఇక అప్పటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక పాలనకు శ్రీకారం చుట్టింది. అనతి కాలంలోనే యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ‘సంక్షేమం – అభివృద్ధి’ రెండు కళ్లుగా భావించి పాలనను కొత్త పుంతలు తొక్కిస్తోంది. సాక్షి, అమరావతి : ఆశయాలు అంబరాన్ని తాకితే ప్రజాదరణే పునాదిగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ నిరూపించింది. ఆకాంక్షల ఉన్నతికి జనాభిమానమే బ్రహ్మరథం పడుతుందని.. విశ్వసనీయత, విలువలకు విశ్వమే అండగా నిలుస్తుందని చాటి చెప్పింది. ఈ సిద్ధాంతాలే ఊపిరిగా ప్రజా క్షేత్రంలో పురుడు పోసుకున్న వైఎస్సార్సీపీ నేడు 11వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సుదీర్ఘ ప్రస్తానంలో వైఎస్సార్సీపీని వెంటాడిన వేధింపులు, చీకటి పర్వాలు, పైశాచిక రాజకీయం సృష్టించిన ఎదురు దెబ్బలు ఎన్నో ఉన్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో ఆంధ్ర రాష్ట్రం నివ్వెరపోయింది. సంక్షేమ సారథి అకాల మరణంతో ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఇడుపులపాయలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరిస్తున్న వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్(ఫైల్) పేదవాడి బతుకును కారుచీకట్లు కమ్ముకున్నాయి. మహానేత లక్ష్యాలను ఆ తర్వాత సర్కార్లు అలక్ష్యం చేశాయి. తండ్రి ఆశయాలు తెరమరుగు చేసే ఆనాటి పాలకుల వైఖరిపై వైఎస్ జగన్ నిరసన గళమెత్తారు. నేనున్నానంటూ ముందుకొచ్చారు. వెంటాడే కుట్రలు ఛేదించుకుని ముందుకెళ్లారు. 2010 నవంబర్ 29న తన పార్లమెంట్ స్థానానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ త్యాగానికి జనం నీరాజనాలు పలికారు. కడప ఎంపీగా నిలబడి 5,45,043 ఓట్ల రికార్డు మెజారిటీతో గెలిచారు. వైఎస్సార్ ఆశయ సాధన దిశగా... విశ్వసనీయ రాజకీయాలకు తెరతీస్తూ 2011 మార్చి 12వ తేదీన వైఎస్సార్సీపీని స్థాపించారు. జన నేతగా జగన్ వేసిన ప్రతీ అడుగు ప్రజాక్షేత్రం వైపే కొనసాగింది. విశ్వసనీయతకు పట్టం ఎదురయ్యే సవాళ్లను వ్యక్తిగానే ఎదుర్కొన్న జగన్.. వైఎస్సార్సీపీని ఓ శక్తిగా మార్చారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో 19 స్థానాలకు పోటీ చేసి, 17 సీట్లు కైవసం చేసుకున్నారు. జన బలమే కొండంత అండగా దుర్మార్గపు రాజకీయ వ్యవస్థను ప్రశ్నించారు. పేదవాడి పక్షాన నిలబడి పోరాడారు. 2014 నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్తానమే మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అనైతిక పొత్తులతో.. అలవికాని వాగ్దానాలతో ఎన్నికలకెళ్లింది. విలువలే ప్రధానంగా.. నిజాలే హామీలుగా వెళ్లిన వైఎస్సార్సీపీ అధికారానికి కూతవేటు దూరంలో నిలిచింది. 44.47 శాతం ఓట్లతో 67 సీట్లు, 8 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. 2019 మే 30న విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వైఎస్ జగన్ ప్రజా క్షేత్రమే దేవాలయం అధికార మదం.. దౌర్జన్యం.. అవినీతి.. అక్రమాలు.. ఏకమై సాగిపోతున్న చంద్రబాబు పాలనపై విపక్ష నేతగా వైఎస్ జగన్ ఉక్కు పిడికిలి బిగించారు. అన్నదాత ఆక్రందనపై నిలదీశారు. అక్కచెల్లెమ్మలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారు. పేదవాడి సంక్షేమం పచ్చ నేతల ఫలహారం అవుతుంటే హూంకరించారు. యువత ఆశలు ఆవిరవుతుంటే ధిక్కరించారు. కూడు, గూడు లేని పేదల పక్షాన స్వరం విన్పించారు. ఢిల్లీ వీధుల్లో ఆంధ్రుల హక్కులు తాకట్టు పెట్టిన టీడీపీ అన్యాయాన్ని నిగ్గదీసి అడిగారు. చినబాబు నుంచి పెదబాబు వరకు చేసిన అవినీతి కంపును కడిగేశారు. వెల్లువలా ఉద్యమాలు చేశారు. దగాపడ్డ జనానికి అండగా నిలిచారు. ప్రమాణ స్వీకార సభలో భావోద్వేగానికి గురైన తల్లి విజయమ్మతో సీఎం వైఎస్ జగన్ జగన్ జనాభిమానాన్ని తట్టుకోలేని టీడీపీ.. దొడ్డిదారి రాజకీయాలకు తెరతీసింది. సంతల్లో పశువుల్లా 23 మంది ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొనేసింది. సమస్యలు నిలదీసే శాసనసభ సాక్షిగా విపక్షం గొంతును ఏకపక్షంగా నొక్కేసింది. దీంతో ప్రజలకు గుండె ధైర్యం చెప్పేందుకు జగన్ జనం బాట పట్టారు. కాలిబాటన ప్రజా జీవితానికి దగ్గరయ్యారు. ఇడుపులపాయలో మొదలైన ప్రజాసంకల్ప యాత్ర ఇచ్ఛాపురం వరకు సాగింది. జనం గుండె చప్పుడులోంచి మేనిఫెస్టో రూపొందించింది వైఎస్సార్సీపీ. మా మేనిఫెస్టో మాకు ఖురాన్.. బైబిల్.. భగవద్గీత.. అని చెప్పిన జగన్ మాటల్లో విశ్వసనీయతను జనం నమ్మారు. 50 శాతం ఓట్లతో.. 151 సీట్లు ఇచ్చి చరిత్రలో ఎన్నడూ లేనంత మెజారిటీతో అధికారం అప్పగించారు. పాదయాత్రలో ఓ అవ్వతో ఆప్యాయంగా.. వైఎస్ జగన్ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే ఇదివరకెన్నడూ.. ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో సంస్కరణలకు నాంది పలికారు. నాడు–నేడు కార్యక్రమంలో ప్రభుత్వ సూళ్ల రూపు రేఖలే మారిపోతున్నాయి. తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వ సూళ్లను చూసిన వారెవరైనా, ఇప్పుడు చూస్తే పోల్చుకోలేనంతగా మార్పు కనిపిస్తోంది. పర్యవసానంగా విద్యార్థుల చేరికలు భారీగా పెరిగాయి. కొన్ని పాఠశాలల్లో అయితే ఇక సీట్లు లేవు.. అని చెప్పాల్సిన పరిస్థితి నెలకొందంటే ఏ స్థాయిలో మార్పు వచ్చిందో ఇట్టే అర్థమవుతోంది. పేద పిల్లలు ఎంత వరకు చదవాలనుకుంటే అంత వరకు ప్రభుత్వమే చదివిస్తుందని ఇచ్చిన మాట మేరకు విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తున్నారు. గత ప్రభుత్వ బకాయిలు సైతం చెల్లించి, తాజాగా తల్లుల ఖాతాల్లో ఫీజు మొత్తం జమ చేస్తున్నారు. విద్యార్థుల హాస్టల్, వసతి ఖర్చుల కోసం వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు సాయం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యా కానుక కిట్ అందజేస్తున్నారు. మన బడి నాడు–నేడులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేసే సదుపాయాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైద్య రంగానికి పెద్దపీట వైద్య రంగంలో విప్లవాత్మక రీతిలో నియామకాలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలోకి అడుగు పెట్టగానే ఏదైనా కార్పొరేట్ ఆస్పత్రిలోకి వచ్చామా.. అనే రీతిలో సౌకర్యాలు, వాతావరణం ఉండేలా, మంచి వైద్యం, రోగులకు మంచి భోజనం లభించేలా దృష్టి సారించారు. ఈ మేరకు ఈ రంగంలో కూడా నాడు–నేడు కింద అభివృద్ధికి కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ పరంపరలో అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బంది, టెక్నీషియన్ల నియామకాలు పూర్తయ్యాయి. ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే తీసుకోండని సీఎం అధికారులను ఇటీవల సమీక్షలో ఆదేశించారు. ప్రధానంగా ఆరోగ్యశ్రీలో ఎవరూ ఊహించని మార్పులు తెచ్చారు. ఆరోగ్య శ్రీ కార్డును ఓ మహిళకు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొరుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా, ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఈ పథకం కింద పేదలు ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొద్ది రోజులు పనులకు వెళ్ల లేరు. విశ్రాంతి అవసరం అవుతుంది. ఆ సమయంలో వారి జీవనభృతికి ఇబ్బంది కాకుండా ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ కింద రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5,000 ఇస్తున్నారు. 108, 104 సర్వీస్ వ్యవస్థ రూపు రేఖలు మార్చారు. కొత్తగా 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి గ్రామంలో, పట్టణాల్లోని వార్డుల్లో వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా కోవిడ్–19 నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య రంగం మంచి ప్రగతి కనబరిచింది. వ్యవసాయ విప్లవం రైతు బావుంటేనే దేశం, రాష్ట్రం బావుంటుందని భావించిన సీఎం జగన్.. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి, ఏటా ఈ పథకం కింద మూడు విడతల్లో రూ.13,500 ఇస్తున్నారు. ఊరూరా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాణ్యమైన పురుగు మందులు, ఎరువులు ఇక్కడే లభించేలా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లను నియమించి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. రైతులకు పెట్టుబడి రాయితీ అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ రానున్న రోజుల్లో ప్రతి ఆర్బీకే పరిధిలో మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో భాగంగా ప్రభుత్వమే ఆ పంటలు కొనుగోలు చేసేలా సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారు. రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నారు. 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఆక్వా రైతులకు కూడా సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఉచిత విద్యుత్ పథకం సవ్యంగా అమలు చేయడానికి ఏకంగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి.. రెండు కళ్లు రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమం, అభివృద్ధి.. రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నారు. ‘అభివృద్ధి అంటే నిన్నటి కంటే నేడు బావుండటం.. నేటి కంటే రేపు మరింత బావుంటుందని నమ్మకం కలిగించడం’ అని సరికొత్త నిర్వచనం చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పాలనలో పారదర్శకత, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కేవలం 20 నెలల్లోనే 90 శాతం హామీలను అమలు చేసి రికార్డు సృష్టించారు. పేదలకు కట్టించే ఇంటి నమూనాను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ పాలనకు జనం నీరాజనం ఇంటిముందుకే వచ్చిన సంక్షేమాన్ని చూసి ప్రజలు జగన్‌ను గుండెల్లో నింపుకుంటున్నారు. భరోసా దక్కిన రైతన్న ముఖంలో చిరునవ్వు కన్పిస్తోంది. పిల్లలను బడికి పంపే అమ్మలో గుండె ధైర్యం నెలకొంది. ఉపాధి దక్కుతుందన్న నమ్మకం యువతలో పెరిగింది. ఆరోగ్య శ్రీ అండ ఉందనిపేదవాడు భావిస్తున్నాడు. బడుగు, బలహీన వర్గాల్లో అభివృద్ధి ఆనందం తొణికిసలాడుతోంది. ఇంటికే వచ్చి ఏం కావాలో తెలుసుకునే గ్రామ సచివాలయ వ్యవస్థ.. ఊళ్లోనే బడి.. ఆస్పత్రి.. మౌలిక సదుపాయాలతో మెరుగైన పల్లెలు.. 21 నెలల్లోనే జగన్ సాధించిన విజయాలు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి 80 శాతం ప్రజా మద్దతు లభించింది. పురపాలక ఎన్నికల్లోనూ ఫ్యాన్ స్పీడ్‌ను జనమే పెంచారు. తమ కోసం ఎందాకైనా.. అంటూ తెగించే నేత కోసం ఈ బంధం, ప్రస్థానం ఇంకెన్నాళ్లయినా ఇలానే కొనసాగుతుందని ప్రజలు చెబుతున్నారు. ఇంటింటికీ రేషన్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన అక్కచెల్లెమ్మలు ‘ఆమె’ సంక్షేమమే లక్ష్యం వైఎస్ జగన్ 21 నెలల పాలనలో మహిళల పట్ల అడుగడుగునా అత్యంత శ్రద్ధ కనిపించింది. మహిళల రక్షణ, సంక్షేమం కోసం విప్లవాత్మక రీతిలో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. భద్రత కోసం ‘దిశ’ చట్టం తీసుకొచ్చేందుకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపారు. ప్రత్యేకంగా దిశ పోలీసుస్టేషన్లు ప్రారంభించారు. దిశ యాప్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏదైనా సమస్య ఎదురైనప్పడు ఈ యాప్ ఉపయోగిస్తే పోలీసులు వెంటనే చేరుకుని రక్షణ కల్పిస్తారు. రక్షణ పరంగా ఇతరత్రా పలు చర్యలు తీసుకున్నారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టం చేశారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా మామూలు సగటు మహిళలు ఎంతో మందికి ఇవాళ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్లు, పలు కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్ పదవులు దక్కాయి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మహిళలకే అవకాశం కల్పించారు. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఇటీవల 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి.. వారందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు. ఈ పథకం కింద మహిళల పేరుతోనే పట్టాలు ఇవ్వడం గమనార్హం. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల కింద అందజేసిన సొమ్ముకు తోడు బ్యాంకు రుణాలు అందజేసి మహిళలు చిరు వ్యాపారాలు ప్రారంభించేలా తోడ్పాటు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. సున్నా వడ్డీ పథకాన్ని కూడా ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఇటీవల బాలికల ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ చూపుతూ.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7–12 తరగతుల బాలికలకు శానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. జూలై నుంచి ఈ కార్యక్రమం అమలు కానుంది. పాలనలో పారదర్శకత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు.. అనంతరం వాటి పనితీరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన దక్షతపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి.. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. ప్రతి పథకానికి నిర్ణీత కాల వ్యవధిలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా.. అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తున్నారు. సీఎంగా తొలి సంతకం చేస్తూ.. తనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే పథకాలు అందించాల్సిందేనని సీఎం చెబుతున్నారు. బియ్యం కార్డు, పింఛన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు.. ఇలా ఏదైనా సరే వలంటీర్లే లబ్ధిదారుల వద్దకు వెళ్లి వివరాలు కనుక్కుని ఆయా పథకాలు వారికి అందేలా చేస్తున్నారు. సరిగ్గా ప్రతి నెలా 1వ తేదీ ఉదయాన్నే అవ్వాతాతలు, ఇతరులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత సిబ్బందిని నియమించారు. వలంటీర్లతో కలుపుకుని ఏకంగా 4 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించారు. -
పాలనలో, పార్టీలో మానవీయ ముద్ర
సరిగ్గా దశాబ్దకాలం క్రితం.. మార్చి 12, 2011న కడప జిల్లా ఇడుపులపాయ గడ్డ వైఎస్సార్ (యువజన, శ్రామిక, రైతు) కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న చారిత్రక ఘట్టానికి వేదిక అయింది. ప్రజల ఈతిబాధల పట్ల సహానుభూతి, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండటం వంటి సుగుణాలే.. 2019లో వైఎస్ జగన్‌కి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించాయి. ఈ 21 నెలల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్... క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులలో కూడా.. నవరత్నాలలోని పథకాలను అమలు చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. రాష్ట్ర పరిపాలనలో, పార్టీ వ్యవహారాలలో తనదైన మానవీయ ముద్ర వేసిన వైఎస్ జగన్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో, అభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టించడం తథ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తదుపరి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గత దశాబ్దకాలం ఓ మహత్తర చరిత్రకు సాక్షీభూతంగా నిలిచింది. సరిగ్గా దశాబ్దకాలం క్రితం.. మార్చి 12, 2011న కడప జిల్లా ఇడుపులపాయ గడ్డ వైఎస్సార్ (యువజన, శ్రామిక, రైతు) కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న చారిత్రక ఘట్టానికి వేదిక అయింది. ఆ రోజున పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా యువజనులు, శ్రామికులు, రైతులు, మహిళల ఆశల్ని, ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ ఉవ్వెత్తున ఎగిసింది. ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం పొందిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి నుంచి పుణికిపుచ్చుకొన్న విశిష్ట లక్షణాలు, రాజీపడని వ్యక్తిత్వమే ప్రాంతీయ పార్టీగా ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ ఏర్పాటు చేయడానికి ఆయనను పురిగొల్పింది. ప్రజల ఈతిబాధల పట్ల సహానుభూతి, ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండటం వంటి సుగుణాలే.. 2019లో వైఎస్ జగన్‌కి చరిత్రాత్మకమైన విజయాన్ని అందించాయి. ఆదర్శ నాయకుని కుటుంబంపై కుట్రలు, కుతంత్రాలు రెండు పర్యాయాలు 2004లో, 2009లో పార్టీని అధికారంలోకి తెచ్చిన మహా నాయకుడి కుమారుడి పట్ల అత్యంత అమానుషంగా ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై కుట్ర చేసిన ఫలితంగానే జాతీయ పార్టీ కాంగ్రెస్ నేడు ఆంధ్రప్రదేశ్‌లో మట్టికొట్టుకు పోయింది. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్లో వెళుతూ నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సెప్టెంబర్ 2, 2009న పావురాలగుట్ట వద్ద ప్రమాదానికి గురై విషాదకర పరిస్థితులలో మరణిం చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మహా నేత డాక్టర్ వైఎస్సార్ మరణాన్ని ఆయన సహచరులు, అభిమానులు, కార్యకర్తలు, పేదలు, సామాన్యులు.. ఇలా ప్రతి వర్గం తట్టుకోలేకపోయింది. ‘కాంగ్రెస్ పార్టీ ఇక బ్రతకదు.. దానికి నూకలు చెల్లాయి’ అని అందరూ అంటున్న సమయంలో ఆ పార్టీకి ప్రాణం పోసింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ప్రజలలో నమ్మకం కల్పించి కాంగ్రెస్ పార్టీకి 2004 మే ఎన్నికలలో అఖండ విజయం సాధించి పెట్టారు. తను అమలు చేసిన వినూత్న సంక్షేమ, అభివృద్ధి పనులతో ప్రజల హృదయాలను గెలుచుకొని తిరిగి 2009లో పార్టీని అధికారంలోకి తెచ్చారు. అంతేకాదు.. 2004లో 27 మంది లోక్‌సభ సభ్యులను, 2009లో 33 మంది ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ-1, యుపీఏ-2 ప్రభుత్వాలు ఏర్పడటానికి దోహదం చేశారు. అంతటి గొప్ప ప్రజా నాయకుడు చనిపోయిన తరువాత సొంత పార్టీలోకి కొన్ని శక్తులు, ప్రత్యర్థి పార్టీలోని నాయకులు, మీడియాలోని ఓ వర్గం కుమ్మక్కై వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం సాగించారు. ఓదార్పు నిర్ణయం ఆటంకాలు 2009లో పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ సతీమణి విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యాక.. ఆమె అసెంబ్లీలో చేసిన తొలి ప్రసంగం.. డాక్టర్ వైఎస్సార్ అభిమానుల్ని కదిలించింది. ముఖ్యంగా వైఎస్సార్ మరణవార్త విని తట్టుకోలేక గుండె ఆగి కొందరు, ఆత్మహత్యలు చేసుకొన్న మరికొందరు తమ కుటుంబాలను అనాథలుగా మిగిల్చి వెళ్లారని, అటువంటి వారందర్నీ ఆదుకోవడం తమ ధర్మమని విజయమ్మ చెప్పడం ఆ కుటుంబాలకు గొప్ప ఊరట నిచ్చింది. మృతుల కుటుం బాలను పరామర్శించడానికి వైఎస్ జగన్ ఏప్రిల్ 9, 2010న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుండి ‘ఓదార్పు యాత్ర’ ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. అయితే, జగన్‌కు ప్రజల్లో లభించిన ఆదరణ చూసి తట్టుకోలేని కొన్ని వర్గాలు.. పార్టీ విభేదాలు పక్కన పెట్టి చేతులు కలిపాయి. డాక్టర్ వైఎస్సార్ కుటుం బంపై కుట్రలు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ఓదార్పు యాత్రకు బ్రేక్ ఇచ్చినప్పటికీ.. మలివిడత యాత్రను కూడా చేయొద్దని చెప్పడంతో.. ఇక కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తల వంచకుండా బయటపడుతూ నవంబర్ 29, 2010న విజయమ్మ, వైఎస్ జగన్ ఇరువురూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. దీంతో వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు వేయించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దాడులు చేయించింది. 2014 ఎన్నికలS సమయంలో నరేంద్ర మోదీ గాలి దేశవ్యాప్తంగా వీస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీలు అవకాశవాద పొత్తు పెట్టుకోవడమేకాక.. ‘జనసేన’ అంటూ బయలుదేరిన సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇంటికి బాబు వెళ్లి తనకు సహకరించమని ఒప్పందం చేసుకోవడతో ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 5 లక్షల ఓట్ల వ్యత్యాసంతో 63 సీట్లు పొంది ప్రతిపక్షంలో కూర్చుంది. 2014, మే 17న ఎన్నికల ఫలితాలు వెలువడిన స్వల్ప వ్యవధిలోనే ఆనాడు వైఎస్ జగన్ ప్రజల ముందుకొచ్చి ప్రజాతీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఓటమికి బాధ్యులుగా ఎవ్వరినీ వేలెత్తి చూపలేదు. సహచర ఎమ్మెల్యేలలో, నాయకులలో, కార్యకర్తలలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అయితే, 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్‌పై కత్తి గట్టినట్లు ప్రవర్తించింది. ఫిరాయింపుల్ని ప్రోత్సహించి 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కుంది. అసెంబ్లీలో సైతం వైఎస్సార్సీపీ నేతలను మాట్లాడనివ్వకపోవడం, దూషించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడింది. నవంబర్ 6, 2017న వైఎస్ జగన్ మొదలు పెట్టిన ‘ప్రజాసంకల్పయాత్ర’ ఇడుపులపాయ నుండి మొదలై 13 జిల్లాల్లో 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియడం దేశ రాజకీయాలలోనే ఓ సంచలనం. పాదయాత్ర పొడవునా జగన్.. సమాజంలోని రైతాంగాన్ని, చేతివృత్తుల వారిని, యువతను, మహిళలను.. ఇలా ప్రతి ఒక్కరినీ కలుసుకొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఈతిబాధలను అర్థం చేసుకొన్నారు. నవరత్నాలతో మెరుగైన జీవన ప్రమాణాలు అధికారంలోకి రాగానే.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ‘నవరత్నాలు’ అమలు చేస్తామంటూ వెలువరించిన రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టో ప్రజలను ఆకర్షిం చింది. ఇచ్చిన మాటకు కట్టుబడతారని పేరు తెచ్చుకొన్న వైఎస్ జగన్.. ఎన్నికల మేనిఫెస్టోను ‘పవిత్ర భగవద్గీతగా, పవిత్ర బైబిల్‌గా, పవిత్ర ఖురాన్’ గా భావించి అమలు చేస్తామని ఇచ్చిన హామీ, పార్టీ అభ్యర్థుల ఎంపికలో చేసిన సామాజిక న్యాయం మొదలైన అంశాల కారణంగానే.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 50% ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగలిగారు. 22 లోక్‌సభ సీట్లలో విజయకేతనం ఎగరవేశారు. చెక్కు చెదరని ప్రజాభిమానం అధికారం చేపట్టిన ఈ 21 నెలల్లో సీఎంగా వైఎస్ జగన్.. క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులలో కూడా.. నవరత్నాలలోని పథకాలను అమలు చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. అనేక వినూత్న సంక్షేమ పథకాలను పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా అమలు చేయడం వల్లనే ఆయా వర్గాల ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతూనే.. పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర పరిపాలనలో, పార్టీ సంస్థాగత వ్యవహారాలలో తనదైన మానవీయ ముద్ర వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో, అభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టించడం తథ్యం. వ్యాసకర్త డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్