కేక్ కట్ చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, నందిగం సురేష్. చిత్రంలో లక్ష్మీపార్వతి, జోగి రమేష్, జగన్‌మోహన్‌రావు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం చాలా ప్రత్యేకమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీని సరికొత్త రాజకీయ విధానాలతో నడిపిన చరిత్ర సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. వైఎస్సార్ మరణించినప్పుడు ప్రత్యేక పరిస్థి తుల్లో ఒంటరిగా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఆరోజు నుంచి నిరంతరం జగన్ ప్రజల్లో మమేక మయ్యారు.. ప్రజల్నే నమ్ముకున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా జగన్ సాగిస్తున్న ప్రస్థానం దశాబ్దాలపాటు ముందుకు సాగుతూనే ఉంటుందన్నారు. జగనన్న దగ్గర్నుంచి.. జగన్ మామ, జగన్ తాతగా కూడా ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు.
వైఎస్సార్‌సీపీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడు తూ.. వైఎస్సార్‌సీపీని జగన్ అన్నీ తానై నడిపించా రన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా తీర్చిదిద్దార న్నారు. జగన్ ధైర్యానికి, పోరాటానికి పదేళ్ల రాజకీయ ప్రస్థానమే ఉదాహరణని చెప్పారు. జగన్ రాజకీయ నిర్ణయాల్లో ఎక్కడా దాపరికాలు ఉండవని, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఆయన శైలి అని తెలిపారు. 21 నెలల పాలనతో చరిత్ర సృష్టించారన్నారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నిక ల్లో సీఎం జగన్ పాలనకు ప్రజలు మద్దతు తెలపడమే దీనికి నిదర్శనమన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ విజయం వైఎస్సార్‌సీపీదే నన్నారు. సీఎం జగన్ అంటే లక్షలాదిమంది అభిమానులు, వేలాదిమంది నాయకులు అనే విషయం ఎవ్వరూ మర్చిపోరాదన్నారు. పార్టీ ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను సజ్జల తెలిపారు. వైఎస్సార్ ఆలోచన, స్ఫూర్తితో వైఎస్ జగన్ పార్టీని స్థాపించారని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు.
పండుగలా..
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో పండుగ వాతావరణం నెల కొంది. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగుర వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణుల తో కలసి భారీ కేక్‌ను కట్ చేశారు. పేద మహి ళలకు చీరలు పంచిపెట్టారు. వైఎస్సార్ జిందా బాద్, మహానేత వైఎస్సార్ ఆశయాలు నెరవే రుస్తాం, జగనన్న నాయకత్వం వర్థిల్లాలి, జై జగన్.. జైజై జగన్ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నేతలు చల్లా మధుసూదన్‌రెడ్డి, పండుగాయల రత్నాకర్, చిల్లపల్లి మోహన్‌రావు, నందమూరి లక్ష్మీపార్వతి, నారాయణమూర్తి, శివశంకర్‌రెడ్డి, నారమల్లి పద్మజ, కావటి మనోహర్ నాయుడు, బొప్పన భవకుమార్, రాము, కుంభా రవిబాబు, సోమినాయుడు, క్రిస్టినా, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment