సాక్షి, అమరావతి: రాజన్నగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ఆయన లక్ష్యాలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఉద్భవించిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తన తండ్రి సంక్షేమ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేసి, తమను నమ్ముకున్న ప్రజల కోసం రాజన్న తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సరికొత్త ప్రయాణంలోని ఈ ముఖ్యఘట్టానికి నేటితో పదేళ్లు నిండాయి. ఈ పదేళ్ల కాలంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, రాజకీయ కుట్రలతో తనను ఇబ్బందులకు గురిచేసినా.. ఆయన మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు.
ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వాటికి పరిష్కారం చూపించే దిశగా నవరత్నాలతో మేనిఫెస్టో రూపొందించారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి విలువలు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజారంజక పాలన కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్ సీపీ పదకొండో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, జగనన్న పోరాట పథంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను పరిశీలిద్దాం.
పోరాట పథంలో కొన్ని ముఖ్య ఘట్టాలు
02.09.2009: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతి
08.07.2010: గుండె పగిలిన కుటుంబాలను ఓదార్చేందుకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఓదార్పుయాత్ర
29.11.2010: కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి వైఎస్ జగన్ రాజీనామా
21.12.2010: రైతులు, చేనేతలను ఆదుకోవాలని విజయవాడ కృష్ణా నదీ తీరాన 48 గంటల నిరాహార దీక్ష
12.03.2011: వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ ప్రకటన
14.06.2012: ఉప ఎన్నికల్లో 19 స్థానాలకు 17 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానంలో గెలుపు.
21.12.2012: రాజకీయంగా పెట్టిన అక్రమ కేసులు, సీబీఐ పక్షపాత ధోరణికి వ్యతిరేకంగా ‘జగన్ కోసం జనం’ పేరుతో కోటి సంతకాల సేకరణ
05.10.2013: రాష్ట్ర సమైక్యత కోరుతూ లోటస్‌పాండ్‌లో దీక్ష
18.12. 2013: సమైక్య నినాదం కోరుతూ వైఎస్సార్‌సీపీ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం
16.05.2014: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 67 స్థానాలు.
20.06.2014 : అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌కు గుర్తింపు
21.02.2015: అనంతపురంలో రైతు భరోసా యాత్ర
03.03.2015: రాజధాని అమరావతి ప్రాంతంలో వైఎస్ జగన్ తొలి పర్యటన.
10.08.2015: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఒక రోజు ధర్నా
29.08.2015: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర బంద్ నిర్వహించిన పార్టీ
08.12.2015: మద్య నియంత్రణపై ప్రకటన
26.01.2017: ప్రత్యేక హోదా కోరుతూ విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన జగన్‌ను విమానాశ్రయం రన్‌వే మీదే అరెస్టు చేసిన ప్రభుత్వం.
01.05.2017: గుంటూరులో రైతు దీక్ష. మద్దతు ధరలు ఇవ్వాలని డిమాండ్
06.11.2017: ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర
25.10.2018: వైఎస్ జగన్‌పై ఓ వ్యక్తి హత్యాయత్నం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత
09.01.2019: ఇచ్చాపురం వద్ద ప్రజా సంకల్ప యాత్ర పూర్తి. 3,648 కిలోమీటర్లు పూర్తి.
30.05.2019: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
Comments
Please login to add a commentAdd a comment