సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రస్తకే లేదని,కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు తమకు ఐదేండ్లు పరిపాలన కోసం గెలిపించారని, దానిని తగ్గించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని అన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. ముందస్తు ఊహాగానాలపై స్పందించారు.
ప్రజలను మోసం చేసేవారు, భ్రమలో ఉంచేవారే ముందస్తుకు వెళ్తారని, చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నారని వ్యాఖ్యనించారు. ‘‘మా పార్టీ కార్యకర్తల డీఎన్‌ఏ వేరు. వైఎస్ కుటుంబంతో ముడిపడిన బంధం వాళ్లది. మా వాళ్లను వేరే వాళ్ల పార్టీవాళ్లు తీసుకోవాలనుకోవడం వారి భ్రమ. డిమాండ్ ఎక్కడ ఉంది. మీ పార్టీలోకి వచ్చి ఏం చేస్తారు?’’ అంటూ సెటైర్లు వేశారు సజ్జల.
పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ తమకు కీలకమేనని అన్నారు. అవసరాలను బట్టి మంత్రులుగా ఉండే వాళ్లను వినియోగించుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే రెండున్నర సంవత్సరాలకు కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారని వెల్లడించారు. త్వరలోనే ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment