సాక్షి, తాడేపల్లి: ప్రజాభీష్టంతో మొదలైన పార్టీ.. నేడు సుపరిపాలన అందిస్తూ ప్రజాదరణతో ముందుకెళ్తోంది. ఇందుకు కారణం వైఎస్ జగన్ నాయకత్వం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైఎస్సార్‌సీపీ.. 11 వసంతాలు పూర్తి చేసుకుని నేడు(మార్చి 12న) 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి! అని ట్వీట్ చేశారు సీఎం జగన్.
దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి!
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2022
Comments
Please login to add a commentAdd a comment