సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అని, అంతే తప్ప ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం ప్రేమ లేదన్నారు. ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని జగన్ అంటున్నారు. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదు. తన పాదయాత్రలో జనం చెప్పినవన్నీ జగన్ నోట్ చేసుకున్నారు. ప్రజా అవసరాల మీదనే జగన్ పాదయాత్ర చేశారు. జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదన్నారు. ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్. ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలని ఉమ్మారెడ్డి పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: YSRCPకి 13 ఏళ్లు పూర్తి.. విశ్వసనీయతకు ప్రతీక
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ‘‘జగన్ అంటేనే విశ్వసనీయత. చెప్పిన మాట ప్రకారం మ్యానిఫెస్టో అమలు చేదిన ఘనత జగన్‌ది అని కొనియాడారు.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, జగన్ లాంటి సీఎం మాకూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. చరిత్ర సృష్టించటం జగన్‌కే సాధ్యం.. కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్‌ని ఓడించి తీరుతాం. గుంట నక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ ఐదేళ్లలో ఎన్నో మేళ్లు చేసినందునే ధైర్యంగా ఓటు అడగుతున్నాం. అన్ని వర్గాల ప్రజలు మన వెంట నడుస్తున్నారు. వారికి అండగా నిలవాలంటే మళ్లీ జగన్‌ను సీఎం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment