![CM YS Jagan Tweet About YSRCP Formation Day - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/12/ys-jagan33.jpg.webp?itok=u5ZujJZi)
సాక్షి, అమరావతి: విశ్వసనీయత, విలువలకు విశ్వమే అండగా నిలుస్తుందని చాటి చెప్పి.. ఈ సిద్ధాంతాలే ఊపిరిగా ప్రజా క్షేత్రంలో పురుడు పోసుకున్న వైఎస్సార్‌సీపీ నేడు 11వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్‌సీపీ పురుడు పోసుకుందన్నారు. పదేళ్ల ప్రయాణంలో కష్టసుఖాల్లో తనకు అండగా నిలిచిన ప్రజలకు, కలిసి నడిచిన నాయకులకు, వెన్నంటి ఉన్న కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్.. ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
చదవండి:
పింగళి వెంకయ్య కుటుంబాన్ని సత్కరించిన సీఎం జగన్
పండుగలా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment