సాక్షి, అమరావతి: సీఆర్డీయే పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాల పంపిణీతో పాటు, సీఆర్డీయే ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ శుక్రవారం పండగలా జరిగింది.
ఈ క్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మన ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడింది. నేడు అదే అమరావతిలో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ల స్థలాలకు 50,793 మంది అక్కచెల్లెమ్మలను యజమానులను చేసింది మన ప్రభుత్వం. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించే అవకాశాన్ని నాకు కల్పించిన దేవుడికి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అంటూ సీఎం జగన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
చదవండి: లబ్ధిదారుల భావోద్వేగం.. మా ‘బలగం’ మీరే జగనన్నా..
అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు మన ప్రభుత్వం సుప్రీంకోర్ట్ వరకూ వెళ్ళి పోరాడింది. నేడు అదే అమరావతిలో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ళ స్థలాలకు 50,793 మంది అక్కచెల్లెమ్మలను యజమానులను చేసింది మన ప్రభుత్వం. ఇంత మంచి కార్యక్రమం నిర్వ… pic.twitter.com/72QEY09aTn
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 26, 2023
Comments
Please login to add a commentAdd a comment