house pattas
-
టీడీపీ అడ్డుకున్నా ఆగలేదు..ఘనంగా జగనన్న ఇళ్ళ పట్టాల జాతర
-
ఒకే రోజు 25,000 ఇళ్ల పట్టాలు..
-
అంతరాలు అంతం
పేదలకూ పెద్దల తరహాలోనే ఇళ్ల పట్టాల విషయంలో ఆ రోజు నేను అధికారులందరినీ ఒకటే అడిగా. మీకు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రముఖులకు ప్రభుత్వం ఎలా ఇస్తోందని అడిగితే దానికి వేరే పద్ధతి ఉందన్నారు. ప్రముఖులకు ఇచ్చే విధానంలో, పూర్తి హక్కులతో రాష్ట్రంలో ప్రతి నిరుపేదకూ ఇంటి పట్టాలివ్వాలని ఆదేశాలివ్వడమే కాకుండా చట్టంలో మార్పులు చేశాం. ఈరోజు అవే పూర్తి హక్కులతో పట్టాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నాం. - ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదలకో న్యాయం.. పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని సమూలంగా మారుస్తూ 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పేదలకు ఉచితంగా అందించిన ఇళ్ల పట్టాల నుంచి విద్య, వైద్యం, సామాజిక రంగాలలో ఇదే ఒరవడిని అనుసరిస్తూ ధనిక – పేద అంతరాలను తొలగిపోయేలా విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. నాడు – నేడుతో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ చదువులను పేదింటి పిల్లలకు చేరువ చేయడంతోపాటు ఖరీదైన, నాణ్యమైన వైద్యాన్ని సర్కారీ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద లబ్దిదారులకు సర్వ హక్కులతో రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు పండుగలా కొనసాగనున్నాయి. రెండు రకాల రూల్సా..? దేశ చరిత్రలో తొలిసారిగా 31 లక్షల మందికి ఇచ్చిన డీ పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్న కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి జరుగుతోంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, మంచి చేయడంలో గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో అంతా గమనించాలి. పేదల బతుకులు మారి వారి బిడ్డలు గొప్పగా ఎదిగేలా 58 నెలలుగా మన ప్రతి అడుగూ పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. ఐఏఎస్‌లు, ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలకు ఇచ్చే ప్లాట్లకు విధించే నిబంధనలే పేదలకూ వర్తింపచేయాలనే ఉద్దేశంతో కన్వేయన్స్ డీడ్లతో రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నాం. రాష్ట్రంలో రెండు రకాల నిబంధనలు ఉన్నట్లు తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. పేదలకు ఒక రకంగా, పెద్దలకు మరో రకంగా నిబంధనలు ఉండటం సరికాదు. అలాంటి విధానాలపై తిరుగుబాటు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. 58 నెలల ప్రయాణంలో ప్రతి అడుగూ అలాగే వేస్తున్నాం. చదువుల్లో అంతరాన్ని తొలగిస్తూ.. పేదలకో న్యాయం, పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని మార్చేయాలనే తపనతో మన అడుగులు పడ్డాయి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు పేద పిల్లలు గవర్నమెంట్ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుతుంటే డబ్బున్న వారి పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మన గవర్నమెంట్ స్కూళ్లలో నాడు–నేడుతో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లిష్ మీడియంతో పాటు బైలింగ్యువల్ బుక్స్, బైజూస్ కంటెంట్, 8వ తరగతి నుంచి ట్యాబ్‌లు అందిస్తున్నాం. 6వ తరగతి నుంచి ప్రతి క్లాసు రూములో డిజిటల్ బోధన. ఐఎఫ్‌పీ ప్యానళ్లు అందుబాటులోకి తెచ్చాం. పేద పిల్లలు కాన్వెంట్ డ్రస్, షూస్ వేసుకుని చిరునవ్వుతో ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్నారు. సీబీఎస్ఈ నుంచి ఐబీ విద్యా విధానం స్థాయికి గవర్నమెంట్ బడులను తీసుకెళుతున్నాం. పెద్ద చదువులు చదివే పిల్లలకు వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ విద్యాదీవెన, వసతి దీవెనతో పాటు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, ఎంఐటీ, హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత వర్సిటీల నుంచి ఉచితంగా ఆన్లైన్లో కోర్సులు చదివేలా మనందరి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డబ్బులేని వారి పిల్లలకు, డబ్బున్న వారి పిల్లలకు మధ్య చదువుల పరంగా అంతరాన్ని చెరిపేయడం అంటే ఇదీ అని చెప్పడానికి గర్వపడుతున్నా. పేదలకు, పెద్దలకు ఒకే రకమైన వైద్యం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం ఇవాళ పేదలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,000కి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లింది మన ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షల వరకు ఉచితంగా విస్తరించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. అంతేకాకుండా శస్త్ర చికిత్సల తరువాత రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా తెచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ద్వారా ఉచితంగా వైద్యంతోపాటు మందులు కూడా అందుతోంది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. నేను చెప్పే ప్రతి మాటా కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను గమనించండి. పేదలకు, పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడం అంటే ఇదీ. బడుగు, బలహీన వర్గాలకు పదవులు గతంలో పెత్తందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన నామినేటెడ్ పదవులను చట్టం చేసి ఏకంగా 50 శాతం బడుగు, బలహీన వర్గాల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. సామాజిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత అంటే ఇదీ. పేదల ఆంధ్రప్రదేశ్ వేరు... డబ్బున్న వారి ఆంధ్రప్రదేశ్ వేరు అనే భావాలను పూర్తిగా తుడిచి వేస్తూ, పేదలకో న్యాయం – డబ్బున్న వారికో న్యాయం అనే విధానాలను రద్దు చేస్తూ మన అడుగులు పడ్డాయి. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీలు.. రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ వల్ల ఆస్తిపై అక్కచెల్లెమ్మల హక్కులు భద్రంగా ఉంటాయి. దొంగ సర్టిఫికెట్లు సృష్టించేందుకు వీలుండదు. ఎప్పుడు పడితే అప్పుడు రద్దు చేయలేరు. సచివాలయాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఎన్నిసార్లైనా పొందవచ్చు. అందులో హక్కుదారు మీరే అన్న విషయం సచివాలయాల్లో శాశ్వతంగా, భద్రంగా ఉంటుంది. సరిహద్దు రాళ్లతో స్థలం వద్ద అక్కచెల్లెమ్మల ఫొటో తీసి జియోట్యాగింగ్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఎవరూ కబ్జా చేయలేరు. పదేళ్లు కాగానే ఆ పట్టాలను అమ్ముకునేందుకు, వారసత్వంగా ఇచ్చేందుకు, గిఫ్ట్‌గా ఇచ్చేందుకు పట్టా భూములున్న వారితో సమానంగా ఆటోమేటిక్‌గా హక్కులు సంక్రమిస్తాయి. ఆ తేదీ వివరాలతో సహా స్పష్టంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో పొందుపరిచాం. ఎన్ఓసీ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. బ్యాంకు రుణాలు కావాలంటే సులభంగా తక్కువ వడ్డీకే అక్కచెల్లెమ్మలకు అందుతాయి. నా అక్కచెల్లెమ్మలు, పేదలకు ఇచ్చే స్థలాలు, హక్కులు, ఆత్మగౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూశారా? అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, మంచి తమ్ముడిగా ముఖ్యమంత్రి స్థానంలో వారి బిడ్డ ఉన్నాడు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతున్నాం. ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇవన్నీ చూస్తుంటే వంద మంది సినిమా విలన్ల కంటే, పురాణాల్లో రాక్షసులందరి కంటే ఒక్క చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అనిపిస్తుంది. చివరికి అమరావతిలో మనం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందంటూ ఆ పెద్దమనిషి నిస్సిగ్గుగా కోర్టుల్లో కేసులు వేసి తన లాయర్లతో వాదించాడు. ఇంత అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తి జంకు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాడంటే ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని వాదిస్తే తల్లిదండ్రులంతా గట్టి గుణపాఠం చెబుతారనే భయం లేకుండా చంద్రబాబు పాపిష్టి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దారుణమైన వ్యాఖ్యలు చేసి కూడా బరితెగించి తిరుగుతున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? బీసీల తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్! అని వ్యాఖ్యానిస్తే బీసీలంతా బుద్ధి చెబుతారన్న భయం కూడా లేకుండా ఉండగలుగుతున్నాడంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించిన ఈ మాయలోడు ఏ జంకూ గొంకూ లేకుండా ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడంటే ఇంతకన్నా దారుణం ఉందా? 650 వాగ్దానాలిచ్చి కనీసం 10 శాతం కూడా అమలు చేయకుండా ఎన్నికలొచ్చేసరికి నిస్సిగ్గుగా మళ్లీ కొత్త మేనిఫెస్టోతో సిద్ధమయ్యాడంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? మన ఖర్మ ఏమిటంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు మనం రాజకీయాలు చేస్తున్నాం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, ధర్మాన ప్రసాదరావు, మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీ రామకృష్ణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీనియర్ ఐఏఎస్ ముత్యాలరాజు, కలెక్టర్ ఏఎస్.దినేష్‌కుమార్, ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెంటు కూడా ఇవ్వకపోగా బాబు కుట్రలు.. 2020 ఉగాది నాటికే ఈ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలనుకున్నా కొందరు రాక్షసుల మాదిరిగా అవరోధాలు సృష్టించారు. అధికారంలో ఉండగా పేదవాడికి ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపానపోని చంద్రబాబు ఇవాళ మనం ఇస్తుంటే అడ్డుపడి ఆయన మనుషుల ద్వారా ఏకంగా 1,191 కేసులు దాఖలు చేశారు. వీటిని అధిగమించి ఇవాళ ఒక్క ఒంగోలులోనే 21 వేల మంది పేదలకు సర్వ హక్కులతో ఇళ్ల పట్టాలిస్తున్నాం. ఒంగోలు అర్బన్‌లో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం యర్రజర్ల హిల్స్‌లో 866 ఎకరాలను 2020లోనే గుర్తించి 24 వేల ప్లాట్లతో లే అవుట్లు సిద్ధం చేశాం. ఈ గొప్ప కార్యక్రమానికి అడ్డుపడి చంద్రబాబు, ఆయన మనుషులు కోర్టులో కేసు వేశారు. ఒక్క ఒంగోలే కాకుండా ఏ జిల్లాలో చూసినా చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలివ్వలేదు. మనం ఇస్తుంటే ఆయన అసూయ దాగటం లేదు. ఇవన్నీ దాటుకుంటూ మీ బిడ్డ అడుగులు వేశాడు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్లేశ్వరపురం, ఎన్.అగ్రహారం, వెంగముక్కపాలెం, యర్రజెర్ల గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నల దగ్గర నుంచి 536 ఎకరాల భూమిని సేకరించేందుకు రూ.210 కోట్లు ఖర్చు చేసి ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరో రూ.21.33 కోట్లు లే అవుట్ అభివృద్ధి కోసం వ్యయం చేస్తున్నాం. ఇదే ఎన్.అగ్రహారం, మల్లేశ్వరపురంలో 31 బ్లాక్స్‌లో, వెంగముక్కపాలెం, యర్రజెర్లలో మరో 32 బ్లాక్స్‌తో జగనన్న మోడల్ టౌన్ షిప్స్‌ను పూర్తి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నాం. ఎస్టీపీ ప్లాంట్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ సప్లయ్ కోసం రూ.247 కోట్లు ఖర్చు చేసేలా ఆదేశాలు ఇచ్చాం. ఒంగోలుకు మంచి చేస్తూ పట్టణంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మరో రూ.339 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌కు కూడా ఈరోజే శంకుస్థాపన చేస్తున్నాం. బైబై బాబు అంటున్న బాబు సతీమణి చంద్రబాబును నేను ఇవన్నీ ప్రశి్నస్తే నన్ను సవాల్ చేస్తున్నావా? అంటాడే కానీ ఇంటింటికీ ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు. గ్రామ గ్రామానికీ ఇదిగో ఈ ఈ మంచి చేశానని చెప్పలేడు. జగన్ మాదిరిగా బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేశాననే మాటలు ఈ పెద్దమనిషి నోట్లో నుంచి రావు. ఆయన చేయలేదు కాబట్టే చెప్పలేడు. ఒకవైపు ఎన్నికలకు మనమంతా సిద్ధం అంటుంటే.. మరోవైపు చంద్రబాబు భార్య మా అయన సిద్ధంగా లేరని అంటున్నారు. ఏకంగా కుప్పంలోనే బైబై బాబు.. అంటూ ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తున్నాయి. ఇలాంటి చంద్రబాబును రాష్ట్రంలో ప్రజలెవరూ సమర్థించడం లేదు. కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించడంలేదు. ఏపీకి రానివారు, సొంత ఊరు ఏదంటే తెలియని వారు, రాష్ట్రంలో ఓటే లేని వారు, ఇక్కడ దోచుకున్నది పంచుకోవడానికి అలవాటైన నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబును సమర్థిస్తారు. నాకు ఆయన మాదిరిగా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి మద్దతు లేవు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడాలని కోరుతున్నా. నేను పైన దేవుడిని, కింద మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నా. మధ్యలో దళారులను, బ్రోకర్లను నమ్ముకోలేదు. అడ్డంకులను అధిగమించి.. అధికారంలోకి రాగానే అందరికీ స్థలాలు ఇవ్వడానికి 71,811 ఎకరాలను సేకరించి పంపిణీ చేశాం. 17,005 లే అవుట్లలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు, కరెంటు, మంచినీరు, పార్కులు, కామన్ ఏరియాలు, ఇతర సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా 8.90 లక్షల ఇళ్లను ఇప్పటికే పూర్తి చేశాం. మిగతావి వివిధ దశల్లో వేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆ ఇంటి స్థలాల విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. ఒంగోలులో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలం విలువ గజం రూ.10 వేల పైచిలుకే ఉన్నట్లు ఇంతకు ముందే అధికారులు చెప్పారు. ఇక్కడ రెండు లే అవుట్లలో పేదలకు ఇచ్చిన ఒక్కో స్థలం విలువే రూ.6 లక్షలు కాగా రూ.2.70 లక్షలు ఖర్చు చేసి ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. రోడ్లు, డ్రెయినేజీ, కరెంటు సదుపాయాల కోసం మరో రూ.లక్ష దాకా వెచ్చిస్తున్నాం. ఇలా ఇల్లు పూర్తయ్యే సరికే ఒక్కో ఇంటి విలువ రూ.10 లక్షలు పైమాటే ఉంటుందని చెప్పడానికి సంతోషపడుతున్నా. అక్కచెల్లెమ్మలను మిలియనీర్లుగా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.7 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా విలువైన స్థిరాస్తిని పెడుతున్నాం. తద్వారా ఏకంగా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్కచెల్లెమ్మల కోసం ఖర్చు చేశామని చెప్పేందుకు గర్వపడుతున్నా. మహిళలకు ఆర్థిక సాధికారత, భద్రత పేదింటి అక్కచెల్లెమ్మల సాధికారత కోసం వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలతోపాటు దిశ యాప్, సచివాలయంలో మహిళా పోలీసుల ద్వారా అండగా నిలబడ్డాం. నా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత, భద్రత రెండూ అందుతున్నాయి. ఇవన్నీ గతంలో లేవు. మన పథకాల ఫలితంగా మహిళా ఆర్థిక సాధికారత పెరిగింది. అంతరాలు తగ్గుతున్నాయని నేను చెప్పడం కాదు.. నిన్ననే విడుదలైన జాతీయ గణాంకాలే చెబుతున్నాయి. ఆర్థిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. గత 58 నెలల్లో డీబీటీతో ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయగా ఇందులో 75 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అందించగలిగాం. -
ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం
సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందించనుంది. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల జీవితాల్లో సంతోషాలు నింపుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎన్ అగ్రహారంలో కన్వేయన్స్ డీడ్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీ ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికి అందించడం, వాటిని సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేస్తుండడం దేశంలోనే ప్రథమం. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు ఉండేవి కాదు. “డి’ పట్టాలు కావడంతో అనుభవించడం మినహా హక్కులు లేనందున అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందిస్తోంది. వారి పేరు మీద ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఈ డీడ్లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో ఇచ్చిన ‘డి’ పట్టాలను క్రమబద్దికరించుకోవడం ఎంత కష్టమో తెలిసిన విషయమే. రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చడం ఓ ప్రహసనమే. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టారు. ఈ రిజిస్ట్రేషన్ల డేటా మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లోని డేటాబేస్‌లో పదిలంగా ఉంది. లబ్దిదారులు ఎప్పుడైనా అక్కడి నుంచి తమ ఇళ్ల పట్టాకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని పొందే అవకాశం ఉంటుంది. దాన్ని ఫోర్జరీ గానీ, ట్యాంపర్ చేయడానికిగానీ ఆస్కారం ఉండదు. విలువైన స్థిరాస్తి.. ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇప్పిస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ది చేకూరుస్తోంది. మొత్తంగా ఒక్కో లబ్దిదారుడికి రూ. 2.70 లక్షల మేర ప్రయోజనం దక్కుతోంది. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ.లక్ష వరకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువ చేసే విలువైన స్థిరాస్తిని సమకూర్చుతోంది. ఇలా సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో కనీసం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల సంపదను పెడుతున్నారు. కుటుంబ సమేతంగా లబ్దిదారులు. ఒంగోలులోని ఎన్ అగ్రహారం వద్ద నేడు సీఎం జగన్ పాల్గొంటున్న బహిరంగ సభకు ఇళ్ల లబ్ది దారులు కుటుంబ సమేతంగా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఎన్.అగ్రహారంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు వాసుల మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.339 కోట్లు మంజూరు కాగా రోజూ తాగునీరు అందించేలా నగరంలోని పైపులైన్ వ్యవస్థను సమూలంగా మార్పు చేయనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ పథకానికి సంబంధించి కార్పొరేషన్‌పై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. 17,005 లేఅవుట్లు.. 71,811 ఎకరాలు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని రీతిలో సీఎం జగన్ ప్రభుత్వం నిధులు వెచ్చించింది. 71,811 ఎకరాలను సేకరించి 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17,005 లేఅవుట్లు నిర్మించింది. 71,811 ఎకరాల్లో ప్రైవేట్‌గా 25,374 ఎకరాలు సేకరించారు. ఇందుకు భూసేకరణకు రూ.11,343 కోట్లు ఖర్చు చేసింది. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల కోసం ఇంత భారీగా భూసేకరణ చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఒక్కో ప్లాట్ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పలుకుతోంది. కనీస విలువ రూ.2.5 లక్షల చొప్పున లెక్కించినా ఇళ్ల పట్టాల విలువ రూ.76,000 కోట్లకుపైనే ఉంటుంది. అలాగే సుమారు రూ.60,000 కోట్ల వ్యయంతో 22 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో ఇప్పటికే 8.9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లలో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, సీవరేజ్, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. -
రేపు 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒకేసారి 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం ఒక చరిత్ర అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయ మీడియాతో మాట్లాడుతూ, పూరి గుడిసె లేని ఇంటిని చూడాలనిదే లక్ష్యమన్నారు. 536 ఎకరాల్లో సుమారు 25 వేల మందికి ఇంటి స్థలం లేని పేదలకు రేపు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. సీఎం జగన్ మాట ఇచ్చాడంటే తప్పడు అనడానికి ఈ బృహత్తర కార్యక్రమం నిదర్శనమన్నారు. కష్ట కాలంలో కూడా 231 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన సీఎం జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా. టీడీపీ ఇన్ని కుట్రలు చేసినా పేదల పక్షాన ముందుకెళ్తూనే ఉంటాం. సీఎం జగన్ చేతుల మీదుగా రేపు లబ్ధిదారులకు స్థల రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తాం. అలాగే 339 కోట్ల రూపాయలతో నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకి సీఎం శంకుస్థాపన చేస్తారు. పేద, మధ్యతరగతి వర్గాల పక్షాన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని, సేవను ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. -
10 లక్షలు దాటిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. రోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి 10.31 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 79,953 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాకినాడ జిల్లాలో 79,892 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పల్నాడు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 50 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగిలిన రిజిస్ట్రేషన్లను వారం రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లు పూర్తయిన లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్ల పంపిణీని త్వరలో చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పేదలకు స్థలాలు ఇచ్చినా వాటిపై పూర్తి హక్కులు ఇవ్వకుండా డి–పట్టాలు మాత్రమే జారీ చేశారు. తొలిసారిగా వైఎస్ జగన్ అన్ని హక్కులతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే వాటికి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని చూసినా చట్టపరమైన ఇబ్బందుల వల్ల ఆ పని ఆలస్యమైంది. అన్ని సమస్యలను అధిగమించి, అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ల తర్వాత జారీ చేసే కన్వేయన్స్ డీడ్లు పదేళ్ల తర్వాత సేల్ డీడ్లుగా మారనున్నాయి. అప్పుడు రెవెన్యూ శాఖ ఎన్ఓసీ అవసరం లేకుండానే పేదలు వాటిని నిరభ్యంతరంగా అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ అయిన నాటి నుంచి వాటిపై ప్రైవేటు భూముల మాదిరిగానే రుణాలు, ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది. -
శరవేగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం రికార్డు స్థాయిలో జరుగుతోంది. 4 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 2వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 5,000 రిజిస్ట్రేషన్లు జరగ్గా క్రమంగా వాటి సంఖ్య పెరిగింది. సోమవారం ఒక్కరోజే 90,000 రిజిస్ట్రేషన్లు చేశారు. మంగళవారం రాత్రికి లక్ష రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల సమయానికే 60 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన లబ్ధిదారులు.. సాయంత్రం ఇంటికి వచ్చాక రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం వేగంగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన 3 లక్షల రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా పల్నాడు జిల్లాలో 24 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత బాపట్ల, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, నంద్యాల జిల్లాల్లో 17 నుంచి 20 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వం తరఫున వీఆర్వోలు లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రోజుకు లక్ష రిజిస్ట్రేషన్లు మొత్తం 30.61 లక్షల రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 15.33 లక్షల ఇళ్ల పట్టాల డేటాను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎంటర్ చేశారు. త్వరలో మిగిలిన డేటాను కూడా ఎంటర్ చేయనున్నారు. రోజుకు లక్ష రిజిస్ట్రేషన్లు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనిప్రకారం సాధ్యమైనంత త్వరగా మొత్తం రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆదివారాల్లోనూ రిజిస్ట్రేషన్లు ఆగకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కన్వేయన్స్ డీడ్ల ముద్రణకు ఏర్పాట్లు రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత కన్వేయన్స్ డీడ్స్‌ను ముద్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ఈ డీడ్లను త్వరలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ వాటిని పంపిణీ చేయనున్నారు. దేశ చరిత్రలో పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తున్న ఏకైక ప్రభుత్వంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచింది. ఇప్పటివరకు పేదలకు ఇచ్చిన స్థలాలకు గత ప్రభుత్వాలు డీ పట్టాలు ఇచ్చేవి. వాటిపై పూర్తి హక్కులు లేకపోవడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడేవారు. అందుకే తొలిసారిగా వారికి హక్కుల ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టా ఇస్తున్నారు. పదేళ్ల తర్వాత ఈ పట్టా (కన్వేయన్స్ డీడ్స్) ఆటోమేటిక్‌గా సేల్ డీడ్‌గా మారుతుంది. గడువు తీరిన తర్వాత తహశీల్దార్ నుంచి నిరభ్యంతర పత్రం అవసరం ఉండదు. కన్వేయన్స్ డీడ్స్ సేల్ డీడ్‌గా మారాక దాన్ని ప్రైవేటు పట్టా మాదిరిగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. కన్వేయన్స్ డీడ్స్ పొందినప్పటి నుంచి దానిపై బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. -
లైన్ క్లియర్.. ఒంగోలు ప్రజలకు సీఎం జగన్ శుభవార్త...
-
ఏళ్ల నిరీక్షణకు తెర.. పేదలకు పెద్ద మేలు!
నివేశన స్థలాల కోసం అనేక ఏళ్లుగా నిరీక్షిస్తున్న పేదలకు జగన్ సర్కార్ ఊరట కలిగించింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలాలను క్లియరెన్స్ చేసి పట్టాలు మంజూరు చేసింది. వారి సొంతింటి కల సాకారానికి బాటలు వేసింది. గత టీడీపీ ప్రభుత్వం చేసిన మోసంతో ఆశలు వదులుకున్న పేదలు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో న్యాయం జరగడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉరవకొండ: టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 సార్వత్రిక ఎన్నికల వేళ ఓట్ల కోసం గిమ్మిక్కులు చేశారు. ఏకంగా 15 సర్వే నంబర్లు పొందుపరచి.. హద్దులు పేర్కొనకుండానే తయారు చేసిన ఇంటి పట్టాలను ఉరవకొండలో పేదలకు పంపిణీ చేశారు. పేదలకు పట్టాలు తన ఘనతేనంటూ పయ్యావుల కేశవ్ పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ అస్పష్టంగా ఉన్న ఆ పట్టాలన్నీ చెల్లవని తేలింది. తాము నిలువునా మోసపోయామని బాధితులు లబోదిబోమన్నారు. ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పేదల ఇంటి పట్టాల సమస్యను పట్టించుకోలేదు. విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు, టీవీ చానెళ్లు, సోషల్ మీడియాకు పరిమితమయ్యారు. పైగా నియోజకవర్గ టీడీపీ నేతలు పేదలకు స్థలాలు అందకూడదనే ఉద్దేశంతో సదరు సర్వే నంబర్ల భూయజమానులపై ఒత్తిడి తెచ్చి పరిహారం పెంచాలంటూ కోర్టులో కేసులు వేయించారు. జగన్ సర్కారు చొరవ.. ఉరవకొండలోని పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ సర్కారు చొరవ తీసుకుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద అర్హత కల్గిన వారందరికీ స్థలాల కేటాయింపునకు చర్యలు చేపట్టింది. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక చొరవతో ఉరవకొండ పట్టణంలో ఏకంగా 3,500 మంది పేదలకు ఇంటి పట్టాలు మంజూరయ్యాయి. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఏళ్లుగా ఉన్న భూవివాదం హైకోర్టులో పరిష్కారమయ్యేలా శ్రద్ధ చూపడంతో తొలి విడతగా 560 ఇంటిపట్టాలను వై.విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా ఇటీవలే పంపిణీ చేశారు. స్థలాలను కూడా చూపించారు. మిగిలిన వారికి కూడా పట్టాలు సిద్ధం చేశారు. వారికి త్వరలోనే అందించనున్నారు. నాడు ఎమ్మెల్యే కేశవ్ దొంగపట్టాలతో తమను మోసం చేస్తే.. నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విశ్వేశ్వరరెడ్డి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా పట్టాలు మంజూరు చేయించారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేలు చేసిన వారిని మరువం గతంలో ఓట్ల కోసం బోగస్ పట్టాలు పంపిణీ చేసి మోసం చేశారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గెలిచిన తర్వాత కూడా పట్టాల గురించి పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మా పక్షాన నిలబడ్డారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం హామీ పత్రాలు అందించి.. కోర్టు వివాదం పరిష్కరించి ఇంటి స్థలం చూపించారు. మేలు చేసిన వారిని ఎన్నటికీ మరచిపోము. – షాకీరా, లబ్ధిదారు, ఉరవకొండ సంతోషంగా ఉంది నాడు 15 సర్వే నంబర్లతో ప్రభుత్వం పట్టా ఇచ్చింది. అయితే అందులో హద్దులు చూపకుండా నిలువునా మోసం చేసింది. జనంతో మమేకమయ్యే విశ్వ అన్న సీఎం జగనన్నతో మాట్లాడి మాకు సమగ్ర వివరాలతో కూడిన పట్టా ఇప్పించి, పక్కాగృహం మంజూరు చేయించారు. చాలా సంతోషంగా ఉంది. – ఈశ్వరమ్మ, రంగావీధి, ఉరవకొండ రుణపడి ఉంటాం 15 ఏళ్లుగా బాడుగ ఇంట్లో ఉంటూ అవస్థలు పడ్డాం. కోర్టు వివాదంలో ఉన్న స్థలాలు జగన్ ప్రభుత్వంలో విశ్వ అన్న కృషితో పరిష్కారం అయ్యాయి. నాకు పట్టా ఇచ్చి పక్కా ఇల్లు కూడా మంజురు చేశారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. – కురసాల లావణ్య, చౌడేశ్వరి కాలనీ, ఉరవకొండ పేదల కళ్లల్లో ఆనందం కన్పిస్తోంది ఎమ్మెల్యే కేశవ్ అప్పట్లో ఓట్ల కోసం చెల్లని పట్టాలు ఇచ్చి ప్రజలను మోసగించాడు. అప్పట్లోనే నేను పేదల ఇంటి పట్టాల కోసం భారీ స్థాయిలో ఉద్యమించాను. రోడ్ల దిగ్బంధం, తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు చేపట్టి అరెస్టయ్యాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో రికార్డు స్థాయిలో ఉరవకొండ పట్టణానికి 3,500 పట్టాలు, నియోజకవర్గ వ్యాప్తంగా 21 వేల పక్కా ఇళ్లు మంజూరు చేయించాం. సొంతింటి కల సాకారమవుతున్న వేళ పేదల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం నాకు ఎంతో తృప్తినిస్తోంది. – వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఉరవకొండ రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం.. పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయించాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఆయన కృషితో జిల్లాలోనే రికార్డుస్థాయిలో ఉరవకొండ నియోజకవర్గానికి 21 వేల పక్కా ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. -
92 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
-
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: సీఎం జగన్
సాక్షి, ఏలూరు: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారని ప్రస్తావించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. 2014 చంద్రబాబు, పవన్ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. చదవండి: నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా? సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని సీఎం జగన్ ఈ సభలో ప్రారంభించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామని తెలిపారు. చుక్కుల భూములకు సైతం పరిష్కారం చూపించామని, అసైన్డ్ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్ చేస్తున్నామన్నారు. వేలమంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామని తెలిపారు. ‘మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండవ దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. మొత్తంగా 45 లక్షల ఎకరాల సరిహద్దు అంశాలు పరిష్కరించాం. 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములనునిషేధిత జాబితా నుంచి తొలగించాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. దళిత వర్గాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్మశానవాటికలకు స్థలాలు కేటాయించాం. సామాజిక న్యాయాన్ని ఒక విధానంగా అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చాక 2 లక్షల 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ -
గతంలో అద్దె ఇళ్లలో చాలా కష్టాలు పడ్డాం..కానీ ఇప్పుడు మా కల నెరవేరింది..!
-
TTD: నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్: భూమన
తిరుపతి: టీటీడీ ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ చారిత్రక నిర్ణయం అని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.ఇవాళ్టి ఇళ్ల పట్టాల పంపిణీతో టీటీడీ ఉద్యోగుల 60 ఏళ్ల కల సాకారమైందని భూమన అన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయించారని గుర్తు చేసిన భూమన.. సీఎం జగన్ ఇప్పుడు దాన్ని పూర్తి చేశారని అన్నారు. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పూర్తి చేయడం సీఎం జగన్ వల్లే సాధ్యమయిందని చెప్పారు. పేదల పట్ల గౌరవం ఉన్న ముఖ్యమంత్రి ఒక్క జగనే అని భూమన కొనియాడారు. దాదాపు మూడు వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు వస్తున్నాయి.. మిగిలిన వారికి కూడా త్వరలో ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు భూమన వెల్లడించారు. సీఎం జగన్ హయాంలో ఇంత అభివృద్ధిలో భాగం అయినందుకు భూమన సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇన్ని వందల ఎకరాల భూమిని టీటీడీ ఉద్యోగుల ఇళ్ల కోసం కేటాయిస్తూ సీఎం జగన్ మహత్తర కార్యక్రమం చేపడుతున్నారని భూమన అన్నారు. వైయస్ఆర్ హయాంలో తాను టీటీడీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించినట్లు భూమన పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల ఇంత అభిమానం ఉన్న సీఎం జగన్‌ను ఉద్యోగస్థులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. ఇదీ చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలు: తిరుమలకు సీఎం జగన్.. అప్డేట్స్ -
టీటీడీ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, తిరుపతి: టీటీడీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. టీటీడీ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం కానుంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ నెల 18వ తేదిన టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపిణీ చేయనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాల సమర్పణకు విచ్చేస్తూన్న సమయంలో ఉద్యోగులుకు ఈస్థలాలు పంపిణీ చేయనున్నారు. చదవండి: ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు -
భూమిని నమ్ముకున్నందుకు న్యాయం...రైతులుగా మారనున్న 46 వేల మంది
-
రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టా రావడం సంతోషంగా ఉంది.. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు..
-
టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ
-
రోడ్డు పక్కన గుడిసెలో ఉంటున్న మేము సొంత ఇంటికి వెళ్తున్నామంటే జగనన్నే కారణం..!
-
ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి వేణుగోపాలకృష్ణ
-
ఇది సీఎం జగన్ పట్టుదల, దక్షతలకు నిదర్శనం
పేదలకు మేలు జరుగుతుందన్న విశ్వాసం కలిగితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనుకాడరు అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదేమో. తను నమ్మిన న్యాయం కోసం ఆయన పోరాడతారు. సాధించి తీరుతారు.రాజధాని అమరావతి గ్రామాలలో పేదలకు 50 వేలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన తీరు, తదుపరి వారందరికి ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన వైనం చూసిన తర్వాత ఏపీలో పేద వర్గాలకు మరింత భరోసా దక్కినట్లయింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మరో పక్క ఈనాడు వంటి మీడియా సంస్థలు వేటకుక్కల మాదిరి వెంబడిస్తున్నా జగన్ ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. పేదల పట్టాల పంపిణీ కి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడితే దానిని చెడగొట్టాలని కొందరు ప్రయత్నం చేయకపోలేదు. కాని పోలీసులు సమర్ధంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చేశారు.కాని రైతుల ముసుగులో కొంతమంది నల్లజెండాలు, నల్ల బెలూన్లు వంటివాటితో నిరసన తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిరసనగా కూడా సరిగ్గా ఇలాగే బెలూన్ లు ఎగురవేశారు. కాని ఆ తర్వాత ఏమైందో అంతా చూశారు. మోదీ మరోసారి ఎన్నికై దేశానికి ప్రదానమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా కూడా జరిగే ప్రయత్నాలు అలాగే ఉన్నాయి. అమరావతిలో పేదలకు భూములు ఇవ్వడానికి అడ్డుతగులుతున్నారన్న విషయం రాష్ట్రం అంతా తెలిసిపోవడం వల్ల టీడీపీకి భారీగా నష్టం వాటిల్లిందట. ఈ విషయం వారి సొంత సర్వేలలో తేలిందట. దాంతో అమరావతి గ్రామాలలో శుక్రవారం చాలా తక్కువ స్థాయిలోనే ఈ నిరసనలు జరిగాయని చెప్పాలి. టీడీపీ నేతలు నేరుగా రంగంలోకి రాకుండా కొంతమేర జాగ్రత్తపడ్డారని అనుకోవచ్చు. జెఎసి నేతల పేరుతోనో, ఊరు,పేరు లేని రాజకీయ పార్టీ నేత పేరుతోనో ఆందోళన చేయించాలని చూశారు. వారి దీక్ష శిబిరాల వద్ద ఉద్రిక్తత సృష్టించాలని యత్నించారు. పోలీసు అధికారులు మహిళలను ఏదో అన్నారని ప్రచారం చేశారు. వాటిని పెద్ద,పెద్ద అక్షరాలతో ఈనాడు పత్రికలో అచ్చేయించారు. అయినా ప్రజలలో పెద్ద కదలిక రాలేదు. యధాప్రకారం పది, ఇరవై మంది వారి శిబిరంలో కనిపించారు. పేదల పట్టాల విషయంలో తెలుగుదేశం కు కొమ్ముకాసిన వామపక్షాలు కూడా కాస్త సిగ్గుపడినట్లుగా ఉంది. వారు ఎక్కడా ప్రత్యక్ష నిరసనలలో కనిపంచలేదు. మరో వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు పట్టాల పంపిణీకి కార్యక్రమం నిర్వహిస్తే వేలాది మంది తరలివచ్చి ఆయనకు జేజేలు పలికారు. జగన్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సామాజిక అమరావతికి శ్రీకారం చుట్టామని అన్నారు. అంటే ఏదో ఒక కులం, ఒక వర్గం ప్రాధాన్యత కాకుండా, అందరికి సమప్రాతినిద్యం లబించేలా పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం అన్నమాట. గతంలో పేదలకు పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పేరుతో తెలుగుదేశం నేతలు కోర్టుకు వెళ్లినప్పుడు సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదించారు. దానికి జగన్ ఇప్పుడు సమాదానం ఇచ్చినట్లయింది.పేదలకు, పెత్తందార్లకు మద్య పోరాటంగానే జగన్ తీసుకువెళుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సెంటు స్థలం స్మశానం, అని సమాధి అని చేసిన తెలివితక్కువ వ్యాఖ్యల ప్రభావం కూడా బాగానే ఉందనిపించింది. లబ్దిదారులు కొందరు దీనిపై ఆయన మీద మండిపడ్డారు. ఒక మహిళ అయితే ముసలినక్కలు తమకు స్థలాలు రాకుండా అడ్డుకోవాలని చూశాయని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నేతలు కాని, జెఎసి నేతలు కాని గతంలో హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పులు వస్తే తమదే విజయం అని, ప్రభుత్వం దానిని పాటించాలని అంటుండేవారు. కాని ఇప్పుడు ఇళ్ల పట్టాల కేసులో సుప్రింకోర్టు తీర్పు పేదలకు అనుకూలంగా అంటే ప్రభుత్వ వాదనను బలపరిచేలా వచ్చినా వీరు ఆందోళన వీడడం లేదు. విమర్శలు ఆపడం లేదు. పేదల స్థలాల పంపిణీని ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇదంతా చంద్రబాబు చేసిన నిర్వాకమే అని చెప్పాలి. ఆయన అనవసరంగా వేల ఎకరాల పచ్చని పంటల భూమిని సమీకరించి ,రైతులకు పని లేకుండా ఏడాదికి ఏభైవేల రూపాయల కౌలు ఇవ్వడానికి అంగీకరించిన ఫలితమే ఈ తలనొప్పి అని చెప్పాలి. అదే ఏ వెయ్యో, రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే ఏ గొడవ ఉండేదికాదు. అప్పుడు ఏ పేదలకు ఎక్కడ నివాస స్థలాలు ఇచ్చినా ఎవరూ కాదనేవారు కాదు. అలాకాకుండా మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చడంతో వచ్చిన చిక్కు ఇదంతా. తను తీసుకు వచ్చిన చట్టంలోనే ఐదు శాతం భూమి పేదలకు ఇవ్వాలని ఉంది. దానిని అమలు చేస్తుంటే ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.పట్టాల పంపిణీ సభలో మాట్లాడిన ఇద్దరు మహిళలు తమ ఆవేదనను పంచుకుంటూ సొంత ఇల్లు అన్నది తమ చిరకాల వాంఛ అని, దానిని జగన్ తీర్చారని చాలా సంతృప్తిగా మాట్లాడారు. ఒకరైతే కన్నీటి పర్యంతం అయ్యారు. కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుపడుతున్నా, జగన్ తమకోసం పోరాడారని వారు అభిప్రాయ పడ్డారు. ముఖ్యమంత్రి కూడా వచ్చే జూలై ఎనిమిది అంటే దివంగత తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నాటికి ఈ స్థలాలలో ఇళ్ల నిర్మాణం ఆరంభం అవుతుందని ప్రకటించడం లబ్దిదారులలో ఎంతో సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నరకాసురుడిని అయినా నమ్మవచ్చేమో కాని, నారా చంద్రబాబును మాత్రం నమ్మవద్దని కొత్త డైలాగు విసిరారు. యదా ప్రకారం ఎల్లో మీడియా తన ప్రభుత్వానికి సృష్టిస్తున్న అడ్డంకులను ప్రజలకు వివరించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం చానల్ ఒకటి టీడీపీ అధికారంలోకి రాగానే ఈ పట్టాలు రద్దు అవుతాయని దుర్మార్గంగా ప్రచారం చేసిందని వ్యాఖ్యానించారు.వైసిపి ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజదానిలో ఇళ్ల స్థలాల పంపిణీని ఒక వారం రోజుల కార్యక్రమంగా రూపొందించింది. తద్వారా రాష్ట్రవ్యాప్త ప్రజలపై ఒక ప్రభావం పడాలని యత్నిస్తోంది. తెలుగుదేశం పార్టీ పేదల వ్యతిరేక పార్టీ అని, వారికి మేలు చేస్తుంటే చూడలేకపోతోందని వైసిపి ప్రచారం చేయడానికి ఈ అవకాశం వినియోగించుకుంటుంది. అందుకు తెలుగుదేశం పార్టీనే చాన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా జగన్ పట్టుదల, దక్షతలకు ఈ ఇంత వేగంగా ఈ ఇళ్ల స్థలాల పంపిణీ నిదర్శనం అని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
నవ్వులూరు లేఔట్ లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్కే
-
ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సుదీర్ఘ న్యాయపోరాటం
-
ఇది గొప్ప సంకల్పం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలు ఉండకూడదు అన్న గొప్ప సంకల్పంతో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం వెంకటపాలెంలో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేసిన ఆయన గుంటూరు జిల్లాలో ఇప్పటికే లక్షా 17,108 మందికి ఇళ్ల పట్టాలు అందచేసినట్టు వివరించారు. దీనికోసం 276 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు రూ.1,452 కోట్ల రూపాయలు వెచ్చించి 2,512 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించామని వెల్లడించారు. మొత్తం 2,789 ఎకరాలలో 284 జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని, ఆ భూములు చదునుచేసి సరిహద్దురాళ్లు, గ్రావెల్ రోడ్ల కోసం 81.56 కోట్ల రూపాయలు, తాగునీరు, విద్యుత్ సరఫరా కోసం రూ. 47.57 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. మొదటి దశలో 209 కాలనీలలో 66,125 ఇళ్లు ప్రారంభమై వేగవంతంగా జరుగుతున్నాయని, జిల్లాలో 18,448 టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని వివరించారు. మంగళగిరి, తెనాలి, పొన్నూరులో అన్ని మౌలిక వసతులతో ప్రారంభోత్సవాలు కూడా చేశామని, అమరావతిలో ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సీఆర్డీఏ పరిధిలోని పది గ్రామాలలో 5,024 ఇళ్లు ప్రారంభోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈరోజు 23,762 మంది లబ్ధిదారులకు 10 లేఅవుట్లలో 1402.58 ఎకరాల భూమిలో పట్టాలు ఇస్తున్నామని వివరించారు. -
మనసున్న నాయకుడు.. పిలిచి మరీ ఇంటి పట్టా ఇచ్చారు..
సాక్షి, వెంకటపాలెం:ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది నిరుపేద అక్కచెల్లెమ్మలకు సీఆర్డీఏ పరిధిలో కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. దీంతోపాటు ఇక్కడ నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్ల పత్రాలను సైతం లబ్ధిదారులకు అందజేశారు. దీనిలో భాగంగా లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. 23 ఏళ్లుగా ఇల్లు లేక కష్టాలు పడ్డామన్నా నాకు పెళ్లయినప్పటి నుంచి 23 ఏళ్లుగా రైల్వే స్థలంలో గుడిసె వేసుకుని ఉంటున్నామన్నా. మాతోపాటు అక్కడ 750 కుటుంబాలదీ అదే పరిస్థితి. ఎన్నోసార్లు రైల్వే వారు నోటీసులిచ్చారు. ఇల్లు అద్దెకు తీసుకునే శక్తి లేదు. ఇద్దరు పిల్లలతో ఎక్కడికి పోవాలో తెలియదు. ఎండకు ఎండాం, వానకు తడిచాం. గజం స్థలం కూడా కొనలేని నాకు జంటనగరాల మధ్య పిలిచి మరీ మీరు ఇంటి స్థలం ఇచ్చారు. రాజకీయ కుట్రలు పన్ని అడ్డుకోవాలని చూసినా, మీరు ఆడపడుచులను ఆస్తి పరులు చేశారన్నా. మీ సాయాన్ని జీవితంలో మరిచిపోలేను. ఈ రోజు నాలాంటి వారికి పెద్ద పండగ. అన్నా.. నా గృహ ప్రవేశానికి మీరు రావాలి. – గొట్టుముక్కల హైమావతి, తాడేపల్లి అద్దె పెంచినప్పుడల్లా ఇల్లు మారే పరిస్థితి అన్నా.. నాకు ముగ్గురు పిల్లలు. భర్త హోటల్లో పని చేస్తారు. 25 ఏళ్లుగా చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాం. చాలీచాలని ఆదాయం. ఇంటి అద్దె పెంచినప్పుడల్లా పిల్లి తన పిల్లల్ని తిప్పినట్టు ఇల్లు మారేదాన్ని. ఓసారి అత్తగారి అమ్మ చనిపోతే శవాన్ని కూడా ఇంటికి తీసుకురానీయలేదు. ఆ క్షణంలో ఎంతో మానసిక క్షోభ అనుభవించాను. సొంతిల్లు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనిపించింది. నాలాంటి మహిళకు సొంతిల్లు కలగానే మిగిలిపోతుందనుకున్నా. కానీ మీరు పెట్టిన వలంటీర్ మా ఇంటికి వచ్చి.. జగనన్న ఉచితంగా ఇల్లు ఇస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు ఎంతగా అడ్డుపడినా మీరు శ్రీరాముడిలా వారిని జయించి మాకు యాగ ఫలాన్ని అందించారన్నా. – లక్ష్మి, గుణదల, విజయవాడ గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? పేదలకు సీఎం వైఎస్ జగన్ మంచి చేస్తుంటే.. హడావుడి చేస్తున్న వ్యక్తులు, గత ప్రభుత్వంలో భూములు లాక్కుని కనీసం పరిహారం చెల్లించని చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? రైతులకు సీఎం జగన్ మేలు చేస్తున్నారే తప్ప ఎటువంటి అన్యాయం చేయటం లేదు. కావాలనే పేదలకు మేలు జరగకుండా అడ్డుకుంటున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుందని కుళ్లు బుద్ధితో కోర్టుకు వెళుతున్నారు. ఇక్కడి అభివృద్ధిపై రైతులు నిలదీయాల్సింది చంద్రబాబును. – పి.గంగా భవాని, విజయవాడ మంచి మనసున్న నాయకుడు మాకు ఇల్లు లేదు. ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. సీఎంగా జగన్ పరిపాలన ప్రారంభించాక పేదలకు మంచి జరగటం మొదలైంది. మాకు ఇంటి స్థలం కేటాయించారు. కచ్చితంగా ఇల్లు కట్టించి అందజేసే మంచి మనసున్న నాయకుడు సీఎం జగన్. పేదలకు అండగా నేనున్నానే భరోసా కల్పించారు. – షేక్ మస్తాన్‌బీ, మెల్లెంపూడి, గుంటూరు జిల్లా ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు మూడు కుటుంబాల వాళ్లం ఒకే ఇంట్లో తలదాచుకుంటున్నాం. సీఎం జగన్ ఇంటి స్థలాలు ఇవ్వటం ద్వారా అందరికీ జాగా వచ్చింది. పేదలకు మంచి చేసేందుకు ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. పేదోళ్ల కష్టం తెలుసు కాబట్టే.. స్థలాలు అందజేస్తున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. – జాలాది రత్నకుమారి, ఆత్మకూరు, గుంటూరు జిల్లా జగనన్న భరోసా కల్పించారు మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు వచ్చిన స్థలం భవిష్యత్‌లో మా బిడ్డలకు అండగా ఉంటుంది. కరోనా సమయంలో నాకు పనిలేదు. అప్పుడు ప్రభుత్వ పథకాలు మమ్మల్ని ఆదుకుని నిలబెట్టాయి. అన్నీ చెప్పిన సమయంలోనే చేస్తున్నారు. భగవంతుని చల్లని చూపు ఈ ప్రభుత్వానికి ఉంటుంది. – అబ్దుల్ వసీమ్, రేష్మా, మంగళగిరి, గుంటూరు జిల్లా మా కోసం యుద్ధమే చేశారు మా పొట్టకొట్టేందుకు చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మా అందరి కోసం యుద్ధం చేసి విజయం సాధించారు. తాను గెలిచి మమ్మల్ని గెలిపించిన తీరు ఆధ్యంతం స్ఫూర్తిదాయకం. జగనన్న దయవల్ల మాకు ప్లాట్ వచ్చింది. అది తీసుకునేందుకు వచ్చాం. – ఎ.భారతి, విజయవాడ సమానత్వానికి నాంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా రాజధానిలో సామాజిక సమానత్వానికి నాంది పలికినట్లయింది. పేదలు రాజధానిలో నివాసముంటే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందనేది తప్పు అని దీని ద్వారా తేటతెల్లమైంది. ఇప్పటి వరకు కొందరిదిగా ఉన్న అమరావతి ఇప్పుడు అందరిదైంది. ఏకంగా 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలివ్వడం అంటే మామూలు విషయం కాదు. తద్వారా లబ్ధిదారులకు వ్యక్తిగత లాభంతో పాటు ఇక్కడ ఏర్పడే ఇళ్ల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా రాజధాని ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. పాలకులకు ఎంతో గొప్ప మనసు ఉంటే కానీ ఇలాంటి నిర్ణయాలు సాధ్యం కావు. – కె మధుబాబు, సీడీసీ డీన్, ఏఎన్‌యూ ఈ అవకాశం ఎవరికీ రాలేదేమో.. 35 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలపై సంతకం పెట్టే అవకాశం బహుశా ఇప్పటి వరకు ఎవరికీ రాలేదేమో. ఆ అవకాశం నాకు మాత్రమే దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉంది. నేను ఉద్యోగంలో చేరి 35 సంవత్సరాలు. ఇన్ని ఏళ్లలో అత్యంత సంతోషకరమైన రోజు ఇది. ఈ అవకాశం రాష్ట్రంలో, దేశంలో ఏ అధికారికీ లభించి ఉండకపోవచ్చు. – రామ్‌ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి, గుంటూరు జిల్లా ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో అల్పాదాయ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎంతో ఆనందించాల్సిన, అభినందించాల్సిన విషయం. అన్ని సామాజిక వర్గాలకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుంది. ప్రభుత్వం ఎంతో శ్రమపడి పేదల కల సాకారం చేసింది. గతంలో ఎప్పడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఈ అంశంలో అందరూ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. – కె.శ్రీరామమూర్తి, పూర్వ ప్రిన్సిపాల్, ఏయూ ఆర్ట్స్, కామర్స్ కళాశాల -
‘జీవితాంతం రుణపడి ఉంటా’.. ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: సీఆర్డీయే పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాల పంపిణీతో పాటు, సీఆర్డీయే ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ శుక్రవారం పండగలా జరిగింది. ఈ క్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మన ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడింది. నేడు అదే అమరావతిలో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ల స్థలాలకు 50,793 మంది అక్కచెల్లెమ్మలను యజమానులను చేసింది మన ప్రభుత్వం. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించే అవకాశాన్ని నాకు కల్పించిన దేవుడికి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అంటూ సీఎం జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: లబ్ధిదారుల భావోద్వేగం.. మా ‘బలగం’ మీరే జగనన్నా.. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు మన ప్రభుత్వం సుప్రీంకోర్ట్ వరకూ వెళ్ళి పోరాడింది. నేడు అదే అమరావతిలో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ళ స్థలాలకు 50,793 మంది అక్కచెల్లెమ్మలను యజమానులను చేసింది మన ప్రభుత్వం. ఇంత మంచి కార్యక్రమం నిర్వ… pic.twitter.com/72QEY09aTn — YS Jagan Mohan Reddy (@ysjagan) May 26, 2023