సాక్షి, ప్రకాశం జిల్లా: ఒకేసారి 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం ఒక చరిత్ర అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయ మీడియాతో మాట్లాడుతూ, పూరి గుడిసె లేని ఇంటిని చూడాలనిదే లక్ష్యమన్నారు. 536 ఎకరాల్లో సుమారు 25 వేల మందికి ఇంటి స్థలం లేని పేదలకు రేపు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు.
సీఎం జగన్ మాట ఇచ్చాడంటే తప్పడు అనడానికి ఈ బృహత్తర కార్యక్రమం నిదర్శనమన్నారు. కష్ట కాలంలో కూడా 231 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన సీఎం జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా. టీడీపీ ఇన్ని కుట్రలు చేసినా పేదల పక్షాన ముందుకెళ్తూనే ఉంటాం. సీఎం జగన్ చేతుల మీదుగా రేపు లబ్ధిదారులకు స్థల రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తాం. అలాగే 339 కోట్ల రూపాయలతో నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకి సీఎం శంకుస్థాపన చేస్తారు. పేద, మధ్యతరగతి వర్గాల పక్షాన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని, సేవను ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment