
సాక్షి, అనంతపురం: అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగాదికి ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ వెంటనే స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులను సమూల ప్రక్షాళన చేయాలని తెలిపారు. అదేవిధంగా పెండింగ్ కేసులన్నీ వెంటనే పరిష్కరించాలని, భూ ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment