
సాక్షి, అమరావతి: ఇప్పటివరకు 29.18 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అసెంబ్లీలో గురువారం ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో 71,811 ఎకరాల భూ సేకరణ జరిగిందన్నారు. పేదలకు సొంతిల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయం అన్నారు.
కుల,మతాలకు అతీతంగా అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందన్నారు. సంక్షేమ పథకాలకు టీడీపీ మోకాలడ్డుతోందన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చారిత్రాత్మక పథకం. ఈ పథకానికి సహకరించకపోగా టీడీపీ అడ్డంకులు సృష్టిస్తోంది. రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు దక్కకుండా అడ్డుకుంటున్నారు. సీఎం జగన్‌కు మంచి పేరు వస్తోందని టీడీపీ కుట్రలు చేస్తోంది. కోర్టులు స్టేలు తెచ్చి ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నారని’’ మంత్రి కృష్ణదాస్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment