సాక్షి, తాడేపల్లి: మన భావితరాలు ప్రపంచాన్ని ఏలే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేనన్ని సంక్షేమ పథకాలను విద్యారంగంలో మన ప్రభుత్వంలో ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వరుసగా నాలుగో ఏడాదీ ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి సీఎం బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ‘అమ్మ ఒడి’ పథకంపై ఆయన ట్వీట్ చేశారు.
‘‘పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ బిడ్డల విద్యావసరాల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం కింద తమ పిల్లలను చదివిస్తున్న 42.64 లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేడు రూ.6,393 కోట్లను జమ చేస్తున్నాం. ఈ ఒక్క పథకం కిందే మన ప్రభుత్వం ఈ నాలుగేళ్ళలో రూ.26,067 కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. విద్యార్థులందరినీ ఉన్నత విద్యావంతులు చేసే లక్ష్యంతో విద్యారంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
చదవండి: చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం: సీఎం జగన్
తాజాగా విడుదలైన నిధులతో కలిపి.. ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని జగనన్న ప్రభుత్వం లబ్ధిదారులకు చేకూర్చినట్లయ్యింది. ఇక గత నాలుగేళ్లలో నాలుగేళ్లలో విద్యా రంగంపై సీఎం జగన్ ప్రభుత్వం రూ.66,722.36 కోట్లను వెచ్చించారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నారు.
మన భావితరాలు ప్రపంచాన్నేలే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేనన్ని సంక్షేమ పథకాలను విద్యారంగంలో మన ప్రభుత్వంలో ప్రవేశపెట్టాం. పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ బిడ్డల విద్యావసరాల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం… pic.twitter.com/pzte4zJ1W3
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 28, 2023
Comments
Please login to add a commentAdd a comment