సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు.
అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని సీఎం జగన్ అన్నారు. ‘‘ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు. ఆయన మార్గంలోనే మా పయనం. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు.
అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే. ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు. ఆయన మార్గంలోనే మా పయనం. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు.#jyotiraophule
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 11, 2023
Comments
Please login to add a commentAdd a comment