సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అఖండ మెజార్టీతో విజయం సాధించి.. సంక్షేమ పాలనతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. 50 శాతానికి పైగా ఓట్లు.. 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించింది. దేశంలో ఒంటరిగా పోటీచేసిన ఒక పార్టీ ఇంత భారీ విజయం సాధించడం అదే ప్రథమం.
చంద్రబాబు దుర్మార్గపు పాలనకు సమాధి కడుతూ సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు చారిత్రక తీర్పు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు.. ప్రజాసంకల్ప పాదయాత్రలో భవితపై భరోసా కల్పించిన సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టి.. నవశకాన్ని ఆవిష్కరించి నేటికి నాలుగేళ్లు. ఈ సందర్భంగా నాలుగేళ్ల పాలనపై సీఎం ట్వీట్ చేశారు.
‘‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ల క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ళ క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 23, 2023
Comments
Please login to add a commentAdd a comment