CM YS Jagan Emotional Tweet About On YSR Jayanthi - Sakshi
Sakshi News home page

మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

Published Sat, Jul 8 2023 8:00 AM | Last Updated on Sat, Jul 8 2023 11:02 AM

Cm Ys Jagan Emotional Tweet About On Ysr Jayanthi - Sakshi

వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశారు.

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు అడుగులు వేస్తున్నారు.

వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు’’ అని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు.


చదవండి: మరపురాని మహానేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement