Jyotirao phule Jayanthi
-
మహాత్మా జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని సీఎం జగన్ అన్నారు. ‘‘ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు. ఆయన మార్గంలోనే మా పయనం. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే. ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు. ఆయన మార్గంలోనే మా పయనం. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు.#jyotiraophule — YS Jagan Mohan Reddy (@ysjagan) April 11, 2023 -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా చూసే దృక్కోణం మారాలి. నిజమైన సమస్యలున్న నిజమైన మనుషులుగా వారిని చూడాలి. మహాత్మా ఫూలే చింతన ఈ విషయంలో మనకు తోడ్పడగలదు. వీటన్నింటికి మించి సమానత్వం అనేదాన్ని ఒక కుటుంబ విలువగా అందరిలోనూ పాదుకొల్పాలి. భారతదేశ గతిని ఉన్నతి వైపు తిప్పిన మహాను భావులు ఎందరో. అలాం టివాళ్లకు మనం రుణపడి ఉండాలి. అలాంటివారిలో ఒకరు జ్యోతిరావు ఫూలే. భార్య సావిత్రి బాయితో కలిసి ఆయన స్త్రీవిద్యకు మార్గదర్శిగా నిలిచారు. 1827 ఏప్రిల్ 11న జన్మించిన నాటి నుంచి, 1890 నవంబర్ 28న తుదిశ్వాస విడిచే వరకూ ఫూలే అవి శ్రాంతంగా సామాజిక న్యాయం కోసం పోరాడారు. ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడే తల్లి చిమ్నాబాయి మరణించింది. మాలి కులానికి చెందిన అబ్బాయి కావడం వల్ల పైకులాల వాళ్ల లాగా చదువు కోసం కలలుగనే అవకాశాలు లేకపోవడం, తమ కులంలో కూడా చదువు అనేదానికి అంతగా ప్రాధాన్యత లేకపోవడంవల్ల వాళ్ల తండ్రి ఆయన్ని బడి మాన్పిం చాడు. అయితే వాళ్ల కులంలోంచి క్రిస్టియన్‌గా మారిన ఒకాయన చొరవతో స్థానిక స్కాటిష్ మిషన్ హైస్కూల్లో చదవగలిగాడు. జ్యోతిరావు ఫూలే ఏడాది వయసులో ఉన్నప్పుడు తల్లి చిమనాబాయి కన్నుమూసింది. దిగువ కులానికి చెందిన పిల్లవాడు అగ్రకుల పిల్లల్లాగా చదువు పట్ల ఆకాంక్ష ఉంచుకోవడం కష్టం.. పైగా విద్య ఫూలే కులానికి ప్రాధమ్యం కాదు. దీంతో ఫూలే పాఠశాలను వదిలిపెట్టాల్సి వచ్చింది. కానీ వీరి కులం నుంచి క్రిస్టియన్‌గా మారిన ఒక వ్యక్తి స్థానికంగా ఉండే స్కాటిష్ మిషన్ స్కూల్లో పూలేని చేర్పించాలని జ్యోతిరావు తండ్రికి నచ్చచెప్పడంతో తర్వాత పూలే 1847 నాటికి తన ఇంగ్లిష్ పాఠశాల చదువును పూర్తి చేశాడు. 1848లో ఒక బ్రాహ్మణ స్నేహితుడి వివాహా నికి హాజరైనప్పుడు అతడి తల్లిదండ్రుల నుంచి ఎదురైన అవమానం ఫూలేలో కులాల అసమానత మీద గట్టి పోరాటం చేయాలన్న సంకల్పాన్ని కలి గించింది. అదే సంవత్సరం క్రైస్తవ మిషనరీలు అహ్మద్‌నగర్(మహారాష్ట్ర)లో నడుపుతున్న బాలికల పాఠశాలను చూడటమూ, థామస్ పెయిన్ రాసిన ‘రైట్స్ ఆఫ్ మ్యాన్’ పుస్తకం చదవడమూ దోపిడీకి గురవుతున్న వర్గాల దాస్యవిమోచనకు విద్య అనే దాన్ని మహత్తర శక్తిగా గుర్తించేట్టు చేసింది. ఆ రోజుల్లో బాల్యవివాహాల సంప్రదాయం ఉండ టంతో ఆయనకు పదమూడేళ్లకే సావిత్రిబాయితో పెళ్లయింది. దాంతో ముందుగా భార్యకు చదవడం, రాయడం నేర్పి, అనంతరం బాలికల కోసం ఆమెతో కలిసి బడిని ప్రారంభించాడు. ఆ దంప తుల ఆధ్వర్యంలో 1852లో 273 మంది బాలిక లతో మూడు పాఠశాలలు నడుస్తుండేవి. స్త్రీవిద్యతో పాటు వితంతు పునర్వివాహాన్ని ఫూలే సమర్థించాడు. పైకులాల వితంతు మహిళలు సురక్షితంగా ప్రసవించేందుకు వీలుగా 1863లో ఆశ్రమం నెలకొల్పాడు. కాశీబాయి అనే బ్రాహ్మణ వితంతువు గర్భం దాల్చడం, ప్రసవించిన శిశువును ఆమె బావిలో తోయడం, అటుపై పట్టుబడి ఆమె జైలుకు వెళ్లడం జరిగింది. ఈ సంఘటనతో చలించిన ఫూలే, ‘వితంతువులారా, మీ శిశువులను ఇక్కడ సురక్షితంగా ప్రసవించండి. ఆ శిశువును మీరు పెంచుకుంటారా మీ ఇష్టం, లేదంటే ఆశ్ర మమే పెంచుతుంది’ అని ప్రకటన ఇచ్చాడు. బ్రాహ్మణుడు లేకుండా పెళ్లి చేసే పద్ధతిని కూడా జ్యోతిబా ప్రారంభించాడు. దాన్ని ముంబై హైకోర్టు కూడా గుర్తించింది. నిమ్నకులాల కోసం తమ మంచినీటి బావిని వాడుకోనివ్వడంతోపాటు, అణగారిన వర్గాలను సూచించడానికి మరాఠీ పదమైన దళిత పదాన్ని మొదటిసారి ఆయనే ప్రయోగించాడు. మాజీ ప్రధాని వాజ్‌పేయి 2003లో పార్లమెంట్ ప్రాంగణంలో ఫూలే విగ్ర హాన్ని ఆవిష్కరించడంతో ఆయన సేవలను గుర్తించినట్టయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ పూచీ ఉండటంతో ఎస్సీలు, ఎస్టీల హక్కుల పరిరక్షణ జరిగిన మాట వాస్తవం. కానీ అదే మాట ఇతర వెనుకబడిన కులాలైన ఓబీసీల విషయంలో చెప్పలేము. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం 27 శాతం రిజర్వేషన్ కల్పించడం వారి అభ్యున్నతి విష యంలో చిన్న అడుగు మాత్రమే. వారికి కేటా యించిన వాటిల్లో చాలా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకాకుండా ఉండిపోతున్నాయి, ముఖ్యంగా ఏ, బీ గ్రూపుల్లో. ఓబీసీల్లోని నిరుపేదల ఎదుగుదల కోసం సమగ్ర విధానం అవసరం. ఓబీసీల్లో ఉప వర్గీకరణ పంపకాల్లోని అసమానతలను పరిశీలించ డానికి 2017లో బీజేపీ ప్రభుత్వం జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసింది. 2014లో ఓబీసీల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ హోదాలో నేను దేశవ్యాప్తంగా పర్యటించాను. వివిధ ఓబీసీ బృందాలతో సంభాషించాను. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించాలనేది అప్పుడు వచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అది ప్రసాదించడం, ఆ చారిత్రక ఘట్టంలో నేనూ భాగంకావడం నేను గర్వించే విషయం. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా చూసే దృక్కోణం మారాలి. నిజమైన సమస్యలున్న నిజమైన మనుషులుగా వారిని చూడాలి. మహాత్మా ఫూలే చింతన ఈ విషయంలో మనకు తోడ్పడగలదు. నిరుపేద ఓబీసీల కోసం మోడల్ స్కూళ్లు ప్రారంభించడం, అత్యున్నత సంస్థల నుంచి వారు చదివే వీలు కల్పించేలా స్కాలర్షిప్పులు ఇవ్వడం, సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విశ్వ విపణికి అనుసంధానం చేయడం, సూక్ష్మ పరిశ్రమలు నెలకొల్పేందుకు తగిన సాంకే తిక పరిష్కారాలను వెతకడం, బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు అందేలా చూడటం లాంటివి అత్యవసరం. వీటన్నింటికి మించి సమానత్వం అనేదాన్ని ఒక కుటుంబ విలువగా అందరిలోనూ పాదుకొల్పాలి. సామాజిక ఐక్యత, వివిధ వర్గాల మధ్య సామరస్యం కోసం ఫూలే స్థాపించిన సత్య శోధక్ సమాజ్ లాంటి ఎన్నో సంస్థలు పని చేయాల్సిన అవసరం ఉంది. బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ (నేడు మహాత్మా జ్యోతిబా ఫూలే 194వ జయంతి) -
పూలే జయంతి ‘నిధుల దుర్వినియోగం’పై నివేదికివ్వండి
సాక్షి, హైదరాబాద్: జ్యోతిరావు పూలే జయంతి వేడుకల దుర్వినియోగ అభియోగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిధుల దుర్వినియోగం రిట్లో కౌంటర్ దాఖలు చేయాలని గత జనవరిలో హైకోర్టు నోటీసులు జారీ చేస్తే నాలుగు నెలలైనా ఇప్పటివరకూ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుతోపాటు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి/కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రంలో పూలే జయంతి వేడుకల నిర్వహణకు బీసీ సంక్షేమ శాఖ రూ.11.25 లక్షలు మంజూరు చేస్తే హైదరాబాద్‌లో చేసిన ఖర్చులో సుమారు 70 శాతం వరకు దుర్వినియోగం అయిందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన శివుపల్లి రాజేశం పిల్ దాఖలు చేశారు. 18 నుంచి అన్ని కేసులనూ విచారించనున్న హైకోర్టు లాక్డౌన్ కారణంగా అత్యవసర కేసుల్ని మాత్రమే విచారిస్తున్న హైకోర్టు ఈ నెల 18వ తేదీ సోమవారం నుంచి అన్ని రకాల కేసులనూ విచారించాలని నిర్ణయించింది. రిట్లు, క్రిమినల్, సివిల్ కేసులను ఆన్లైన్లో ఏ విధంగా దాఖలు చేయాలో హైకోర్టు వెబ్సైట్లో వివరాలను పొందుపర్చినట్లు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. -
చంద్రబాబు సభ వద్ద కుల సంఘాల నేతల ఆందోళన
-
చంద్రబాబు సభ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బుధవారం పూలే విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు వెన్నెముక అని, వారి సంక్షేమం కోసం స్థాపించిన పార్టీ టీడీపీ అని ఆయన పేర్కొన్నారు. వెనుక బడిన వర్గాలకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై గంగిరెద్దుల కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమకు ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని, అసలేమి ఇవ్వకుండానే అన్ని ఇచ్చినట్టు చెబుతున్నారని కుల సంఘాల నేతలు సభ వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్నికలకు ముందు తమను ఎస్సీల్లో చేరుస్తామన్న ముఖ్యమంత్రి ఇపుడు పట్టించుకోవడం లేదన్నారు. సభలో కనీసం తమ గురించి ప్రస్తావించలేదని వారు అసహనం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. -
ముందు తరాలకు ఆదర్శం పూలే జీవితం
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పట్టణంలోని కొత్తబస్టాండ్ వద్దగల ఆయన విగ్రహానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ పూలే కుల నిర్మూలన కోసం పోరాటం చేసిన మహనీయుడన్నారు. ఆయన జీవితం ముందు తరాలకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, శివశంకర్‌పాటిల్, సుధాకర్‌గౌడ్, హరిక్రిష్ణగౌడ్, భాస్కర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పూలే సేవలు చిరస్మరణీయం సంగారెడ్డి మున్సిపాలిటీ: జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని ,ఆయన కృషి ఫలితంగానే మహిళలు నేడు విద్యారంగంలో రాణిస్తున్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు పలు దళితసంఘాల నేతలు కొనియాడారు. గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిరావుపూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, నేటి యువత పూలే బాటలో పయనించి మంచి పేరు తేవాలని సూచించారు. అనేక పాఠశాలలను నెలకొల్పిన పూలే ఉన్నతవిద్య కోసం ఎనలేని కృషి చేశారన్నారు. పూలే జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని కొత్తబస్టాండ్ ఎదుట ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సామాజిక సేవా సంఘం జిల్లా అధ్యక్షడు వెంకట్ మాట్లాడుతూ సమాజంలో చదువు ద్వారానే విజ్ఞానం వస్తుందని, ఫలితంగా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని భావించారన్నారు. అందుకోసం ఆయన మహిళలకు అక్షర జ్ఞానం కల్పించాలని సంకల్పించారన్నారు. దీంతో అతి చిన్న వయస్సులోనే తన సతీమణితో ఉచిత అక్షరాభ్యాస కేంద్రాలను ప్రారంభించారన్నారు. మహారాష్ట్రలో ప్రతి గ్రామంలో అక్షరాభ్యాస కేంద్రాలను ప్రారంభించి మహిళలను అక్షరాస్యులుగా చేయడంలో పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన చేసిన కృషి వల్లనే ప్రభుత్వ రంగంలో మహిళలు ఉద్యోగులుగా లభిస్తు న్నాయన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అక్షరాభ్యాసం అవసరమని అది లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో నాయకలు రవి, ప్రభాకర్, సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దళితులు విద్యావంతులు కావాలి బహుజన వేదిక ఆధ్వర్యంలో పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మెదక్ ఎంపీ అభ్యర్థి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ భారత సామాజిక వ్యవస్థలో కుల వ్యవస్థను ధ్వంసం చేసేందుకు నిర్మాణాత్మక పోరాటం చేసింది జ్యోతిరావు పూలే అన్నారు. తొలి మహిళా విశ్వవిద్యాలయ స్థాపకుడు విలియం కార్వే పుట్టకముందే పూలే భార్య సావిత్రి బాయిని తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దింది జ్యోతిరావుపూలే అన్నారు. భర్తకు తోడుగా సామాజిక ఉద్యమంలో సావిత్రాబాయి ప్రత్యేక్షంగా పాల్గొని ఆదర్శ దంపతుల్లా కీర్తించబడ్డారన్నారు. కుల వ్యవస్థ పూర్తిగా అంతం కావాలంటే దళితులు పూర్తి స్థాయిలో విద్యావంతులు కావాలన్నారు.