జ్యోతిరావుపూలే జయంతి సభలో చంద్రబాబు
సాక్షి, విజయవాడ: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బుధవారం పూలే విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు వెన్నెముక అని, వారి సంక్షేమం కోసం స్థాపించిన పార్టీ టీడీపీ అని ఆయన పేర్కొన్నారు. వెనుక బడిన వర్గాలకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై గంగిరెద్దుల కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమకు ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని, అసలేమి ఇవ్వకుండానే అన్ని ఇచ్చినట్టు చెబుతున్నారని కుల సంఘాల నేతలు సభ వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్నికలకు ముందు తమను ఎస్సీల్లో చేరుస్తామన్న ముఖ్యమంత్రి ఇపుడు పట్టించుకోవడం లేదన్నారు. సభలో కనీసం తమ గురించి ప్రస్తావించలేదని వారు అసహనం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment