సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్‌పై వాలంటీర్ల(Volunteers) పోరాటం కొనసాగుతోంది. తాజాగా విజయవాడ(Vijayawada)లో వాలంటీర్ల నిరసన ఉధృతంగా మారింది. రోడ్డుపై వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ యూటర్న్ విధానానికి వ్యతిరేకంగా బ్యాక్ వాక్ చేశారు. ఈ సందర్భంగా బాబు వచ్చారు.. జాబ్ తీశారంటూ నినాదాలు చేశారు. అలాగే, పెండింగ్ జీతాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఏపీలో వాలంటీర్ల(Volunteers) పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రాధాన్యత ఇస్తామని, వేతనాన్ని కూడా పెంచుతామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలను చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో కూటమి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి నెలకు రూ.10వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక, విశాఖలోనూ వాలంటీర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల్లో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమను విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిలించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తూ నిరనసలు చేపట్టారు. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే అమరావతిలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment