
సాక్షి, విజయవాడ: మూడు రాజధానులపై టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా యువజన, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు. శనివారం సీతారామపురం జంక్షన్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థి విభాగం నేతలు..ఆంధ్రా ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని.. వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న చంద్రబాబు ద్రోహిగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. చంద్రబాబును ప్రజలు, విద్యార్థులు ఈ రాష్ట్రం నుంచి తరిమికొడతారని అంజిరెడ్డి నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment