student jac dharna
-
తెలంగాణలో వివాదంగా మారిన జోనల్ విధానం రద్దు
-
ఆంధ్రా ద్రోహి చంద్రబాబు..
సాక్షి, విజయవాడ: మూడు రాజధానులపై టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా యువజన, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు. శనివారం సీతారామపురం జంక్షన్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థి విభాగం నేతలు..ఆంధ్రా ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని.. వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న చంద్రబాబు ద్రోహిగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. చంద్రబాబును ప్రజలు, విద్యార్థులు ఈ రాష్ట్రం నుంచి తరిమికొడతారని అంజిరెడ్డి నిప్పులు చెరిగారు. -
కేంద్రంలో నేను ఉండబట్టే.. నెలకో ప్రాజెక్ట్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఢిల్లీలోని వెంకయ్య నివాసం వద్ద శుక్రవారం విద్యార్థి జేఏసీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ తెలుగు రాష్ట్రాలకు అధిక ప్రాజెక్టులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అనేక ఉన్నత సంస్థలు, విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చినట్లు వెంకయ్య తెలిపారు. కేంద్రంలో తాను ఉండబట్టే తెలు రాష్ట్రాలకు నెలకు ఒక ప్రాజెక్ట్ వస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్స్ సమయంలో ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చౌకబారు రాజకీయాలు చేశారని వెంకయ్య నాయుడు మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదని ఆయన తెలిపారు.