కేంద్రంలో నేను ఉండబట్టే.. నెలకో ప్రాజెక్ట్ | Students jac dharna outside central minister's venkaiah naidu house in delhi | Sakshi
Sakshi News home page

కేంద్రంలో నేను ఉండబట్టే.. నెలకో ప్రాజెక్ట్

Published Fri, May 8 2015 11:34 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

కేంద్రంలో నేను ఉండబట్టే.. నెలకో ప్రాజెక్ట్ - Sakshi

కేంద్రంలో నేను ఉండబట్టే.. నెలకో ప్రాజెక్ట్

న్యూఢిల్లీ :  ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఢిల్లీలోని వెంకయ్య నివాసం వద్ద శుక్రవారం విద్యార్థి జేఏసీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ తెలుగు రాష్ట్రాలకు అధిక ప్రాజెక్టులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

రాష్ట్ర విభజన చట్టంలోని అనేక ఉన్నత సంస్థలు, విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చినట్లు వెంకయ్య తెలిపారు. కేంద్రంలో తాను ఉండబట్టే తెలు రాష్ట్రాలకు నెలకు ఒక ప్రాజెక్ట్ వస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్స్ సమయంలో ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చౌకబారు రాజకీయాలు చేశారని వెంకయ్య నాయుడు మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement