
ఢిల్లీ: ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులు, సంస్కార వంతులని, ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పనిపట్ల నిబద్ధత కల్గిన వ్యక్తి అని వెంకయ్య నాయుడు కొనియాడారు.
‘గౌతమ్ రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. గౌతమ్ రెడ్డి నేనంటే ఎంతో అభిమానం చూపేవారు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment