సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పట్టణంలోని కొత్తబస్టాండ్ వద్దగల ఆయన విగ్రహానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ పూలే కుల నిర్మూలన కోసం పోరాటం చేసిన మహనీయుడన్నారు. ఆయన జీవితం ముందు తరాలకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, శివశంకర్‌పాటిల్, సుధాకర్‌గౌడ్, హరిక్రిష్ణగౌడ్, భాస్కర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
పూలే సేవలు చిరస్మరణీయం
సంగారెడ్డి మున్సిపాలిటీ: జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని ,ఆయన కృషి ఫలితంగానే మహిళలు నేడు విద్యారంగంలో రాణిస్తున్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు పలు దళితసంఘాల నేతలు కొనియాడారు. గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిరావుపూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, నేటి యువత పూలే బాటలో పయనించి మంచి పేరు తేవాలని సూచించారు. అనేక పాఠశాలలను నెలకొల్పిన పూలే ఉన్నతవిద్య కోసం ఎనలేని కృషి చేశారన్నారు.
పూలే జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని కొత్తబస్టాండ్ ఎదుట ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సామాజిక సేవా సంఘం జిల్లా అధ్యక్షడు వెంకట్ మాట్లాడుతూ సమాజంలో చదువు ద్వారానే విజ్ఞానం వస్తుందని, ఫలితంగా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని భావించారన్నారు. అందుకోసం ఆయన మహిళలకు అక్షర జ్ఞానం కల్పించాలని సంకల్పించారన్నారు. దీంతో అతి చిన్న వయస్సులోనే తన సతీమణితో ఉచిత అక్షరాభ్యాస కేంద్రాలను ప్రారంభించారన్నారు. మహారాష్ట్రలో ప్రతి గ్రామంలో అక్షరాభ్యాస కేంద్రాలను ప్రారంభించి మహిళలను అక్షరాస్యులుగా చేయడంలో పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
ఆయన చేసిన కృషి వల్లనే ప్రభుత్వ రంగంలో మహిళలు ఉద్యోగులుగా లభిస్తు న్నాయన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అక్షరాభ్యాసం అవసరమని అది లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో నాయకలు రవి, ప్రభాకర్, సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దళితులు విద్యావంతులు కావాలి బహుజన వేదిక ఆధ్వర్యంలో పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు, మెదక్ ఎంపీ అభ్యర్థి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ భారత సామాజిక వ్యవస్థలో కుల వ్యవస్థను ధ్వంసం చేసేందుకు నిర్మాణాత్మక పోరాటం చేసింది జ్యోతిరావు పూలే అన్నారు.
తొలి మహిళా విశ్వవిద్యాలయ స్థాపకుడు విలియం కార్వే పుట్టకముందే పూలే భార్య సావిత్రి బాయిని తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దింది జ్యోతిరావుపూలే అన్నారు. భర్తకు తోడుగా సామాజిక ఉద్యమంలో సావిత్రాబాయి ప్రత్యేక్షంగా పాల్గొని ఆదర్శ దంపతుల్లా కీర్తించబడ్డారన్నారు. కుల వ్యవస్థ పూర్తిగా అంతం కావాలంటే దళితులు పూర్తి స్థాయిలో విద్యావంతులు కావాలన్నారు.
ముందు తరాలకు ఆదర్శం పూలే జీవితం
Published Fri, Apr 11 2014 11:58 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement