prabhu goud
-
ఆర్టీసీ చార్జీల పెంపు తగదు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ సంగారెడ్డి క్రైం : రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచాలని యోచించడం సరికాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ సూచించారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ చార్జీలను పెంచడం వల్ల పేద, మధ్యతరగతి ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇటీవల ఆర్టీసీ కార్మికుల వేతనాలను భారీగా పెంచిన నేపథ్యంలో చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపడం దారుణమని విమర్శించారు. సీఎం కేసీఆర్ కార్మికులకు వరాలు ఇస్తూ పేదలపై భారం వేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ఇటీవల పలుమార్లు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల పెరిగాయని, ఈ భారం నుంచి ప్రజలు బయట పడకముందే బస్సు చార్జీలను పెంచాలని యోచించడం తగదన్నారు. రాష్ట్రంలో బడా సంస్థలకు ఇస్తున్న రాయితీలను తగ్గించైనా పేదలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సుధాకర్‌గౌడ్, మక్సూద్ అలీ, పరుశురాంరెడ్డి, బాగన్నగౌడ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుగౌడ్ను పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మెదక్ జిల్లా పార్టీ నేత ప్రభుగౌడ్ ను పరామర్శించారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని...వైఎస్ జగన్ పరామర్శించి, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ప్రభుగౌడ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. -
ప్రజల గుండెల్లో వైఎస్
సంగారెడ్డి క్రైం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు మెతుకు సీమ లో ఎందరో నిరుపేదలు, అభాగ్యులకు అండ గా నిలిచాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ అన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రుణమాఫీ, ఉచిత కరెంట్, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్, బంగారుతల్లి, సామాజిక పెన్ష న్లు, ఆరోగ్యశ్రీ వంటి లెక్కకు మించి ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిర్విరామంగా కొనసాగించిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. మనసున్న నేతగా అన్ని వర్గాల ప్రజల్లో ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుంద ని తెలిపారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న జిల్లా వ్యాప్తంగా సంస్మరణ సభలు నిర్వహిస్తామని తెలిపారు. దీనికోసం తమ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అన్నదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వైఎస్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్ హయాంలో అమలైన అన్ని సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహానేత పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని గుర్తు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని రుణ మాఫీ, ఉచిత కరెంట్, రుణాల రీ షెడ్యూల్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశారని కొనియాడారు. వైఎస్ చేసిన కృషి వల్లే జిల్లాకు సింగూరు సాగు జలాలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, వైద్యనాథ్, అంతయ్య, పరశురాం, పాండు తదితరులు ఉన్నారు. -
కరువు జిల్లాగా ప్రకటించాలి
ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి ►ఆత్మస్థైర్యం కోసం అవగాహన సదస్సులు నిర్వహించాలి ►వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ డిమాండ్ వర్గల్: జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొన్నందునా కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ డిమాండ్ చేశారు. మరోవైపు రైతుల ఆత్మహత్యలకు గత నాలుగేళ్ల కాంగ్రెస్ పాలనే కారణమని మండిపడ్డారు. శుక్రవారం వర్గల్ మండలం మైలారం గ్రామంలో బలవన్మరణానికి పాల్పడిన రైతు బాలాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. రైతు మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుగౌడ్ విలేకరులతో మాట్లాడారు. రైతులకు భరోసా కల్పించేందుకు, బలవన్మరణాలకు అడ్డుకట్టవేసేందుకు సీఎం కేసీఆర్ తక్షణం కార్యాచరణ చేపట్టాలన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, ఆంక్షలతో నిమిత్తం లేకుండా రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వానల్లు లేక, కరెంట్ రాక, పంటలకు నీరందక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును రాజుగా చూడాలని తపించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రుణమాఫీ, ఉచిత కరెంట్‌తో అండగా నిలిచారని, ఆయన రైతు బాంధవునిగా చెరగని ముద్రవేశారన్నారు. ప్రస్తుత దయనీయ పరిస్థితిలో ఉన్న రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి ఆత్మస్థైర్యం కల్పించాలన్నారు. రైతులు మనోనిబ్బరంతో ఉండాలని, మీ పిల్లలకు, కుటుంబాలకు పెద్ద దిక్కులేకుండా బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. రైతు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ సంగారెడ్డి నేత సుధాకర్ గౌడ్, జగదీశ్వర్ రావు, ఆందోలు నాయకుడు సంజీవరావు, సిద్దిపేట నేత జగదీశ్వర్ గుప్త, మెదక్ నేత అల్లారం క్రీస్తుదాసు, స్థానిక నేతలు ఎల్లంగౌడ్ ఉన్నారు. -
రైలు ప్రమాద బాధితులకు వైఎస్సార్సీపీ సాయం
తూప్రాన్: మాసాయిపేట బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అండగా నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ తెలిపారు. అందులో భాగంగానే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ తెలంగాణ కన్వీనర్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు జనక్ ప్రసాద్, నల్లా సూర్యప్రకాశ్‌రావు, గట్టు రాంచంద్రరావు తదితరులు మాసాయిపేట దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను మంగళవారం పరామర్శించి ఆర్థిక సాయం అందించనున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ, పార్టీ నేతలు తొలుత రైలు ప్రమాదం జరిగిన మాసాయిపేట గ్రామానికి చేరుకుని ఉదయం 9.30 గంటలకు చిన్నారుల ఆత్మశాంతికి శ్రద్ధాంజలి ఘటించనున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించి మృతుల కుటుంబీకులను పరామర్శించి ఆర్థికసాయం అందించనున్నట్లు వివరించారు. అలాగే రైల్వే అధికారులు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేంతవరకు తమ పార్టీ తరపున ఉద్యమిస్తామన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
రైతు ఆత్మహత్యలకు టీడీపీ, కాంగ్రెస్ నేతలే కారణం
మెదక్, రూరల్: అప్పులు ఉన్నంత మాత్రాన రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం సరికాదని, కాంగ్రెస్, టీడీపీ నేతల మాటలతోనే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ పేర్కొన్నారు. మెదక్ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన ఏసు అప్పుల బాధతో ఈనెల 15న ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. కాగా విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ సోమవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూ.లక్ష లోపు రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని, అయినప్పటికీ జిల్లాలో ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. రైతులకు ధైర్యం చెప్పాల్సి కొన్నిపార్టీలు వారిని అధైర్య పరుస్తున్నాయని పరోక్షంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శించారు. కలెక్టర్ చొరవచూపి గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఆత్మహత్యలను నివారించాలని కోరారు. రైతురుణాల మాఫీతో పాటు తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాల కృషిచేస్తానని కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఏసుదాసు ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు దురదృష్టకరం మెదక్ మున్సిపాలిటీ:ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించినా రైతులు ఆత్మహత్యలకు పాల్పడం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభు గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మెదక్ ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు రుణమాఫీపై ప్రభుత్వం చేసిన ప్రకటనను వక్రీకరించడంవల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అంతకు ముందు ఆయన టేక్మాల్‌లో ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రామయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ క్రీస్తుదాస్, సుధాకర్ తదితరులు ఉన్నారు. -
రైతులకు కేసీఆర్ భరోసా ఇవ్వాలి
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత టీఆర్ఎస్ అధినేత, కాబోయే సీఎం కేసీఆర్‌పై ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ పేర్కొన్నారు. చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో సోమవారం ఆత్మహత్య చేసుకున్న రైతు ఉప్పరి నర్సింలు కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో రైతురుణ మాఫీపై తొలి సంతకం చేసి వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీపై దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి సంతకం చేసి వారికి అండగా నిలిచారన్నారు. అలాంటి ధీమా మళ్లీ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో ఉండగానే జిల్లాలో రైతు ఆత్మహత్యలు జరగడం దారుణమన్నారు. రైతులకు ధైర్యం కల్పించాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను వైఎస్ అందించిన విధంగా ప్రత్యేక ప్యాకేజీ కల్పించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా నర్సింలు కుమారుడు ప్రవీణ్ చదువుకయ్యే ఖర్చును తాను భరిస్తానని తెలిపారు. ఆయన వెంట శాలిపేట గ్రామ ఎంపీటీసీ యాదమ్మ సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ క్రీస్తుదాస్, నాయకులు సుధాకర్‌గౌడ్, రవి, వెంకటరమణ తదితరులు ఉన్నారు. అధిష్టానం ఆదేశిస్తే మెదక్ ఎంపీగా పోటీచేస్తా! సంగారెడ్డి అర్బన్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నందున పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను మెదక్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధిస్తానని ప్రభుగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాలుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వెంటే తాను ఉన్నానని, వైఎస్ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ దాడికి దిగడంతో వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. తానెప్పుడు పార్టీలు మారలేదని పదవుల కోసం పాకులాడలేదన్నారు. పార్టీలను తరచుగా మార్చేవారిని ప్రజలు నమ్మరన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన వారిలో కేసీఆర్‌కు తనకు మాత్రమే రాజకీయాలు తెలుసన్నారు. ఉప ఎన్నికలో బీసీ నాయకునిగా ప్రజలు తనను గుర్తించి గెలిపిస్తారన్నారు. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్నదనే సందేశం ఇవ్వడానికి కేసీఆర్‌ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నందున తాను పోటీకి సిద్ధమన్నారు. -
వైఎస్ జగన్ ఆంధ్రా సీఎం కావడం ఖాయం
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం కావడం ఖాయమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో జగన్ సీఎం కావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ జగన్ సీమాంధ్ర ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ని ప్రార్థించానన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ హయాంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందేవన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు నిర్వీర్యం చేశారన్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అభివృద్ధికోసం కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సుధాకర్, వైద్యనాథ్, వెంకటరమణ, జగదీశ్, పరుశురామ్‌రెడ్డి పాల్గొన్నారు. పటాన్చెరు టౌన్: వైఎస్ హయాంలోనే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం, జగన్ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన పటాన్చెరులో విలేకరులతో మాట్లాడుతూ 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నందున అభ్యర్థులు ఏజెంట్లను కౌటింగ్ కేంద్రాలకు పంపించాలని సూచించారు. కాంగ్రెస్ , టీడీపీ, పార్టీలు ప్రజాసంక్షేమం పట్టించుకోలేదన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలు మరిచిపోలేదన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడు రైతులకు మేలు చేయలేదని ,ఇప్పుడు ఆయన అన్నీ ఉచితంగా ఇస్తానంటున్నాడన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుధాకర్, జగదీష్, హరికృష్ణగౌడ్, పరుషరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్‌సీపీతోనే తెలంగాణ అభివృద్ధి
రామాయంపేట,న్యూస్‌లైన్: మహానేత వైఎస్సార్ ఆశయ సాధనకోసం స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రభుగౌడ్ అన్నారు. గురువారం ఆయన రామాయంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్పర్థి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ దక్కాయన్నారు. ఆ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. ప్రతి రైతును లక్షాధికారి చేయాలనే లక్ష్యంతోనే రాజశేఖర్‌రెడ్డి పాలన సాగించారన్నారు. వైఎస్సార్ లాగే ఇచ్చిన మాటకు కట్టుబడటం వైఎస్ జగన్మోహన్రెడ్డి నైజమన్నారు. అందువల్లే వైఎస్సార్సీపీ తెలంగాణకోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించారని, పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అభివృద్ధికోసం కృషి చేస్తామన్నారు. అందువల్ల ఓటర్లంతా ఫ్యాన్‌గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుధాకర్‌గౌడ్, పరుశురాంరెడ్డి, కిరణ్‌కుమార్, కార్తీక్, రామాయంపేట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ మాసుల సిద్దరాంలు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం పార్టీ అభివృద్ధికోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రమాదవశాత్తు మృతి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ప్రభుగౌడ్ అన్నారు. ఇటీవల ప్రమాదాల్లో మృతి చెందిన వైఎస్సార్ సీపీ జిల్లా సాంసృ్కతిక విభాగం కన్వీనర్ నింగరబోయిన మహేష్, గొల్పర్థి గ్రామానికి చెందిన నడీల రాజయ్యల కుటుంబీకులను గురువారం ఆయన పరామర్శించారు. ఢి.ధర్మారం గ్రామానికి చెందిన నింగరబోయిన మహేష్ గత 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, గొల్పర్థి గ్రామానికి చెందిన న డీల రాజయ్య విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. దీంతో గురువారం మృతుల కుటుంబీకులను పరామర్శించిన ప్రభుగౌడ్, పార్టీ అధ్యక్షునితో మాట్లాడి తప్పకుండా ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. రుద్రారంలో ఇంటింటి ప్రచారం మిరుదొడ్డి: జిల్లాలో ఎక్కడకు వెళ్లినా వైఎస్సార్సీపీకి అపూర్వ ఆదరణ లభిస్తోందని వైఎస్సార్ సీపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ప్రభుగౌడ్ అన్నారు. గురువారం మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో దుబ్బాక నియోజక వర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గుప్తతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు రుద్రారం గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ, వైఎస్సార్‌ను అభిమానించే వారంతా వైఎస్సార్సీపీని ఆదరిస్తున్నారనీ, వారి ఆదరాభీమానాలతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతోందన్నారు. అనంతరం రోడ్డుప్రమాదంలో మృత్యువాతపడిన వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి శోభానాగిరెడ్డి ఆత్మ శాంతించాలని నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు హరి శంకర్, సురేష్, రఘుపతి, నర్సింలు, మహేష్, రాజేశం, జమీర్ పాల్గొన్నారు. -
శోభానాగిరెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ స్పష్టం చేశారు. శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు సిద్దిపేటలో ప్రచార పర్వం ముగించారు. అనంతరం స్థానికంగా పార్టీ కార్యకర్తల అధ్వర్యంలో శోభానాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధి శోభానాగిరెడ్డి చేసిన కృషి అభినందనీయమన్నారు. వైఎస్ జగన్ కుటుంబానికి క్లిష్ట సమయంలో శోభానాగిరెడ్డి అండగా నిలిచిరాన్నారు. ఆమె మరణం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆమె మృతిని పార్టీ నాయకులు జీర్ణించుకొలేకపొతున్నారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అకాంక్షించారు. కార్యక్రమంలో సిద్దిపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి తడ్క జగదీశ్వర్‌తో పాటు జిల్లా నాయకులు సుధాకర్‌గౌడ్, కార్తీక్, పర్శరాంరెడ్డి, మల్లేశం, ఇమ్రాన్, శ్రీనివాస్‌రెడ్డి, దుర్గాప్రసాద్, అఖిల్, అల్తాప్, రాజశేఖర్, విజయ్, నారాయణ, ప్రవీణ్ పాల్గొన్నారు. మృతికి సంతాపం సంగారెడ్డి అర్బన్ : వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకురాలు శోభానాగిరెడ్డి అకాల మరణం పట్ల పార్టీ ముఖ్య నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ శోభానాగిరెడ్డి మరణంతో సమర్ధురాలైన మహిళా నాయకురాలిని పార్టీ కోల్పోయిందన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జహీరాబాద్, మెదక్ పార్లమెంట్, శాసనసభ అభ్యర్థుల తరఫున తాము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌రావు, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మహమూద్ మొహియోద్దీన్, నారాయణ్ఖే డ్ శాసన సభ అభ్యర్థి అప్పారావు షెట్కార్, సంగారెడ్డి శాసన సభ అభ్యర్థి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా యువజన నాయకులు శివశంకర్‌పాటిల్, జగదీశ్, డాక్టర్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ముందు తరాలకు ఆదర్శం పూలే జీవితం
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పట్టణంలోని కొత్తబస్టాండ్ వద్దగల ఆయన విగ్రహానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ పూలే కుల నిర్మూలన కోసం పోరాటం చేసిన మహనీయుడన్నారు. ఆయన జీవితం ముందు తరాలకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, శివశంకర్‌పాటిల్, సుధాకర్‌గౌడ్, హరిక్రిష్ణగౌడ్, భాస్కర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పూలే సేవలు చిరస్మరణీయం సంగారెడ్డి మున్సిపాలిటీ: జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని ,ఆయన కృషి ఫలితంగానే మహిళలు నేడు విద్యారంగంలో రాణిస్తున్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు పలు దళితసంఘాల నేతలు కొనియాడారు. గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిరావుపూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, నేటి యువత పూలే బాటలో పయనించి మంచి పేరు తేవాలని సూచించారు. అనేక పాఠశాలలను నెలకొల్పిన పూలే ఉన్నతవిద్య కోసం ఎనలేని కృషి చేశారన్నారు. పూలే జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని కొత్తబస్టాండ్ ఎదుట ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సామాజిక సేవా సంఘం జిల్లా అధ్యక్షడు వెంకట్ మాట్లాడుతూ సమాజంలో చదువు ద్వారానే విజ్ఞానం వస్తుందని, ఫలితంగా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని భావించారన్నారు. అందుకోసం ఆయన మహిళలకు అక్షర జ్ఞానం కల్పించాలని సంకల్పించారన్నారు. దీంతో అతి చిన్న వయస్సులోనే తన సతీమణితో ఉచిత అక్షరాభ్యాస కేంద్రాలను ప్రారంభించారన్నారు. మహారాష్ట్రలో ప్రతి గ్రామంలో అక్షరాభ్యాస కేంద్రాలను ప్రారంభించి మహిళలను అక్షరాస్యులుగా చేయడంలో పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన చేసిన కృషి వల్లనే ప్రభుత్వ రంగంలో మహిళలు ఉద్యోగులుగా లభిస్తు న్నాయన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అక్షరాభ్యాసం అవసరమని అది లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో నాయకలు రవి, ప్రభాకర్, సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దళితులు విద్యావంతులు కావాలి బహుజన వేదిక ఆధ్వర్యంలో పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మెదక్ ఎంపీ అభ్యర్థి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ భారత సామాజిక వ్యవస్థలో కుల వ్యవస్థను ధ్వంసం చేసేందుకు నిర్మాణాత్మక పోరాటం చేసింది జ్యోతిరావు పూలే అన్నారు. తొలి మహిళా విశ్వవిద్యాలయ స్థాపకుడు విలియం కార్వే పుట్టకముందే పూలే భార్య సావిత్రి బాయిని తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దింది జ్యోతిరావుపూలే అన్నారు. భర్తకు తోడుగా సామాజిక ఉద్యమంలో సావిత్రాబాయి ప్రత్యేక్షంగా పాల్గొని ఆదర్శ దంపతుల్లా కీర్తించబడ్డారన్నారు. కుల వ్యవస్థ పూర్తిగా అంతం కావాలంటే దళితులు పూర్తి స్థాయిలో విద్యావంతులు కావాలన్నారు. -
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 6, 11వ తేదీల్లో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ ఓటర్లను కోరారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు రాజన్న పథకాలు చేరాయని వివరించారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలు లక్షలాది మందికి మేలు చేశాయన్నారు. రైతు ఆత్మహత్యలు పూర్తిస్థాయిలో తగ్గడానికి రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలే కారణమన్నారు. మహానేత పథకాలను యథాతథంగా ప్రజలకు మరోసారి అందించేందుకు వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందన్నారు. తమ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలు కోరారు. కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అందోల్ మండలం నేరేడుగుంట ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి మొగులయ్యను కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ప్రచారం చేయకుండా అడ్డుకోవడం, లేనిపోని కేసులు పెడతామని బె దిరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటుకోవాలని కానీ ఇలా అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలిచి పోరాడే వారికి ఓటర్లు పట్టం కడతారని ప్రభుగౌడ్ స్పష్టం చేశారు. అరాచకాలకు పాల్పడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఎంఆర్ఓ ఎల్లయ్య, యువజన సంఘం నాయకులు శివశంకర్ పాటిల్, అశోక్‌గౌడ్, జగదీష్, సురేష్, సుశాంత్, అంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ
జహీరాబాద్, న్యూస్‌లైన్: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజకు ప్రజాదరణ పెరుగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ అన్నారు. బుధవారం జహీరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీలో చేరేందుకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రతి కుటుంబం ప్రస్తుతం ఆయన తనయుడు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి వైపు చూస్తుందన్నారు. జగన్ సీఎం అయితేనే రాజన్న పథకాలు అందరికీ అందుతాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా తెలంగాణలోనూ పార్టీ ఉంటుందన్నారు. ఈ విషయంలో కొందరు కావాలని దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎ స్సార్సీపీ అభ్యర్థులు సత్తాచాటుతారని ధీమా వ్యక్తంచేశారు. జహీరాబాద్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ప్రజలు స్థానిక అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్.ఉజ్వల్‌రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ పార్టీ ఇన్చార్జి ఎస్.నారాయణరెడ్డి, పార్టీ నాయకులు కలిమొద్దీన్, ముర్తుజా, జగన్, అత్తార్, సమి, ముబీన్, మోహన్‌రెడ్డి, సతీష్, జైపాల్‌రెడ్డి, ప్రవీణ్, సంజీవరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఎన్నికల్లో సత్తాచాటుతాం రామచంద్రాపురం: ఎన్నికల్లో వైఎస్సార్సీపీ స త్తా చాటుతామని ఆ పార్టీ బీసీ విభాగం హైదరాబాద్, ఖమ్మం జిల్లాల ఇన్చార్జ్ సతీష్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం విలేకరులతో ఆయ న మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో వైఎ స్సార్‌సీపీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. దివంగతనేత వైఎస్సార్ చేసిన అభివృద్ది కార్యక్రమాలను గడపగడపకు వెళ్లి వివరిస్తామన్నారు. పేదల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రధానంగా ప్రతి గ్రామంలో అర్హులైన పేదలందరికి పెన్షన్లు ఇచ్చారని తెలిపారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎందరికో ప్రాణా లు పోసిందన్నారు. నేడు వైఎస్ ప్రజల మధ్య లేకున్నా పేదల గుండెల్లో కొలువై ఉన్నారని కొనియాడారు. అలాంటి మహనీయుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సొంత లాభాలే తప్ప ప్రజా సం క్షేమం పట్టించుకోలేదని విమర్శించారు. కాం గ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని ప్రజల కు పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ బలం ఉందన్నారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్ అభిమానులు ఉన్నారని తెలిపారు. వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.