తూప్రాన్: మాసాయిపేట బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అండగా నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ తెలిపారు. అందులో భాగంగానే పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ తెలంగాణ కన్వీనర్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు జనక్ ప్రసాద్, నల్లా సూర్యప్రకాశ్‌రావు, గట్టు రాంచంద్రరావు తదితరులు మాసాయిపేట దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను మంగళవారం పరామర్శించి ఆర్థిక సాయం అందించనున్నారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ, పార్టీ నేతలు తొలుత రైలు ప్రమాదం జరిగిన మాసాయిపేట గ్రామానికి చేరుకుని ఉదయం 9.30 గంటలకు చిన్నారుల ఆత్మశాంతికి శ్రద్ధాంజలి ఘటించనున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించి మృతుల కుటుంబీకులను పరామర్శించి ఆర్థికసాయం అందించనున్నట్లు వివరించారు. అలాగే రైల్వే అధికారులు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేంతవరకు తమ పార్టీ తరపున ఉద్యమిస్తామన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రైలు ప్రమాద బాధితులకు వైఎస్సార్‌సీపీ సాయం
Published Tue, Jul 29 2014 12:08 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement