జహీరాబాద్, న్యూస్‌లైన్: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజకు ప్రజాదరణ పెరుగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ అన్నారు. బుధవారం జహీరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రతి కుటుంబం ప్రస్తుతం ఆయన తనయుడు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వైపు చూస్తుందన్నారు.
జగన్ సీఎం అయితేనే రాజన్న పథకాలు అందరికీ అందుతాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా తెలంగాణలోనూ పార్టీ ఉంటుందన్నారు. ఈ విషయంలో కొందరు కావాలని దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎ స్సార్‌సీపీ అభ్యర్థులు సత్తాచాటుతారని ధీమా వ్యక్తంచేశారు. జహీరాబాద్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ప్రజలు స్థానిక అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్.ఉజ్వల్‌రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ పార్టీ ఇన్‌చార్జి ఎస్.నారాయణరెడ్డి, పార్టీ నాయకులు కలిమొద్దీన్, ముర్తుజా, జగన్, అత్తార్, సమి, ముబీన్, మోహన్‌రెడ్డి, సతీష్, జైపాల్‌రెడ్డి, ప్రవీణ్, సంజీవరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
ఎన్నికల్లో సత్తాచాటుతాం
రామచంద్రాపురం: ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ స త్తా చాటుతామని ఆ పార్టీ బీసీ విభాగం హైదరాబాద్, ఖమ్మం జిల్లాల ఇన్‌చార్జ్ సతీష్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం విలేకరులతో ఆయ న మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గంలో వైఎ స్సార్‌సీపీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. దివంగతనేత వైఎస్సార్ చేసిన అభివృద్ది కార్యక్రమాలను గడపగడపకు వెళ్లి వివరిస్తామన్నారు. పేదల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రధానంగా ప్రతి గ్రామంలో అర్హులైన పేదలందరికి పెన్షన్లు ఇచ్చారని తెలిపారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎందరికో ప్రాణా లు పోసిందన్నారు.
నేడు వైఎస్ ప్రజల మధ్య లేకున్నా పేదల గుండెల్లో కొలువై ఉన్నారని కొనియాడారు. అలాంటి మహనీయుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సొంత లాభాలే తప్ప ప్రజా సం క్షేమం పట్టించుకోలేదని విమర్శించారు. కాం గ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని ప్రజల కు పిలుపునిచ్చారు.
తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ బలం ఉందన్నారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్ అభిమానులు ఉన్నారని తెలిపారు. వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ
Published Thu, Mar 27 2014 12:36 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement