రామాయంపేట,న్యూస్‌లైన్: మహానేత వైఎస్సార్ ఆశయ సాధనకోసం స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్‌సీపీ మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రభుగౌడ్ అన్నారు. గురువారం ఆయన రామాయంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్పర్థి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ దక్కాయన్నారు. ఆ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు.
ప్రతి రైతును లక్షాధికారి చేయాలనే లక్ష్యంతోనే రాజశేఖర్‌రెడ్డి పాలన సాగించారన్నారు. వైఎస్సార్ లాగే ఇచ్చిన మాటకు కట్టుబడటం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నైజమన్నారు. అందువల్లే వైఎస్సార్‌సీపీ తెలంగాణకోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించారని, పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అభివృద్ధికోసం కృషి చేస్తామన్నారు. అందువల్ల ఓటర్లంతా ఫ్యాన్‌గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుధాకర్‌గౌడ్, పరుశురాంరెడ్డి, కిరణ్‌కుమార్, కార్తీక్, రామాయంపేట మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ మాసుల సిద్దరాంలు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
పార్టీ అభివృద్ధికోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ప్రమాదవశాత్తు మృతి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ప్రభుగౌడ్ అన్నారు. ఇటీవల ప్రమాదాల్లో మృతి చెందిన వైఎస్సార్ సీపీ జిల్లా సాంసృ్కతిక విభాగం కన్వీనర్ నింగరబోయిన మహేష్, గొల్పర్థి గ్రామానికి చెందిన నడీల రాజయ్యల కుటుంబీకులను గురువారం ఆయన పరామర్శించారు. ఢి.ధర్మారం గ్రామానికి చెందిన నింగరబోయిన మహేష్ గత 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, గొల్పర్థి గ్రామానికి చెందిన న డీల రాజయ్య విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. దీంతో గురువారం మృతుల కుటుంబీకులను పరామర్శించిన ప్రభుగౌడ్, పార్టీ అధ్యక్షునితో మాట్లాడి తప్పకుండా ఆర్థికంగా ఆదుకుంటామన్నారు.
రుద్రారంలో ఇంటింటి ప్రచారం
మిరుదొడ్డి: జిల్లాలో ఎక్కడకు వెళ్లినా వైఎస్సార్‌సీపీకి అపూర్వ ఆదరణ లభిస్తోందని వైఎస్సార్ సీపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ప్రభుగౌడ్ అన్నారు. గురువారం మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో దుబ్బాక నియోజక వర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గుప్తతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు రుద్రారం గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు.
ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ, వైఎస్సార్‌ను అభిమానించే వారంతా వైఎస్సార్‌సీపీని ఆదరిస్తున్నారనీ, వారి ఆదరాభీమానాలతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతోందన్నారు. అనంతరం రోడ్డుప్రమాదంలో మృత్యువాతపడిన వైఎస్సార్‌సీపీ అధికారప్రతినిధి శోభానాగిరెడ్డి ఆత్మ శాంతించాలని నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు హరి శంకర్, సురేష్, రఘుపతి, నర్సింలు, మహేష్, రాజేశం, జమీర్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీతోనే తెలంగాణ అభివృద్ధి
Published Thu, Apr 24 2014 11:53 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement