సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం కావడం ఖాయమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో జగన్ సీఎం కావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ జగన్ సీమాంధ్ర ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ని ప్రార్థించానన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ హయాంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందేవన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు నిర్వీర్యం చేశారన్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అభివృద్ధికోసం కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సుధాకర్, వైద్యనాథ్, వెంకటరమణ, జగదీశ్, పరుశురామ్‌రెడ్డి పాల్గొన్నారు.
పటాన్‌చెరు టౌన్: వైఎస్ హయాంలోనే అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం, జగన్ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన పటాన్‌చెరులో విలేకరులతో మాట్లాడుతూ 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నందున అభ్యర్థులు ఏజెంట్లను కౌటింగ్ కేంద్రాలకు పంపించాలని సూచించారు. కాంగ్రెస్ , టీడీపీ, పార్టీలు ప్రజాసంక్షేమం పట్టించుకోలేదన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలు మరిచిపోలేదన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడు రైతులకు మేలు చేయలేదని ,ఇప్పుడు ఆయన అన్నీ ఉచితంగా ఇస్తానంటున్నాడన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుధాకర్, జగదీష్, హరికృష్ణగౌడ్, పరుషరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్ ఆంధ్రా సీఎం కావడం ఖాయం
Published Thu, May 15 2014 12:02 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement