సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ స్పష్టం చేశారు. శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు సిద్దిపేటలో ప్రచార పర్వం ముగించారు. అనంతరం స్థానికంగా పార్టీ కార్యకర్తల అధ్వర్యంలో శోభానాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు.
ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధి శోభానాగిరెడ్డి చేసిన కృషి అభినందనీయమన్నారు. వైఎస్ జగన్ కుటుంబానికి క్లిష్ట సమయంలో శోభానాగిరెడ్డి అండగా నిలిచిరాన్నారు. ఆమె మరణం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆమె మృతిని పార్టీ నాయకులు జీర్ణించుకొలేకపొతున్నారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అకాంక్షించారు. కార్యక్రమంలో సిద్దిపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తడ్క జగదీశ్వర్‌తో పాటు జిల్లా నాయకులు సుధాకర్‌గౌడ్, కార్తీక్, పర్శరాంరెడ్డి, మల్లేశం, ఇమ్రాన్, శ్రీనివాస్‌రెడ్డి, దుర్గాప్రసాద్, అఖిల్, అల్తాప్, రాజశేఖర్, విజయ్, నారాయణ, ప్రవీణ్ పాల్గొన్నారు.
మృతికి సంతాపం
సంగారెడ్డి అర్బన్ : వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకురాలు శోభానాగిరెడ్డి అకాల మరణం పట్ల పార్టీ ముఖ్య నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ శోభానాగిరెడ్డి మరణంతో సమర్ధురాలైన మహిళా నాయకురాలిని పార్టీ కోల్పోయిందన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జహీరాబాద్, మెదక్ పార్లమెంట్, శాసనసభ అభ్యర్థుల తరఫున తాము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌రావు, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మహమూద్ మొహియోద్దీన్, నారాయణ్‌ఖే డ్ శాసన సభ అభ్యర్థి అప్పారావు షెట్కార్, సంగారెడ్డి శాసన సభ అభ్యర్థి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా యువజన నాయకులు శివశంకర్‌పాటిల్, జగదీశ్, డాక్టర్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
శోభానాగిరెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు
Published Thu, Apr 24 2014 11:46 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement