
సిద్ధిపేట, సాక్షి: రాజీవ్ జాతీయ రహదారిపై సోమవారం ఊహాకందని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొడుతూ ఎగిరిపడి ప్రమాదానికి గురైంది. అయితే.. ఆ సమయంలో ఈ కారు మరో కారును ఢీ కొట్టిది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం..
హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న కారు-కరీంనగర్ నుండి హైదరాబాద్ వస్తున్న కారు పరస్పరం తిమ్మారెడ్డి పల్లి ప్రమాదానికి గురయ్యాయి. రెండింటిలో ఓ కారు అదుపు తప్పి అదుపుతప్పి డివైడర్ మీదుగా పల్టీలు కొడుతూ వెళ్లింది. ఆ సమయంలో అవతలి రోడ్డులో కరీంనగర్ వైపు వెళ్తున్న కారుకు తగలడంతో.. రెండు ఒకదాని మీద ఒకటి పడి దొర్లాయి. ఆ తర్వాత రెండోకారు రోడ్డు కిందకు దిగిపోయి చెట్టును బలంగా ఢీ కొట్టింది.
సమాచారం అందుకున్న కొండపాక 108 సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితులను సిద్ధిపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.
క్షతగాత్రుల్ని కరీంనగర్ డెయిరీ అడ్వైజర్ హన్మంతరెడ్డి (48), మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డ్రైవర్ శోభన్(36) గుర్తించారు. వీళ్లద్దరి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలోనే శోభన్ (44), ప్రశాంత్ (34)లు సైతం తీవ్రంగానే గాయపడినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment