rajiv highway
-
సిద్ధిపేట: రాజీవ్ రహదారిపై ఊహకందని ప్రమాదం
సిద్ధిపేట, సాక్షి: రాజీవ్ జాతీయ రహదారిపై సోమవారం ఊహాకందని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొడుతూ ఎగిరిపడి ప్రమాదానికి గురైంది. అయితే.. ఆ సమయంలో ఈ కారు మరో కారును ఢీ కొట్టిది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.. హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న కారు-కరీంనగర్ నుండి హైదరాబాద్ వస్తున్న కారు పరస్పరం తిమ్మారెడ్డి పల్లి ప్రమాదానికి గురయ్యాయి. రెండింటిలో ఓ కారు అదుపు తప్పి అదుపుతప్పి డివైడర్ మీదుగా పల్టీలు కొడుతూ వెళ్లింది. ఆ సమయంలో అవతలి రోడ్డులో కరీంనగర్ వైపు వెళ్తున్న కారుకు తగలడంతో.. రెండు ఒకదాని మీద ఒకటి పడి దొర్లాయి. ఆ తర్వాత రెండోకారు రోడ్డు కిందకు దిగిపోయి చెట్టును బలంగా ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న కొండపాక 108 సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితులను సిద్ధిపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రుల్ని కరీంనగర్ డెయిరీ అడ్వైజర్ హన్మంతరెడ్డి (48), మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డ్రైవర్ శోభన్(36) గుర్తించారు. వీళ్లద్దరి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలోనే శోభన్ (44), ప్రశాంత్ (34)లు సైతం తీవ్రంగానే గాయపడినట్లు సమాచారం. -
పెళ్లికి వెళ్లి అనంత లోకాలకు..
కొండపాక(గజ్వేల్): రాజీవ్ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. ఓ ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టడంతో బావామరదలు అక్కడికక్కడే మృతి చెందారు. మరదలు చెయ్యి తెగిపోయి సుమారు 20 గజాల దూరంలో పడిపోయింది. ఆదివా రం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు... కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కూతురు రవళి వివాహం కుకునూరుపల్లిలోని కోల ఆంజనేయులు ఫంక్షన్‌హాల్ జరిగింది. దుబ్బాక మండలంలోని రఘోత్తంపల్లికి చెందిన రెడ్డి వెంకట్‌రెడ్డి (35), వెంకట్‌రెడ్డి మేనమరదలు, తొగుట మండలం వేముల గట్టు గ్రామానికి చెందిన శేరిపల్లి సౌమ్య(12), దుబ్బాక మండలంలోని బొప్పాపూర్‌కు చెందిన వెంకట్‌రెడ్డి చెల్లెలు కవిత (28), ఆమె కూతురు శ్రీవిద్య(6)లు ద్విచక్ర వాహనంపై ఈ పెళ్లికి వచ్చారు. కాగా ఎండ వేడిమికి తట్టుకోలేక వారు స్థానిక వైద్యుని వద్దకు వచ్చి మందులు తీసుకుని మళ్ళీ ఫంక్షన్ హాల్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో కుకునూరుపల్లి పోలీస్టేషన్ ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని యూటర్న్ చేస్తుండగా సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపునకు వెళుతున్న బొలేరో వాహనం అతి వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో వెంకట్‌రెడ్డి, శేరిపల్లి సౌమ్య అక్కడికక్కడే మృతి చెందారు. కవిత, శ్రీవిద్యలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన కవిత, శ్రీవిద్యలను హైదరాబాద్‌కు తరలించారు. బొలేరో వాహనం ఢీకొట్టడంతో సౌమ్య కుడి చెయ్యి తెగిపోయి సుమారు 20 గజాల దూరంలో పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఫంక్షన్ హాల్లోని బంధువులు, కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో సుమారు అరగంటపాటు రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ జామ్ అవడం తో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సౌమ్య తండ్రి హన్మంతరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. ఈ సంఘటనతో వెంకట్‌రెడ్డి స్వగ్రామం రఘోత్తంపల్లి, సౌమ్య స్వగ్రామం వేముల గట్టులో విషాదచాయలు అలుముకున్నాయి. సౌమ్య 8వ తరగతి చదువుతోందని, వెంకట్‌రెడ్డికి నెల పదిహేను రోజుల కిందట పాప జన్మించిందని బంధువులు తెలిపారు. -
రాజీవ్ రహదారిపై లారీ బీభత్సం
కోల్‌సిటీ: కరీంనగర్ జిల్లా గోదావరిఖని సమీపంలో రాజీవ్ రహదారిపై ఓ లారీ శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. ఐరన్‌లోడ్‌తో చంద్రాపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ గోదావరిఖని సమీపంలో చక్రం ఊడిపోవడంతో అదుపుతప్పింది. దీంతో డివైడర్‌ను ఢీకొని పక్కనే ఉన్న సర్వీసు రోడ్డు లోకి దూసుకెళ్లింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం, అయితే ఆ సయయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
రాజీవ్ రహదారి మరో 100 కి.మీ.
♦ సిర్పూర్ మీదుగా మహారాష్ట్ర వరకు నాలుగువరుసల నిర్మాణం ♦ రోడ్లు, భవనాల శాఖ {పతిపాదనకు ప్రభుత్వం ఆమోదం ♦ దాదాపు రూ.వేయి కోట్ల వ్యయం! సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారిని మరో వంద కిలోమీటర్లు నాలుగు వరుసలుగా నిర్మించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణానికి రూ.వేయి కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. దీని నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి మహరాష్ట్ర సరిహద్దు వరకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలు సాగించడానికి వీలు కలుగుతుంది. ఆసిఫాబాద్, సిర్పూర్, మంచి ర్యాల ప్రాంతాల్లో సింగరేణి బొగ్గు గనులతోపాటు వివిధ రకాల పరిశ్రమలు, పేపర్ మిల్స్ ఉండడంతో ఈ రోడ్డు బీఓటీ కింద నిర్మాణం సాధ్యమని నిర్ణయానికి వచ్చిన రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. టోల్గేట్ల ద్వారా నిర్మాణ సంస్థలు ఆదాయం పొందుతాయి. వంద కిలోమీటర్ల విస్తరణ... ప్రస్తుతం రాజీవ్ రహదారి హైదరాబాద్ నుంచి రామగుండం వరకు విస్తరించి ఉంది. ఇందులో మంచిర్యాల దాటిన తర్వాత ఇందారం వరకు మాత్రమే నాలుగు వరుసలుగా ఉంది. ఆ తరువాత నిజామాబాద్-జగ్దల్పూర్ జాతీయ రహదారి కలుస్తుంది. దాన్ని దాటుకుని అటు ఆసిఫాబాద్, ఇటు సిర్పూర్ వరకు సరైన రోడ్డు వ్యవస్థ లేదు. ఇది బొగ్గు గనులు, పరిశ్రమలతో ఉన్న ప్రాంతం కావడంతో ఆ రోడ్డును విస్తరించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. అక్కడి నుంచి అటు మహారాష్ట్రకు ఎగుమతులు, దిగుమతులు ఉంటుండడంతో భారీ ట్రాక్కుల రాకపోకలూ జరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లు భవనాల శాఖ తాజాగా సర్వే నిర్వహించి బీఓటీ కింద రోడ్డును విస్తరించేందుకు వెసులుబాటు ఉందని గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది. టోల్‌ప్లాజాల రూపంలో వచ్చే ఆదాయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నిర్మాణ సంస్థలు అంతగా ఉత్సాహం చూపడం లేదు. కానీ పరిశ్రమలు, బొగ్గు గనులున్నందున ఈ మార్గంలో ఆదాయం బాగానే ఉంటుందని రోడ్లు భవనాల శాఖ నిర్ధారణకు వచ్చింది. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఇప్పటికే నిర్మాణమైన రాజీవ్ రహదారిలో ఉన్న లోపాలను సరి దిద్దేందుకు పం పిన ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా, ఇందుకోసం అవసరమైన భూసేకరణ సంబంధించి ప్రతిపాదనకు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. -
నిద్రిస్తున్న వ్యక్తి పైనుంచి వెళ్లిన లారీ
నుజ్జునుజ్జయిన ఆటో డ్రైవర్ శరీరం తిమ్మాపూర్ : నిద్రిస్తున్న ఆటోడ్రైవర్ పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అల్గునూరు పరిధిలోని రాజీవ్ రహదారి పక్కనే ఉన్న భారత్ పెట్రోల్‌బంక్‌లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా మద్దూరు మండలం డోర్నాల తండకు చెందిన గుగులోతు బోజు(32) కరీంనగర్‌లోని కాశ్మీర్‌గడ్డ వద్ద ఉంటూ ఆటో నడిపి జీవిస్తున్నాడు. భార్య స్వప్న కాశ్మీర్‌గడ్డ మార్కెట్లో కూరగాయలు అమ్ముతోంది. బోజు మంగళవారం రాత్రి పెట్రోల్‌బంక్‌లో ఆటోను నిలిపి పక్కనే కింద నిద్రిస్తున్నాడు. అదే బంక్‌లో ముందుగా పార్కింగ్ చేసినున్న లారీని డ్రైవర్ వెనక్కి తీస్తుండగా బోజుపై నుంచి వెళ్లింది. బంక్ సిబ్బంది అంతా నిద్రలో ఉండడంతో లారీ ఆపకుండా వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం చూసేసరికి ఆటో డ్రైవర్ బోజు శరీరం నుజ్జునుజ్జయి ఉంది. సమాచారం అందించడంతో హెడ్‌కానిస్టేబుల్ బాపు, పోలీసులు మురళి, వినోద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆటో అడ్డాల నుంచి వచ్చిన డ్రైవర్లు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. -
వాహన తనిఖీలలో రూ.20 లక్షలు స్వాధీనం
మెదక్ (ములుగు): ఆధారాలు లేకుండా కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి రాజీవ్ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనలో సిద్దిపేటకు చెందిన వాసి సత్యం అనే వ్యక్తి నుంచి రూ.20లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఇన్‌కం టాక్స్ అధికారులకు అప్పగిస్తామని ఓఎస్డీ జ్యోతి ప్రకాశ్ తెలిపారు. -
నిబంధనలు గాలికి!
సిద్దిపేట రూరల్ : జిల్లాలోనే అన్ని రంగాల్లో సిద్దిపేట ముం దుకెళుతోంది. గత కొన్నేళ్లుగా రాజీవ్ రహదారిపై పట్టణ శివారులో ఉన్న దాబా హోటళ్లు మద్యం సిట్టింగ్ కేంద్రాలుగా ఉండేవి. జిల్లా ఎస్పీ సుమతి రాకతో సిద్దిపేట డివిజన్ వ్యాప్తం గా దాబాలు గత వారం రోజులుగా వెలవెలబోతున్నాయి. దాబాల్లో మద్యం సిట్టింగ్ లేకపోవడంతో మద్యం బాబులు పర్మిట్ రూంలను ఆశ్రయిస్తున్నారు. దీంతో పర్మిట్ రూంల నిర్వాహకులు ఇష్ఠారీతిలో డబ్బులను దండుకుంటున్నారు. సిద్దిపేట కేంద్రంగా కరీంనగర్, హైదరాబాద్‌ల వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలు ఇక్కడ నిలుపుతుంటారు. దాబా హోటళ్లలో భోజనంతో పాటు రహస్యంగా మద్యం అంది స్తున్నారు. ఇటీవల సుమతి ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడంతో ముందు జాగ్రత్తగా స్థానిక పోలీసులు దాబాల్లో మద్యం సిట్టింగ్‌లను నిలిపివేయించారు. దీంతో మద్యం బాబులంతా వైన్స్‌ల పక్కనే ఉండే పర్మిట్ రూంలలోకి వెళ్తున్నారు. పర్మిట్ రూంను నిబంధనల మేరకు నడిపించాల్సి ఉన్నప్పటికి మద్యం బాబులు ఎక్కువగా రావడంతో నిర్వాహకులకు కిక్కు ఉండడంతో నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ఇష్టారీతిగా పర్మిట్ రూంను పెంచేసుకుంటూ మందుబాబులకు కావాల్సిన తిండిని సమకూరుస్తూ వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలు పాటించని పర్మిట్ రూంల్లో అధికారులు ఎలాంటి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. దాబాలను కట్టడి చేసిన మాదిరిగానే పర్మిట్ రూంల్లో నిబంధనలు పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఎస్పీ స్పందించి పర్మిట్ రూంలను నిబంధనల మేరకు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
రాజీవ్ రహదారికి రూ. 750 కోట్లు
తెలంగాణలో మూడుచోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ రహదారిపై సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం 750 కోట్ల రూపాయలతో ఈ రహదారిని పునరుద్ధరించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. సిద్దిపేట, షామీర్ పేట, ఎల్కతుర్తి ప్రాంతాల్లో ఫై ఓవర్లు నిర్మించడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు.