క్షతగాత్రులను తన కారులో ఆస్పత్రికి పంపిస్తున్న మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్/సిద్ధిపేట: సిద్దిపేట పట్టణ శివారులోని రాజీవ్ రహదారి రంగీలా దాబా చౌరస్తా వద్ద మంగళవారం కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్ తన కాన్వాయ్‌ను నిలిపి కాన్వాయ్‌లోని ఓ వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తన వ్యక్తిగత సిబ్బందిని తోడుగా ఆసుపత్రికి పంపించారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. కారులో ఇరుక్కున్న డ్రైవర్‌ను సిద్దిపేట టూటౌన్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
చదవండి: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన రౌడీమూకలు.. టీస్టాల్‌పై వీరంగం
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన చిలివేరి భాస్కర్ తన భార్య తిరుమల, కూతురు మౌనిక, అల్లుడు అమర్షు, అత్తమ్మ రాజమ్మలతో కలిసి కారులో కరీంనగర్‌లోని బంధువుల ఇంటిలో జరిగే వివాహానికి హాజరయ్యాడు. తిరిగి వీరు హైదరాబాద్ వస్తున్న క్రమంలో సిద్దిపేట శివారు రంగీలా దాబా చౌరస్తా రాజీవ్ రహదారిపై ఎడమ వైపు ఉన్న సూచిక బోర్డు, డివైడర్‌ను నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ ఢీ కొట్టాడు. దీంతో డ్రైవర్ భాస్కర్, రాజమ్మ, తిరుమల, అమర్‡్ష, మౌనిక గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
చదవండి: తోలు తీసి.. నదిని దాటేసి.. ఏ కాలం నుంచి మొదలు?
Comments
Please login to add a commentAdd a comment