amma vodi
-
సూపర్ సిక్స్ కాదిది.. సూపర్ మోసం: అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి: పిల్లలను బడులకు పంపించడానికి పేదరికం అడ్డు కాకూడదని, బడి ఈడు పిల్లలు పనులకు పోకూడదన్న మంచి సంకల్పంతో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తూ తల్లిదండ్రులను మోసగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చదువుకునే పిల్లలున్న తల్లులకు ఏటా రూ.15 వేలు ఇవ్వడం ద్వారా పేదరికంలో ఉన్న వాళ్లకు వైఎస్ జగన్ మేలు చేశారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయనటువంటి వినూత్న ఆలోచనను చేసిన నేత ఒక్క జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఒక్క పథకానికే ఏకంగా రూ.26 వేల కోట్లు తల్లుల ఖాతాల్లోకి జమ చేశారన్నారు. ఐదేళ్ల తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని తెలుగుదేశం కూటమి కాపీ కొట్టడమేకాక, మాట నిలుపుకోలేదని ధ్వజమెత్తారు. ‘ఇంటిలో ఎంత మంది చదువుకున్నా జగన్ ఒక్కరికే రూ.15 వేలు ఇస్తున్నారు. మమ్నల్ని అధికారంలోకి తీసుకొస్తే ఒకరైతే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు అందజేస్తామని ప్రకటిస్తే ప్రజలు ఆకర్షితులై ఓట్లేసి గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబునాయుడికి ఉందా? లేదా?’ అని నిలదీశారు. ఇదే విషయాన్ని ప్రతి బహిరంగ సభలో కూడా చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌తో పాటు కూటమి నేతలంతా ప్రచారం చేశారని చెప్పారు. వారి ప్రచారానికి సంబంధించిన వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. తల్లికి వందనం కాదు.. మోసం తల్లికి వందనం పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని చదివితే చాలా అనుమానాలు కలుగుతున్నాయని అంబటి అన్నారు. ఈ జీవో ప్రకారం ప్రతి ఏడాది తల్లికి వందనం కింద రూ.15 వేలు అందిస్తామని ఉందని చెప్పారు. ఎంత మంది పిల్లలను స్కూల్‌కి పంపినా రూ.15 వేలు మాత్రమే ఇస్తామని దాని అర్థం అన్నారు. ఇది సూపర్ సిక్స్ కాదని.. సూపర్ మోసమని అభివరి్ణంచారు. ఇది తల్లికి వందనం కాదని.. తల్లికి మోసమని నిప్పులు చెరిగారు. ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్ అయితే, ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు అని చెప్పారు. బాబు మోసంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారు? జగన్ వద్దని, చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులు, కుటుంబాలు తాము ఎంత దారుణమైన మోసాలు చేసే వ్యక్తికి ఓట్లేశామో గుర్తించాలని అంబటి సూచించారు. ఇదే జగన్ ఉన్నట్లయితే జూన్ ఆఖరుకు ప్రతి తల్లి ఖాతాలో అమ్మఒడి జమ అయి ఉండేదని, ఇవాళ జూలై వచ్చినా ఆ డబ్బులు రాలేదన్నారు. ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను మార్చి ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున డబ్బులు ఇచ్చి తీరాల్సిందేనన్నారు. వాగ్దానాలు నెరవేర్చకపోతే వైఎస్సార్సీపీ మీ వెంట పడుతుందని హెచ్చరించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇప్పుడు చంద్రబాబు చెప్పడం దారుణం అని, ఆ విషయం హామీలు ఇచ్చే ముందు తెలియదా అని నిలదీశారు. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుని ఉంటే బావుండేదని రాష్ట్ర ప్రజలు అనుకునే రోజులు ప్రారంభమయ్యాయన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్.. ఒక్కరికే వందనం.. అందరికీ ఎగనామం!
ఎన్నికల ప్రచారంలో..తల్లికి వందనం కింద ఏడాదికి ప్రతి ఒక్క బిడ్డకూ 15 వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాదీ... ఒక్కరికే అనే నిబంధన లేదు.. ఇద్దరుంటే ఇద్దరికీ ఇస్తా.. ముగ్గురుంటే ముగ్గురికీ ఇస్తా.. నలుగురుంటే నలుగురికీ ఇస్తా.. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తా. ఈ లెక్కన నలుగురుంటే రూ.60 వేలు ఇస్తా.‘నేను హామీ ఇస్తున్నాను.. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకూ (విద్యార్థిని, విద్యార్థులు) 15 వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాదీ... ఒక్కరికే అనే నిబంధన లేదు.. ఇద్దరుంటే ఇద్దరికీ ఇస్తా.. ముగ్గురుంటే ముగ్గురికీ ఇస్తా.. నలుగురుంటే నలుగురికీ ఇస్తా.. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తా. ఈ లెక్కన నలుగురుంటే రూ.60 వేలు ఇస్తా’ అని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఊరూరా లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహిరంగంగా మాట ఇచ్చారు. బాబుతో పాటు టీడీపీ నేతలంతా ఇంటింటా ఇవే మాటలు చెప్పారు. ఇలా మాయ మాటలు చెప్పి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక నిస్సిగ్గుగా ప్లేటు మార్చారు. మరీ ఇంత దుర్మార్గమా.. అని ఎవరైనా చంద్రబాబును ప్రశ్నిస్తే దబాయించి నోరు మూయించడం ఆయన నైజం. సూపర్ సిక్స్‌లో మిగతా హామీలన్నింటిలో కోతలు.. దాటవేతలేనని బాబు వాలకం చెబుతోంది.సాక్షి, అమరావతి: మాట మార్చడంలో డబుల్ పీహెచ్డీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి తన నైజాన్ని చూపించారు. ‘తల్లికి వందనం’ పేరిట ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామన్న అంశంపై మాట తప్పారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి.. ఒక్కరుంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తామని లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహిరంగంగా ఇచ్చిన మాటను గాలికి వదిలేశారు. ఇప్పుడు ఈ పథకాన్ని చదువుకునే పిల్లల్లో ఒక ఇంట్లో ఒక్కరికే అమలు చేస్తామని ప్రకటించారు. ఆధార్ అనుసంధానం పేరుతో అనేక కొర్రీలు వేసి లబ్ధిదారులను తగ్గించే పనిలో ఉన్నారు. అందుకే ఏటా జూన్ నెలలో పాఠశాలలు తెరిచిన వెంటనే ఇవ్వాల్సిన పథకంపై కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. బుధవారం జీవో నం.29 విడుదల చేసి.. పిల్లలతో సంబంధం లేకుండా ఒక్క తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. అంటే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన 42.62 లక్షల మంది లబ్ధిదారుల కంటే తక్కువ మందికే ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తాం. ఆ మొత్తం నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి పథకాలు అందుకోండి’ అంటూ ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటిస్తే.. ఇప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఆ పథకం గురించి తనదైన శైలిలో ‘నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు..’ అంటూ చిన్న పిల్లలను చూపిస్తూ ప్రచారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇన్ని ఆధారాలు ఉన్నా ఇప్పుడు ‘వందనం ఒక్కరికే’ అనడంపై తల్లులు మండి పడుతున్నారు. కోటి మంది పిల్లల్లో భారీగా కోత రైతులకు రుణమాఫీ చేస్తామని టీడీపీ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి రాగానే అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను తగ్గించండంతో పాటు రుణ మాఫీని సైతం భారీగా కుదించేశారు. ఇప్పుడు తల్లికి వందనం పైనా ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభ్వుం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ తలో రూ.15 వేలు చొప్పున ఇస్తూ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చేసిన ప్రకటనకు విరుద్ధంగా ముందుకెళుతోంది. అందుకు అనుగుణంగానే జీవో నం.29లో జారీ చేసింది. పిల్లలు అందరికీ ఇస్తామన్న పథకాన్ని ‘తల్లికి మాత్రమే రూ.15000’ అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంటే రాష్ట్రంలో దాదాపు కోటి మందికి పైగా పిల్లలున్నారు. ఇందులోనూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. అందుకే ఆధార్‌తో లింక్ అయ్యి ఉన్న అన్ని ఆస్తుల వివరాలను తీసుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధించిన నిబంధనలను కాకుండా మరిత కఠినంగా నిబంధనలు రూపొందిస్తోంది. గత ప్రభుత్వంలో ప్రతి బిడ్డా చదువుకునేందుకు బడికి వెళ్లడమే లక్ష్యంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. అన్ని మేనేజ్మెంట్ల స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివే పిల్లలను ప్రోత్సహించేందుకు వారి తల్లులకు ఏటా రూ.15 వేలు జమ చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఒకటి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కాలేజీల్లో చదివే పిల్లలకు మాత్రమే పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వీరిలోనూ వివిధ ఆదాయ మార్గాలను సాకుగా చూపి పిల్ల సంఖ్యను భారీగా తగ్గించే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే గతంలో అమ్మ ఒడి అందుకున్న 42.62 లక్షల మందిలో చాలా మంది ఈ పథకానికి దూరమవుతారు. మూడుసార్లు మాట మార్చిన కూటమి చదువుతో సంబంధం లేకుండా ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజలకు మాట ఇచ్చారు. ‘స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఆర్ధిక సాయం’ అంటూ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలున్న తల్లికే ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. అంటే ఒకే అంశంపై మూడుసార్లు మాట మార్చారు. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కాలేజీలు, ప్రయివేట్ ఎయిడెడ్, ప్రయివేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో చదివే పిల్లలు గల తల్లులకు అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. కానీ ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల్లో ఎక్కడా స్కూళ్లు, కాలేజీల ప్రస్తావన చేయలేదు. సర్వే పేరుతో ఇన్నాళ్లూ కాలయాపన చేసి, అనంతరం తీరిగ్గా మార్గదర్శకాలు విడుదల చేస్తే తాము అర్ధికంగా నష్టపోతామని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల డేటా ఉన్నా కాలయాపన స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్యపై రాష్ట్రాలు ఏటా ‘యూనిఫైడ్ డి్రస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్’ (యూడైస్ ప్లస్) ద్వారా జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయి. ఈ ఏడాది నుంచి విద్యార్థుల చేరికలు, బదిలీలు నేరుగా ‘యూడైస్ ప్లస్’ ద్వారానే చేయాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. యూడైస్ ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఇంటర్ వరకు మొత్తం 82,29,858 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్నారు. కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య కూడా దీనికి జత చేయాలి. విద్యార్థుల చేరిక సమయంలోనే ఆధార్‌తో పాటు కుటుంబ నేపథ్యం, ఆర్ధిక స్థాయి కూడా నమోదు చేస్తున్నారు. ఇదంతా ఆన్లైన్లో జరిగేదే. పైగా గతేడాది కూడా వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పిల్లల వివరాలను ప్రభుత్వానికి అందించారు. ఈ వివరాలు ప్రభుత్వం వద్ద నూరు శాతం ఉన్నాయి. 2018–19 విద్యా సంవత్సరం విద్యార్థుల డేటా ఆధారంగా గత ప్రభుత్వం తొలి ఏడాది అమ్మఒడి పథకాన్ని అమలు చేసింది. 2020లోనూ ముందు సంవత్సరం విద్యార్థుల సంఖ్య (డేటా) ఆధారంగా పథకాన్ని అందించింది. ఇలా నాలుగు విద్యా సంవత్సరాల్లో ముగిసిన ఏడాది డేటా ఆధారంగా అమ్మ ఒడి జమ చేసింది. దీంతో పాటు 75 శాతం హాజరు శాతం తప్పనిసరి అన్న నిబంధన విధించినా, పేద కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదన్న మానవతా దృష్టితో హాజరు సరిపడినంత లేకున్నా ఇతర అర్హతలు గల ప్రతి తల్లికీ అమ్మఒడి అమలు చేశారు. పది, ఇంటర్ ఫెయిల్ అయ్యి, తిరిగి ప్రవేశం పొందిన విద్యార్థులు, మధ్యలో స్కూల్లో చేరిన అర్హత గల పిల్లలకు కూడా పథకాన్ని అమలు చేశారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల సంఖ్యను సర్వే చేసి తేల్చాలని నిర్ణయించింది. ప్రభుత్వం వద్ద పూర్తి డేటా ఉన్నా కేవలం పథకాన్ని ఈ విద్యా సంవత్సరంలో అమలు చేయకుండా దాట వేయడానికి మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రభుత్వమే ఉండి ఉంటే..వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కొనసాగుతూ ఉండిఉంటే ఈ పాటికే అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా పథకాలు అమలై ఉండేవి. గత ఐదేళ్లలో ఈ పథకాలన్నీ చెప్పిన రోజు చెప్పినట్లు అర్హత గల లబ్ధిదారులందరికీ అందాయి. అర్హత ఉండీ కూడా ఏ కారణం వల్లనైనా లబ్ధి పొందని వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి మరీ మేలు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి నిజంగా పిల్లలపై ప్రేమ ఉంటే జూన్ నెలలోనే తల్లికి వందనం (అమ్మ ఒడి) పథకాన్ని అమలు చేసి ఉండేది. ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో ఎలా కోత పెట్టాలా.. అని నెల రోజులకు పైగా ఆలోచించి ఇప్పుడు తీరిగ్గా గైడ్‌లైన్స్ మాత్రమే జారీ చేసింది. పిల్లలందరికీ అని చెప్పి ఇప్పుడు ఒక్కరికే అంటూ ప్లేటు ఫిరాయించింది. అది కూడా ఎప్పుడిస్తారో చెప్పక పోవడం గమనార్హం. ఆశ పెట్టి.. మాట మార్చకూడదు మాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒకరు ఈపూరు యూపీ పాఠశాలలో, మరొకరు అనంతవరం జెడ్పీ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పదో తరగతి చదువుతున్న మా మేనకోడలిని కూడా మేమే పెంచుతున్నాం. గత ప్రభుత్వంలో మా బిడ్డలతోపాటు, మా మేనకోడలికి సైతం మా బ్యాంక్ ఖాతాలో అమ్మ ఒడి సొమ్ము జమైంది. ప్రస్తుత ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంత మందికి రూ.15 వేల చొప్పున అందజేస్తామన్న హామీని నిలుపుకోవాలి. అధికారంలోకి వచ్చాక టీడీపీ హామీని విస్మరించడం మంచిది కాదు. మాలాంటి కుటుంబాలను ఆశ పెట్టి.. ఇలా ఏమార్చి కష్టాల్లోకి నెట్టడం తగదు. – బూసే జోత్న్స, ఈపూరు, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు? మాకు నలుగురు పిల్లలున్నారు. ప్రభుత్వం ‘తల్లికి వదనం’ ద్వారా సాయం చేస్తుందని అందరినీ ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నాం. వారి ఫీజులు, పుస్తకాలు, డ్రస్సులు, బూట్లు ఇలా అన్నీ కలిపి ఒక్కొక్కరికి రూ.20 వేల దాకా ఖర్చు అవుతుంది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పథకం కింద అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇంట్లో ఎంత మంది పిల్లలు పాఠశాలకు వెళితే వారందరికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలి. ఈ మొత్తాన్ని త్వరగా మంజూరు చేయాలి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పథకంలో కొర్రీలు వేయాలని చూడటం మంచిది కాదు. ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు..? – షాఫియా భాను, హస్నాబాద్, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లామరీ ఇంత మోసమా!? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం కింద ప్రతి సంవత్సరం చెప్పిన తేదీన బ్యాంకు ఖాతాలో డబ్బు జమయ్యేది. ప్రస్తుత ప్రభుత్వంలో ఇంకా డబ్బులు జమ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఈ పథకం అర్హతకు కొత్త నిబంధనలు పెట్టడం ఆందోళనకరంగా ఉంది. నాకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు ఐదో తరగతి, రెండో కొడుకు నాలుగో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కూతురు అంగన్వాడీ చదువు పూర్తి చేసుకుంది. పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.45 వేలు వస్తుందని ఆశించాం. కూతుర్ని ప్రయివేటు స్కూల్లో చేరుద్దామనుకున్నాం. హామీ ఇచ్చి మరీ ఇంత మోసం చేస్తారనుకోలేదు. – ఎం.పూజిత నాగలక్ష్మి, ఎనికేపాడు, విజయవాడ రూరల్ మండలంరూ.60 వేలు వస్తాయని ఎదురు చూస్తున్నాం మేము విశాఖ జీవీఎంసీ 6వ వార్డు కొమ్మాది దరి కె1 కాలనీలో నివాసం ఉంటున్నాం. మాకు నలుగురు పిల్లలు. పెద్దబ్బాయి రుషిత్ సింగ్ 10వ తరగతి, రెండవ అబ్బాయి సౌమిత్రి సింగ్ 6వ తరగతి, మూడవ అబ్బాయి హేమంత్ సింగ్ మూడవ తరగతి, నాలుగవ అబ్బాయి ప్రకృత్ సింగ్ నర్సరీ చదువుతున్నాడు. గతంలో ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో, ఒక అబ్బాయిని ప్రైవేట్ పాఠశాలలో చదివించే వాళ్లం. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రతీ విద్యార్ధికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని చెప్పడంతో నలుగురినీ ప్రైవేట్ పాఠశాలలో చేరి్పంచాం. పాఠశాల యాజమాన్యాలు ఫీజుల కోసం మాపై ఒత్తిడి తెస్తున్నాయి. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తల్లికి వందనం పథకం కింద రూ.60 వేలు ఇవ్వాలి. – లక్ష్మీ కౌర్ -
బడులు తెరిచారు.. బరువు మోపారు.. 'వందనమేదీ'!
వెంటనే పిల్లలందరికీ ఇవ్వాలి..నాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప ఆరో తరగతి, మరో అమ్మాయి ఐదో తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ డబ్బులిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరవగానే మా ఖాతాలో డబ్బులు జమ చేసేవారు. – పదముత్తం లక్ష్మి, ఏరూరు, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లాసాక్షి, అమరావతి: ‘ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకంఅమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి.. పథకాలు అందుకోండి..’ అంటూ ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిచోటా చాటింపు వేసిన సీఎం చంద్రబాబు ఒకపక్క పాఠశాలలు పునఃప్రారంభమై నెల కావస్తున్నా ఆ ఊసే పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రేగుతోంది. మంత్రి నారా లోకేశ్‌తోపాటు ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నాయకులంతా ప్రజలకు బహిరంగంగా ఈ ఇచ్చిన హామీపై నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్థులు, బడి ఈడు పిల్లలు దాదాపు కోటి మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వీరందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలంటే ఏటా సుమారు రూ.15 వేల కోట్లు అవసరం. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కోటి మంది పిల్లలకు ‘తల్లికి వందనం’ ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోగా ఈ హామీని ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాదంతా కాలయాపన చేసి లబ్ధిదారులను తగ్గించేందుకు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏరుదాటాక తెప్ప తగలేయడంలో నిపుణుడైన చంద్రబాబు 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీని నెరవేర్చకుండా కోటయ్య కమిటీ పేరుతో కోతలు విధించిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.ఖర్చులు తడిసిమోపెడు..పాఠశాలలు తెరవటమే ఆలస్యం.. పిల్లల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ‘అమ్మ ఒడి’ పథకం నాలుగేళ్ల పాటు తల్లిదండ్రులకు నిశ్చింత కల్పించింది. పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నా సరే వంద శాతం పారదర్శకతతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి రప్పించడమే లక్ష్యంగా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. ఏటా రూ.6,400 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.26 వేల కోట్లకుపైగా అమ్మ ఒడి ద్వారా అందించడం పిల్లల చదువుల పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. భావి పౌరుల భవితవ్యానికి భరోసా కల్పిస్తూ వెలుగులు పంచిన ఈ పథకంపై ఇప్పుడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఈ పథకం పేరు మార్చేసి ‘‘తల్లికి వందనం’’ అంటూ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ హామీ కింద ప్రకటించిన కూటమి సర్కారు స్కూలుకి వెళ్లే విద్యార్థులతో పాటు ప్రతి బిడ్డకూ ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఒక్కో ఇంట్లో నలుగురు ఐదుగురు పిల్లలున్న కుటుంబాలు తమకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు లబ్ధి చేకూరుతుందని ఆశపడ్డారు. ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ‘తల్లికి వందనం’పై ఇంతవరకూ కొత్త సర్కారు నోరు మెదపకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, పుస్తకాల ఖర్చులు తడిసిమోపెడు కావడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలయాపన.. కోతలు2014 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను భారీగా తగ్గించేసి అరకొరగా విదిలించారు. ఇప్పుడు తల్లికి వందనంపైనా ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఒక్కో బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికీ పథకం వర్తింప చేస్తామని ఇచ్చిన హామీ ప్రభుత్వ పెద్దల్లో కూటమి సర్కారులో గుబులు రేపుతోంది. ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం కావడం ఇందుకు కారణం. దీంతో వలంటీర్లను గౌరవ వేతనం రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామన్న హామీని గాలికి వదిలేసినట్లే... ‘తల్లికి వందనం’ కూడా లబ్ధిదారుల ఎంపిక పేరుతో ఈ ఏడాది కాలయాపన చేసి అనంతరం రకరకాల నిబంధనలతో కోతలు విధించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. టీడీపీ హయాంలో రైతుల రుణమాఫీపైనా ఇదే విధానం అనుసరించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అదే జరిగితే తమ పిల్లల చదువులు నాశనమవుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డ్రాప్ అవుట్స్‌కు అడ్డుకట్ట..బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండేలా, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి విద్యారంగాన్ని బలోపేతం చేసింది. పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్‌ను గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో అమ్మఒడి పథకానికి విద్యార్థి హాజరును ప్రామాణికంగా తీసుకుంది. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. 2019– 20, 2020–21 విద్యా సంవత్సరాల్లో మాత్రం కోవిడ్ కారణంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. జీఈఆర్...2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేలా ఈ నిర్ణయం నూరు శాతం ఉపయోగపడింది.జూన్‌లోనే జమకు గత సర్కారు ఏర్పాట్లు..పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో 2019 జూన్‌లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్‌లోనే అంతకుముందు సంవత్సరం హాజరును బట్టి రూ.15 వేలు చొప్పున అందిస్తూ రూ.వెయ్యి టాయిలెట్ మెయింట్‌నెన్స్ ఫండ్‌కి, మరో రూ.వెయ్యి స్కూల్ నిర్వహణ నిధికి జమ చేసింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి అందించి చదువులకు భరోసా కల్పించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్.. ఇలా ఎక్కడ చదువుతున్నా సరే పథకాన్ని నూరు శాతం పారదర్శకతతో అమలు చేసింది. 2022–23కి సంబంధించి గతేడాది జూన్ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్‌లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది. జూలై వచ్చినా తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు.మాట ప్రకారం డబ్బులివ్వాలిగత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఏటా సకాలంలో నగదు నా ఖాతాలో జమ చేశారు. పిల్లల చదువుల కోసం అది ఎంతో ఉపయోగపడేది. కూటమి పార్టీలు ప్రతి విద్యార్ధికీ రూ.15 వేలు చొప్పున డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చాయి. బడులు ఇప్పటికే తెరిచినా కొత్త ప్రభుత్వం ఇంత వరకు ఏమీ చెప్పడం లేదు. చేసేదేమీ లేక రూ.15 వేలు అప్పు చేసి పిల్లలకు అవసరమైనవి కొన్నాం. మాట ప్రకారం పిల్లల చదువులకు డబ్బులు ఇవ్వాలి. – పద్మ, విద్యార్థి తల్లి, పుత్తూరు, తిరుపతి జిల్లాపాత వాటికి పేర్లు మార్చారే కానీపిల్లలు స్కూళ్లకు వెళుతున్నా ఏ పథకం అందలేదు. పాత పథకాలకు పేర్లు మార్చారే కానీ లబ్ధిదారులకు ఇంతవరకు ఏ పథకం ద్వారా డబ్బులు ఇవ్వకపోవడం దారుణం. ఇలాగే ఉంటే మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే పథకాలు అందేలా చూడాలి. – సి.జానకి, జల్లావాండ్లపల్లె, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లాఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదునా కుమార్తె లిఖిత జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఇంతవరకూ మాకు అమ్మ ఒడి డబ్బులు పడలేదు. గతంలో ఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదు. అసలు డబ్బులు పడతాయో లేదో కూడా తెలియడం లేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదంటున్నారు. పిల్లల చదువుల కోసం అప్పు చేయాల్సి వస్తోంది. – మరడాన జ్యోతి, రామభద్రపురం, విజయనగరం జిల్లాబడులు మొదలైనా ఆ ఊసే లేదు గతంలో స్కూళ్లు తెరవగానే అమ్మ ఒడి అందేది. పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడేవి. ఈసారి బడులు ప్రారంభమైనా ఇంతవరకూ ఆ ఊసే లేదు. అసలు డబ్బులు ఇస్తారో లేదో కూడా ఈ ప్రభుత్వంలో స్పష్టత లేదు. గతంలో ఉన్న లబ్ధిదారులందరికీ అమ్మఒడి ఇవ్వాలి. – రమణమ్మ, అంకేపల్లి, మర్రిపూడి, ప్రకాశం జిల్లా పిల్లలను ఆదుకోండయ్యా..! పాఠశాలలు తెరిచి రెండు వారాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ పథకం అందలేదు. మా పిల్లలను ఆదుకుని పథకాలు వర్తింపచేసేలా ప్రభుత్వం చొరవ చూపాలి. – పి.రామలక్ష్మమ్మ, మల్లూరు, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా -
మన మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు..!
-
అమ్మ ఒడి 17 వేలకు పెంపు..
-
స్టార్ హీరో భార్య సూపర్ హిట్ చిత్రం.. ఐదేళ్ల తర్వాత వస్తోంది!
జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాక్షసి. ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాష్, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. తమిళంలో హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులోనూ తీసుకొస్తున్నారు. అమ్మ ఒడి టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈనేపథ్యంలో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే టీచర్ పాత్రలో జ్యోతిక నటించారు. పాడైపోయిన స్కూళ్లను.. పునరుద్దించాలనుకునే పాత్రలో జ్యోతిక నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే వారికి ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రంలో నాగినీడు హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్, సత్యన్ ముఖ్యపాత్రలు పోషించారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. -
అమ్మఒడి వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
భావితరాలు ప్రపంచాన్ని ఏలే స్థాయికి.. అమ్మ ఒడిపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: మన భావితరాలు ప్రపంచాన్ని ఏలే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేనన్ని సంక్షేమ పథకాలను విద్యారంగంలో మన ప్రభుత్వంలో ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వరుసగా నాలుగో ఏడాదీ ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి సీఎం బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ‘అమ్మ ఒడి’ పథకంపై ఆయన ట్వీట్ చేశారు. ‘‘పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ బిడ్డల విద్యావసరాల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం కింద తమ పిల్లలను చదివిస్తున్న 42.64 లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేడు రూ.6,393 కోట్లను జమ చేస్తున్నాం. ఈ ఒక్క పథకం కిందే మన ప్రభుత్వం ఈ నాలుగేళ్ళలో రూ.26,067 కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. విద్యార్థులందరినీ ఉన్నత విద్యావంతులు చేసే లక్ష్యంతో విద్యారంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం: సీఎం జగన్ తాజాగా విడుదలైన నిధులతో కలిపి.. ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని జగనన్న ప్రభుత్వం లబ్ధిదారులకు చేకూర్చినట్లయ్యింది. ఇక గత నాలుగేళ్లలో నాలుగేళ్లలో విద్యా రంగంపై సీఎం జగన్ ప్రభుత్వం రూ.66,722.36 కోట్లను వెచ్చించారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నారు. మన భావితరాలు ప్రపంచాన్నేలే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేనన్ని సంక్షేమ పథకాలను విద్యారంగంలో మన ప్రభుత్వంలో ప్రవేశపెట్టాం. పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ బిడ్డల విద్యావసరాల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం… pic.twitter.com/pzte4zJ1W3 — YS Jagan Mohan Reddy (@ysjagan) June 28, 2023 -
చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం: సీఎం జగన్
సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందులో భాగంగా పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహిస్తాం అని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన జగనన్న అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతీ ఒక్కరికి నిండు మనసుతో.. హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు. తల్లులు తమ పిల్లలను బడులకు పంపేందుకు అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం. ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో.. క్లాస్ టీచర్లకే గతిలేని పరిస్థితి గతంలో చూశాం. ఇప్పుడు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా చేస్తున్నాం. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్‌గా తయారు కావాలి అని సీఎం జగన్ వేదిక నుంచి ఆకాంక్షించారు. ► ఒకటి నుంచి 12వ తరగతి దాకా చదివిస్తున్న 42,61,965 మంది అక్కచెల్లెమ్మలకు అండగా, 83,15,341 మంది విద్యార్థులకు మంచి జరిగిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా రూ.6,392.94 కోట్లు అక్కచెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకైనా అమ్మ ఒడి వర్తింపజేస్తున్నాం. బటన్ నొక్కడం అంటే ఇదీ.. బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్ధాయిలకు ఈ విషయం అర్థం అయ్యేలా చెప్పండి అని కోరుతున్నా. ► భారతదేశంలోనే 28 రాష్ట్రాల్లో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇక మీదట కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పిల్లల బంగారు భవిష్యత్ కోసం తప్పనిసరిగా మీ పిల్లలను బడికి పంపించండి. నాలుగేళ్లుగా మీ పిల్లల బాగు కోరే ప్రభుత్వంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులన్నింటిలో కూడా ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. బడులు ప్రారంభం కాగానే మెరుగైన విద్యాకానుక కిట్లను ప్రతి పిల్లాడు, ప్రతి పాప చేతిలో పెడుతున్నాం. 3వ తరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ టోఫెల్ కరిక్యులమ్ తీసుకొచ్చింది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే. పిల్లలను బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్ లు, చక్కగా అర్థమయ్యేందుకు మొట్టమొదటి సారిగా ఇస్తున్నాం. బైజూస్ కంటెంట్ ను కూడా మన పాఠాల్లోకి అనుసంధానం చేయడం మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది. 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమును డిజిటలైజ్ చేసి ఐఎఫ్పీలను తెచ్చి డిజిటల్ బోధనను స్కూల్స్ లోకి తీసుకొచ్చాం. ► అంగన్వాడీల్లోనూ మార్పులు తెచ్చాం. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సంపూర్ణ పోషణ అమలు చేస్తున్నాం. సంపూర్ణ పోషణ ప్లస్ కూడా గిరిజన ప్రాంతాల్లో అమలు చేస్తున్నాం. పాఠశాలలన్నీ రూపు రేఖలు మార్చి 45,000 గవర్నమెంట్ స్కూళ్లలో నాడు-నేడు తెచ్చాం. 8వ తరగతి పిల్లలకు, టీచర్లకు ఇద్దరికీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో కూడా పని చేసేలా వారికి ట్యాబ్స్ అందిస్తున్న మీ మేన మామ ప్రభుత్వం. ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ పథకాన్ని అమలు చేస్తున్నాం. మీ మేనమామ ప్రభుత్వంలోనే.. పెద్ద చదువుల కోసం వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో జగనన్న విద్యా దీవెన ఇస్తోంది మీ మేనమామ ప్రభుత్వంలోనే. మెస్ ఖర్చులు, హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మీ మేనమామ ప్రభుత్వమే. పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి. ప్రతి కుటుంబం నుంచి సత్యనాదెళ్ల రావాలి. పదో తరగతి పూర్తి చేసి ఉండాల్సిందే అన్న నిబంధనతో వైఎస్సార్ కల్యాణమస్తు-షాదీ తోఫా అమలు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసం అక్షరాలా రూ.66,722 కోట్లు ఖర్చు. గత ప్రభుత్వం దాదాపు కోటి మంది పిల్లలకు చేసిన అన్యాయం క్షమించగలమా అని అడుగుతున్నా. ప్రభుత్వ బడులతో వెలుగులు పెత్తందార్లకు అందుబాటులో ఉన్న ఆ చదువులకంటే గొప్ప చదువులు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులు.. ప్రైవేట్ బడులకు తీసిపోకుండా పోటీ పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. గవర్నమెంట్ బడుల్లో ఆణిముత్యాలుంటాయని, వజ్రాలు, రత్నాలు మెండుగా పుట్టే విద్యా విధానాన్ని తీసుకొచ్చింది మీ మేనమామ ప్రభుత్వంలోనే. పేద కుటుంబాల్లో వెలుగులు నింపేలా గవర్నమెంట్ బడి వెలుగుతోంది. టెన్త్ పరీక్షల్లో గవర్నమెంట్ స్కూళ్లో నుంచి టాప్ 10 ర్యాంకులు గతేడాది 25 రాగా, ఈ ఏడాది ఏకంగా 64కు పెరిగాయి. 75 శాతానికి పైగా మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 63,275 మంది అయితే, ఈ ఏడాది 67,114కు పెరిగింది. గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలు 66.50 శాతం ఫస్ట్ క్లాస్ లో పాసయితే ఈ ఏడాది 70.16 శాతానికి పెరిగారు. 67 మంది పిల్లలకు ఐఐటీ, ఎన్ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు దొరికే అవకాశం ఈ సంవత్సరం రాబోతోంది. ఇవి ఫలితాలు.. 2018-19లో స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో.. 84.48 శాతంతో మన రాష్ట్రంలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటే ఇప్పుడు 100.80 శాతంతో, జాతీయ సగటు 100.13 శాతం కంటే మెరుగ్గా ఉన్నాం. ఇది విద్యారంగంలో మనం చూపించిన శ్రద్ధకు దక్కిన ఫలితాలివీ. గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నది మీ బిడ్డ ప్రభుత్వమే. 5 మంది డిప్యూటీ సీఎంలను తయారు చేస్తే అందులో నా చెల్లెమ్మ మొట్ట మొదటి గిరిజన డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో పని చేసిన చరిత్ర. మీ జగనన్న క్యాబినెట్ లో గిరిజనుడు ఒక డిప్యూటీ సీఎంగా ఈరోజు పని చేస్తున్నాడు. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని వేసిన చరిత్ర మనది నవరత్నాలను మారుమూల ఉన్న ట్రైబల్ విలేజ్ కు చేర్చాలని తపన పడుతున్నాం. కురుపాం నియోజకవర్గంలోనే 118 టవర్లను ఒక్కో టవర్ ఖర్చు 80 లక్షలతో 2,600 సెల్ ఫోన్ టవర్లు నిర్మాణంలో కనిపిస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ కడుతున్నాం. కురుపాం నియోజకవర్గంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వేగంగా కడుతున్నాం. ఇదే కురుపాం నియోజకవర్గంలో మరో మెడికల్ కాలేజీ రాబోతోంది. ఇదే ట్రైబల్ ప్రాంతంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఒకటి పాడేరులో వేగంగా కడుతున్నారు.మరొకటి కురుపాంలో రాబోతోంది. మూడోది నర్సీపట్నంలో వేగంగా కడుతున్నారు. నాలుగోది విజయనగరంలో రేపు సంవత్సరం అడ్మిషన్లు రాబోతున్నాయి. వచ్చే నెల ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నాం. గిరిజనుల కోసం ఏకంగా 147242 కుటుంబాలకు మేలు చేస్తూ ఆర్వోఎఫ్ఆర్ డీకేటీ పట్టాలు 362737 ఎకరాలను పంచి పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. కురుపాంలోనే 21311 కుటుంబాలకు 38798 ఎకరాలు పంపిణీ చేశాం. వాళ్లందరికీ రైతు భరోసా సొమ్మును కూడా గత నాలుగేళ్లుగా ఇస్తున్న ప్రభుత్వం మనది. నామినేటెడ్ పదవి, కాంట్రాక్ట్ నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించాలని చట్టం చేశాం. మన కళ్లెదుటనే గ్రామ సచివాలయాల్లో 1,30,000 మంది ఉద్యోగస్తులు కనిపిస్తున్నారు. నా ఎస్టీ, ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు వీటిలో 84 శాతం కనిపిస్తున్నారు. పెత్తందార్లకే అందుబాటులో ఉన్న చదువులు .. ఇప్పుడు పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు సీఎం వైఎస్ జగన్. ఈ క్రమంలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని క్షమించగలమా? అని ప్రశ్నించారాయన. పెత్తందారీ విద్యావిధానాన్ని బద్ధలు కొట్టి.. అన్నివర్గాలకు ఉన్నతవిద్యను అందిస్తున్నామన్నారు. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడులని తీర్చిదిద్దాం. ప్రైవేట్ బడులతో ప్రభుత్వ బడులు పోటీపడే పరిస్థితికి చేరుకుంది. చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం. ప్రభుత్వ బడుల్లోనూ వజ్రాలు, రత్నాల్లాంటి పిల్లలు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మరోసారి ఉద్ఘాటించారు సీఎం జగన్. -
28న ‘అమ్మ ఒడి’.. ఏపీ సర్కార్ కీలక మార్గదర్శకాలు జారీ..
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి 2022–23 పథకం అమలుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. తమ పిల్లలను పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు పంపుతున్న తల్లుల ఖాతాల్లో ఈ నెల 28న అమ్మఒడి నగదును జమ చేయనుంది. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లి/సంరక్షకుడు ఏటా రూ.15 వేలు చొప్పున పొందచ్చని పేర్కొంది. ► ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు తల్లులు పథకానికి అర్హులు. ► పేదరికంలో ఉన్న కుటుంబాల ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలుకు మించకూడదు. ► ఆదాయపన్ను చెల్లించేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ► వ్యవసాయ భూమిలో మెట్ట అయితే 10 ఎకరాల్లోపు, మాగాణి భూమి 3 ఎకరాల్లోపు, రెండూ కలిపి ఉంటే 10 ఎకరాల్లోపు ఉండాలి. ► విద్యుత్ గరిష్ట వినియోగం నెలకు 300 యూనిట్లు మించనివారు కూడా అర్హులే. ► నాలుగు చక్రాల వాహన యజమానులకు సంబంధించి డ్రైవర్లు సొంతంగా నడుపుకునే ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లు, ఆటోలకు కూడా మినహాయింపునిచ్చింది. వీరు అమ్మఒడి పథకానికి అర్హులే. ► పట్టణాల్లో స్థిరాస్తికి సంబంధించి ఇంటి విస్తీర్ణం 1,000 చదరపు అడుగులు మించకుండా ఉంటే అమ్మఒడిని వర్తింపజేస్తారు. ► పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ కాకుండా పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ వంటి కోర్సుల్లో చేరేవారికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తారు. చదవండి: తిరుమల: 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల -
చదువుపై ఇష్టం... రామోజీకి కష్టం!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ కొత్త చరిత్రవైపు అడుగులేస్తోంది. ‘నాడు–నేడు’తో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. అమ్మ ఒడి నుంచి మొదలుపెడితే జగనన్న విద్యా కానుక వరకూ అన్ని పథకాలూ చదువుపై ఇష్టం పెంచుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్య అంటే ప్రేమగా దగ్గరకెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఇదో గొప్ప ముందడుగు. కొత్త చరిత్ర. ఫలితాలు కూడా మొదలయ్యాయి. కానీ... రెండు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను రాక్షసంగా నలిపేసిన తెలుగుదేశం మాఫియాకు ఇదెంతమాత్రమూ రుచించటం లేదు. విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకుని విషసర్పాలుగా ఎదిగిన చంద్రబాబు నాయుడి బినామీల పని అయిపోతున్నదనే భయం ఎల్లో ముఠాను వణికిస్తోంది. ఫలితమే... కొద్దిరోజులుగా ‘ఈనాడు’ పత్రికలో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై వస్తున్న నెగెటివ్ కథనాలు. జూనియర్ కాలేజీలు పెట్టారు తప్ప సౌకర్యాలను పట్టించుకోలేదని ఒకనాడు... ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణతలు అంతంతమాత్రమేనని మరోనాడు... ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఇంకోనాడు... ఇలా రోజుకొక విష గుళికను పాఠకుల మెదళ్లలో వేస్తున్నారు రామోజీరావు!. ఏం? రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యను ప్రయివేటు మాఫియా చేతుల్లో పెట్టిందెవరు? విశాలమైన ప్రాంగణాల్లో ఉన్న జూనియర్ కాలేజీలను పరాధీనం చేసిందెవరు? కార్పొరేట్ మాఫియా చేతుల్లో విద్యార్థుల తలరాతల్ని పెట్టింది చంద్రబాబు నాయుడు కాదా? విద్యార్థులపై ఒత్తిడిని పెంచి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నది అదే కార్పొరేట్ మాఫియా కాదా? వారిలో నారాయణ వంటివారు చంద్రబాబు బినామీలు కారా? అంటే ఈ ఆత్మహత్యలకు బాధ్యుడు చంద్రబాబు కాదా? ఎందుకీ దౌర్భాగ్యపు కథనాలు? ఎందుకీ విషపు రాతలు? మీ మాఫియా మనగలిగే రోజులు పోతున్నాయనా? మీ రాతలింకా జనం నమ్ముతున్నారనే అనుకుంటున్నారా రామోజీరావు గారూ?? రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకముందు వరకు... అంటే 2019 వరకు 10వ తరగతి విద్యార్థుల్లో 65 శాతం మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుండగా ప్రయివేటు స్కూళ్లలో 35 శాతం వరకు ఉండేవారు. కానీ ఇంటర్మీడియెట్‌కు వచ్చేసరికి అది పూర్తిగా తారుమారయ్యేది. ఇంటర్ విద్యార్థుల్లో కేవలం 25 శాతం మంది ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా... 75 శాతం మందిది ప్రయివేటు కాలేజీల బాటే. 1996లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాటి నుంచి మెల్లగా తన బినామీ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేయకుండా ప్రయివేటు కాలేజీలే విద్యార్థులకు దిక్కయ్యేలా చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,600 వరకు జూనియర్ కాలేజీలుండగా అందులో 290 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. మిగతావన్నీ ప్రయివేటువే. దీన్నిబట్టే చంద్రబాబు ప్రయివేటు రంగానికి ఏ స్థాయిలో మేలు చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సరైన సదుపాయాలు కల్పించక... అక్కడ చదివితే భవిష్యత్తు ఉండదన్న భావనను ప్రజల్లో ఏర్పడేలా చేసి వాటిని నిర్వీర్యపరిచారు. దీంతో టెన్త్ పాసైన ప్రతి ఒక్కరూ కార్పొరేట్ కాలేజీలనే ఆశ్రయించాల్సిన దుస్థితి. అక్కడేమో లక్షల్లో ఫీజులు... అడ్డగోలు దోపిడీ!!. ఈ పరిస్థితి మారాలనుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి... పునాది స్థాయి నుంచే వ్యవస్థను బలోపేతం చేసేలా ఫౌండేషన్ విద్యకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే వాతావరణం ఉండేలా వాటిని వేలకోట్ల రూపాయలతో ‘నాడు–నేడు’ పేరిట సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిస్తున్నారు. మరోవైపు నాణ్యమైన విద్య అందేలా కరిక్యులమ్‌లోనూ సంస్కరణలు తెచ్చారు. ఊహించని స్థాయిలో వేలకోట్ల రూపాయలతో విద్యాభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టారు. ఫలితాన్నిచ్చిన పథకాలు... ప్రభుత్వ విద్యను మెరుగు పరిచేందుకు... పాఠశాలలపై ఇష్టం పెంచేందుకు అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ స్కూళ్లకు పరిమితమైన ఇంగ్లీషు మీడియాన్ని ఎన్నో న్యాయపోరాటాలను కూడా తట్టుకుని అమల్లోకి తెచ్చారు. డిజిటల్ విద్యకూ శ్రీకారం చుట్టారు. వీటిల్లో కొన్ని పథకాలు విద్యా రంగ పరిస్థితులను సమూలంగా మార్చాయి. అవొక్కసారి చూస్తే... జీఈఆర్ పెంచిన అమ్మ ఒడి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018లో, ప్రాథమిక విద్యలో ఆంధ్రప్రదేశ్ జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) 84.48. జాతీయ సగటు 99.21తో పోలిస్తే ఇది తక్కువ. పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని తెచ్చారు జగన్. ఈ పథకం కింద ప్రతి తల్లి/సంరక్షకుడికి ఏటా రూ.15 వేలు అందిస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం రూ.19,617.6 కోట్లు ఇలా తల్లుల ఖాతాల్లో జమ చేసింది. పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి ఇస్తున్న ఈ సాయంతో... ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్థాయిల్లో జీఈఆర్ గడిచిన మూడేళ్లుగా గణనీయంగా పెరిగింది. నిపుణులు మెచ్చిన ‘విద్యా కానుక’ పాఠశాలల్లో పిల్లల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం విద్యార్థులకు కిట్ల రూపంలో బోధన–అభ్యాస సామగ్రిని అందిస్తోంది. ప్రతి విద్యార్థి కిట్‌లో ఒక స్కూల్ బ్యాగ్, స్టిచింగ్ ఛార్జీతో కూడిన 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, వర్క్‌బుక్‌లు ఇంగ్లీష్– తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటోంది. గడిచిన మూడేళ్లుగా రూ.2,323.99 కోట్లు ఖర్చు చేసి ఏడాదికి 47 లక్షల మంది చొప్పున పిల్లలకు ‘కిట్లు’ అందించింది. స్కూళ్లు మొదలైన ఆరు నెలలకు కూడా అందరికీ పుస్తకాలు అందని గతమెక్కడ? ఆరంభమయ్యేనాటికే బుక్స్‌తో సహా బ్యాగులు, యూనిఫామ్, షూతో స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులున్న ప్రస్తుతమెక్కడ? ఏ కొంచెమైనా పోలిక ఉందా? ఇంతటి నవశకాన్ని కనీసం ప్రశంసించని రామోజీరావును ఏమనుకోవాలి? ఇందులో కూడా రంధ్రాలు వెదికి... కొందరి బ్యాగులు పాడయ్యాయని, కొందరికి షూలు పెద్దవయ్యాయని పతాకస్థాయి కథనాలు రాసే నీచపు పాత్రికేయాన్ని ఏం చేయాలి? ఇలాంటివేవీ చేయకున్నా అధికారంలో చంద్రబాబు ఉంటే ఆహా ఓహో అనే రామోజీరావును అసలు మనిషనుకోవచ్చా? అది.. ఆడపిల్లల గౌరవం సీఎం స్వయంగా చొరవ తీసుకుని... ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక ని«ధిని ఏర్పాటు చేయించారు. గడిచిన రెండేళ్లుగా రూ.874 కోట్లు ఈ నిధికి జమయ్యాయి. చదువుకునే పిల్లలు టాయిలెట్ల కోసం ఇళ్లకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదని, ఆ విషయంలో వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నది సీఎం జగన్ ఉద్దేశం. అందుకే గతంలో అధ్వాన్నంగా ఉండి, శిథిలమైపోయిన టాయిలెట్ల స్థానంలో కొత్తవి నిర్మించటం, మరమ్మతులు చేయించటంతో పాటు... వాటికి రన్నింగ్ వాటర్ ఉండేలాంటి ఏర్పాట్లూ చేశారు. వాటి నిర్వహణ కోసం 44,748 స్కూళ్లలో 47,277 మంది ఆయాలను సైతం ఏర్పాటు చేశారు. ఒక్కో ఆయాకు నెలకు రూ.6 వేలు చెల్లిస్తున్నారు. దీనికోసం రూ.442 కోట్లతో స్కూల్ నిర్వహణ నిధిని (ఎస్ఎంఎఫ్) ఏర్పాటు చేశారు. ఆత్మవిశ్వాసం పెంచిన ఇంగ్లీషు మీడియం ఇంగ్లీషు విద్య అందరికీ అందాలన్నది సీఎం కల. దాన్ని అడ్డుకోవటానికి చంద్రబాబు, ఆయన ఎల్లో ముఠా, కార్పొరేట్ మాఫియా కలిసి రకరకాలుగా చేసిన పోరాటాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు జగన్. ప్రభుత్వ చిత్తశుద్ధి ఫలితంగా అమల్లోకి వచ్చిన ఇంగ్లీషు మీడియం విద్య... రాష్ట్రంలో ఎన్నో స్కూళ్లలో విద్యార్థుల మాట తీరునే మార్చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా తాము పోటీపడగలమన్న ఆత్మ విశ్వాసాన్ని వారిలో అణువణువునా నింపింది. అంతేకాదు! ఉన్నత ప్రమాణాలు, బోధనా పద్ధతులు ఉత్తమ మూల్యాంకన విధానానికి వీలుగా ప్రభుత్వ స్కూళ్లు దశల వారీగా సీబీఎస్ఈకి అనుసంధానమయ్యేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈకి శ్రీకారం చుట్టింది కూడా. సీబీఎస్ఈ సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)–హైదరాబాద్, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్ (ఆర్ఎల్సీ)– అహ్మదాబాద్, సహకారంతో టీచర్లకు శిక్షణ ఇచ్చారు. హిందూ గ్రూప్‌తో కలిసి టీచర్లు స్టాండర్డ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీలో (ఎస్టీఈపీ) శిక్షణ పొందారు. ఇవన్నీ కార్పొరేట్ స్కూళ్ల మనుగడనే ప్రశ్నిస్తుండటం... రామోజీ ఎదుర్కొంటున్న అసలు సమస్య. వినూత్నంగా డిజిటల్ తరగతులు... పాఠశాలలన్నిటా 6వ తరగతి నుంచి పైతరగతుల్లో ప్రతి తరగతి గదికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, అంతకన్నా కింది తరగతులకు స్మార్ట్ టీవీలను ప్రభుత్వం ఏర్పాటుచేయిస్తోంది. మనబడి నాడు–నేడు... తొలిదశ పూర్తయిన 15,715 స్కూళ్లలో రూ.352.32 కోట్ల అంచనాతో 10,038 స్మార్ట్ టీవీలు, 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వచ్చే ఈ డిజిటల్ తరగతులతో పిల్లలకు నాణ్యమైన ఈ–కంటెంట్... దానిద్వారా అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తాయి. దీనికోసం విద్యా సమీక్షా కేంద్రాన్ని (కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్) కూడా ఏర్పాటుచేస్తోంది. 4 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ ఈ–కంటెంట్‌ను ఉచితంగా అందుబాటులోకి తేవటంతో... స్కూలు ముగిశాక విద్యార్థులకు వారి ఇళ్లలోనే సందేహాల నివృత్తికి ఇది ఉపయోగపడుతోంది. మారిన పాఠ్యాంశాలు... పెరిగిన ప్రమాణాలు ప్రభుత్వం 2020–21 నుండి పాఠ్యాంశాల్లో అనేక సంస్కరణలు తెచ్చింది. 1 నుంచి 7 తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఫలితాలొచ్చే పాఠ్యాంశాలపై దృష్టి సారించి మార్పులు చేయించింది. ప్రస్తుత కాలానికి అవసరమైన నైపుణ్యాలను పొందడమే లక్ష్యంగా 8, 9 తరగతులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చింది. సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యపుస్తకాలన్నిటినీ రెండు భాషల్లో (ఇంగ్లీషు– తెలుగు, హిందీ–తెలుగు మాదిరి) ఉండేలా అందిస్తోంది. పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా 3 నుండి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయుల ద్వారా బోధనను అందిస్తున్నారు. ఆయా సబ్జెక్ట్‌లలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు పాఠాలు చెబితే పిల్లల్లో ప్రమాణాలు మెరుగువుతాయనేది ప్రభుత్వ యోచన. ఇవన్నీ ఫలితాలనిస్తుండటమే... ప్రయివేటు విద్యా రంగ మాఫియాను కొమ్ముకాస్తున్న ఎల్లో ముఠాకు నచ్చటం లేదు. మండలానికి రెండు కాలేజీలు.. అందులో ఒకటి బాలికలకే తెలుగుదేశం హయాంలో ఉన్నవి మూతపడ్డాయి తప్ప ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ కూడా రాలేదు. విశాలమైన స్థలాలతో ఉండే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పరాధీనమైపోయాయి. కార్పొరేట్ల జెండా పైపైకి ఎగిరింది. చదివించే స్థోమత లేనివారు మగపిల్లలనైతే అప్పులు చేసి కాలేజీల్లో చేర్పించటం... ఆడపిల్లలనైతే చదువు మాన్పించటం చేసేవారు. దీంతో టెన్త్ తరువాత బాలికలు డ్రాపవుటవ్వడం పెరిగింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందులో ఒకటి హైస్కూల్‌ను అప్‌గ్రేడ్ చేసి కాలేజీగా మార్చటం ద్వారా చేయాలనుకున్నారు. రెండు కాలేజీల్లో ఒకటి బాలికలకే. దీనివల్ల హైస్కూల్లో ఉత్తీర్ణులైన బాలికలందరూ తమ విద్యను కొనసాగించడానికి వీలుంటుందన్నది సీఎం జగన్ ఉద్దేశం. ఇందులో భాగంగా 292 ఉన్నత పాఠశాలల్ని బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కస్తూర్బాగాందీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్లస్2ను ప్రవేశపెట్టారు. 2022–23 నుండి 14 కో–ఎడ్ జూనియర్ కాలేజీలనూ బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. ఇలా మొత్తం 679 మండలాలలో రెండేసి జూనియర్ కాలేజీలుండేలా చేస్తున్నారు. విచిత్రమేంటంటే... అసలు కాలేజీలే లేనప్పుడు రామోజీరావు ఒక్క అక్షరం కూడా రాయలేదు. ఇలా కాలేజీలు ఏర్పాటు చేసినపుడు మంచి చర్యంటూ ఒక్క కథనమూ వేయలేదు. కానీ కొన్ని కాలేజీల్లో ఫలితాలు బాగా రాలేదంటూ మాత్రం ఓ కథనాన్ని అచ్చేసేశారు. అదీ.. ‘ఈనాడు’ అంటే. విద్యారంగ పథకాలకు రూ.54వేల కోట్ల ఖర్చు.. ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు రూ.54,023 కోట్లు వెచ్చించింది. చరిత్రలో ఎన్నడూ ఇంతటి భారీ మొత్తాన్ని విద్యపై ప్రభుత్వాలు ఖర్చు చేయలేదు. తరగతి గదుల కొరతను దృష్టిలో ఉంచుకొని ‘నాడు నేడు’ కింద జూన్ నాటికి 24వేల అదనపు గదుల నిర్మాణాన్ని చేపట్టారు. ‘నాడు నేడు’ రెండు, మూడు దశలు కూడా పూర్తయితే ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో విద్యార్థులకు, టీచర్లకు అవసరమైన సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలే... రామోజీ ముఠాకు భవిష్యత్తుపై కునుకు లేకుండా చేస్తున్నాయి. కేజీబీవీలను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే... చంద్రబాబు హయాంలో కేజీబీవీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అనా«థ, నిరుపేద అణగారిన వర్గాలకు చెందిన బాలికలకు విద్యనందించే ఈ సంస్థలకు కనీస నిధులు కూడా ఇవ్వలేదు నాటి ప్రభుత్వం. ఇక్కడ 6 నుంచి 10 వరకే తరగతులుండడంతో... ఆ చదువు పూర్తిచేసిన వారికి పై చదువులకు ఆస్కారం ఉండేదికాదు. డ్రాపవుట్ అయ్యేవారు. చంద్రబాబు వీటిని పట్టించుకుంటే ఒట్టు!. రాష్ట్రంలో 352 కేజీబీవీలు ఉండగా వాటిలో 84,923 మంది బాలికలు చదువుతున్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దశలవారీగా మొత్తం 321 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. సిబ్బంది ఖాళీలను చంద్రబాబు అలాగే వదిలేయగా గడిచిన మూడున్నరేళ్లలో 1,377 పోస్టులను భర్తీ చేశారు. ఇంటర్మీడియెట్‌ను దృష్టిలో పెట్టుకొని అదనంగా గెస్టు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో అధ్యాపకులను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఈ విద్యార్థినులకు సరైన సదుపాయాలు లేవు. ఈ ప్రభుత్వం వీరికి జగనన్న విద్యాకానుక కింద అన్నీ సమకూరుస్తోంది. ఇక వీరికి హాస్టల్‌తో కూడిన చదువులు అందిస్తున్నా.. వీరి తల్లులకోసం అమ్మ ఒడినీ అందిస్తుండడం విశేషం. అమ్మ ఒడి ద్వారా 2020–21లో 55వేల మందికి, 2021–22లో 67వేల మందికి, 2022–23లో 84వేల మందికి రూ.15వేల చొప్పున రూ.312.80 కోట్ల లబ్ధి చేకూరింది. కాకుంటే రామోజీరావు మాత్రం ఈ వాస్తవాలేవీ చెప్పరు. విషపు రాతలే అచ్చేస్తారు. అదే పాఠకుల దౌర్భాగ్యం. పోటీపడేలా చేసిన ‘నాడు–నేడు’ ‘మన బడి నాడు– నేడు’ పేరిట ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న 44,703 స్కూళ్లలో తొలిదశ కింద 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో పనులు పూర్తిచేయించారు. నాడు–నేడు 2వ దశలో రూ.4,100 కోట్లతో 17,500 స్కూళ్లలో పనులు చేయిస్తున్నారు. ఇవి రాబోయే విద్యా సంవత్సరానికల్లా అందుబాటులోకి వస్తాయి. మిగిలిన స్కూళ్లలో ‘నాడు–నేడు’ పనులన్నీ ఆ తరువాతి విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. కొంచెం ఖాళీ స్థలం కూడా లేకుండా ఇరుకిరుకు భవనాల్లో నడిపిస్తున్న కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా విశాలమైన ప్రాంగణాల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న స్కూళ్లపై విద్యార్థులకెంత ఇష్టం పెరగిందంటే... సీట్లు లేవు అని స్కూళ్లకు బోర్డులు పెట్టేంతగా!. ఇదొక్కటి చాలు ఈ సంస్కరణల ఫలితమేంటో చెప్పడానికి. హాజరు పెంచిన ‘గోరుముద్ద’ ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంపై సీఎం జగన్ ఎంతశ్రద్ధ పెట్టారంటే... వారికి అందించే భోజనం మెనూను స్వయంగా తానే మార్పు చేయించారు. ఎందుకంటే... కడుపు నిండితేనే చక్కని చదువు కూడా వంటబడుతుందన్నది ఆయన మాట. స్వయంగా తానే మెనూ తయారు చేయించి... ‘జగనన్న గోరుముద్ద’ పేరిట రోజుకోరకమైన ఆహారాన్ని అందించేలా చేశారు. వారానికి ఐదు గుడ్లు, రోజూ చిక్కీలతో పాటు ఇటీవల బ్రేక్‌ఫాస్ట్‌గా రాగి జావను కూడా అందించేలా చర్యలు తీసుకున్నారు. వీటికి ప్రభుత్వం ఏటా రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. గుడ్డు నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్లను అందించాలని కూడా ఆలోచిస్తోందంటేనే సర్కారు చిత్తశుద్ధి అర్థమవుతుంది. డిజిటల్ లెర్నింగ్... కొత్త చరిత్ర కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా పిల్లలు దెబ్బతిన్నారు. అభ్యసన స్థాయిలు దిగజారాయి. అందుకే విద్యార్థులకు గూగుల్ రీడ్ ఎలాంగ్ పీఎఎల్, బైజూస్ తదితర మార్గాల్లో చదువులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 4 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు బైజూస్ పాఠ్యాంశాలను అందుబాటులోకి తెచ్చారు. 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు, వారికి బోధన చేసే టీచర్లకు ప్రభుత్వం రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబులను అందించింది. ఈ ఏడాది కూడా 8వ తరగతిలోకి వచ్చేవారికి రూ.750 కోట్లతో ట్యాబులు అందించనుంది. ప్రతి ఏటా ఇలా 8వ తరగతిలో ఇచ్చే ట్యాబులు వారికి 10వ తరగతి వరకూ డిజిటల్ లెర్నింగ్‌కు పనికొస్తాయి. తరవాత ఇంటర్మీడియెట్ ఎలాగూ అందుబాటులో ఉంటుంది. అంటే... కార్పొరేట్ స్కూళ్లలో సైతం వేలకు వేలు అదనపు ఫీజులు కడితే తప్ప అందని ట్యాబులు, బైజూస్ వంటి ఎడ్యుటెక్ దిగ్గజ సంస్థ పాఠాలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగానే అందుతున్నాయి. తద్వారా వారికి ఏ స్థాయిలోనైనా పోటీపడే సామర్థ్యం వస్తోంది. -
ఈ ప్రభుత్వ పాఠశాల పిల్లల మార్కులను చూస్తే కార్పోరేట్ స్కూళ్లు సిగ్గు పడాల్సిందే
మదనపల్లె సిటీ: కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఇంటర్మీడియట్లో పేద, సామాన్య కుటుంబాల పిల్లలు సగర్వంగా తలెత్తుకునే రీతిలో మార్కులు సాధించారు. ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో చదివే పిల్లలు పాసైతే చాలు అనుకునేవారు. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించి, మౌలిక వసతులు కల్పించడంతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి అందరి మన్ననలు పొందారు. కార్మికుడి ఇంట.. చదువుల తల్లి మదనపల్లె పట్టణం అవంతి టాకీసు వద్ద నివాసం ఉంటున్న ఖాదర్‌వలి మెకానిక్. షర్మిల గృహిణి. సామాన్య కుటుంబం. కూతురు మెహర్ చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తోంది. పదో తరగతి స్థానిక హోప్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివింది. పదిలో 590 మార్కులు సాధించింది. ఇంటర్మీడియట్ బాలికల జూనియర్ కాలేజీలో బైపిసి చేరింది. ఇంటర్లో 968 మార్కులు వచ్చాయి. రైతు బిడ్డ ..చదువులో దిట్ట రైతు కుటుంబంలో పుట్టి చదువులో రాణిస్తోంది.సత్యసాయి జిల్లా కొక్కంటిక్రాస్ నల్లంవారిపల్లెకు చెందిన లింగారెడ్డి పద్మావతిల కుమారై కవిత. లింగారెడ్డి రైతు, పద్మావతి గృహిణి. కవిత మదనపల్లె జీఆర్టీ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్లో పదో తరగతి పాసైంది. ఇంటర్ బాలికల జూనియర్ కాలేజీలో బైపీసీ చేరింది. ఇంటర్లో 965 మార్కులు సాధించింది. కాలేజీ హాస్టల్లో ఉంటూ విద్యలో రాణించింది. వాచ్మెన్ కూతురు..ఇంటర్లో టాపర్ తండ్రి వాచ్మెన్. తండ్రి పడుతున్న కష్టాలు చూసి చదువులో రాణించాలనుకుంది ప్రీతిలతాదాల్. మదనపల్లె ఎస్టేట్‌కు చెందిన దిగంబర్దాల్ ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. ప్రీతి లతాదాల్ ప్రభుత్వ కళాశాలలో చదివి సీఈసీలో 948 మార్కులు సాధించించి అందరి మన్ననలు అందుకుంది. దినకూలి ఇంట సరస్వతి పుత్రుడు తంబళ్లపల్లె: ఓ దినసరి కూలీ ఇంట చదువుల తల్లి సరస్వతి కొలువుదీరింది. ఆ ఇంటిలోని ఓ విద్యార్థి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభచాటి పలువురి మన్ననలు పొందాడు. మండలంలోని కొటాలకు చెందిన అమరావతి కూలీ పనులతో కుంటుంబ పోషణ సాగిస్తోంది. రెండో కుమారుడు ఇ.అశోక్‌కుమార్ ప్రాథమిక విద్య కొటాల ప్రభుత్వ పాఠశాలలో, గోపిదిన్నె ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి పూర్తి చేసి 540 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. అప్పటికే తల్లి పడుతున్న కష్టం చూసి అతనిలో బాగా చదవాలనే పట్టుదల పెరిగింది. తంబళ్లపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చేరాడు. ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 950 మార్కులు సాధించాడు. అతడి తండ్రి ఈశ్వరయ్య కోవిడ్ తో మృతి చెందాడు. ఐఏఎస్ కావాలన్నదే ధ్యేయం సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నదే ధ్యేయం. అందుకే ఇంటర్మీడియట్ సీఈసీ చేరాను. అధ్యాపకులు రెడ్డప్పరెడ్డి సూచనలు,సలహాలతో మంచి మార్కులు సాధించాను. –ప్రీతిలతాదాల్ ఎంబీబీఎస్ చేస్తా ఎంబీబీఎస్ చేయాలని ఉంది. ఇందు కోసం ఎంసెట్,నీట్ ఎంట్రన్స్‌లకు ప్రిపేర్ అవుతున్నా. అధ్యాపకులు ఇచ్చిన సలహాలు, సూచనలతో ప్రతి రోజు 9 గంటలు చదువుతున్నా. –కవిత రాజుపాళెం : మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్ధినులు ప్రభంజనం సృష్టించారు. జమ్మలమడుగు మండలంలో కన్నెలూరు చెందిన సుబన్న, మేరిల కుమార్తె ప్రియాంక ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ గ్రూపు ఫలితాల్లో 1000 మార్కులకు 976 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. 10వ తరగతి జమ్మలమడుగు గూడెంచెరువులోని కస్తూరిబా పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించింది. బాలిక తండ్రి బేల్దారిగా పని చేస్తున్నాడు. భవిష్యత్తులో డాక్టర్ అయి పేదలకు సేవచేస్తానని ప్రియాంక చెప్పింది. ప్రియాంక తండ్రి సుబ్బన్న బేల్దారిగా పనిచేస్తున్నాడు, తల్లి మేరి కూలి పని చేసుకుని జీవిస్తున్నారు. భవిష్యత్తులో డాక్టర్నవుతా నంద్యాల జిల్లా సంజాముల మండలంలోని నొస్సం గ్రామానికి చెందిన బి.నాగేశ్వరరావు కుమార్తె బి.ముని జాహ్నవి ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీగ్రూపులో ఫలితాల్లో 1000 మార్కులకు 976 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల పదదోతరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు చదివింది. బాలిక తండ్రి జూనియర్ లైన్మెన్గా, తల్లి అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్నారు. భవిష్యత్తులో డాక్టర్ కావాలని ఉద్ధేశంతో ప్రస్తుతం నీట్‌కు కోచింగ్ తీసుకుంటున్నట్లు మునిజాహ్నవి తెలిపింది. వ్యవసాయ కూలీ బిడ్డ.. చదువులో దిట్ట రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్థి పామిడి లక్ష్మిదేవి సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని నగళ్లపాడుకు చెందిన వ్యవసాయ కూలి పామిడి శ్రీనివాసులు కుమార్తె లక్ష్మిదేవి సీనియర్ ఇంటర్ బైపీసీ గ్రూపులో 1000 మార్కులకు 966 మార్కులు సాధించింది.. తండ్రి వ్యవసాయ కూలీ కాగా, తల్లి స్వాతి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో నీట్ కోచింగ్ తీసుకుంటున్నానని, భవిష్యత్తులో డాక్టర్నవుతానని తెలిపింది. బి.ఫార్మసీ చేయాలని ఉంది ఎంసెట్, నీట్ ఎంట్రన్స్ రాస్తా. బి.ఫార్మసీ చేయాలని ఉంది.అధ్యాపకులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలతో మంచి మార్కులు సాధించా. –మెహర్, మదనపల్లె ఐఏఎస్ చదవాలన్నదే ఆశయం ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి ఐఏఎస్ కావాలన్నదే తన ఆశయమని అశోక్‌కుమార్ తెలిపాడు. నేటి ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు పేద పిల్లలకు ఇస్తున్న భరోసా తనకు ఆనందం కలిగిస్తోందన్నారు. -
జగన్ పథకాలు భేష్ అన్న టీడీపీ ఎమ్మెల్యే
-
విద్యా హక్కుపైనా వికృత రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లటమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ విద్యా హక్కు చట్టం అమలుపైనా, అమ్మఒడి పథకంపైనా తన వక్రబుద్ధిని చాటుకుంది. విద్యా హక్కు చట్టం గురించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు కనీసం పట్టించుకోకపోయినా ఈనాడు ఒక్క వార్తా రాయలేదు. పేద పిల్లలకు మేలు జరిగే ఈ చట్టాన్ని ఎందుకు అమలుచేయడంలేదని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. కానీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ చట్టాన్ని అమలుచేయిస్తూ పేదపిల్లలకు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలోనూ చదువుకునే అవకాశం కల్పిస్తుంటే ‘ఈనాడు’కు నచ్చడంలేదు. అందులో భాగంగానే విద్యా హక్కు చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓను తప్పుపడుతూ ఈనాడు సోమవారం నాటి దినపత్రికలో అసత్యపు వార్తను అచ్చేసింది. వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేస్తూ అసత్యాలతో ఆరోపణలు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ‘ఫ్యాక్ట్‌చెక్’లో ఈనాడు బండారం, వార్తలోని డొల్లతనం బట్టబయలయ్యాయి. అంశాల వారీగా ఈనాడు చేసిన ఆరోపణల్లోని అవాస్తవాలను వెల్లడిస్తూ వాటిని ఖండించింది. అవి.. ఆరోపణ–1: విద్యా సంస్థల ఫీజులను ప్రభుత్వం చెల్లించాలి. ఇతర రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం ఇలాగే అమలు చేస్తున్నారు. వాస్తవం: 2019–2020 విద్యా సంవత్సరం నుండి అమ్మఒడి పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.15,000లను 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థుల విద్యా ఖర్చుల కోసం (స్కూల్ ఫీజులతో కలిపి) జమచేస్తోంది. నిజానికి.. గతంలో ఈ పథకం లేదు. ఇలాంటి పథకం ఈ రాష్ట్రంలో కానీ, దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేదు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యా ఖర్చుల నిమిత్తం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలోకి ఈ అమ్మఒడి నిధులు జమచేస్తోంది. 2019–20లో 42,33,098 మంది తల్లులకు రూ.6,349.60 కోట్లు, 2020–21లో 44,48,865 మంది తల్లులకు రూ.6,673.40 కోట్లు, 2021–22లో 42,62,419 మంది తల్లులకు రూ.6,393.60 కోట్లు జమచేసి విద్యా ఖర్చుల నిమిత్తం చెల్లించింది. 2వ ఆరోపణ: అమ్మఒడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని భావించి గత ఏడాది విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పొందారు.. వాస్తవం: ఈనాడు ఆరోపణ అవాస్తవం. గత సంవత్సరం విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాల అమలులో ప్రభుత్వం ఎక్కడా అమ్మఒడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని ప్రకటన చేయలేదు. ఆ విధంగా తల్లిదండ్రులకు ప్రభుత్వం ఏ సందర్భంలోనూ ఆ విధంగా హామీ ఇవ్వలేదు. 3వ ఆరోపణ: తాజా ఉత్తర్వులతో తల్లిదండ్రులపై భారం పడింది. వాస్తవం: ఈనాడులోని ఈ ఆరోపణ పూర్తిగా అవాస్తవం. 2019–2020 విద్యా సంవత్సరం నుండి మాత్రమే అమ్మఒడి పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా ప్రభుత్వం రూ.15,000లు జమచేస్తోంది. అంతకుపూర్వం ఇలాంటి పథకం ఈ రాష్ట్రంలో కానీ దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోను లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్ధారించబడిన ఫీజు అమ్మఒడి నుండి చెల్లించిన పిదప ఇంకా విద్యా ఖర్చుల నిమిత్తం కొంత భాగం తల్లిదండ్రులకు మిగులుతుంది. గతంలో ప్రైవేట్ పాఠశాల్లో ఫీజులపై నియంత్రణలేదు. విద్యా హక్కు చట్టం అమలుచేయలేదు. ఇది తల్లిదండ్రులకు భారం కాదు.. అని ఫ్యాక్ట్‌చెక్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. -
విషాద జీవితాల అనాథ బిడ్డలకు ‘అమ్మఒడి’ ఆలంబన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆ బిడ్డలు చేసిన పాపం ఏమిటో వారెవరికీ తెలియదు. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి రాగానే అనాథలయ్యారు. అమ్మ ఆప్యాయత, నాన్న అనురాగానికి దూరమయ్యారు. వారిని ‘దాతృత్యం’ అక్కున చేర్చుకుంది. కన్నబిడ్డల కంటే మిన్నగా ఆదరించి కడపు నింపింది. అయితే దశాబ్దాలుగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. పాలకులు మారినా ఇటువంటి వారికి అందరి మాదిరిగానే ప్రభుత్వ పథకాలకు అర్హులైనా సంక్షేమ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మానవత్వం, ప్రభుత్వ యంత్రాంగం చొరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయాన్ని కదిలించింది. హృదయాలు ద్రవించే విషాద జీవితాల అనాథ బిడ్డలకు ఒక్క సంతకం ‘అమ్మఒడి’ ఆలంబనగా నిలిచింది. తల్లిదండ్రుల స్థానంలో దేవుళ్ల పేరు పాఠశాలలో చేరే విద్యార్థులకు తల్లిదండ్రులు పేర్లు, మతం, కులం తప్పనిసరిగా పొందుపర్చాల్సింగా స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయితే తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథ బిడ్డలకు దేవుళ్లే తమ తల్లిదండ్రులుగా భావించి (సరస్వతి, లక్ష్మీ, పార్వతి, శివయ్య, బ్రహ్మ, విష్ణుమూర్తి) వంటి పేర్లను రాసుకుంటున్నారు. గతంలో ఎస్ఎస్సీ పరీక్షల్లో తండ్రి పేరే రాయాల్సి ఉండేది. 2009 సెప్టెంబర్ 14 నుంచి తల్లి పేరు తప్పనిసరి చేయడంతో తల్లి పేరు కూడా రాయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు తండ్రి పేరు రాసేందుకు తంటాలు పడిన విద్యార్థులు చివరకు తల్లిదండ్రులుగా దేవుళ్లు, దేవతల పేర్లనే దరఖాస్తుల్లో నమోదు చేసుకుంటున్నారు. సంక్షేమానికి దూరంగా అనాథ బాలబాలికలు రాష్ట్ర ప్రభుత్వం విద్యావిప్లవాన్ని తీసుకొచ్చింది. పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. నాడు–నేడు పథకంతో మౌలిక వసతులను సమకూర్చింది. అర్హులైన విద్యార్థులు పాఠశాలల్లో ఉండాలనే సంకల్పం తీసుకుంది. ఇంతటి మహోన్నత ఆశయంలో కూడా అనాథ బాలబాలికలకు ‘అమ్మఒడి’ అర్హత లేకుండా పోయింది. సంక్షేమ పథకాలకు ప్రధానంగా రేషన్‌కార్డు, కులం, ఆదాయం, ఆధార్ కార్డు తప్పనిసరిగా అయ్యాయి. ఎవరో దాత దాతృత్వంతో బతికే వీరికి కులం, ఆదాయ ధ్రువీకరణ, గుర్తింపు కార్డులు గగనమయ్యాయి. దీంతో అర్హులైనప్పటికీ అమ్మఒడి వర్తించడంలేదు. ఫలించిన ఎంపీ వేమిరెడ్డి కృషి వాత్సల్య అనాథాశ్రమ నిర్వాహకులు ఈ పరిస్థితిని ఓ వైపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తూనే మరోవైపు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాలబాలికల విద్యకోసం విశేషంగా కృషి చేస్తున్న తరుణంలో అనాథలకు అమ్మఒడి పథకం వర్తించకపోవడాన్ని విని చలించిపోయారు. కలెక్టర్‌తో చర్చించి నివేదికను రూపొందించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 227 మంది అనాథ బాలబాలికలు అమ్మఒడికి అర్హులుగా తేల్చారు. అదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లాతో సరిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమాల్లో ఉంటూ చదుకుంటున్న అనాథ బాలబాలికలు వివరాలపై నివేదిక కోరారు. ఆ విధంగా 5,990 మంది అనాథ విద్యార్థులకు రూ.7.787 కోట్లు విడుదల చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లెటర్ నంబర్.1768275/2022 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు నెల్లూరు జిల్లాలోని అనాథ బాలబాలికలకు రూ.29.51 లక్షలు విడుదలయ్యాయి. నెల్లూరులో బీజం.. అనాథ బిడ్డలకు అమ్మఒడి పథకం వర్తింప చేయాలనే ఆలోచనకు నెల్లూరులో బీజం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న అందరికీ వర్తించింది. నెల్లూరు నగరంలోని కొండాయపాళెం రోడ్డు సమీపంలోని రామకృష్ణానగర్‌లో ఉన్న జనహిత–వాత్సల్య సేవా సంస్థలో దాదాపు 117 మంది అనాథ బాలలు ఆశ్రమం పొందుతున్నారు. దాతల దాతృత్వంలో నడిచే ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో భారతీయ విద్యా వికాస్ పేరుతో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను నిర్వహిస్తోంది. ఆ పాఠశాలలో విద్యను అభ్యసించే ఇతర విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తిస్తోంది. అనాథలుగా ఉన్న విద్యార్థులకు వర్తించడం లేదు. ఇదే విషయం జనహిత–వాత్సల్య సేవా సంస్థ ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. కలెక్టర్ చక్రధర్‌బాబు చొరవతో ఇటువంటి అనాథలను జిల్లా వ్యాప్తంగా 227 మందిని గుర్తించి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో అమ్మఒడి పథకం వర్తించింది. జిల్లా నుంచి వెళ్లిన సిఫార్సులను పరిశీలించిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వర్తింప చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనాథ బాలబాలికలకు 5,590 మందికి రూ.7.787 కోట్లు అమ్మఒడి నిధులు మంజూరయ్యాయి. అనాథలకు ఎంతో ఉపయోగం చదువుకు సర్కార్ తోడ్పాటునిస్తోంది. అమ్మఒడి చక్కటి పథకం. ఎంతో కాలంగా అనాథ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నాం. మా అభ్యర్థను కలెక్టర్ మన్నించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చొవర కారణంగా సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసున్న ముఖ్యమంత్రి అని చాటుకున్నారు. ఆశ్రమాలు నిర్వహణకు అమ్మఒడి తోడ్పాటు కానుంది. – జీవీ సాంబశివరావు, వాత్సల్య అనాథాశ్రమం సంస్థాగత కార్యదర్శి సమాజంలో వారికి గుర్తింపు సమాజంలో అనా«థలను ప్రభుత్వాలు అక్కున చేర్చుకోవాలి. గత ప్రభుత్వాలు అనా«థల విషయంలో సరైన న్యాయం చేయలేకపోయింది. కేవలం దాతల దాృతత్వంతోనే జీవనం సాగిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం స్పందించింది. అమ్మ ఒడి పథకం వర్తించేలా కసరత్తు చేయడం హర్షనీయం. అనా«థలు అంటే మన పిల్లలే అనే భావన అందరిలో కలగాలి. వారిని చేరదీసి ప్రయోజకుల్ని చేయాలి. – సామంతు గోపాల్‌రెడ్డి, వాత్సల్య సేవా సంస్థ గౌరవాధ్యక్షుడు -
విద్యారంగంలో దూసుకుపోతున్న ఏపీ
విద్యాభివృద్ధి మీదే సమాజాభివృద్ధి అధారపడి ఉంటుంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారం చేపట్టిన వెంటనే ముందు విద్యా రంగంపై దృష్టిపెట్టారు. ‘నాడు–నేడు’లో భాగంగా ప్రభుత్వ బడులలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టారు. తొలి దశ క్రింద 15,715 స్కూళ్లలో సదుపాయాలను కల్పించగా... ప్రస్తుతం రెండో విడత పనులు జరుగుతున్నాయి. ఈ దశలో స్కూళ్లతో పాటుగా కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, డైట్‌తో పాటు శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రాథమిక తరగతి నుండి ఇంటర్ వరకు ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా విద్యార్థులను పాఠశాలకు రప్పించడానికి ప్రతి విద్యార్థి తల్లికి 15 వేల రూపాయలను ఆమె ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం. పాఠశాల ప్రారంభంలోనే ‘జగనన్న విద్యా కానుక’ రూపంలో విద్యార్థులకు బుక్స్, బ్యాగ్, యూనిఫాం, బూట్లు, టై, బెల్టులు, డిక్షనరీలు ప్రతి విద్యార్థికి అందిస్తోంది. అలాగే ఉన్నత విద్య చదవాలన్న ఆసక్తి కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. ‘జగనన్న విద్యాదీవెన’, ‘వసతి దీవెన’ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సహాయం అందిస్తోంది. అర్హత ఉన్న విద్యార్థులు అన్ని కోర్సులకు చెల్లించే ఫీజును తిరిగి విద్యార్థులకే చెల్లిం చాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘జగనన్న విద్యాదీవెన’ ద్వారా 24.74 లక్షల మంది విద్యార్థులకు రూ. 8,365 కోట్ల పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లింపులు జరిగాయి. ‘జగనన్న వసతి దీవెన’ కింద 18.77 లక్షల మందికి రూ. 3349.57 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా ఈ మూడేళ్లలో 44.5 లక్షల మంది ఖాతాల్లో రూ. 19617.60 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 98 శాతం మందికి విద్య అందుబాటులోకి వచ్చిందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం) రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో చేస్తున్న అనేక రకాల సంస్కరణల్లో మరొకటి ఇంటర్ విద్యను, పాఠశాల విద్యను కలిపి ‘ప్లస్ 2’ చేయడం. దీనివలన మూడవ తరగతి నుండి ఇంటర్మీ డియట్ వరకు విద్య ఒకే చోట దొరుకుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని మూడు నుంచి ఆరేళ్ల వయస్సుగల పిల్లలకు అందించడంలో ఏపీ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ‘ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్’ (ఈసీఈ) అమలులో ఏపీ అగ్రస్థానంలో ఉంది. పేద విద్యార్థులకు ఆధునిక పద్ధతిలో జ్ఞానాన్ని అందించే క్రమంలో ‘విద్యా కానుక’లో భాగంగా ఈ ఏడాది 4.70 లక్షల మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు, దాదాపు 50 వేల మంది టీచర్లకు 665 కోట్లతో 5.18 లక్షల ట్యాబ్‌లను ప్రభుత్వం అందించనున్నది. ఇలా ఏపీ విద్యాసంస్కరణలతో ముందుకు దూసుకు పోతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. - వి.వి. రమణ సామాజిక విశ్లేషకులు -
సచివాలయాల వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం సాకారం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలనలో పెను మార్పులు తెచ్చి గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం చెప్పిన సచివాలయాల వ్యవస్థ ఎంతో బాగుందని, ముందుచూపుతో ఏర్పాటైన ఈ వ్యవస్థ భవిష్యత్తు తరాలకూ ఎంతో ఉపయోగకరమని ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. సచివాలయాలపై పట్టణ ప్రాంత ప్రజల మనోగతం అనే అంశంపై ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ సోషల్ వర్క్ చదువుతున్న విద్యార్థిని తాటిపూడి తనూజ స్రవంతి ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్ సమయంలో సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పని చేసిందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వలంటీర్ల ద్వారా చేరవేశారని తెలిపారు. సచివాలయాల్లో ఉద్యోగులు మరింత అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. అద్భుతమైన సచివాలయ వ్యవస్థ నిర్వహణలో చిన్నపాటి లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్న సూచనలు వ్యక్తమయ్యాయి. గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 51వ వార్డులోని గాంధీనగర్ సచివాలయ పరిధిలో ఈ అధ్యయనం నిర్వహించారు. 45 ప్రశ్నలకు సచివాలయ పరిధిలోని వంద మందితో సమాధానాలు రాబట్టారు. ప్రాజెక్టు వర్క్‌ను ఏయూ వీసీ ప్రసాదరెడ్డికి ఈ నెల 28వ తేదీన విద్యార్థిని అందచేసింది. 83 మంది పురుషులు, 17 మంది మహిళలు సర్వేలో పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు 9 మంది, ప్రైవేట్ ఉద్యోగులు 48 మంది, వేతన కూలీలు 24 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. ► సచివాలయాల ఏర్పాటు మంచి నిర్ణయమని, దీనివల్ల భవిష్యత్తులోనూ ఎంతో ఉపయోగం ఉంటుందని 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారైనా సచివాలయానికి వెళుతున్నట్లు 78 శాతం మంది సర్వేలో చెప్పారు. ► నవరత్నాల పథకాల గురించి సమగ్ర అవగాహన ఉందని 77 మంది పేర్కొనగా 23 మంది కొన్ని పథకాలు గుర్తున్నాయని చెప్పారు. ► అమ్మ ఒడి పథకం భేష్ అని 53 శాతం మంది వెల్లడించారు. ఇది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని తెలిపారు. ► వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ద్వారా తమ సొంతింటి కల నెరవేరిందని 62 మంది తెలిపారు. ఆ పథకానికి అర్హత లేనందున తమకు అందలేదని 38 మంది చెప్పా రు. ► 86 శాతం మందికి హెల్త్‌కార్డులుండగా 14 శాతం మంది హెల్త్ కార్డులు లేవని తెలిపారు. ► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలు చాలా ఉపయోగపడుతున్నాయని 64 శాతం మంది పేర్కొన్నారు. ► కోవిడ్ సమయంలో సచివాలయ సిబ్బంది తమ ఇంటిని సందర్శించారని 74 శాతం మంది పేర్కొనగా 26 శాతం మంది మాత్రం రాలేదని చెప్పారు. సచివాలయాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని 83 శాతం మంది తెలిపారు. ► సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారా? అనే ప్రశ్నకు 52 శాతం మంది అవునని పేర్కొనగా 48 శాతం మంది మాత్రం సరిగా ఉండటం లేదని చెప్పారు. వార్డు శానిటరీ సెక్రటరీ నిరంతరం విధుల్లో ఉంటున్నట్లు 32 మంది బదులిచ్చారు. ఆ తర్వాత వెల్ఫేర్ సెక్రటరీలు 18 శాతం, హెల్త్ సెక్రటరీలు 14 శాతం మంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వంద మందిలో ఒక్కరు కూడా టౌన్‌ప్లానింగ్, వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీలు అందుబాటులో ఉంటున్నట్లు చెప్పలేదు. ► సచివాలయాల ద్వారా అందచేసే సేవలపై 51 శాతం మందికి అవగాహన ఉండగా 49 శాతం మంది మాత్రం పూర్తిస్థాయి అవగాహన లేదని చెప్పారు. మీ వలంటీర్ ఎవరు? తెలుసు – 89 తెలియదు – 11 మీ సచివాలయం ఎక్కడ? తెలుసు – 92 తెలియదు –08 సచివాలయాల ద్వారా ఆదాయం, నివాస దృవపత్రం పొందారా? అవును –93 లేదు –07 సచివాలయాల ద్వారా జనన, మరణ సర్టిఫికెట్లు పొందారా? అవును –86 లేదు – 14 గ్రామ స్వరాజ్యం సాకారం ఎమ్మెస్సీ సోషల్ వర్క్‌లో నా సబ్జెక్టు కమ్యూనిటీ డెవలప్మెంట్. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోంది. – తాటిపూడి తనూజ స్రవంతి, ఎంఎస్సీ, సోషల్ వర్క్, ఏయూ ఇదీ చదవండి: Photo Feature: పచ్చని గిరులపై మేఘాల పల్లకి -
విద్యాదాత.. జగన్ మావయ్యకు ప్రేమతో.. (ఫొటోలు)
-
శ్రీకాకుళం : జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
ఆ రెండు వేల కోసం విమర్శిస్తున్నారు: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: పిల్లలకు ఏనాడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వని వాళ్లు.. ఇవాళ ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, అలాంటి వాళ్లు విమర్శించే మనస్తత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో సోమవారం జరిగిన మూడవ విడత అమ్మఒడి నిధుల విడుదల సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీపడే రోజు రావాలి. పోటీ ప్రపంచంలో మన పిల్లలు నెగ్గాలి కూడా. అలాంటి రోజు రావాలంటే క్రమం తప్పకుండా బడికి పోవాలి. బడికి వెళ్తేనే చదువు వచ్చేది. ఆ బాధ్యతను అక్కచెల్లెమ్మలే చూసుకోవాలి. నాడు-నేడులో బడుల రూపు రేఖలు మారుస్తున్నాం. పాఠశాలల మెయింటెనెన్స్ కోసమే అమ్మఒడిలో కాస్త కేటాయింపులు చేస్తున్నాం. స్కూళ్ల బాగోగుల కోసమే అమ్మ ఒడిలో రూ.2వేలు కేటాయించాం. కానీ, ఈ రెండు వేల రూపాయల మీద కొందరు విమర్శలు చేస్తున్నారు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి బతుకు మార్చాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని ఉద్ఘాటించిన సీఎం జగన్.. అతిపెద్ద ఎడ్యుకేషన్ బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ప్రతిఏటా 24వేలు ఖర్చు చేస్తే అందుబాటులోకి రాని బైజూస్ యాప్‌ను.. పేద పిల్లలకు ఉచితంగా ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఏనాడైనా నిజాలు చెప్పే ధైర్యం ఉందా? దుష్టచతుష్టయాన్ని సీఎం జగన్ నిలదీశారు. ఐదేళ్ల బాబు పాలనలో ఇలాంటి ఆలోచన కూడా చేయలేదని గుర్తు చేశారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆయాలకు 8నెలల జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది. చంద్రబాబు పాలనలో పోషణం పథకానికి ఐదు వందల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అలాంటిది మన ప్రభుత్వం వైఎస్సార్ పోషణం కింద రూ.5వేల కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు కుయుక్తులు, కుతంత్రాల మధ్య యుద్ధం జరుగుతోంది. మారీచులతో మనం యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేదరని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇంకా సీఎం జగన్ ఏమన్నారంటే.. ► మూడేళ్లలో అమ్మఒడి కింద రూ.19,617 కోట్లు ఖర్చు చేశాం. ► విద్యాదీవెన కింద దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశాం. ► జగనన్న వసతి దీవెన కింద రూ. 3,329 కోట్లు ఖర్చు చేశాం. ► విద్యాదీవెన, వసతి దీవెన.. ఈ రెండింటి మీదే మూడేళ్లలో రూ.11 వేల కోట్లు ఖర్చు. ► జగనన్న గోరుముద్ద కోసం రూ.3,200 కోట్లు ఖర్చు చేశాం. ► విద్యార్థుల ఉన్నత భవిష్యత్ కోసం రూ.52,600 కోట్లు ఖర్చు చేశాం. ప్రతీ విద్యార్థి బతుకు బాగుపడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ ఆశయ సాధన దిశగా కృషి చేస్తానని పేర్కొంటూ అమ్మ ఒడి మూడో విడుత నిధులను రిలీజ్ చేశారు సీఎం జగన్. చదవండి: అందుకే 75 శాతం హాజరు తప్పనిసరి చేశాం: సీఎం జగన్ -
జగన్ మావయ్యా.. మీరు మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు
శ్రీకాకుళం: అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి చదువుతున్న నిహారిక అనే విద్యార్థిని ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడింది. సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ తీసుకొచ్చిన మార్పులను కొనియాడింది ఆ విద్యార్థిని. ఆ బాలిక ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా సాగింది. దీన్ని చూసి సీఎం జగన్ మురిసిపోయారు. చివర్లో సీఎం జగన్‌పై తెలుగులో ఒక కవిత్వం కూడా చెప్పింది. జగన్ మావయ్యా.. ‘మీరు రాజన్నకి పుత్రుడు, రైతన్నకి మిత్రుడు, అక్కాచెల్లెలమ్మకు అన్నదమ్ముడు, మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు’.. అంటూ తన ప్రసంగాన్ని ముగించింది.ఈ క్రమంలోనే సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకుంది విద్యార్థిని నిహారిక. అందర్నీ కట్టిపడేసిన ఈ చిన్నారి ప్రసంగం మీరు వినండి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇక్కడ చదవండి: చదువు మీద పెట్టే ప్రతిపైసా గొప్ప పెట్టుబడి: సీఎం జగన్ -
చదువు మీద పెట్టే ప్రతిపైసా పవిత్రమైన పెట్టుబడి: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: చదువుల మీద పెట్టే ప్రతిపైసా.. పవిత్రమైన పెట్టుబడి అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆర్థిక పరిస్థితులతో పిల్లలను చదివించలేని పరిస్థితి శాపం కాకూడదని కోరుకున్న ఆయన.. పిల్లలను బాగా చదివించినప్పుడే వాళ్ల జీవితాలు మారుతాయని చెప్పారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమ సభలో ప్రసంగించారు ఆయన. సభా ప్రాంగణం నుంచి సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘చెరగని చిరునవ్వుతో అప్యాయత చూపిస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. అక్షరాల 43 లక్షల 96 వేల మందికి పైగా తల్లులకు, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. అక్షరాల 6, 595 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో నేరుగా జమ చేసే గొప్ప కార్యక్రమం ఇద’’ని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు ఒక మంచి అన్నయ్య వాళ్లకు తోడుగా ఉన్నానని తెలియజేసే ఈ కార్యక్రమం.. దేవుడి దయ వల్ల ముందుకు సాగుతోందని చెప్పారాయన. మనిషికి చదువే నిజమైన ఆస్తి అని పేర్కొన్న సీఎం జగన్.. చదువులు ఎక్కువగా ఉండే దేశాల్లో ఆదాయమూ ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతీ ఇంట్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీలో గత మూడేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం జగన్.. మనిషి తలరాతను మార్చేసే శక్తి చదువుకు ఉందని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్ని చూశానని.. అందుకే అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని ఆయన చెప్పారు. పిల్లలను బడికి పంపిస్తే చాలూ.. ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం తమ ప్రభుత్వం అందిస్తుందని.. పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుందని, వాళ్ల భవిష్యత్తు బాగుండాలనే 75 శాతం హాజరు నిబంధన తీసుకొచ్చామని తెలిపారు. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే తన లక్ష్యమని మరోసారి ఉద్ఘాటించారు సీఎం జగన్. ఇంకా.. ► ఒక్కో విద్యార్థికి రూ. 12వేలు విలువ చేసే ట్యాబ్‌ను.. సెప్టెంబర్‌లో అందజేస్తాం. ఇందుకోసం రూ.500 కోట్ల ఖర్చు చేయబోతున్నాం. ► ప్రతి క్లాస్ రూమ్‌లో డిజిటల్ బోర్డులు అందుబాటులోకి తెస్తున్నాం. ► కోడి రామ్మూర్తి స్టేడియం మరమ్మత్తుల కోసం పదికోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. -
CM YS Jagan: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఇలా..
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా సీఎం అదనపు పీఎస్ కె.నాగేశ్వరరెడ్డి టూర్ షెడ్యూల్‌ను వివరిస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం ఉదయం 9 గంటలకు ఆయన నివాసం నుంచి బయల్దేరి 9.20 గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుతారు. 9.30 గంటలకు విమానంలో బయల్దేరి విశాఖపట్నంకి 10.15కు చేరుకుంటారు. 10.25కు హెలీకాప్టర్‌లో విశాఖపట్నం నుంచి బయలుదేరి 11గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 నుంచి 11.15 వరకు ప్రజలు, అధికారులతో మాట్లాడుతారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఉన్న హెలీప్యాడ్ నుంచి బయల్దేరి కోడి రామ్మూర్తి స్టేడియానికి 11.25కు చేరుకుంటారు. 11.25 నుంచి 11.45 వరకు సభావేదికపైన అతిథుల ప్రసంగం ఉంటుంది. 11.45 నుంచి 11.55 వరకు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడతారు. 11.55 నుంచి 12.40 వరకు సీఎం ప్రసంగిస్తారు. 12.40 నుంచి 12.45 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమ్మఒడి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు బటన్ నొక్కుతారు. 12.45కి బయలుదేరి ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద హెలీప్యాడ్‌కు చేరుకుంటా రు. మధ్యాహ్నం 1 గంటకు హెలీకాప్టర్‌లో బయల్దేరి 1.35కు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం 1.45కు విశాఖపట్నం నుంచి విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు 2.30గంటలకు చేరుకుంటారు. అనంతరం సీఎం నివాసానికి 2.40 గంటలకు చేరుకుంటారు. చదవండి: (గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల) -
అమ్మ ఒడికి రూ.6,594.60 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్కరి చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో నవరత్నాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి పథకం కింద ఈ ఏడాది 43,96,402 మంది తల్లులకు లబ్ధి చేకూర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో 54 శాతం మంది బీసీలు, 21 శాతం మంది ఎస్సీలు, 6 శాతం మంది ఎస్టీలు, 19 శాతం మంది ఓసీలు ఉన్నారు. ఈ పథకం కింద ఈ నెల 27న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,594.60 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా అమ్మ ఒడి పరిథిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. ఈ పథకం ద్వారా 82,31,502 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను సమాచార, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నాణ్యమైన విద్య దిశగా మరో ముందడుగు ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర విద్యా రంగంలో మరో భారీ కార్యక్రమం అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా కొందరికే పరిమితమైన ఎడ్యు–టెక్ విద్య ప్రభుత్వ స్కూళ్లలోని పేద పిల్లలకు అందుబాటులోకి రానుంది. ► ఏటా రూ.20 వేల నుంచి రూ.24 వేలు పైబడి చెల్లిస్తేకాని లభించని బైజూస్.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు అందుబాటులోకి వస్తోంది. తెలుగు – ఇంగ్లిష్ మాధ్యమాల్లో సమగ్రంగా నేర్చుకునేందుకు వీలు కల్పించేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ► 2025లో సీబీఎస్ఈ నమూనాలో పరీక్షలు రాయనున్న ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులను సుశిక్షితులుగా మార్చేందుకు ప్రభుత్వం ఇంకొన్ని అడుగులు వేస్తోంది. ఈ విద్యార్థులకు సిలబస్‌తోపాటు అదనంగా ఇంగ్లిష్ లెర్నింగ్ యాప్, నేర్చుకునేందుకు ట్యాబ్‌లు ఇవ్వనుంది. ► దాదాపు 4.7 లక్షల మంది పిల్లలకు ఈ సెప్టెంబర్‌లో ట్యాబ్‌లు ఇస్తున్నాం. దీనికోసం ప్రభుత్వం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లు ఇస్తుంది. వీళ్లు 9వ తరగతిలోకి వెళ్లేసరికి ఆ తరగతి పాఠాలకు సంబంధించి కంటెంట్ డౌన్లోడ్ చేసి సిద్ధం చేస్తుంది. అలాగే 10వ తరగతిలోనూ కంటెంట్‌ను సమకూరుస్తుంది. ► వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌ను పొందుపరిచి పాఠ్యపుస్తకాలను ముద్రించనుంది. వీడియో కంటెంట్ ద్వారా పిల్లలు నేర్చుకునేందుకు నాడు – నేడు కింద ప్రతి తరగతి గదిలో టీవీలు ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రులు వచ్చే నెలలో సంక్షేమ క్యాలెండర్ అమలు ► 2022 సంక్షేమ క్యాలెండర్లో భాగంగా జూలైలో అమలు చేయనున్న నాలుగు పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూలై 5న జగనన్న విద్యా కానుక, జూలై 13న వైఎస్సార్ వాహన మిత్ర, జూలై 22న వైఎస్సార్ కాపు నేస్తం, జూలై 26న జగనన్న తోడు పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ► వివిధ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి.. మిగిలి పోయిన లబ్ధిదారులకు జూలై 19న ఆ పథకాల కింద ప్రయోజనం చేకూర్చడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ► వంశధార ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు అదనపు పరిహారంగా రూ.216.71 కోట్ల పంపిణీకి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను మంత్రివర్గం ఆమోదించింది. వర్శిటీ, కార్పొరేషన్, సొసైటీ ఉద్యోగులకు పీఆర్సీ ► యూనివర్సిటీలు, కార్పొరేషన్, సొసైటీ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేస్తూ గతంలో మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ► 70 ఏళ్లు పైబడ్డ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయకూడదనే ప్రతిపాదనకు ఆమోదం. పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ మరణిస్తే అంతిమ సంస్కారాల ఖర్చుల కింద ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ► అర్జున అవార్జు గ్రహీత, ప్రముఖ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నంకు గ్రూప్–1 సర్వీసు కింద డిప్యూటీ కలెక్టర్ పోస్టులో నియామకానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. కొత్త వైద్య కళాశాలల్లో 3,530 పోస్టుల భర్తీ ► విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలల్లో ఒక్కో కళాశాలలో 706 ఉద్యోగాల చొప్పున, మొత్తంగా 3,530 కొత్త పోస్టుల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. ► వైద్య విధాన పరిషత్‌కు సంబంధించిన ఆస్పత్రుల్లో పడకల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని ఉంచేందుకు వీలుగా అదనంగా మరో 2,558 పోస్టులు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. ఆక్వా రైతులకు పెద్ద ఊరట ► ఆక్వా సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం విద్యుత్ చార్జీలలో రాయితీ ఇస్తోంది. ఇప్పటికే 5 ఎకరాలలోపు సాగు చేస్తున్న రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు అందిస్తోంది. ఇప్పుడు పది ఎకరాలలోపు ఆక్వా సాగు చేస్తున్న రైతులకు కూడా దానిని వర్తింప చేయడానికి ఆమోదం. ► రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ రూ.500 కోట్ల రుణాలకు సంబంధించి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు అనుమతి. ► ఆదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు 3,700 మెగావాట్ల హైడ్రో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ఆమోదం. దీనివల్ల రైతులకు ఎకరాకు లీజు రూపేణా రూ.30 వేలు నికర ఆదాయం లభిస్తుంది. ► ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పునర్ వ్యవస్థీకరణ, కొత్త పోస్టుల నియామకం, ఎగ్జిక్యూటివ్ కేడర్ బలోపేతం వంటి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్. జగనన్న స్మార్ట్ టౌన్షిల్లలో పైవేటుకూ భాగస్వామ్యం ► జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ఏంఐజీ లే ఔట్స్‌లలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధికి సంబంధించి విధి, విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న భూసేకరణ విధానాలకు అదనంగా మరో కొత్త విధానం ప్రవేశ పెట్టందుకు అంగీకారం. ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే లేఔట్స్‌లో 40 శాతం ఫ్లాట్లను ప్రభుత్వం నిర్దేశించిన వారికి, 60 శాతం ఫ్లాట్లను ప్రైవేటు సంస్థ విక్రయించుకోవచ్చు. ► మానసిక, శారీరక దివ్యాంగులకు, అనాథలకు, నిరుపేదలకు సేవలు అందిస్తున్న వివిధ ఛారిటబుల్ సంస్థలకు ఇచ్చిన స్థలం లీజు కాలాన్ని పొడిగించేందుకు ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు అనుమతి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. గండికోటలో ఇంటిగ్రేటెడ్ టూరిజం ప్రాజెక్టు ► వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటిగ్రేటెడ్ టూరిజం ప్రాజెక్టు కోసం పర్యాటక శాఖకు 1,131.39 ఎకరాల స్థలం కేటాయింపునకు ఆమోదం. ► టూరిజం పాలసీ 2020–25కు అనుగుణంగా తిరుపతిలో నొవొటెల్ బ్రాండ్ కింద హోటల్ నిర్మాణానికి లీజు విధానంలో భూమి కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్. ► హరే కృష్ణా మూవ్మెంట్, దేవదాయ శాఖ మధ్య భూమి లీజు ఒప్పందం విషయంలో స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు ఆమోదం. ► 2018 అక్టోబర్‌లో తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న 90,789 మంది రైతుల పంటలకు రూ.182,60,06,490 అదనపు ఇన్పుట్ సబ్సిడీ అందజేసేందుకు కేబినెట్ ఆమోదం. మరిన్ని కీలక నిర్ణయాలు ఇలా.. ► జిల్లాల పునర్విభజన నేపథ్యంలో 13 పాత జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీ చైర్మన్లనే 26 జిల్లాలకు కొనసాగిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను చట్టంగా తెచ్చేందుకు ఆమోదం. ► బద్వేలులో కొత్తగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 26 పోస్టుల నియామకాలు. ► సత్యసాయి జిల్లా ధర్మవరంలో రెండో పట్టణ పోలీసు స్టేషన్ ఏర్పాటు. ► వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు 3,148.68 ఎకరాలను ప్రభుత్వ ఈక్విటీగా పరిగణన. ► ఈ నెల 22న స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం. ► తిరుపతి ఏపీఐఐసీలో ఈఎంసీ–2లో వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎకరా రూ.38.44 లక్షల చొప్పున 75 ఎకరాల కేటాయింపు. ► ప్రభుత్వ, ఎయిడెడ్ పాలిటెక్నిక్ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు పే స్కేల్స్ వర్తింపు. ► హైకోర్టు ఆదేశాల మేరకు డిసిఫ్లీనరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్ రద్దు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్న డిసిప్లీనరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులను నియమించని పరిస్థితి. మూడు నెలల్లో కేసులు పరిష్కారించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు.. వాటిని పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయం. ఇందులో భాగంగా ఇప్పటిదాకా పెండింగ్‌లో ఉన్న 789 కేసులను కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కి బదలాయించాలని ఆదేశం. ► గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో 100 కొత్త పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఈ మేరకు సర్వీసు రూల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశం. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా.. ► కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు సంబంధించి సవరణలు, మార్పులు, చేర్పులుతో కూడిన తుది నోటిఫికేషన్‌ను ఆమోదించింది. ► కొత్తగా ఏర్పాటు చేసిన బద్వేలు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కొత్తగా 20 పోస్టులు మంజూరు. ► నెల్లూరు జిల్లా కనుపూరులో మైసూరుకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్ట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ స్టడీస్ ఇన్ క్లాసికల్ తెలుగు కోసం 5 ఎకరాల స్థలం. ► సత్యసాయి జిల్లా పెనుకొండలో 63.29 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు. ► ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ యాక్ట్ 1971కు సవరణలతో కూడిన డ్రాప్ట్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్. ► వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఇందుకూరులోని సర్వారాయ సాగర్ రిజర్వాయర్ పేరును కమ్యూనిస్టు యోధుడు నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయర్‌గా మార్పు చేస్తూ.. జల వనరుల శాఖ చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. -
‘అమ్మ ఒడి’పైనా విషం
ఆలూ లేదు..చూలూ లేదు.. కొడుకు పేరు రామోజీరావు అనే తీరులో ఉంది ‘ఈనాడు’ కథనం. ‘అమ్మ ఒడి’ పథకంలో తుది జాబితాలు ఖరారు కాకముందే... ‘1.29 లక్షల మందికి కోత’ ‘మరో లక్షన్నర మంది తల్లుల ఈ–కేవైసీ పెండింగ్’ అంటూ ఎడాపెడా గుండెలు బాదేసుకున్నారు రామోజీరావు. వాస్తవాలన్నీ దాచిపెట్టి... ఇంతటి బృహత్తర పథకంపై కూడా విషపు రాతలతో రెచ్చిపోయారు. పిల్లల్ని స్కూలుకు పంపి చదివించేలా తల్లుల్ని ప్రోత్సహిస్తూ నేరుగా వారి ఖాతాల్లోకే ఏటా రూ.15 వేలు జమచేస్తున్న ఇలాంటి పథకం నభూతో అన్న రీతిలో దేశంలో ఎక్కడా లేదు. చదువుకునే పిల్లల సంఖ్యలో గణనీయమైన మార్పు తెచ్చిన ఈ బృహత్తర పథకానికి కేంద్రం, ఇతర రాష్ట్రాలు సైతం జై కొడుతున్నాయి. ముఖ్యమంత్రి జనాదరణను దెబ్బతీయటానికి ప్రతిరోజూ తప్పుడు రాతలతో చెలరేగిపోతున్న ‘ఈనాడు’కు మాత్రం ఇందులోనూ రంధ్రాలు కనిపించడం విచిత్రమేమీ కాదనే అనుకోవాలి. అసలు నిజంగా ఈ సంవత్సరం తగ్గిన లబ్ధిదారులెందరు? ఎందుకు తగ్గారు? ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత? ఒకసారి చూద్దాం... పిల్లలంటే భవిష్యత్... అన్న రీతిలో విద్యా రంగంలో ఊహించని మార్పులను విజయవంతంగా అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ‘అమ్మ ఒడి’ కూడా ఆయన ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్నదే. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే వారికే పరిమితం చేయాలని సూచనలొచ్చినా... చదువే ముఖ్యం కనక ప్రైవేటు స్కూళ్లలోని వారికీ వర్తింపజేశారు. గరిష్ట సంఖ్యలో తల్లులకు లబ్ధి కలిగించి... వారంతా తమ పిల్లలను బడిబాట పట్టించాలనేది జగన్ ఆలోచన. కాకపోతే ఏ పథకంలోనైనా అర్హులకు కొన్ని నిబంధనలుంటాయి కనక దీన్లో పిల్లలకు స్కూల్లో 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన పెట్టారు. గడచిన రెండేళ్లూ కోవిడ్ మూలాన స్కూళ్లకు సెలవులెక్కువ వచ్చాయి కనక అప్పట్లో ఈ నిబంధనను కూడా పట్టించుకోలేదు. ఈ సంవత్సరం ఈ నిబంధన ప్రకారం తగ్గింది ఎంత మందో తెలుసా? 1.2 శాతం!!. గతేడాది 44,48,865 మందికి అమ్మ ఒడి పథకం అందగా... ఈ ఏడాది హాజరు నిబంధనతో 52,463 మంది తగ్గి... 43,96,402 మందిని ప్రస్తుతానికి ఖరారు చేశారు. అంటే తగ్గిన వారి శాతం కేవలం 1.2. కానీ ‘ఈనాడు’ మాత్రం నోటికొచ్చిన లెక్కలతో కథనం వండి వార్చేసింది. విధివిధానాలు తెలియవా రామోజీ? ప్రతి పేద తల్లీ తన పిల్లలను తప్పనిసరిగా స్కూలు, కాలేజీకి పంపించి చదివించే లక్ష్యంతో 1 నుంచి 12 తరగతులకు వర్తించేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం... అర్హులకు కొన్ని నిబంధనలు నిర్దేశించింది. దానిప్రకారం లబ్ధిదారు ఇంట్లో చదువుకునే పిల్లలు ఎందరున్నా ఏటా రూ.15వేలు అందిస్తారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలే దీనికి అర్హులు. ఎక్కువ మందికి పథకం అందజేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ దీన్ని సవరించి... ఆదాయ, ఇతర పరిమితులను పెంచారు కూడా. పైపెచ్చు కరోనా సమయంలో గత రెండేళ్లలో 75 శాతం హాజరును పూర్తిగా మినహాయించి అర్హులైన విద్యార్థుల తల్లులందరికీ అమ్మ ఒడిని అందించారు. ఈ ఏడాది స్కూళ్లు తెరిచినా... అతి తక్కువ హాజరున్న వారిని మాత్రమే అమ్మ ఒడి నుంచి మినహాయించేలా అధికారులకు తగు సూచనలిచ్చారు. ఫలితం... 43,96,402 మందిని అర్హులుగా విద్యాశాఖ గుర్తించింది. ఈ లెక్కన గత ఏడాది కన్నా తల్లుల సంఖ్య 52,463 వరకు తగ్గుతోంది. అంటే దాదాపు 1.2 శాతం. మరోవంక పథకానికి ఎంపిక కాకపోవడంలో పొరపాటు జరిగి ఉంటే సరిచేయడానికి కూడా ప్రభుత్వం అవకాశమిచ్చింది. వారికి మళ్లీ గడువిచ్చి దరఖాస్తు చేస్తే... పరిశీలించి అర్హులైతే గతంలో మాదిరిగానే పథకాన్ని అందిస్తారు. ఇదీ జరిగింది. తుది జాబితాలు ఖరారు కాకముందే..! ‘ఈనాడు’కు తొందరెక్కువ!. ఏదో ఒక వ్యతిరేక వార్త రాసి... ఆ రోజు గడిచేలా చూసుకోవటం దానికి అలవాటైపోయింది. ఎందుకంటే విద్యాశాఖ ఈ జాబితాలను సోషçల్ ఆడిట్ కోసం స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, గ్రామ, వార్డు సచివాలయాలకు పంపింది. అక్కడ పరిశీలించాక తుది జాబితా ప్రకటిస్తారు. పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే వాటిని సరిచేస్తారు కూడా. ఈ ప్రక్రియ పూర్తయ్యాకనే విద్యాసంవత్సరంలో ఎంత మందికి అమ్మ ఒడి అందిందో తేలుతుంది. రామోజీ మాత్రం ఇప్పుడే 1.29 లక్షల మందికి పథకం అందటం లేదని అచ్చేసేశారు. ఆ పత్రికే తెలుగు పాఠకులు చేసుకున్న ఓ పాపం మరి!. నిర్వహణ నిధిపైనా అక్కసే... కార్పొరేట్లకు చంద్రబాబునాయుడు తాకట్టు పెట్టేసిన విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలనుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి... ‘నాడు– నేడు’ పేరిట స్కూళ్ల ముఖ చిత్రాన్ని మార్చేశారు. దీనికోసం తొలి దశలో 15,713 స్కూళ్ల కోసం రూ.4 వేల కోట్లు ఖర్చుచేశారు. రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇన్ని కోట్లతో ఏర్పాటు చేసే మౌలిక వసతులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవసరం వస్తే మరమ్మతు చేయించాలి. దీనికోసమే అమ్మ ఒడిని అందుకుంటున్న తల్లులు ఆయా స్కూళ్లలోని టాయిలెట్ల నిర్వహణకు రూ.1,000 చొప్పున అందిస్తున్నారు. స్కూళ్లలోని ఇతర పరికరాల నిర్వహణ, మరమ్మతుల కోసం మరో రూ.1000 ఇవ్వాలని విద్యాశాఖ అభ్యర్థించింది. ప్రభుత్వమిచ్చే నగదులోంచి ఆ మొత్తాన్ని ఇవ్వటానికి వారికెలాంటి ఇబ్బందీ లేదు. దానివల్ల వారి పిల్లలకే కాక... ప్రభుత్వ బడులలోని 32 లక్షల మంది విద్యార్థులకు చక్కని సౌకర్యాలు సమకూరుతాయి. పైపెచ్చు తాము డబ్బులిస్తున్నాం కనక నిర్వహణ బాగుండాలని స్కూళ్లను అడిగే అవకాశం వారికొస్తుంది. స్కూళ్ల జవాబుదారీ తనం, నిర్వహణలో పారదర్శకత పెరుగుతాయి. కానీ వ్యవస్థ ఇంత సాఫీగా నడవటం రామోజీకి సుతరామూ నచ్చటం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది చంద్రబాబు కాదు. బాబు హయాంలో ఏ స్కూల్లోనూ కనీసం టాయిలెట్లు లేకున్నా ‘ఈనాడు’ ప్రశ్నిస్తే ఒట్టు!. కొన్ని స్కూళ్లలో టాయిలెట్లు ఉన్నా... వాటిని వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. నీళ్లు లేక... గోడలు లేక.. నిర్వహణ అంటే ఏంటో తెలియక మొత్తంగా స్కూళ్లు దయనీయ పరిస్థితికి చేరుకున్నాయి. అయినా ‘ఈనాడు’ అప్పట్లో స్కూళ్లు బాగులేవని కానీ, చంద్రబాబు దీనిపై దృష్టిపెట్టాలని కానీ ఎలాంటి వార్తలూ రాయలేదు. ఎందుకంటే అలా చేస్తే తమ మిత్రుల కార్పొరేట్ స్కూళ్లు ‘నారాయణా..’ అంటాయేమోనని వారి భయం. అందుకే ప్రభుత్వ స్కూళ్లకు దేవుడే దిక్కు అనే రీతిలో వదిలేశారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవటంతో... దుష్ప్రచారానికి దిగారు. ప్రభుత్వం నిర్వహణ ఫీజుల పేరిట కోత కోసేస్తున్నారంటూ తప్పుడు రాతలు అచ్చేశారు. పేద పిల్లలు చదువుకొనే ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ స్కూళ్లకు, కాలేజీలకు దీటుగా ప్రభుత్వం వేలకోట్ల నిధులు వెచ్చించి అన్ని సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. రూ.12వేల కోట్లకు పైగా ఇందుకోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటికే తొలివిడతలో 15713 స్కూళ్లను రూ.4000 కోట్లతో అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఇలా అభివృద్ధి చేసిన స్కూళ్లలో రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, మంచినీరు సదుపాయంతో పాటు విద్యుత్తు సదుపాయం, ఫ్యాన్లు, లైట్లు, కిచెన్షెడ్లు ఇలా ఏర్పాటుచేయించింది. వీటిని సరైన రీతిలో నిర్వహించకపోతే గతంలో మాదిరిగానే ఆయా స్కూళ్లు, కాలేజీలు మళ్లీ అధ్వాన్నంగా మారే పరిస్థితి వస్తుంది. గతంలో అన్ని స్కూళ్లలో మరుగుదొడ్లు కట్టినట్లు రికార్డుల్లో ఉన్నా నిర్వహణ లోపం వల్ల శిధిలమైపోయాయి. అలా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం టాయిలెట్ మెయింటెనెన్సు ఫండ్‌ను ఏర్పాటుచేసింది. విద్యార్థుల తల్లిదండ్రులను దీనిలో భాగస్వామ్యం చేసింది. తద్వారా పాఠశాలల్లో సదుపాయాలపై వారికి ప్రశ్నించే అధికారాన్ని కల్పించింది. అమ్మ ఒడి కింద వారందుకొనే రూ.15వేల నుంచి రూ.1000 చొప్పున వారు ఈ నిధికి స్వచ్ఛందంగా జమచేస్తున్నారు. ఇలా రూ.430 కోట్లు ఈ నిధికి చేరాయి. ఈ నిధులతో ఆయా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను అనుసరించి గరిష్టంగా నలుగురు ఆయాలను నియమించేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 48,139 మందిని పేరెంట్సు కమిటీల ద్వారా నియమించింది. వీరికి నెలకు రూ. 6 వేల చొప్పున గౌరవ భృతిని అందిస్తోంది. గతంలో నిర్ణయించిన భృతిని మార్పు చేసి ఈ మొత్తాన్ని ఇస్తోంది. టాయిలెట్ల నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఈ నిధి ద్వారా వారికి అందిస్తోంది. గడచిన మూడేళ్లుగా.. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ పథకానికి సంబంధించిన జీవో తెచ్చేనాటికే విద్యా సంవత్సరం ప్రారంభమైపోయింది. అయినా సరే ఆ ఏడాది నుంచే ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. తొలి ఏడాది 42,33,098 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.15వేలు చొప్పున జమ చేయించారు. 2020–21లో కరోనా సమయంలో స్కూళ్లు నడిచే పరిస్థితి లేకున్నా... పేద తల్లులకు అండగా నిలవాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకెళ్లారు. ఏకంగా 44,48,865 మంది తల్లులకు ఆర్థిక సాయం అందించారు. 2021–22కి సంబంధించి గత ఏడాదిలోని 44,48,865 మంది తల్లుల జాబితాను పరిశీలన చేపట్టింది. ఇంటర్ పూర్తయి వెళ్లేవారు... ఒకటిలోకి కొత్తగా చేరేవారు... వీరందరినీ సోషల్ ఆడిట్, ఆరంచెల పరిశీలన ప్రక్రియ అనంతరం లెక్క తేల్చి అర్హులందరికీ పథకాన్ని అందిస్తారు. ఆ ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే... 1,46,572 మందికి ఈ కేవైసీ పూర్తి కాలేదని తప్పుడు సమాచారంతో ‘ఈనాడు’ రెచ్చిపోయింది. -
ఆ ప్రచారం అవాస్తవం.. ‘అమ్మ ఒడి’పై మంత్రి బొత్స క్లారిటీ
సాక్షి, విజయనగరం: ఈ నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా తల్లుల అకౌంట్లలోకి నగదు జమ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గతంలో 32 శాతం మాత్రమే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివేవారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల సంఖ్య 65 శాతానికి పెరిగిందన్నారు. చదవండి: పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమన్నారు. అటెండెన్స్ ఆధారంగా లబ్ధి చేకూరుతుందన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కు పంపితేనే పథకం వర్తిస్తుందన్నారు. రూ.2 వేలు అనేది పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తాన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అధ్యాపకులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు. -
CM Jagan: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న శ్రీకాకుళం రాను న్నారు. అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే సీఎం చేపట్టనున్నా రు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం–ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు సమీక్షించేందుకు సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ మంగళవారం శ్రీకాకుళం వచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన సాగేదిలా.. ఈ నెల 27న సోమవారం ఉదయం 11 గంటల కు శ్రీకాకుళంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి అమ్మ ఒడి లబ్ధిదారులు హాజరు కానున్నారు. మూడో విడత పంపిణీ కార్యక్రమం ఇక్కడి నుంచే జరుగుతుంది. అంతకుముందు ఆమదాలవలస–శ్రీకాకుళం రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అమ్మ ఒడి లబ్ధిదారులతో మమేకమవుతారు. తిత్లీ, వంశధార ప్రాజెక్టుకు అదనపు పరిహారం పొందుతున్న లబ్ధిదారులతో కూడా కాసేపు ముచ్చటిస్తారు. ఈ సందర్భంగా ఆ లబ్ధిదారులు సీఎంకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా కోడి రామ్మూర్తి స్టేడియంను పరిశీలించిన సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ రాధిక తదితరులు ఏర్పాట్లపై సమీక్ష.. సీఎం హాజరవుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై తలశిల రఘురాం, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ రాధిక సమీక్షించారు. ముందు గా కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్ కళాశాల మైదా నం పరిశీలించారు. అనంతరం హెలీపాడ్ స్థలి, సీఎం పయనించే మార్గం, బహిరంగ సభ, లబ్ధిదారులతో ముఖాముఖీ తదితర వాటిపై చర్చించారు. అనంతరం ఆర్అండ్బీ బంగ్లాకు చేరుకుని జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించి పలు సూచన, సలహాలు చేశారు. కార్యక్రమంలో ధర్మా న రామ్ మనోహర్‌నాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, డీఆర్డీఎ పీడీ బి.శాంతిశ్రీ, ఆర్డీవో బి.శాంతి, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ ఓబులేసు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వడ్డి సుందర్, ఆర్అండ్బి ఎస్ఈ కాంతిమతి, డీఈవో పగడాలమ్మ, సమగ్ర శిక్ష అభియాన్ పీఓ జయప్రకాష్, డీఎస్పీ మహేంద్ర, వైఎస్సార్సీపీ నాయకులు మెంటాడ స్వరూప్, జలుమూరు ఎంపీపీ వాన గోపి, శిమ్మ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (28న ప్యారిస్‌కు సీఎం జగన్) సీఎం పర్యటన విజయవంతం చేయాలి అమ్మ ఒడి మూడో విడత పంపిణీ, మరికొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లాకొస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. అమ్మ ఒడి లబ్ధిదారులు, పార్టీ శ్రేణు లు హాజరై జయప్రదం చేయాలని కోరారు. -
విద్యా కార్యక్రమాలకు వెన్నుదన్ను
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సంక్షేమం దిశగా అమలు చేస్తున్న మన బడి నాడు–నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద కార్యక్రమాలపై మండల విద్యాధికారుల ద్వారా పూర్తి స్థాయిలో పర్యవేక్షించనుంది. వీటితో పాటు బోధనాభ్యసన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయించేలా కార్యాచరణను రూపొందించింది. ఈ నేపథ్యంలో ఎంఈవోలకు విద్యేతర కార్యక్రమాల బాధ్యతలు అప్పగించొద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మెమో ద్వారా సూచించారు. పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యం రాష్ట్రంలో 61,390 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వాటిలో 72,48,961 మంది విద్యార్థులున్నారు. ఈ స్కూళ్లలో 2,90,662 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం పలు పథకాల ద్వారా పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా పాఠశాలల పనితీరును క్రమబద్ధీకరించేందుకు.. నియంత్రణ, పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నందుకు అర్హులైన ప్రతి తల్లికీ జగనన్న అమ్మఒడి కింద ఆర్థిక సాయం అందించడంతో పాటు పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ‘జగనన్న విద్యా కానుక’లు అందిస్తున్నారు. విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తయారు చేయాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పాఠశాల విద్యలో సమూలమైన సంస్కరణలు అమలు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఫౌండేషనల్ విద్యకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు, ఫౌండేషన్ పాఠశాలలు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూల్, ఉన్నత పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో అభ్యసన ఫలితాలను పెంపొందించేందుకు ఈ సమగ్ర విద్యా, పరిపాలన సంస్కరణలు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమర్థంగా వినియోగిస్తారు. ఇకపై విద్యా కార్యక్రమాలపైనే దృష్టి జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, మనబడి నాడు–నేడు వంటి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు విద్యాశాఖలోని క్షేత్ర స్థాయిలో పటిష్ట పర్యవేక్షణకు సిబ్బంది సమస్య ఎదురవుతోంది. ఏకీకృత సర్వీస్ రూల్స్ ఖరారు కానందున ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసే పరిస్థితి లేకపోయింది. దీంతో మండల విద్యాశాఖ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 264 ఎంఈవో పోస్టులు, 50 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. ప్రస్తుతం చాలా మంది మండల విద్యాశాఖాధికారులు మూడు లేదా నాలుగు మండలాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారు ఎక్కువ పని చేయాల్సి వస్తోంది. సాధారణ విధులతో పాటు, అన్ని జిల్లా విద్యా శాఖ అధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు మండల విద్యా అధికారులకు ఇతర శాఖేతర పనులు కేటాయిస్తున్నారు. ఆస్పత్రుల్లో కోవిడ్ కోసం నోడల్ అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా, ఎన్ఆర్జీఈఎస్ ఆడిటింగ్ అధికారి పనులు, ఓటీఎస్ పనులకు ప్రత్యేక అధికారులుగా తదితర బాధ్యతలను అప్పగిస్తున్నందున విద్యాశాఖ అధికారులు తగిన సమయాన్ని వెచ్చించలేక, విద్యాశాఖలో ప్రాధాన్యం కలిగిన కార్యక్రమాలపై దృష్టి సారించలేకపోతున్నారని కలెక్టర్లకు పంపిన మెమోలో రాజశేఖర్ వివరించారు. ఈ నేపథ్యంలో విద్యా శాఖలోని క్షేత్ర స్థాయి అధికారులందరికీ ఇతర శాఖేతర పనులను అప్పగించొద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. వారు ఇకపై శాఖాపరమైన పనులకే పరిమితమవుతారు. విద్యా రంగంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం కోసం పనిచేస్తారు. ఇకపై విద్యాభివృద్ధి కార్యక్రమాలపై క్షేత్ర స్థాయి అధికారుల ద్వారా పర్యవేక్షణ మరింతగా పెరగనుంది. -
‘అమ్మఒడి’పై సినిమా.. ప్రధానోపాధ్యాయుడి పాత్రలో ఎమ్మెల్యే
పాడేరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నవరత్నాల్లోని అమ్మఒడి పథకం పేరు మీద శ్రీదత్తాత్రేయ క్రియేషన్స్ ఓ చలనచిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే వెండితెర మీదకు రానున్న ఈ చిత్రంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రధానోపాధ్యాయుడి పాత్ర పోషిస్తున్నారు. పాడేరు మండలంలోని దిగుమోదాపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. తహసీల్దార్ ప్రకాష్‌రావు ఎమ్మెల్యేకు క్లాప్ కొట్టారు. షూటింగ్ అనంతరం ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో పారదర్శకంగా అందిస్తున్న సంక్షేమ పథకాలలో అమ్మఒడి ఒకటని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు పేరుతో ఊహించని రీతిలో అభివృద్ధి చేశారని కొనియాడారు. అమ్మఒడి పథకంపై చలనచిత్రం నిర్మించడం గొప్ప విషయమని చిత్ర నిర్మాత, దర్శకులను అభినందించారు. ఈ చిత్రానికి త్రినాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: Rythu Bharosa: ఆర్బీకే సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా) -
భరోసా ఇచ్చిన ‘ఆసరా’
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో బుధవారం పెద్ద షామియానా వేశారు. ప్రాంగణం అంతా రంగు రంగుల బెలూన్లు, బంతిపూల తోరణాలతో కళకళలాడుతోంది. కొందరు మహిళలు ముగ్గులు వేస్తోంటే.. మరికొందరు వాటికి రంగులు అద్దడంలో నిమగ్నమయ్యారు. ‘ఏం జరుగుతోంది ఇక్కడ? ఏదైనా పంక్షనా?’ అని అడిగితే.. ‘అవును.. వైఎస్సార్ ఆసరా పండుగ. 2014 ఎన్నికల సమయంలో రుణ మాఫీ చేస్తానని చెప్పి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక చంద్రబాబు మమ్మల్ని నిలువునా ముంచాడు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాం. డ్వాక్రా సంఘాల్లో చాలా వరకు ఆ దెబ్బతో మూతపడ్డాయి. ఆ సమయంలో పాదయాత్రగా వచ్చిన జగనన్నకు మా కష్టాలు చెప్పుకున్నాం. ఆదుకుంటానని ఆయన మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే సీఎం ఆయ్యాక మా అప్పు మొత్తాన్ని 4 విడతలుగా మా చేతిలో పెడుతున్నాడు. గత ఏడాది మొదటి దఫా ఇచ్చారు. ఇప్పుడు రెండో దఫా ఇస్తున్నారు. అన్ని విధాలా జగనన్న మా తల రాత మార్చారు. అందుకే పండుగ చేసుకుంటున్నాం’ అని తెలిపారు. ‘గత ఏడాది మొదటి విడతలో నాకు రూ.10 వేలు వచ్చింది. ఇప్పుడు రెండో దఫా రూ.10 వేలు బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. మాకు ఆర్థిక భరోసానిచ్చిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని మేం సంబరంగా నిర్వహించుకుంటున్నాం. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మహిళలు, ఎమ్మెల్యే అందుకే ఈ ప్రాంగణాన్ని మేమే స్వయంగా ముస్తాబు చేస్తున్నాం’ అని ఉయ్యూరు మండలం కలాసమాలపల్లికి చెందిన నెహ్రూ గ్రూప్ సభ్యురాలు గుమ్మడి చంద్రమ్మ చెప్పింది. ‘గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన రుణంతో రెండు గేదెలు కొన్నాను. వాటి ద్వారా ప్రతి నెలా రూ.10 వేలు సంపాదిస్తున్నాను. చదువుకుంటున్న నా బిడ్డకు అమ్మ ఒడి వచ్చింది. మా అత్త విజయలక్ష్మికి వైఎస్సార్ చేయూత సాయం అందింది. మా ఊళ్లో చాలా మంది నాలాగే లబ్ధి పొందారు’ అని చంద్రమ్మ వివరించింది. తోట్లవల్లూరు మండలం పాముల్లంక గ్రామానికి చెందిన సాయూ గ్రూప్ అధ్యక్షురాలు మోటూరు అనిత, యలమర్రుకు చెందిన సోని, అప్పకట్లకు చెందిన కుంపటి వీరమ్మ, యలమర్రుకు చెందిన వరస జయలక్ష్మి తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రీతిలో మహిళలు ‘ఆసరా’ పంపిణీ కార్యక్రమాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్నారు. కృష్ణా జిల్లా పెడనలో ఎమ్మెల్యే రమేష్ నుంచి ఆసరా చెక్కు అందుకుంటున్న లబ్ధిదారులు ఊరూరా సంబరాలు ► బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 52 చోట్ల (ఉప ఎన్నిక వల్ల వైఎస్సార్ జిల్లాలో వాయిదా) సంబరాలు కొనసాగాయి. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పథకం రెండవ విడత రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల పరిధిలోని 7.55 లక్షల సంఘాలకు సంబంధించి 74.81 లక్షల మంది మహిళలకు రూ.6,099 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటివరకు12 జిల్లాల్లో 4,74,832 సంఘాల్లోని 46,86,241 మంది మహిళల ఖాతాల్లో రూ.3,815.31 కోట్లు మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది. కాగా, బుధవారం సెలవు కారణంగా డబ్బు జమ కాలేదు. ► అనంతపురం జిల్లా గోరంట్లలో మంత్రి శంకరనారాయణ, నల్లచెరువులో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కణేకల్లులో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్య ఆధ్వర్యంలో ఆసరా సంబరాలు కొనసాగాయి. కణేకల్లులో పలువురు మహిళలు ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ప్లకార్డులు చూపారు. ► తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత పాల్గొన్నారు. వైఎస్ జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేశారు. ► పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, పశివేదలలో నిర్వహించిన కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఆనందపురంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా 1,291 సంఘాలకు రూ.10.45 కోట్లను అందించారు. ► ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన కార్యక్రమంలో విద్య శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు అందజేశారు. ఒంగోలులో మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ► శ్రీకాకుళం జిల్లా పొందూరులో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జరిగిన ఆసరా ఉత్సవాల్లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
AP: ఓ బ్రహ్మయ్య.. తండ్రి నీవయ్య!
‘‘నెల్లూరు నగరంలో ఓ అనాథ యువతి ఆశ్రమంలో ఉంటూ బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేస్తోంది. ఆమెకు నెలవారీగా వచ్చే స్టైఫండ్ రూ.3 వేలను దాచుకునే నిమిత్తం అకౌంట్ తెరిచేందుకు బ్యాంకుకు వెళ్లింది. కానీ, ఆమె వద్ద అవసరమైన ధ్రువపత్రాల్లేవని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. దీంతో ఆశ్రమం నిర్వాహకుల వద్దే ఆమె ఆ మొత్తాన్ని దాచుకుంటోంది’’.. ఇది ఈ ఒక్క యువతి ఇబ్బందే కాదు.. ఇలాంటి ఎంతోమంది అనాథలు రాష్ట్రవ్యాప్తంగా ఎదుర్కొంటున్న కష్టాలు. అమ్మానాన్నలు లేని ఫలితంగా ఎలాంటి ధుృవపత్రాలకు నోచుకోక వీరు పలు ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి కథే నెల్లూరు నగరంలోని ఓ అనాథాశ్రమం విద్యార్థుల వ్యథ. సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని కొండాయపాళెం రోడ్డు సమీపంలోని రామకృష్ణానగర్‌లో ఉన్న జనహిత–వాత్సల్య సేవా సంస్థలో దాదాపు 117 మంది అనాథ బాలలు ఆశ్రయం పొందుతున్నారు. ఈ సంస్థ కేవలం దాతల దాతృత్వంతో నడిచే సంస్థ. ఈ సంస్థ భారతీయ విద్యా వికాస్ పేరుతో ఇంగ్లిష్ మీడియం పాఠశాలను నిర్వహిస్తోంది. ఇందులో అనాథ బాలలతోపాటు ఇతరులు కూడా విద్యను అభ్యసిస్తున్నారు. జనహిత–వాత్సల్య సేవా సంస్థ ప్రాంగణం ఈ సేవా సంస్థలో ఆశ్రయం పొందిన వారు కొందరు ఉన్నత చదువులు చదువుకున్న వారూ ఉన్నారు. చదువుల అనంతరం వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. ఇక్కడి ఆడపిల్లలకు అమ్మానాన్న లేని లోటు తెలీకుండా పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపుతున్నారు. కానీ, ఈ అనాథలకు పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేవుళ్లనే తల్లిదండ్రులుగా భావిస్తూ.. పదో తరగతి చదివే విద్యార్థులు పరీక్ష దరఖాస్తుల్లో తల్లిదండ్రుల పేర్లు రాయాలి. కానీ, వారెవరో తెలియని ఈ అనాథలు దేవుళ్లనే తమ తల్లిదండ్రులుగా భావించి సరస్వతి, లక్ష్మీ, పార్వతి, శివయ్య, బ్రహ్మ, విష్ణుమూర్తి వంటి పేర్లను రాసుకుంటున్నారు. గతంలో టెన్త్ పరీక్షల సందర్భంలో తండ్రి పేరే రాయాల్సి ఉండేది. 2009 సెప్టెంబర్ 14 నుంచి తల్లి పేరు తప్పనిసరి చేశారు. అప్పటివరకు తండ్రి పేరు రాసేందుకు తంటాలు పడిన ఈ అనాథ విద్యార్థులు దీంతో తల్లిదండ్రులుగా దేవుళ్లు, దేవతల పేర్లనే దరఖాస్తులలో పేర్కొంటున్నారు. జనహిత–వాత్సల్య సేవా సంస్థ సంక్షేమానికి దూరంగా.. ప్రభుత్వం విద్యను ప్రొత్సహించేందుకు ప్రవేశపెట్టే పథకాలకూ ఈ అనాథలు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ పథకాలకు ప్రధానంగా రేషన్‌కార్డు, కులం, ఆదాయం, ఆధార్‌కార్డు తప్పనిసరి. ఇవన్నీ ఎలా వస్తాయో తెలియని ఈ అనాథలు సంక్షేమ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వాలు వీరిని ప్రత్యేకంగా పరిగణించి ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చి అన్ని సదుపాయాలు కల్పిస్తే వీరు సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. జనహిత–వాత్సల్య సేవా సంస్థలో భోజనానికి ముందు ప్రార్థన చేస్తున్న బాలలు అమ్మఒడిపై స్పందించిన సర్కార్ ప్రస్తుత ప్రభుత్వం విద్యను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం పేద వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. కేవలం ఆధార్‌కార్డు రానందున ఈ పథకానికి అనాథలు అర్హత సాధించలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం స్పందించి వచ్చే విద్యా సంవత్సరంలోనైనా అమ్మఒడి వర్తించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. స్థానిక అధికారులూ వీరికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనాథలను గుర్తించాలి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా అనాథ బాలలకు సరైన న్యాయం చేయలేకపోయింది. సమాజంలో వారికి గుర్తింపు లేకుండాపొయింది. ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ వారు నోచుకోలేకపోతున్నారు. అమ్మఒడి పథకం వారికి వర్తింపజేయాలి.– జీవీ సాంబశివరావు, వాత్సల్య అనాథాశ్రమ సంస్థాగత కార్యదర్శి సమాజంలో వారికి గుర్తింపునివ్వాలి అనాథలను ప్రభుత్వాలు అక్కున చేర్చుకోవాలి. గత ప్రభుత్వాలు అనాథల విషయంలో సరైన న్యాయం చేయలేకపోయాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం స్పందించి వారికి అమ్మఒడి పథకం వర్తించేలా కసరత్తు చేయడం హర్షణీయం. అనాథలు అంటే మన పిల్లలే అనే భావన అందరిలో కలగాలి. – సామంతు గోపాల్‌రెడ్డి, వాత్సల్య సేవా సంస్థ గౌరవాధ్యక్షులు -
YS Jagan అద్భుతాలు చేస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత విద్యాభివృద్ధి కార్యక్రమాల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, అనేక విప్లవాత్మక మార్పులకు ఇవి నాంది పలుకుతున్నాయని పలువురు విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం సీఎంకు రెండు కళ్లు అని వారు అభివర్ణించారు. స్వచ్ఛంద సంస్థ ‘ఓపెన్ మైండ్స్’ ఆధ్వర్యంలో శుక్రవారం ‘ముఖ్యమంత్రి జగన్ రెండేళ్ల పాలన–విద్యారంగంలో వినూత్న మార్పులు’ అంశంపై పలువురు విద్యారంగ నిపుణులతో వర్చువల్ సమావేశం జరిగింది. వక్తలు ఏమన్నారంటే.. నిధుల కేటాయింపు ఇంగ్లండ్ కన్నా ఇక్కడే ఎక్కువ విద్యారంగానికి వైఎస్ జగన్ 17 శాతానికి పైగా నిధులు కేటాయిస్తున్నారు. ఇంగ్లండ్‌లో కన్నా ఈ కేటాయింపులు అధికం. విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. ఉన్నత, పాఠశాల విద్యకు వేర్వేరుగా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్లను ఏర్పాటుచేశారు. వీటన్నింటి ఫలితాలు రావడం మొదలు పెడితే ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. – జస్టిస్ ఈశ్వరయ్య, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ సీఎం చాలా అద్భుతాలు చేస్తున్నారు వైఎస్ జగన్ పథకాలన్నీ ఎంతో మేలు చేసేవి. అమ్మఒడిని ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేస్తే అవి మరింత బలోపేతమవుతాయి. నాడు–నేడుతో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఏర్పడి చూడముచ్చటగా మారాయి. పాఠశాల టీచర్ల వ్యవస్థ బాగుంది. వర్సిటీ అధ్యాపకులపై ఏటా అసెస్మెంటు జరగాలి. సీఎం జగన్ చాలా అద్భుతాలు చేస్తున్నారు. – ప్రొ. వెంకట్రామిరెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ అమ్మఒడితో హాజరు శాతం పెరిగింది అమ్మఒడితో డ్రాప్ అవుట్లు బాగా తగ్గాయి. గతంలో 70 శాతం హాజరుండగా ఇప్పుడు 90 శాతానికి పెరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది చేరికలు పెరిగాయి. – డాక్టర్ బి.ఈశ్వరయ్య, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యుడు ‘నాడు–నేడు’అత్యుత్తమ పథకం నాడు–నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ పథకం. జగనన్న గోరుముద్ద, విద్యాకానుకతో విద్యార్థుల్లో ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం, చదువులపై ఆసక్తి పెరిగింది. హ్యూమన్ కేపిటల్‌గా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. – ప్రొ. నారాయణరెడ్డి, విక్రమ సింహపురి వర్సిటీ ఫౌండర్ రిజిస్ట్రార్ 16 ప్రభుత్వ వైద్య కాలేజీల ఏర్పాటు గొప్ప విషయం విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేవు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు పెట్టడానికి నిర్ణయించి నిధులు కేటాయించడం గొప్ప విషయం. – జి. శాంతారావు, మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ 45వేల స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ రాష్ట్రంలో స్టేట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటుచేయడం సంతోషించదగ్గ విషయం. 45 వేల పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలుచేయించడం గొప్ప విషయం. ఏయూ, ఎస్వీయూ, నాగార్జున వర్సిటీలు మరింత ప్రమాణాలతో ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్సులోకి వస్తాయని ఆశిస్తున్నాం. – ప్రొ.నారాయణరావు, ఎస్ఆర్ఎం వర్సిటీ -
ఈసారి 43 లక్షల మందికి విద్యా కానుక
సాక్షి, అమరావతి: అమ్మ ఒడి, నాడు–నేడు వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు గణనీయంగా పెరగడంతో ఈ ఏడాది జగనన్న విద్యాకానుక బడ్జెట్ కూడా భారీగా పెరగనుంది. రూ.731.30 కోట్లతో ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన వస్తువులను కిట్ల రూపంలో అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అందించే జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫారం, షూ, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్‌లు, నోట్ బుక్‌లతో పాటు ఈసారి అదనంగా ఇంగ్లిష్ – తెలుగు డిక్షనరీని అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో జగనన్న విద్యాకానుకలో ఈ ఏడాది కొత్తగా డిక్షనరీని చేర్చారు. డిక్షనరీ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నాణ్యత కూడా బాగుండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఆంగ్ల మాధ్యమానికి తల్లిదండ్రుల మద్దతు ► పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి తల్లిదండ్రుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది. పాఠశాలల్లో చేరే పిల్లలు, వారి తల్లిదండ్రులు 96.17% మంది ఆంగ్ల మాధ్యమానికే ఆప్షన్ ఇచ్చారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగుకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు దాన్ని తప్పనిసరి చేశారు. ► 2020–21 విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతి వరకు అమలైన ఆంగ్ల మాధ్యమం.. 2021–22 నుంచి ఏటా ఒక్కో తరగతి చొప్పున వరుసగా పదోతరగతి వరకు అమలు కానుంది. దీంతో పాటు రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానం అమలు చేయడానికి సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారు. ► ఇప్పటికే ఇంగ్లిష్ మీడియంలో బోధించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులతో పాటు ఇంగ్లిష్ ల్యాబ్స్ ఉండేలా చర్యలు చేపట్టారు. ► పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం జగన్ అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మంచి మెనూతో జగనన్న గోరుముద్ద పథకం తీసుకొచ్చారు. నాణ్యతలో రాజీ లేదు.. ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మునిసిపల్, వివిధ సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ స్కూళ్లు, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గుర్తింపు ఉన్న మదర్సాలల్లో 1–10 వరకు చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. గతేడాదితో పోలిస్తే దాదాపు నాలుగు లక్షల మంది పిల్లలు పెరిగారు. 2020–21 విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం రూ.648.10 కోట్లకు పైగా వెచ్చించగా, ఈ ఏడాది రూ.731.30 కోట్లను మంజూరు చేసింది. వీరందరికీ యూనిఫారం కుట్టు కూలీగా 1–8 విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.120, అదే విధంగా 9–10 విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి రూ.240 చొప్పున నిధులు అందిస్తోంది. స్టూడెంట్ కిట్ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులను సీఎం ఆదేశించారు. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్ – తెలుగు డిక్షనరీ ద్వారా పిల్లలు ప్రతి రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని సూచించారు. -
5వ తేదీ వరకు అమ్మఒడిలో మార్పులు.. చేర్పులు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ఈ నెల అయిదవ తేదీ వరకు అమ్మఒడిలో మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమ్మఒడి మార్పులు, చేర్పులకు 5వ తేదీ వరకు గడువు పొడగిస్తున్నామన్నారు. జనవరి 9న అమ్మఒడి రెండవ విడత కార్యక్రమానికి సిద్దమవుతున్నామని, అర్హులందరికి మరో అవకాశం ఇస్తున్నామన్నారు. 6వ తేదీన అమ్మఒడి అర్హుల జాబితా ప్రకటిస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకి అమ్మఒడి ఇవ్వడం లేదంటూ ఎల్లో మీడియా పత్రికలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్ఫష్టం చేశారు. పారిశుద్ధ్య కార్మికులందరికి అమ్మ ఒడి ఇస్తామని, గతేడాది 43 లక్షల మంది తల్లుల ఖాతాలకు అమ్మఒడిని అందించామని తెలిపారు. గతేడాది అమ్మఒడి కోసం 6450 కోట్లు ఖర్చు చేశామని, సడలించిన నిబంధనలతో ఈ సారి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. కోవిడ్ కారణంగా ఈ సారి 75 శాతం అటెండెన్స్ నిబంధన తొలగించామని, గతేడాది అమ్మఒడి అందిన అందరూ రెండవ విడతకి అర్హులేనని చెప్పారు. గతంలో గ్రామీణ స్ధాయిలో 5 వేలు నెలసరి ఆదాయం ఉన్నవారే అర్హులు కాగా ఈ సారి 10 వేల రూపాయలకు పెంచామని, పట్టణ ప్రాంతాలలో లబ్దిదారుల నెలసరి ఆదాయం రూ. 6250 నుంచి 12 వేల రూపాయిలకి పెంచామన్నారు. గత సంవత్సరం నెలకి 200 యూనిట్లు విద్యుత్ వాడేవారు అర్హులు కాగా.. ఈ సారి 300 యూనిట్లకు పెంచామని చెప్పారు. ఈ సడలించిన నిబంధనలతో అమ్మఒడి రెండవ విడత లబ్దిదారులు తప్పనిసరిగా పెరుగుతారని, వాస్తవాలు వక్రీకరించేలా పచ్చ పత్రికలు తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని, అర్హులైనని ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా నెల్లూరులో రెండవ విడత అమ్మఒడి కార్యక్రమం కూడా చేపట్టాలని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
ఏపీ: వారికి నేరుగా నగదు బదిలీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నవరత్నాల పథకాలను అమలు చేసి చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళా పక్షపాతి ప్రభుత్వంగా నిరూపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తన 16 నెలల వ్యవధిలో కేవలం నాలుగు పథకాల ద్వారానే 2,42,73,936 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.18,721.12 కోట్ల నగదును బదిలీ చేయడం విశేషం. ఈ నగదును బ్యాంకులు పాత అప్పులకు తీసుకోకుండా జమ చేయడం గమనార్హం. దేశ చరిత్రలోనే ఇంత పెద్దఎత్తున మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయడం ఇదే తొలిసారి. (చదవండి: స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) 1) వైఎస్సార్ ఆసరా- 87.74 లక్షల మందికి రూ.6,792.21 కోట్లు గత టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న రూ.14,204 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తామని వాగ్దానం చేసి, ఆ తర్వాత ఎగనామం పెట్టింది. వైఎస్ జగన్ గత ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో వారికే ఇస్తానన్న మాట మేరకు వైఎస్సార్ ఆసరా పేరిట తొలి విడతగా 87,74,674 మంది మహిళలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు రూ.6,792.21 కోట్లు జమ చేశారు. 2) సున్నా వడ్డీ పథకం- 90.37లక్షల మందికి రూ.1400.08 కోట్లు గత టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీకి మంగళం పలికింది. వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు పొదుపు సంఘాల్లోని 90,37,255 మంది మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.1400.08 కోట్లను జమ చేశారు. 3) వైఎస్సార్ చేయూత- 22.28 లక్షల మందికి రూ.4,179.20 కోట్లు వైఎస్సార్ చేయూత కింద వైఎస్సార్సీపీ ప్రభుత్వం 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న 22,28,909 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. తొలి విడతగా రూ.4,179.20 కోట్లను జమ చేసింది. దీనిని తోడు మహిళలు వివిధ వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకుల ఆర్థిక సాయంతోపాటు పెద్ద కంపెనీల సహకారం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. 4) అమ్మ ఒడి- 42.33 లక్షల మందికి రూ.6349.63 కోట్లు పేదరికం కారణంగా తమ పిల్లలను చదివించకుండా ఏ తల్లీ రాష్ట్రంలో ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. దీని ద్వారా ఏటా పిల్లలను బడులకు పంపే తల్లులకు రూ.15 వేలు ఇస్తామన్న మాట మేరకు తొలి ఏడాది 42,33,098 మంది బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.6349.63 కోట్లను జమ చేశారు. ఇక నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని నిర్ణయించారు. నాతో పాటు మా అత్తకూ పథకాలు మా కుటుంబంలో నాకు అమ్మ ఒడి కింద రూ.15 వేలు, సున్నా వడ్డీ కింద రూ.3 వేలు, ఆసరా కింద రూ.10,800 బ్యాంకులో జమ చేశారు. మా అత్త బ్రహ్మమ్మకు చేయూత కింద డబ్బులు జమ చేశారు. సున్నా వడ్డీ కింద రూ.3 వేలు, ఆసరా కింద రూ.10,800 బ్యాంకులో వేశారు. ఇలా మా బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు వేయడం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. - సి.అనిత, ఎఎస్‌పాడు గ్రామం, మండలం, ప్రకాశం జిల్లా ప్రభుత్వం డబ్బులు వేయడం ఇప్పుడే చూస్తున్నాం మా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేయడం ఇప్పుడే చూస్తున్నాం. ఎన్నికలకు ముందు చెప్పిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, అమ్మ ఒడి కింద నా బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేశారు. - కోబాకు తనూజ, నిడిగల్లు పంచాయతీ, బాలాయపల్లి మండలం, నెల్లూరు జిల్లా -
అప్పటి దాకా మీరు సీఎంగా ఉండాలి మామయ్యా
సాక్షి, పునాదిపాడు: ‘మనలాంటి పేదలకేం కావాలో, ఏమిస్తే ఏమిస్తే మనం సంతోషంగా ఉంటామో, ఆయనకు తెలుసు. ఇంతకంటే గొప్ప మామయ్య మనకు దొరుకుతాడా.. అందుకే జగన్ మామయ్య అంటే నాకు ఎంతో ఇష్టం’ అంటూ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతునన్న షేక్ తస్లీం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు, వారి తలిదండ్రులు మాట్లాడారు. విద్యార్థిని షేక్ తస్లీం మాట్లాడుతూ.. ‘మన జగన్ మామయ్య ముఖ్యమంత్రి అయ్యాక, విద్యకు సంబంధించి చాలా పథకాలు ప్రవేశపెట్టారు. వాటిలో భాగంగా అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, నాడు–నేడు. ఈ రోజు జగనన్న విద్యా కానుక. నాకొక కోరిక ఉంది. అది ఏంటంటే, నేను బాగా చదువుకుని కలెక్టర్ అయి మీరు పెట్టిన ఈ పథకాలన్నీ పేద ప్రజలకు అందేలా చూడాలని. అప్పటి దాకా మీరు సీఎంగా ఉండాలి, ఉండి తీరాలి’ అని కోరింది. ‘కాన్వెంటు పిల్లలను చూసి వాళ్లలాగా బూటూ, సూటూ వేసుకుని వెల్లాలని ఉంటుంది. ఆ కోరిక నాకు ఈ ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా తీరబోతుంది. మా నాన్న చెప్పారు, జగనన్న విద్యా కానుక ద్వారా అందించిన వస్తువులను కొనాలంటే 3500 రూపాయలు అవుతాయని చెప్పారు. ఇప్పుడు మాకు ఆ బాధలేదు. అంతేకాదు నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలకు రూపురేఖలు మార్చేశారు. మధ్యాహ్న భోజనంలో మంచి పౌష్టిహారం అందించారు. దాంతో పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మనకేం కావాలో, ఏమిస్తే మనలాంటి పేదలు గొప్పవాళ్లమవుతామో ఆయనకు తెలుసు. ఈ వనరులను ఉపయోగించుకుని కలెక్టర్ అవుతాను’ అని చిన్నారి తస్లీం స్పష్టం చేసింది. (చదవండి: ‘జగనన్న విద్యా కానుక’లో ఏమున్నాయంటే...) జగన్ మామయ్య నాకిచ్చిన బహుమతి అయిదో తరగతి విద్యార్థిని లీలా లహరి మాట్లాడుతూ..‘జగనన్న విద్యాకానుక, అది జగన్ మామయ్య నాకిచ్చిన బహుమతి. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది, నేను మాటిస్తున్నాను, బాగా చదవి తరగతిలో ఫస్ట్ ర్యాంకు సాధిస్తాను. నా ఫ్రెండ్స్‌ను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరమని ఎంకరేజ్ చేస్తాను. నా తల్లిదండ్రులు ఆర్ధిక పరిస్ధితి సరిగా లేకపోవడం వల్ల నేను గతేడాది మండల పరిషత్ స్కూల్లో నాలుగో తరగతిలో చేరాను. గతేడాది మా అమ్మ జగనన్న అమ్మఒడి కింద రూ.15వేలు అందుకుంది. నిజంగా ఈ డబ్బులు మా తల్లిదండ్రులకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఇది నా విద్యా జీవితంలో చాలా మంచి మార్పు. ఈ సంవత్సరం మరో మంచి మార్పు నా విద్యా జీవితంలో రాబోతుంది. అదే జగనన్న విద్యాకానుక. మాకు కావాల్సిన వాటిని ఈ విద్యా సంవత్సరంలో మా తరగతులు ప్రారంభం కాకముందే ఇవ్వడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అన్నది. (చదవండి: అమ్మఒడితో కొండంత భరోసా) విద్యార్థులు, తలిదండ్రులు మీ వెనుకే.. పాఠశాల పేరెంట్స్ కమిటీ మెంబర్ ఉషా కుమారి మాట్లాడుతూ.. ‘ఈ రోజు జగనన్న విద్యాకానుక కింది ఇచ్చిన వస్తువులన్ని పేద, మద్యతరగతి, నిరుపేద తల్లిదండ్రులకు ఈ కరోనా టైంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇదే కాకుండా అమ్మఒడి పథకం కింద 15వేల రూపాయలు ఆర్ధికంగా వాళ్లు ఎదిగేందుకు మాకు అందజేశారు. మరి నాడు–నేడు కార్యక్రమంలో స్కూళ్లు రిపేర్లు, ఆడపిల్లలకు ప్రత్యేక బాత్రూంలు, స్కూళ్లో వాటర్ ట్యాంకులు, బోర్డులు, ఫ్యానులు అన్నీ సమకూర్చారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఈ గవర్నమెంటు స్కూళ్లను నిలబెట్టిన మా జగనన్నకు మా తల్లిదండ్రులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎందుకుని ఎన్నో అవరోధాలు సృష్టించినప్పటికీ., మా పేద, మద్యతరగతి పిల్లలకు ఇంగ్లిషు మీడియం అందజేసినందుకు మీకు చాలా, చాలా ధన్యవాదములు. ఇంగ్లిషు మీడియం కోసం పేద, మద్యతరగతి వాళ్లు ప్రైవేటు స్కూళ్లకు పంపలేరు. దీన్ని ఇలాగే కొనసాగించండి. మీ వెనుక మేం తల్లిదండ్రులందరం ఉన్నామని స్వయంగా చెపుతున్నాం’ అన్నారు. (చదవండి: చక్కని వసతులు.. ఇంగ్లిష్ మాటలు) మీరిలాగే ముందుకు వెళ్లాలి. ‘నేటి బాలలే రేపటి పౌరులగా గుర్తించిన మా జగనన్నకు కోటి వందనాలు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూలిపనులకెలుతుంటే పిల్లలు ఏం తింటారనే బెంగలేకుండా.. మధ్యాహ్న భోజన పథకంలో ‘జగనన్న గోరుముద్ద’ కార్యక్రమంలో మా పిల్లలకు వెజిటబుల్ బిర్యానీ, చిక్కీ, పొంగల్, గుడ్డు పెడుతూ, వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు ధన్యవాదాలు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఇకపై పిల్లలకు అక్షరాభాస్యం చేసేటప్పుడు ఏ దేవుడు పేరో రాయకుండా జగన్ మామయ్య అని రాసే రోజులు ఎంతో కాలం లేవని ఘంటాపధంగా తెలియజేస్తున్నాం. రేపు మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవరకు మీరు మా ముందుండి నడిపించి ఇలానే ముందుకు వెళ్లాలి’ అని కోరుకుంటున్నాము అన్నారు. -
ఏపీలో సర్కారీ బడికి సై
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గతంలో 23 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా ఈ ఏడాది 58కి చేరింది. ఇదే మండలం ధర్మవరం ఆదర్శ పాఠశాలలో గతంలో 33 మంది ఉండగా ఇప్పుడు విద్యార్థుల సంఖ్య 63కి పెరిగింది. విజయవాడలో 1,600 మంది విద్యార్థులున్న ఏకేటీపీ హైస్కూలులో అడ్మిషన్ల కోసం పలువురు సిఫార్సులతో వస్తున్నారు. జీడీఈటీ హైస్కూలులో ఇప్పటికే 1,300 మంది విద్యార్థులు ఉండటంతో సీట్లు లేవని చెబుతున్నారు. ఇదే నగరంలో 800 మంది చదువుతున్న బీఎస్ఆర్కే హైస్కూల్లో, 700 మంది ఉన్న ఎస్పీఎస్ఎంసీ హైస్కూలులో సీట్లు లేవని సర్ది చెప్పాల్సి వస్తోంది. వీఎంసీ ఎలిమెంటరీ స్కూల్లో, ప్రశాంతి నగర్ ఎలిమెంటరీ స్కూల్లోనూ ఇదే పరిస్థితి. కాకినాడ, విశాఖ, విజయనగరం, గుంటూరు, ఏలూరు, కర్నూలు, కడప, అనంతపురంలోని మున్సిపల్ స్కూళ్లలో సీట్ల కోసం తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. సాక్షి, అమరావతి: విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలు, విద్యాభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్లు తగ్గడంతోపాటు విద్యార్థుల చేరికలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం, పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివేలా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించి విద్యారంగం పట్ల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సర్కారీ స్కూళ్ల వైపు విద్యార్థులు మొగ్గు చూపటానికి ప్రధాన కారణం. 2019–20 విద్యా సంవత్సరంలో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ రెండు నెలల వ్యవధిలోనే మరో 70,000 మందికిపైగా విద్యార్థులు సర్కారీ స్కూళ్లలో ప్రవేశాలు పొందారు. అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్నందున ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను వీడి ప్రైవేట్ స్కూళ్లలో చేరిన వారి సంఖ్య దాదాపు 519 మాత్రమే ఉండటం గమనార్హం. ► ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతూ 1–10 వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతుండడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ల వైపు బారులు తీరుతున్నారు. ► ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తూ చేపట్టిన ‘అమ్మ ఒడి’, జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తుండటంతో ప్రభుత్వ స్కూళ్ల పట్ల ఆసక్తి పెరిగింది. జగనన్న విద్యా కానుక ద్వారా రూ.650 కోట్లకు పైగా ఖర్చు చేసి 3 జతల దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూలు, సాక్సులు, బెల్టు, బ్యాగు ఇవ్వడం ప్రభుత్వ స్కూళ్లకు ఆదరణ పెంచుతోంది. ► ‘అమ్మ ఒడి’ద్వారా రూ.6,300కోట్లను విద్యార్థుల తల్లులకు ప్రభుత్వమిచ్చిన సంగతి తెలిసిందే. ► నాడు–నేడు కింద దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో రూ.12 వేల కోట్లతో మరమ్మతులు చేపట్టడంతోపాటు మంచి నీటి సదుపాయం, రన్నింగ్ వాటర్‌తో మరుగుదొడ్లు, గ్రీన్ చాక్ బోర్డులు, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్లు, ప్రహరీల నిర్మాణం, ఫర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, కంప్యూటర్, లైబ్రరీ బుక్స్, డిజిటల్ తరగతులు తదితర సదుపాయాలతో కార్పొరేట్ విద్యా సంస్థల తలదన్నేలా సర్కారీ స్కూళ్లను తీర్చిదిద్దడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూలు కడుతున్నారని మున్సిపల్ స్కూళ్ల టీచర్ల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను దశల వారీగా ప్రభుత్వ స్కూళ్లకు అనుసంధానం చేసి ప్రీ ప్రైమరీ కూడా ప్రవేశ పెడుతుండడంతో చేరికలు మరింత పెరగనున్నాయి. అంచనాలకు మించి! ► కోవిడ్ వల్ల పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. దీంతో తల్లిదండ్రులు మాత్రమే వచ్చి తమ పిల్లల అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ► ప్రస్తుతం 1– 9వ తరగతి వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ వారి డేటాను ఆన్లైన్లో చేరుస్తున్నారు. టెన్త్ పూరై్తన దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు కాలేజీల్లో చేరనున్నారు. మరోవైపు కొత్తగా ఒకటో తరగతితోపాటు ఇతర తరగతుల్లోనూ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని విద్యాశాఖ తాత్కాలిక తేదీని నిర్ణయించింది. ఆ తరువాత విద్యార్థుల చేరికలపై పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది లక్ష్యం 72,46,428 మంది విద్యార్థులకు గాను ఛైల్డ్ ఇన్ఫో ప్రకారం 62,94,005 మంది ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 4,77,577 మంది విద్యార్థుల చేరికలకు సంబంధించి డేటా అప్లోడ్ అయింది. వీరు కాకుండా టీసీలు, డ్రాపవుట్లు 7,79,174 వరకు ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ స్కూళ్లవైపే అంతా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి వచ్చే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు మా స్కూలు బావుంది గతంలో ప్రైవేట్ పాఠశాలలో చదివా. ఇటీవల మా ఊరిలో ప్రభుత్వ పాఠశాల సూపర్‌గా తయారైంది. బెంచీలు, గ్రీన్ బోర్డులు, ఫ్యాన్లు, రంగులతో బొమ్మలు చాలా బాగున్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే చేరా. – మంతెన సాత్విక్ వర్మ, 5వ తరగతి, పోణంగి ఎంపీపీ స్కూల్, పశ్చిమగోదావరి పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య.. మా ఇద్దరు అమ్మాయిలను ఇచ్ఛాపురంలో రెండు కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తుండేవాడిని. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటం చూసి ఆశ్చర్యమేసింది. పైసా ఖర్చు లేకుండా మా పిల్లలను అన్ని సదుపాయాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని నిర్ణయించి సన్యాసిపుట్టుగ ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పించా. – లాబాల జానకిరావు, కేశుపురం, శ్రీకాకుళం జిల్లా -
నవరత్నాల పాలన మాది..
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్థానాల్లో 90 శాతం 14నెలల్లోనే అమలు చేయడమే కాక మేనిఫెస్టోలో లేని మరో 39 పథకాలను కూడా అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ 14 నెలల కాలంలో రూ. రూ.59,000 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 14 నెలల పాలన గురించి సీఎం మాట్లాడుతూ ఏమన్నారంటే... మేనిఫెస్టోను.. ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ మాదిరిగా భావించి అమలు చేస్తున్నాం. ఎన్నికల సమయంలో మేము ఇచ్చిన హామీలు 129. ఇందులో ఇప్పటికే 83 అమలు చేయగా మరో 30 పథకాలకు ప్రారంభోత్సవ తేదీలు ప్రకటించాం. మిగిలిన 16 కూడా రాబోయే రోజుల్లో అమలు చేస్తాం. మేనిఫెస్టోలో లేకపోయినా ఈ ఏడాదిలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 39 పథకాలు అమలు చేస్తున్నాం. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ భేదాలకు అతీతంగా మన ప్రభుత్వం నవరత్నాల పాలన అందిస్తోంది. వేడుకల్లో పాల్గొన్న సీఎం తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతీరెడ్డి విద్యావిధానంలో భారీ మార్పులు.. పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా విద్యా విధానంలో కరిక్యులమ్‌తో పాటు, పూర్తిగా మార్పులు చేర్పులు తీసుకువస్తున్నాం. నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాల నుంచి కాలేజీల వరకు అన్నింటి రూపురేఖలు మారుస్తున్నాం. ఉన్నత విద్యలో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు, విద్యార్థుల లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. అన్నింటికి మించి ప్రాథమిక విద్యలో అమ్మ ఒడి ద్వారా ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని భారీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. పిల్లలకు పుస్తకాలు మొదలు షూస్ వరకు అన్నీ నాణ్యమైనవి ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి రోజూ ప్రత్యేక మెనూతో గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నాం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 100 శాతం విద్యార్థులకు పరీక్షలు జరిపి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కళ్లజోళ్లు అందించే కార్యక్రమం దాదాపుగా పూర్తి చేశాం. రైతు సంక్షేమం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్ముతున్నాం. రైతు భరోసా ద్వారా రూ.11,200 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లభించేలా చూడడంతో పాటు, నాణ్యత ధ్రువీకరించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు.. ఇలా రైతులకు అవసరమైన అన్ని సేవలు ఒక్క చోటే లభించేలా చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులకూ రైతు భరోసా వర్తింప చేశాం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా దాదాపు రూ.3,200 కోట్లకు పైగా మొత్తంతో పంటలు కొనుగోలు చేసి రైతులకు అండగా నిల్చాం. గోదాములు, నాణ్యమైన ఉత్పత్తుల గ్రేడింగ్, వాటి మార్కెటింగ్ వంటి సదుపాయాలను గ్రామస్థాయి నుంచి మొదలు పెడుతున్నాం. మండల స్థాయిలో కోల్డ్ స్టోరేజీలు, అవసరమైన చోట్ల ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాం. ఆరోగ్యశ్రీని విస్తరించాం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఆరోగ్యశ్రీ రక్షణను మరో 1,000కి పైగా జబ్బులకు పెంచి 2,200 జబ్బులను దాని పరిధిలోకి తీసుకువచ్చాం. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింప చేశాం. రూ.1,000 కి మించిన ఖర్చును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. దాదాపు 1,100 వాహనాలు కొని ఒకేసారి 108, 104 సేవల కోసం పంపించాం. దేశ చరిత్రలో కనీవిని ఎరగని విధంగా ఆపరేషన్ అయిన రోగులకు కోలుకునే సమయం వరకు నెలకు రూ.5 వేల వరకు ఆసరాగా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల వరకు పింఛనుగా అందిస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే.. ఈ 14 నెలలలోనే మరో 16 కాలేజీలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నాం. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు అన్నింటి రూపురేఖలు మారుస్తున్నాం. క్యాన్సర్ వంటి రోగాలకు పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాం. కోవిడ్ వంటి మహమ్మారిని కూడా.. దేవుడి దయతో, మీ అందరి దీవెనలతో సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. అక్క చెల్లెమ్మలకు తోడుగా.. మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేలా 23 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు తోడుగా చేయూత కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం ప్రారంభించాం. అమ్మ ఒడి ద్వారా అక్షరాలా 43 లక్షల మంది తల్లులకు, 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చాం. విద్యాదీవెన మొత్తాన్ని అమ్మ పేరుతో బ్యాంకులో వేస్తున్నాం. వసతి దీవెన ద్వారా పిల్లల లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చులన్నింటినీ కూడా నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 91 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేసేలా సున్నా వడ్డీ డబ్బులు జమ చేశాం. అదే 91 లక్షలమంది అక్క చెల్లెమ్మలకు 2019 ఎన్నికల తేదీ వరకు ఉన్న పొదుపు సంఘాల రుణాలకు సమానమైన మొత్తాన్ని నాలుగు విడతల్లో వారి చేతికి ఇచ్చే ఆసరా కార్యక్రమాన్ని వచ్చే నెలలో అమలు చేస్తున్నాం. మద్య నియంత్రణ మద్యం మహమ్మారి అనేక కుటుంబాల్లో చిచ్చు పెడుతోందని గమనించి.. మద్య నియంత్రణ దిశగా అడుగులు వేశాం. అధికారంలోకి రాగానే 43 వేల బెల్టుషాపులు, 4,380 పర్మిట్ రూములు తొలగించి, అధికారిక దుకాణాల సంఖ్యను 33 శాతం తగ్గించాం. బెల్టు షాపులు అనేవి లేకుండా చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం విక్రయాలు జరుపుతూ మద్యం అమ్మే వేళలను కూడా కుదించాం. మద్యం ధరలను దాదాపు 100 శాతం పెంచి అమ్మకాలను భారీగా తగ్గించాం. అవినీతి లేని వ్యవస్థ అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్, జ్యూడిషియల్ ప్రివ్యూ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.59 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించాం. రివర్స్ టెండరింగ్, జ్యూడిషియల్ ప్రివ్యూ, గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును ఆదా చేశాం. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. దిశ బిల్లును ఆమోదించాం. దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్ ద్వారా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం అక్క చెల్లెమ్మలకు ఇస్తూ చట్టం తీసుకువచ్చాం. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధంగా ఉంది. -
దేవదాయ శాఖ నిధుల మళ్లింపు అవాస్తవం
సాక్షి, అమరావతి: అమ్మఒడి పథకం కోసం దేవదాయ శాఖ నిధులు మళ్లించారంటూ బ్రాహ్మణ కార్పొరేషన్‌పై రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు ప్రచారం చేస్తున్నారని.. అవన్నీ పూర్తి అవాస్తవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ‘జగనన్న అమ్మఒడి పథకం అమలుకు ఏ దేవాలయానికి సంబంధించిన నిధులుగానీ, భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలుగానీ, దేవదాయ శాఖ నిధులుగానీ ఉపయోగించలేదు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు మాత్రమే ఉపయోగించాం. దీనిపై ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ విషయం గమనించాలి’.. అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రకటనలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ► గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 42,33,098 మందికి జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరింది. వీరిలో 8,89,113 మంది ఓసీలు కాగా అందులో 17,611 మంది బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పిల్లలకూ లబ్ధి చేకూరింది. ► ఈ ఏడాది జనవరి 3న రూ.24.24 కోట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ జీఓ నెంబరు 20 ద్వారా దేవదాయ శాఖకు అదనపు నిధులు కేటాయించింది. అదే నెల 6న దేవదాయ శాఖ వాటిని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జనవరి 17న మరోసారి రూ.2.16 కోట్లు ఇదే విధానంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు విడుదలయ్యాయి. ► బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు పాలనాపరమైన ఉత్తర్వులు, ప్రభుత్వ బడ్జెట్, నిధుల మంజూరు, దేవదాయ శాఖ ద్వారానే వస్తాయి. ఈ వాస్తవాన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు గుర్తించాలి. అది దేవాలయాల సొమ్ము కాదు దేవాలయాల సొమ్ము రూ.25 కోట్ల మేర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి తరలించిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య కూడా ఒక ప్రకటనలో ఖండించింది. దేవదాయ శాఖలో ఒక భాగంగా ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులను మంజూరు చేసిందని.. కానీ, కొంతమంది దానిని దేవాలయాల సొమ్ముగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబులు పేర్కొన్నారు. దేవాలయాల్లో పనిచేసే అర్చకులు ఒకొక్కరికి రూ.5వేల చొప్పున ఇచ్చిన సహృదయులు సీఎం వైఎస్ జగన్ అని వారు ప్రశంసించారు. -
నీకు జగన్ మామయ్య ఉన్నాడని అమ్మ చెప్పింది
సాక్షి, అమరావతి: ‘మా అమ్మ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడు తోంది. ఇలాంటి కష్టకాలంలో నేను మా అమ్మను మీరిచ్చే పింఛన్‌తో చూసుకుంటున్నాను. నేను లేకపోయినా నీకు మామయ్య (జగన్) ఉన్నాడని మా అమ్మ నాకు చెపుతుందని కృష్ణాజిల్లా కానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రమ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద కన్నీటిపర్యంతమైంది. దీంతో చలించిన ముఖ్యమంత్రి.. బాలిక తల్లి అనారోగ్య సమస్యపై వివరాలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బుధవారం విద్యా రంగంపై జరిగిన మేధోమథన సదస్సుకు వచ్చిన రమ్య ఏం మాట్లాడిందంటే.. ► సీఐడీ ఆఫీసర్ కావాలన్నది నా కల. దాన్ని చేరుకోలేనేమోనని భయపడేదాన్ని. ► మామయ్యలా మాకు అండగా ఉంటానన్న మీ మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి. మా నాన్నగారు లేరు. అమ్మ కూలి పనిచేసుకుని నన్ను చదివించేది. ► మీరిచ్చిన ‘అమ్మఒడి’ డబ్బులు వచ్చాయి. నాలాంటి పేదవారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. ► అమ్మ ప్రేమ ముద్ద మా జగనన్న గోరుముద్ద. ► ఇలాంటి ఫుడ్ పక్కవాళ్లు తింటుంటే.. పెళ్లిళ్లలో చూశాం. కానీ, మేం ఇప్పుడు తింటున్నాం. ► వియ్ ఆర్ లక్కీ సార్. ఐ యామ్ ప్రౌడ్ టు బి లివింగ్ ఇన్ ఏపీ అండర్ యువర్ రూల్ సార్. ► కంటివెలుగు ద్వారా మా స్కూల్లో కంటి పరీక్షలు చేయించుకున్నాం. ► నాడు–నేడు ద్వారా నాడు పాఠశాల వేదనను చూశాం.. నేడు జగనన్న పాలనలో హరివిల్లును చూస్తున్నాం. బాత్రూంలు ఉండేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది.. అని రమ్య తన ప్రసంగం ముగించింది. అనంతరం జోక్యం చేసుకున్న సీఎం జగన్.. రమ్య తల్లి అనారోగ్య సమస్యపై వివరాలు అడిగి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఆంగ్లమే అవసరం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని, ఆంగ్లంలో చదివితేనే ప్రపంచంతో పోటీ పడగలమని విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యా వేత్తలు పేర్కొన్నారు. అమ్మ ఒడితో పేదల చదువులకు భరోసా కల్పించారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యకు అవకాశం కల్పించారని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని బాగా చదువుకుంటామని విద్యార్థులు చెప్పారు. జగనన్న గోరు ముద్ద అమృతమని, రోజుకో మెనూతో నాణ్యమైన భోజనం అందిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదువులపై ముఖ్యమంత్రికి ఉన్న స్పష్టత, అవగాహన అభినందనీయమని విద్యావేత్తలు పేర్కొన్నారు. విద్యారంగంపై బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం నిర్వహించిన మేధోమథన సదస్సుల్లో పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అన్ని రకాలుగా సాయం... నేను స్కూల్లో కుకింగ్ హెల్పర్‌గా పనిచేస్తా. ఈ సంవత్సరమే ఉద్యోగంలో చేరా. మొన్నటి దాకా పిల్లలకు భోజనంలో ఒట్టి సాంబారు పోశాం. ఇప్పుడు స్కూల్లో చిక్కీలు ఇస్తుంటే ఇష్టంగా తింటున్నారు. నా పిల్లలు నలుగురూ ప్రభుత్వ పాఠశాలలోనే తింటారు. బాగా చదువుతున్నారు. నాకు అమ్మఒడి డబ్బులు వచ్చాయి. డ్వాక్రా డబ్బులు ఇచ్చారు. నాకు ఇల్లు కూడా వచ్చిందని వలంటీరు ఫోన్ చేశారు. మా అత్తయ్యకు పింఛన్ కూడా వస్తోంది. ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందిస్తోంది. –జరీనా, పేరెంట్, గుంటూరు ఇష్టంగా తింటున్నాం మామయ్యా..! సీఎం జగన్ మామయ్యకు నమస్కారం. ‘జగనన్న గోరు ముద్ద’ గురించి చెబుతా. గతంలో ఒకటి రెండు కూరలే పెట్టేవారు. ఇప్పుడు ఎన్నో రకాల కూరలు. వారానికి ఐదు గుడ్లు, మూడు చిక్కీలు స్వీట్ పొంగల్, పాయసం, పులిహోర, కోడిగుడ్డు కూర, సాంబారు, ఆలూ కుర్మా, తోటకూర పప్పు ఇవన్నీ పెడుతుంటే ఎంతో ఇష్టంగా తింటు న్నాం. 8వ తరగతి చదివే మా అన్నయ్య కూడా స్కూల్లోనే తింటున్నాడు. ఇవన్నీ సమ కూర్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. –ఎం.రాజేశ్వరి, 5వ తరగతి, కోలవెన్ను, కృష్ణా జిల్లా. అమ్మ ఒడితో పాఠశాల ఫుల్! రెండేళ్ల క్రితం మా పాఠశాలలో 16 మంది విద్యార్ధులే ఉండేవారు. జగనన్న అమ్మఒడి కారణంగా విద్యార్ధుల సంఖ్య 165కి పెరిగింది. పేదవాళ్లను ఉన్నత స్ధితికి చేర్చే క్రమంలో మీరు బోయీలుగా పనిచేస్తున్నారు. మా బతుకుల్లో కొత్త దేవుడు ఉదయించాడని విద్యార్థులు, తల్లిదండ్రులు మీకు (సీఎం జగన్) చెప్పమన్నారు. ఆ చదువులయ్యే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు. – రామ్మోహన్, సెకండరీ గ్రేడ్ టీచర్, వైయస్సార్ నగర్,నెల్లూరు. దేశమంతా ఏపీ వైపు చూస్తోంది.. యావత్ దేశమంతా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. పాదయాత్ర హామీలన్నీ నెరవేరుస్తున్నారు. శార్వరి నామ సంవత్సరాన్ని మేం విద్యా సంవత్సరంగా భావిస్తున్నాం. నవకాయ పిండివంటల్లో ఏది బాగుందంటే ఎలా చెప్పలేమో మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలు కూడా అలాంటివే. ఈ ఏడాది సంక్రాంతి 14వ తేదీన కాకుండా 9వ తేదీనే వచ్చిందని అమ్మ ఒడి పథకంతో లబ్ధిపొందిన తల్లులు పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో చెప్పటాన్ని మరచిపోలేం. జగనన్న విద్యా కానుక ద్వారా పేద పిల్లలకు ఇచ్చే కిట్ ఎంతో ఉపయోగపడుతుంది. –కే.ఎస్.ఆర్.వి. శాస్త్రి, టీచర్, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి. అమ్మలా వచ్చిన అన్న...! నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తూ పేదలకు మేలు చేస్తున్నారు. అమ్మఒడి పథకం మాకు ఎంతో మేలు చేసింది. ఇప్పటిదాకా అక్షరాభ్యాసం సమయంలో అమ్మ అని రాసేవారు ఇప్పుడు అన్న అని రాస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినం దుకు పేరెంట్స్ కమిటీల తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. – టి.ప్రకాష్, పేరెంట్, పెనమలూరు,కృష్ణా జిల్లా ఐరోపాలోనూ ఇలా లేదు.. మీ ప్రసంగం విన్న తరువాత విద్యారంగంపై మీకున్న స్పష్టత అర్థమైంది. విద్యాశాఖ అంశాలపై సాధారణంగా కమిషనర్, సెక్రటరీ లేదా మంత్రి రివ్యూ చేస్తారు. కానీ ఒక సీఎం ఇంత క్లారిటీగా రివ్యూ చేయడం నా సర్వీసులో చూడలేదు. అద్భుతం. విద్యా శాఖకు మీరు కేటాయించిన బడ్జెట్ చూస్తుంటే ఐరోపా దేశాల్లో కూడా ఇలాలేదు. ఈరోజు ప్రపంచ దృష్టంతా విద్యారంగంపైనే ఉంది. – ఉపేందర్ రెడ్డి, నిపుణుడు, అడ్వైజర్,అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా. వర్సిటీల స్థాయిలో నాణ్యత పెరగాలి.. విద్యాసంస్ధల పరంగా మన రాష్ట్రంలో 16 స్టేట్ వర్సిటీస్, 5 డీమ్డ్ వర్సిటీస్, 5 ప్రైవేటు వర్సిటీలున్నాయి. 14 సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంస్థలు లేవు. కొత్త సంస్ధలను నెలకొల్పడం కంటే మనం ఉన్నవాటిని అభివృద్ధి చేసుకుని అప్‌గ్రేడ్ చేసుకోవడం మంచిది. విశ్వవిద్యాలయాల స్థాయిలో నాణ్యత పెంచాలి. కనీసం ఐదు విశ్వవిద్యాలయాలను జాతీయ స్ధాయిలో మొదటి 50 ర్యాంకుల లోపు ఉండేలా చూడాలి. అప్పుడే మనం దేశానికి ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతాం. –కే.ఎన్.సత్యన్నారాయణ, డైరెక్టర్, ఐఐటీ, తిరుపతి. విద్యా దీవెన ఆదుకుంది మా తల్లిదండ్రులకు మేమిద్దరం ఆడపిల్లలం. జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పొందాం. నాన్నకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆరోగ్యశ్రీతో బతికించు కున్నాం. నాన్నకు వికలాంగుల పింఛన్ వస్తోంది. దేవుడే మీ రూపంలో దిగివచ్చి ఏం కావాలని అడుగుతున్నారు. నేను బాగా చదివి మీ దగ్గర మంత్రిగా పనిచేయాలని కోరుకుంటున్నా. – చంద్రిక, విద్యార్థిని, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజి, విజయవాడ రెండు అడుగులు ముందుకు.. మీ నాన్న గారు (వైఎస్సార్) ఒక అడుగు ముందుకేసి గ్రామీణ పేద విద్యార్థుల కోసం ఆర్జీ యూకేటీలను స్ధాపిస్తే మీరు రెండు అడుగులు ముందుకేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. మీకు ధన్యవాదాలు. – నాగలావణ్య, ఆర్జీయూకేటీ, విద్యార్థిని, నూజివీడు -
రోజూ స్కూళ్లు, హాస్టళ్ల సందర్శన తప్పనిసరి
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయ ఉద్యోగుల వారీగా ఏ ఉద్యోగి.. ఏ రోజు.. ఏ నెలలో.. ఏ విధులు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం జాబ్ చార్టులను రూపొందించింది. ఈ ఉద్యోగుల్లో గ్రామ సచివాలయ సంక్షేమం–విద్య అసిస్టెంట్ కీలక పాత్ర పోషించనున్నారు. గ్రామ సచివాలయ సంక్షేమం–విద్య అసిస్టెంట్ రోజూ స్కూళ్లు, హాస్టళ్ల పర్యటనకు వెళ్లాలి. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, పెన్షన్ దరఖాస్తుల పరిశీలనతోపాటు ఆ డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయ సంక్షేమం–విద్య అసిస్టెంట్ విధులు ఇలా.. - రోజూ ఉదయం గ్రామ సచివాలయానికి రాగానే వివిధ వర్గాల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత విభాగాలకు పంపాలి. అనంతరం స్పందనలో వచ్చిన సమస్యల పరిష్కారంపై సహచర ఉద్యోగులతో సంప్రదింపులు చేయడంతోపాటు తన పరిధిలో అభివృద్ధి పనులపై చర్చించాలి. - తన పరిధిలోని స్కూళ్లు, హాస్టళ్లను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుతెన్నులు పరిశీలించాలి. అలాగే నాడు–నేడు కింద చేపట్టిన పనుల పురోగతితోపాటు పనుల నాణ్యతను తెలుసుకోవాలి. - బ్యాంకులకు వెళ్లి డ్వాక్రా సంఘాలు, గృహాల లబ్ధిదారులకు రుణాలిప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. - సాధారణ విధులతోపాటు పంచాయతీ కార్యదర్శి, ఇతర పై అధికారులు చెప్పే పనులు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేపట్టే ప్రత్యేక కార్యక్రమా లన్నింటికీ హాజరు కావాలి. - మధ్యాహ్నం నుంచి సచివాలయంలో సంబంధిత ఫైళ్లను పరిష్కరించడంతోపాటు ఆన్లైన్ సర్వీసులు, మాన్యువల్ సర్వీసులకు అందుబాటులో ఉండాలి. - వైఎస్సార్ బీమా క్లెయిమ్స్ డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. డ్వాక్రా సంఘాల రుణ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. - వైఎస్సార్ పెళ్లికానుక దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు నిర్వహించడంతోపాటు డాక్యుమెంట్లను అప్డేట్ చేయాలి. సంక్షేమ కార్పొరేషన్ల నుంచి ఆయా వర్గాలకు రుణాలను మంజూరు చేయించాలి. - గృహ నిర్మాణాలను పరిశీలించడంతోపాటు పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. - జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీతోపాటు, జగనన్న అమ్మఒడి, వసతి దీవెన లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. - పింఛన్ దరఖాస్తులను పరిశీలించడంతోపాటు డిజిటల్ అసిస్టెంట్ సహకారంతో అన్ని పథకాలు, కార్యక్రమాల వివరాలను అప్డేట్ చేయాలి. - డ్వాక్రా సంఘాలు, గ్రామ సంఘాల సమావేశాలకు హాజరవ్వాలి. అలాగే స్వయంఉపాధి యూనిట్లను సందర్శించాలి. - పింఛన్ డబ్బుల పంపిణీని పర్యవేక్షించడంతోపాటు ఏమైనా సమస్యలుంటే గ్రామ వలంటీర్లతో కలిసి పరిష్కరించాలి. – చదువులో వెనుకబడిన, లేదా తరచూ గైర్హాజరు అవుతున్న, స్కూల్‌కు రావడం మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలి. - ప్రతి నెలాఖరున పౌరహక్కుల రోజును నిర్వహించాలి. అంటరానితనం, బాల కార్మిక వ్యవస్థ, జోగిని వ్యవస్థల నిర్మూలనకు ప్రజలను చైతన్యపరచాలి. - స్కూళ్ల తల్లిదండ్రుల కమిటీల సమావేశాలను నిర్వహించడంతోపాటు అన్ని సంక్షేమ పథకాలకు చెందిన లబ్ధిదారుల దరఖాస్తులను వెరిఫికేషన్ చేయాలి. -
పాలనలో సరికొత్త అధ్యాయం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే ప్రజా సంక్షేమంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆర్థిక మందగమనం సమయాల్లో వృద్ధి రేటు పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ఉద్దీపన పథకాలు ప్రకటిస్తాయి. అయితే రాష్ట్రంలో అందుకు పూర్తి భిన్నంగా కోటిన్నరకుపైగా పేద, సాధారణ కుటుంబాల ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.14,795.21 కోట్లు ఆర్థిక సహాయం రూపంలో అందజేసింది. దీని వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని.. ఆర్థిక వ్యవస్థ కూడా గాడిలో పడుతుందని, ఆర్థిక మందగమనానికి ఇదే విరుగుడని ఆర్థిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాజిక విప్లవం ప్రారంభమైందని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలాగ భావిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై ప్రకటించిన జగన్మోహన్రెడ్డి ఎనిమిది నెలల్లోనే ఎన్నికల మేనిఫెస్టోకు అసలు సిసలు నిర్వచనం ఏమిటో చేతల ద్వారా చూపించారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడే ముఖ్యమంత్రిగా నిలిచారు. ఐదేళ్లు అధికారం ఇచ్చారు కదా అనే గత పాలకుల తరహాకు భిన్నంగా అధికారం చేపట్టిన నాటి నుంచే ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారు. ఎనిమిది నెలల కాలంలోనే మేనిఫెస్టోలోని సింహ భాగం హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. ఈ పథకాలను ప్రజా ఆకర్షక పథకాలుగా చూడకూడదని, ప్రధానంగా వైఎస్సార్ రైతు భరోసా, అమ్మ ఒడి పథకాల వెనుక బహుళ ప్రయోజనాలు ఉన్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. సామాజిక విప్లవానికి నాంది దేశానికి అన్నం పెట్టే రైతులకు పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా పథకం అమలు చేయడం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి రైతుల ఎంపిక చాలా పారదర్శకంగా జరిగింది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా, ఎక్కడా అవినీతికి తావులేకుండా, నేరుగా 46,50,846 మంది రైతుల ఖాతాలకు నగదు జమ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసాను ఈ ఏడాది ఖరీఫ్ నుంచి అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రైతుల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది నుంచే అమలు చేయడం విశేషం. అమ్మఒడి పథకం అమల్లో సామాజిక కోణం స్పష్టంగా కనిపిస్తోంది. పేదలు తమ పిల్లలను బడికి పంపించకుండా పనులకు తీసుకెళ్తున్నారు. దీంతో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పేద పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు కాకుండా బడికి పంపించేందుకు అమ్మఒడి పథకం ప్రారంభించారు. తమ పిల్లలను బడికి పంపించే తల్లులకు ఈ పథకం కింద ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇచ్చారు. తద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించే సామాజిక కోణం ఈ పథకంలో దాగి ఉందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని సామాజిక పెట్టుబడిగా చూడాలని కూడా ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమ్మఒడికి లబ్ధిదారులను పారదర్శకంగా.. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేయడమే కాకుండా అవినీతికి ఆస్కారం లేకుండా ఏకంగా 42,01,621 మంది తల్లుల ఖాతాలకు నగదు జమ చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్.. వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా పెన్షన్ పెంపును దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈ నెల 1వ తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నంలోగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తదితర లబ్ధిదారుల ఇళ్ల వద్దే వలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా ఈ కార్యక్రమం విజయవంతమైంది. పెన్షన్ పెంపు పథకం ద్వారా 54,65,564 మంది చేతులకు నేరుగా రూ.1,320.14 కోట్లు ఇచ్చారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. లంచాలు, అవినీతికి ఎక్కడా ఆస్కారం లేకుండా 1,02,388 మంది మత్య్సకారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. అలాగే చేనేత కార్మికులకు 24 వేల రూపాయల చొప్పున 81,783 మంది ఖాతాలకు నగదు జమ చేశారు. ఇచ్చిన మాట మేరకు అగ్రి గోల్డ్ బాధితులకు తొలి దశలో పది వేల రూపాయల డిపాజిట్ దారులైన 3,34,160 కుటుంబాలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు. ఈ పథకాలను సామాజిక పెట్టుబడిగా చూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించడం విశేషం. ఉద్యోగాల కల్పనకు బాటలు మొన్న కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిన విషయాన్ని స్పష్టం చేసింది. ఇటువంటి సమయంలో ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి ప్రజల కొనుగోలు శక్తి పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాల ప్రజలకు వివిధ పథకాల కింద సుమారు రూ.15 వేల కోట్లు పంపిణీ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లడానికి ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. కచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు ప్రజల వినిమయ శక్తిని పెంచి తద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేస్తాయనడంలో సందేహం లేదు. – డాక్టర్ మధుబాబు, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ హెడ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. దీర్ఘ కాలంలో మంచి ఫలితాలు ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కోనుగోళ్లు పెరిగితే వృద్ధి రేటు పెరుగుతుంది. తద్వారా ఉద్యోగాల కల్పన ఏర్పడుతుంది. ఇదంతా ఓ సైకిల్. ఇప్పుడు నవరత్నాలు, సచివాలయం ఉద్యోగాలతో సీఎం వైఎస్ జగన్ ఇదే చేస్తున్నారు. మందగమనం సమయంలో సంక్షేమ పథకాల రూపంలో పెద్ద ఎత్తున నగదు వ్యవస్థలోకి పంపడం ద్వారా వృద్ధి రేటు పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది ఆర్థిక పరిస్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది. – ప్రొఫెసర్ ఎం.ప్రసాద రావు, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ హెడ్, ఆంధ్రా యూనివర్సిటీ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతం ప్రభుత్వం ఒక రూపాయి వ్యయం చేస్తే అది అనేక రకాలుగా ఆదాయాన్ని కల్పిస్తుంది. అమ్మఒడి కింద చేసిన వ్యయాన్ని మూల ధన పెట్టుబడి కింద చూడాలి. ఇది వ్యయం కాదు. దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది. సంక్షేమ పథకాల మీద చేస్తున్న వ్యయాన్ని రాష్ట్ర ప్రజలపై పెట్టుబడిగా చూడాలి. పేద ప్రజల సంక్షేమ పథకాలపై చేస్తున్న వ్యయం ఆర్థిక వ్యవస్థకు మంచిదే. – పి.సుదర్శన్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, యోగి వేమన విశ్వవిద్యాలయం. -
‘అమ్మఒడి అనేది పథకం కాదు.. విద్యా విప్లవం’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ఓ విద్యా విప్లవమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు కొనియాడారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సందర్భంగా మంగళవారం అమ్మ ఒడి పథకంపై మాట్లాడుతూ.. అదొక విద్యా విప్లవంగా అభివర్ణించారు. విద్యారంగం సంస్కరణల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని ప్రశంసించారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన పథక మెనూను స్వయంగా జగన్ రూపొందించడం నిజంగా అభినందనీయమన్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన ఘనత కూడా జగన్‌దేనన్నారు. దేశ చరిత్రలో అలాంటి సంస్కరణలో ఏ రాష్ట్రంలోనూ చేయలేదన్నారు. తన పాదయాత్రలో పేదల కష్టాలను జగన్ చూశారని ఈ సందర్భంగా అప్పలరాజు మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇక ఫీజు రియింబర్స్‌మెంట్ అనేది పేద విద్యార్థులకు వరం అని అప్పలరాజు పేర్కొన్నారు. ఇక డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. అమ్మఒడి పథకం పేదలకు ఒక భరోసా అన్ని అన్నారు. అంటే అమ్మ అని, ఆ అంటే ఆంధ్రప్రదేశ్‌ని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. -
అమ్మఒడి.. విద్యా విప్లవానికి నాంది
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో అమ్మఒడి పథకం ద్వారా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని చెప్పారు. 14 ఏళ్ల లోపు పిల్లలకు విద్య ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ పేర్కొన్నప్పటికీ, పేదరికం కారణంగా చాలా మందికి పిల్లలను చదివించే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకే ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. చిత్తూరులో గురువారం ఆయన అమ్మఒడి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘ప్రతి బిడ్డ అమ్మ ఒడిలో ఎదుగుతుంది. ఆ తల్లి గుండెల్లో పెట్టుకుని బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తల్లి తన కంటే ప్రాణంగా బిడ్డలను చూసుకుంటుంది. అలాంటి తల్లులను, అక్కచెల్లెమ్మలను నా 3,648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప పాదయాత్రలో చూశాను. వారికి పిల్లల చదువులు భారం కాకుడదని భావించాను. అందుకే ఈ పథకాన్ని ఇక్కడ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా ఈ పథకం కింద రూ.15 వేలు ఇస్తాం’ అని చెప్పారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఈ డబ్బును పాత అప్పులకు జమ చేసుకోరు ‘అమ్మఒడి పథకం ద్వారా చేకూరే లబ్ధి బ్యాంకర్లు మునపటి అప్పులకు జమ చేసుకోకూడదని సూచించాం. బ్యాంకర్లు సహకరించారు. ఈ పథకం కింద దాదాపు 42,12,186 లక్షల మంది తల్లులు, 81,72,224 లక్షల మంది పిల్లలకు మేలు చేకూరుతుంది. వీరికి రూ.6,456 కోట్లు చెల్లించనున్నాం. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అమ్మఒడి ప్రవేశపెట్టనున్నట్లు పాదయాత్రలో చెప్పాను. ప్రస్తుతం ఇంటర్ వరకు వర్తింప చేస్తున్నాం. వరుసగా ప్రతి ఏటా తల్లుల అకౌంట్లో రూ.15 వేలు జమ అవుతుంది. చదువుకోవాలంటే ముందు కడుపు నిండాలని, తల్లులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ పథకంలో విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉంటేనే పథకం వర్తిస్తుంది. ఆంగ్ల మాధ్యమంపై ప్రజల ఆకాంక్ష.. చంద్రబాబుకు, పత్రికాధిపతికి, సినిమా యాక్టర్‌కు పట్టడం లేదు. తెలుగు మీడియం కావాలనే నేతలెవరూ, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వారి పిల్లలను ఆ మీడియంలో చదివించడం లేదు. ఇంగ్లిష్ మీడియం కావాలా.. వద్దా.. అని మిమ్మల్నే అడుగుతున్నా.. మీరిచ్చే సమాధానమే వారికి జవాబు. (కావాలి.. కావాలి.. అంటూ జనం నినాదాలు) ఇంగ్లిష్ మీడియంలో బోధన పేద విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేలా ఇంగ్లిష్ మీడియంలో బోధన. తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు. మనబడి నాడు–నేడు రూ. 14 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో 9 రకాల మౌలిక సదుపాయాల కల్పన. జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఎంతైనా సరే పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్. మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పెంచి, పౌష్టికాహారం అందించేలా మెనూలో మార్పులు. రూ.353 కోట్లు అదనంగా కేటాయింపు. జగనన్న వసతి దీవెన వసతి, భోజన ఖర్చులకు కోసం ఏటా రూ.20 వేలు.. రెండు దఫాలుగా చెల్లింపు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించాలి. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉపాధ్యాయులకు సరైన తర్ఫీదు ఉండాలి. నాణ్యమైన విద్యను అందించినప్పుడే పేద పిల్లలు లక్ష్యం చేరుకుంటారు. అందుకే పోటీ ప్రపంచంలో దీటుగా నిలిచేందుకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టబోతున్నాం. రాబోయే జూన్‌లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేశాం. తెలుగు మీడియం పిల్లలకు కొంత ఇబ్బంది వస్తుంది. దీన్ని అధిగమించేందుకు బ్రిడ్జి కోర్సులు, ఉపాధ్యాయులకు ట్రైనింగ్ కోర్సులు ప్రవేశ పెట్టాం. ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళతాం. ఇలా నాలుగేళ్లలో మన పిల్లలు బోర్డు ఎగ్జామ్‌ను ఇంగ్లిష్‌లో రాసే పరిస్థితి వస్తుంది. కొందరు ఇంగ్లిష్ మీడియం వద్దంటున్నారు. ఈనాడు పేపర్‌కు, చంద్రబాబునాయుడుకు, సినిమా యాక్టర్‌కు విన్పించేలా మీ అభిప్రాయం గట్టిగా చెప్పండి. (కావాలంటూ ప్రజలు నినాదాలు చేశారు) 2020 జూన్‌లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నాం. అప్పుడు 6వ తరగతి చదివే పిల్లలకు 2030లో డిగ్రీ పూర్తి అవుతుంది. 2032లో పీజీ చేస్తారు. 2020లో పుట్టిన పిల్లలు 2040లో డిగ్రీ పూర్తి చేస్తారు. ఆ నాటికి మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడతారు. ఆ మేరకు ప్రభుత్వ బడులను మార్చేస్తాం. సిలబస్‌లో మార్పు తెస్తాం. పేదరికంలో ఉన్న వారి బతుకులు మారాలి. కుల వృత్తితో అన్యాయమైన బతుకు కొనసాగకూడదు. మరో కీలక నిర్ణయం.. మధ్యాహ్న భోజనంలో మార్పులు విద్యార్థులకు మంచి చదువుతోపాటు పౌష్టికాహారం కూడా ముఖ్యమే. మంచి ఆహారం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు తేవాలని సంకల్పించాం. పిల్లల భోజనం మెనూ విషయంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఆలోచించి ఉండరు. మెనూ మార్పు ద్వారా దాదాపు రూ.200 కోట్లు అదనపు భారం పడుతుంది. భోజనం వండి పెట్టే ఆయాల జీతాలు వెయ్యి రూపాయల నుంచి రూ.3 వేలకు పెంచడం వల్ల రూ.160 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. అయినా పిల్లల కోసం ఆ ఖర్చును సంతోషంగా భరిస్తాం. సంక్రాంతి సెలవుల తర్వాత నుంచి కొత్త మెనూ అమలు చేస్తాం. ఆ మెనూ ఇలా ఉంటుంది. సోమవారం : అన్నం, పప్పు చారు, ఎగ్ కర్రీ, స్వీట్ చిక్కీ మంగళవారం : పులిహోర, టామాటా పప్పు, ఉడికించిన గుడ్డు బుధవారం : వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ గురువారం : కిచిడీ, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్ చిక్కీ శనివారం : అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్ తాము వండిన ఆహార పదార్థాలను సీఎంకు రుచి చూపిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు నాడు – నేడుతో ప్రభుత్వ బడుల్లో సమూల మార్పు రాష్ట్రంలో చదువుల విప్లవం కోసం 45 వేల పాఠశాలు, 471 జూనియర్ కళాశాలలు, 3,287 హాస్టళ్లు, 148 డిగ్రీ కళాశాలల్లో నాడు–నేడు ద్వారా మార్పు తెస్తాం. శిథిలావస్థలో ఉన్న బడులను చదువుల దేవాలయాలుగా మార్చాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు బడుల ఫొటోలు తీశాం. వాటి రూపు రేఖలను పూర్తిగా మార్చేసిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి చూపిస్తాం. ఈ ప్రక్రియను మూడేళ్లలో పూర్తి చేస్తాం. మొదటి దశగా ఈ సంక్రాంతి తర్వాత 15,745 బడుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. టాయిలెట్లు, మంచినీళ్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, పర్నిచర్, గ్రీన్ బ్లాక్ బోర్డు, పెయింటింగ్, కాంపౌండ్లు, ఇతర మరమ్మతులు, ఇంగిస్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. సగం విద్యా సంవత్సరం గడిచిన తర్వాత గానీ పుస్తకాలు అందని పరిస్థితిని ఏటా చూస్తున్నాం. ఈ పరిస్థితిని మారుస్తూ.. స్కూళ్లు తెరిచే నాటికే ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలందరీకి స్కూల్ కిట్ అందజేస్తాం. అందులో 3 జతలు యూనిఫాం, పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్ అందజేస్తాం. భోదన ప్రమాణాలు పెంచడంతోపాటు, టీచర్లకు శిక్షణ, విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తున్నాం. విద్యా దీవెనతో ఆదుకుంటాం ఇంటర్మీడియట్ తర్వాత 23 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. మిగతా 77 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదరికంలో ఉన్న మైనార్టీలు, ఇతర వర్గాల్లోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువులు మానేస్తున్నారు. అలాంటి వారి కోసం విద్యా దీవెన పథకం ప్రవేశ పెట్టాం. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా తోడుగా ఉంటాం. ఎంతటి చదువులైన చదివేందుకు అవకాశం కల్పిస్తాం. పేదవారికి తోడు–నీడగా ఉండేందుకు వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ ఖర్చులు కూడా భరిస్తాం. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో రూ.10 వేలు.. జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు పేద విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో హాస్టల్ ఖర్చుల కోసం జమ చేస్తాం’ అని సీఎం అన్నారు. పిల్లల మేనమామగా అభ్యర్థిస్తున్నా.. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అమ్మఒడి పథకాన్ని రూపొందించాం. స్కూళ్ల రూపు రేఖలు మారుస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తున్నాం. పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేశాం. మీ స్కూల్ పనితీరులో మీ భాగస్వామ్యం కూడా కావాలి. మీ పిల్లలు వెళ్లే పాఠశాల వాచ్‌మన్ మీద, బాత్రూమ్ల మీద కాస్త ధ్యాస పెట్టండి. బాత్రూం నిర్వహణ, వాచ్‌మన్ జీతం కోసం మీరూ భాగస్వాములు కావాలి. అప్పుడే జవాబుదారితనం పెరుగుతుంది. అందుకోసం మీకు అందించే రూ.15 వేలల్లో రూ.వెయ్యి పాఠశాల నిర్వహణ కోసం పేరెంట్స్ కమిటీకి అప్పగించండి. పాఠశాల రూపురేఖలు మారినా, నిర్వహణ బాగోలేకపోతే పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. అందుకే పాఠశాలల నిర్వహణ బాధ్యత అక్కచెల్లెమ్మలు తీసుకోవాలి. ప్రతి తల్లికి అన్నాగా తోడుగా ఉంటూ.. పిల్లలకు మంచి మేనమామగా అభ్యర్థిస్తున్నా’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. అనంతరం ల్యాప్‌టాప్ ద్వారా బటన్ నొక్కి అమ్మ ఒడి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, బల్లి దుర్గాప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. విప్లవాత్మక విద్యకు ఈ పథకాలతో రాచబాట పథకం పేరు ఉద్దేశం వ్యయం జగనన్న అమ్మఒడి పిల్లలందరినీ బడికి పంపాలి రూ.6,456 కోట్లు మధ్యాహ్న భోజనం పేద పిల్లలకు పౌష్టికాహారం అదనంగా రూ.360 కోట్లు నాడు–నేడు స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన రూ.14,000 కోట్లు జగనన్న విద్యా దీవెన అర్హతగల ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి ఫీజు జగనన్న వసతి దీవెన హాస్టల్ ఖర్చులనూ ప్రభుత్వమే భరించడం ఒక్కో విద్యార్థికి ఏటా రూ.20 వేలు అందరి కష్టాలు చూశారు.. అండగా నిలిచారు ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా నాడు ‘నేను విన్నాను.. నేను చూశాను.. నేను ఉన్నాను..’ అన్నారు. అందుకే ప్రజలంతా రావాలి జగన్.. కావాలి జగన్.. అంటున్నారు. ఇవాళ మా మేలు కోసం సీఎం వైఎస్ జగన్ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అమ్మఒడి పథకం ద్వారా మా అమ్మకు రూ.15 వేలు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి మా బతుకులు మార్చబోతున్నాయి. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నారు. ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు. ఐఏఎస్ అధికారిణి కావడమే నా లక్ష్యం. ఆ దిశగా ఈ కార్యక్రమాలు, పథకాలు నాకెంతో మేలు చేస్తాయని భావిస్తున్నా. అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపుతున్న సీఎం జగన్‌కు మనసారా ధన్యవాదాలు. (ఇంగ్లిష్‌లో మాట్లాడింది) –కల్పవృక్షిణి, పీసీఆర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, చిత్తూరు అమ్మానాన్నలా, అన్నలా ఆదరిస్తున్నారు మా అమ్మ సహాయ వంటమనిషిగా పనిచేస్తోంది. మా నాన్న నిరుద్యోగి. నా ఆశయం ఐఏఎస్ అధికారి కావడమే. ఈ పథకాన్ని వినియోగించుకుని నేను బాగా చదువుకుంటాను. స్మార్ట్ ఫోన్‌కు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల కంటికి ఇవ్వలేదు. కానీ సీఎం.. వైఎస్సార్ కంటి వెలుగును ప్రారంభించి మా కళ్లకు పరీక్షలు చేయించారు. కళ్లద్దాలను కూడా ఉచితంగా అందజేశారు. రోజూ ఒకే రకమైన భోజనం తిని విసుగు వచ్చేది. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకంలో పలు మార్పులు చేసి మాకు చక్కటి భోజనం పెట్టనున్నారు. అమ్మానాన్నలా, ఒక అన్నలా ఆలోచించి మాకు ఎంతో మేలు చేస్తున్నారు. – నవ్యప్రజ్వలిక, ఆదర్శ పాఠశాల, శాంతిపురం, చిత్తూరు జిల్లా పిల్లల భవిష్యత్ బాగుపడనుంది సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్.. అందరి కష్టాలు తీర్చేందుకు నవరత్నాలను ప్రకటించారు. వాటిలో కీలకమైంది అమ్మఒడి పథకం. ఈ పథకం మా వంటి పేదలకు ఎంతో మేలు చేస్తోంది. మేము మా పిల్లలను బడికి పంపే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు రూ.15 వేలు సహాయం చేస్తుండడం వల్ల పిల్లలను బడికి పంపించగలుగుతున్నాం. ఇంగ్లిష్ మీడియం మా పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. తద్వారా పిల్లల భవిష్యత్ బాగుపడుతుందనడంలో సందేహం లేదు. –శ్రీదేవి, విద్యార్థి తల్లి, పెడగంటిపల్లి గ్రామం, జీడీనెల్లూరు మండలం పిల్లలు బాగా చదువుకునే వాతావరణం పాఠశాలల్లో ఉండాలి.. మంచి చదువులు చెప్పే ఉపాధ్యాయులు ఉండాలి.. చదువులు పేదింటి తల్లులకు భారం కాకూడదు.. పిల్లలకు కడుపు నింపే తిండి ఉండాలి.. ఈ నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పథకం తీసుకొస్తున్నాం. పేదింటి పిల్లలు పోటీ ప్రపంచంలో దీటుగా నిలిచేలా తయారవ్వాలన్నదే మా లక్ష్యం. అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుతుంది. అర్హత ఉండి లబ్ధి చేకూరని తల్లులు ఎలాంటి హైరానా పడాల్సిన పనిలేదు. ఫిబ్రవరి 9వ తేదీలోపు.. అంటే నెల రోజుల్లోపు పేర్లు నమోదు చేసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తాం. - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
‘జగనన్న అమ్మ ఒడి’తో మీ కలలు సాకారం
సాక్షి, అమరావతి: ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం ద్వారా పేదింటి పిల్లల చదువులు సాకారం అవుతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పేదింటి తల్లులు తమ పిల్లలను బడికి పంపి మంచి చదువులు చదివించుకొనేందుకు ఏటా రూ.15 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వారి పిల్లలు మరింత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. అమ్మ ఒడితో పాటు విద్యార్థుల బంగారు భవితవ్యం కోసం మరో 3 విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. ఈమేరకు ‘జగనన్న అమ్మ ఒడి’కి ఎంపికైన పేదింటి తల్లులకు ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఉద్యోగావకాశాలు మెరుగుపడేలా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం, నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన, పుష్టికరమైన మధ్యాహ్న భోజనం అమలు కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం లేఖలో తెలిపారు. లేఖలోని అంశాలు ఇవీ... మాట నిలబెట్టుకుంటున్నా.. ‘‘జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుకోనున్న ప్రతి తల్లికీ నమస్కరిస్తూ అభినందనలు తెలియచేస్తూ ఈ ఉత్తరం రాస్తున్నా. పేదింటి తల్లులు తమ పిల్లలను చదివించుకోడానికి పడుతున్న ఇబ్బందుల్ని నా సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా. అలాంటి తల్లుల్లో మీరు కూడా ఒకరు. మీలాంటి నిరుపేద తల్లులు పిల్లల్ని చదివించుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం నేరుగా అందచేస్తే మీ కష్టాలు కొంతవరకైనా తీరుతాయని, మీ కలలు నెరవేరతాయని భావించా. అందుకని ‘అమ్మ– ఒడి’ అనే పథకం ప్రారంభిస్తానని, ప్రతి పేదింటి తల్లికీ పిల్లల చదువులకోసం ఆర్థిక సహాయం అందచేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చా. ఆ మాట నిలుపుకొంటూ ఇప్పడు రూ.15,000 మీ బ్యాంకు ఖాతాకు, పాతబకాయిలకు సర్దుబాటు చెయ్యకుండా నేరుగా బదిలీ చేస్తున్నాం. ఈ సొమ్ముతో మీ పిల్లల్ని మరింత బాగా చదివించుకోవాలని కోరుకుంటున్నా. దేశంలోనే తొలిసారి.. పిల్లల చదువుకు తల్లుల పేదరికం అడ్డుకాకూడదని మన ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర పథకం రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలోనే మొట్టమొదటిసారి. మీలాంటి తల్లులు దాదాపు 43 లక్షల మందికి సుమారు రూ.6,455 కోట్ల మేర ఈ విధంగా ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మరో మూడు విప్లవాత్మక చర్యలు.. మీ పిల్లలను బడికి పంపించాక చక్కటి చదువు చెప్పటం కోసం మరో మూడు విప్లవాత్మక చర్యలు కూడా తీసుకుంటున్నాం. మొదటిది పిల్లలకు చక్కటి ఉద్యోగ అవకాశాల కోసం మన పాఠశాలలన్నింటిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నాం. రెండోది.. పాఠశాలల్లో మంచినీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు లాంటి కనీస సదుపాయాలు మెరుగుపరుస్తూ ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం కింద పాఠశాలల రూపురేఖల్ని మూడేళ్లలో మార్చబోతున్నాం. ఇక మూడవది.. పిల్లలకు పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం మరింత నాణ్యమైనదిగా, పుష్టికరంగానూ ఉండేందుకు సంక్రాంతి సెలవుల తరువాత నుంచి కొత్త మెనూ అమలు చేయబోతున్నాం. మీ పిల్లలు ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకొని మరింత వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ... మీ .. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి -
దేశవ్యాప్తంగా అమ్మ ఒడిని అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి : చదువుకు పేదరికం అడ్డుకారాదన్న ఉద్దేశంతో ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. నూతన విద్యా విధానం ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రుల సమావేశంలో ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ పాల్గొన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలికిన అమ్మ ఒడి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవశ్యకత ఉందని వివరించారు. అలాగే ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,456 కోట్ల నిధులు వెచ్చిస్తోందని, ఈ పథకానికి కేంద్రం తరఫున కూడా తగిన సాయం చేయాలని కోరారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పనకు ప్రభుత్వం వెచ్చించే నిధులపై జీఎస్టీని మినహాయించాలని కోరారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలను స్కూళ్లకు పంపే పేదలకు జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రాధాన్యం ఇవ్వడాన్ని నూతన విద్యా విధానంలో పొందుపరచాలన్నారు. ఇక ఏపీలో లోక్‌సభ నియోజకవర్గాల కేంద్రంగా వృత్తి విద్యా కాలేజీలు, స్థానికంగా ఉన్న పరిశ్రమలతో అనుబంధంగా నైపుణ్యాల శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీన్ని కూడా జాతీయ స్థాయిలో అమలు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అవసరమైన నిధులు విడుదలలో చొరవ చూపాలని కోరుతూ రమేష్ పోఖ్రియాల్‌ను ప్రత్యేకంగా కలసి ఆదిమూలపు సురేష్ వినతిపత్రం ఇచ్చారు. ఆగస్టు 29న జరిగిన సమావేశంలో కోరిన అంశాలను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. -
‘ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదు’
-
‘అమ్మ ఒడి’పై సీఎంఓ కీలక ప్రకటన
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి వర్తింపజేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని పేర్కొంది. పాదయాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అనుసరించి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ముందుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల స్థితిగతుల్ని, రూపు రేఖల్ని మార్చాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అన్ని చర్యలు తీసుకుంటాం.. పేదల పిల్లలు ప్రతీ ఒక్కరు బడికి వెళ్లి చదువుకోవాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని సీఎంఓ పేర్కొంది. బడిబాట కార్యక్రమంలో అక్షరాభ్యాసం సందర్భంగా, విద్యా శాఖ సమీక్ష సమావేశంలో ఈ పథకం గురించిన విధివిధానాలు రూపొందించాలని ఆయన ఆదేశించారని తెలిపింది. ఇందులో భాగంగా ముందుగా ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించింది. ‘దేశం మొత్తంలో నిరక్షరాస్యుల సగటు 26 ఉంటే.. ఏపీలో 33 శాతం ఉంది. మన రాష్ట్రంలో ప్రతీ 100 మందిలో 33 మంది నిరక్షరాస్యులే. అక్షరాస్యత విషయంలో ఏపీ దేశంలో అట్టడుగున ఉంది. ఈ పరిస్థితిని మార్చి.. పేద కుటుంబాల్లోని పిల్లలు చదువుకునే విధంగా ఈ పథకాన్ని ప్రకటించారు’ అని ‘అమ్మ ఒడి’ పథకం ఆవశ్యకతను వివరించింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావు లేదని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి ఈ పథకం వర్తిస్తుందని సీఎంఓ స్పష్టం చేసింది. -
అమ్మకు అభయం
హుజూర్నగర్/సూర్యాపేట రూరల్ : మాతా శిశు సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం కొనసాగుతుండగా గర్భిణులకు మరిన్ని సేవలందిస్తూ తల్లీబిడ్డ ఆరోగ్య పరిరక్షణకు దోహదపడేందుకు 108 తరహాలో అమ్మఒడి పేరిట 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనాలు అమ్మకు ఆత్మీయత, బిడ్డకు ప్రేమను పంచనున్నాయి. మొదటి విడతగా జిల్లాకు ఇప్పటికే ఎనిమిది వాహనాలు రాగా నియోజకవర్గానికి రెండు చొప్పున కేటాయించారు. ఇటీవల మంత్రి జగదీశ్‌రెడ్డి చేతులమీదుగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క ఫోన్‌కాల్‌తో.. మారుమూల గ్రామాల నుంచి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు సైతం లేని దు స్థితిలో ఇబ్బందులు పడుతున్న మహిళల కోసం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టారు. తల్లీ బిడ్డలకే కాకుండా గర్భిణులకు వైద్యం అవసరమైతే 102 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు. ఇంటికి వచ్చి వాహనంలో వైద్యశాలకు తీసుకు వెళ్లి వైద్యపరీక్షలు పూర్తయ్యాక తిరిగి ఇంటి వద్దకు చేరవేస్తారు. జిల్లాలో గల 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలల పరిధిలో ఏఏ ఆస్పత్రిలో ఎక్కువగా ప్రసవాలు జరుగుతున్నాయో గుర్తించి ఆ ప్రాంతాలకు నూతనంగా వచ్చిన వాహనాలను కేటాయించేందుకు సిద్ధమయ్యారు. సేవలు ఇలా.... గర్భిణులకు 7వ నెల నుంచి ప్రసవానంతరం పుట్టిన చిన్నారికి మూడు నెలలు వచ్చేంత వరకు సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. 7వ నెల నుంచి గర్భిణులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా 102 వాహనానికి సమాచారం అందించి సేవలు వినియోగించుకోవచ్చు. గర్భిణి ఇంటి వద్దకు వచ్చి 102 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తారు. వైద్యసేవలు అందించిన తర్వాత్ల తిరిగి ఇంటికి చేరుస్తారు. డెలివరీ అయిన మూడు నెలల వరకు కూడా ఈ 102 వాహనం సేవలు వినియోగించుకోవచ్చు. 102 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే తరలిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించరు. ప్రయాణం మధ్యలో గర్భిణులు, బాలింతలకు అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే ఎమర్జెన్సీ కిట్ అందుబాటులో ఉంచారు. ప్రయాణ సమయంలో వైద్య పరీక్షల అవసరం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ఆడియోను వినిపిస్తారు. వాహనాల సేవలు వినియోగించుకోవాలి జిల్లాకు 102 వాహనాలు 8 వచ్చాయి. ఈ వాహనాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాల్లో గర్భిణులను సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. – రహీం, ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ , సూర్యాపేట జిల్లా -
తల్లి రుణం తీర్చుకోవడానికే అమ్మ ఒడి
గుండాల (ఆలేరు) : తల్లి రుణం తీర్చుకోవడానికే గత ఐదు సంవత్సరాలుగా అమ్మ ఒడి కార్యక్రమాన్ని చేపట్టి పిల్లల తల్లులకు ఒడి నింపి తన తల్లి రుణం తీర్చుకుంటున్నానని సినీగేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. అశోక్‌తేజ తల్లిదండ్రులు సుద్దాల జానకమ్మ, హన్మంతుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలోసోమవారం జనగామ జిల్లా గుండాల మండలంలోని అనంతారం గ్రామంలో అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తున్నప్పుడు బిడ్డను కాపాడుకోవడానికి ఓ తల్లి పడిన ఆవేదన, అదే ప్రాంతంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా వదిలేసిన సంఘటనను తనను కలచి వేశాయని చెప్పారు. ఆ సంఘటనలనే స్ఫూర్తిగా తీసుకొని తన తల్లిదండ్రుల పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి అమ్మ ఒడి అమ్మ మడి, అమ్మ బడి తది తర సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఎన్నుకో.. ఏలుకో
* బాబు హయాంలో చదువు‘కొనా’ల్సిందే.. * ఫీ‘జులుం’ నుంచి విముక్తి కల్పించిన వైఎస్ * వైఎస్ అనంతరం పరిమితులు * జగన్ ‘అమ్మ ఒడి’ పై చిగురిస్తున్న ఆశలు దాదాపు 1.25 కోట్లు...! మన రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకోబోయే విద్యార్థుల సంఖ్య ఇది. ఇందులో కొత్త ఓటర్లు అంటే..18-19 ఏళ్లలోపు వయసున్న వారి సంఖ్య 15లక్షల పైచిలుకు ఉన్నారు. రానున్న ఎన్నికలలో వీరి ఓట్లదే కీలకం. ‘విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు...విద్యార్థుల త్యాగమూ రాయని చరితే లేదు’....సమాజోద్ధరణలో విద్యార్థి దశ ఎంత కీలకమైనదో ఓ కవి ఎప్పుడో చెప్పాడు. అటువంటి యువత దేశ భవితవ్యాన్ని నిర్దేశించే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది...ఈ నేపథ్యంలో విద్యార్థి సంక్షేమానికి ఏ ప్రభుత్వం చిత్తశుద్ధి కనబర్చిందనే విషయమై...ఈ విశ్లేషణ. మేకల కళ్యాణ్ చక్రవర్తి, ఖమ్మం: తమ అభివృద్ధి కోసం పాటుపడిందెవరు? తమకు విద్యార్థి దశలో మంచి చదువులు చెప్పించే పరిస్థితులను కల్పించి, ఆ దశ దాటిన తర్వాత ఉపాధి కల్పన మార్గం చూపిన వారెవరు? అనే అంశాలే విద్యార్థి వేయబోయే ఓటును నిర్దేశిస్తాయి. ఈ నేపథ్యంలో ఓటేసే వయసున్న యువ విద్యార్థి లోకం గత పాలన తీరు తెరుతెన్నులను నేటి పాలనతో పోల్చి చూస్తోంది. విద్యార్థికి అండగా ఉన్నదెవరు?...వారి భవితవ్యాన్ని శూన్యం చేసిందెవరు?.. భవిష్యత్‌లో తమకు బంగారుబాట వేసేదెవరు? ఇప్పుడు తామేం చేయాలి... ఎవరిని ఎంచుకోవాలి... అనే అంశాలు చర్చిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వా లు ఫీజుల పథకాన్ని దూరం చేసేందుకు చేయ ని ప్రయత్నాలు లేవు. సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులకు వైఎస్ హయాంలో పూర్తి ఫీజురీయింబర్స్ అవగా, ప్రస్తుతం కోర్సు ఫీజు ఎంతైనా గరిష్టంగా రూ.20వేలే రీయింబర్స్ చేస్తున్నారు. డబుల్ పీజీలకు కూడా గతంలో రీయింబర్స్మెంట్ ఇవ్వగా, ఇప్పుడు ఒక్క పీజీకి మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించారు. వయోపరిమితి నిబంధన విధిస్తామంటూ కోర్సుల వారీగా వయసును వర్గీకరించారు. పారామెడికల్ విభాగంలో 26 కోర్సులను 17కు కుదించారు. ఫ్యాషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంటర్ (వృత్తివిద్య), కలినరీ ఆర్ట్ వంటి సర్టిఫికెట్ కోర్సులనూ ఎత్తివేశారు. ‘గేట్’ ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో చేరిన వారిని మినహాయించారు. గతంలో లబ్ధి పొందిన వీరి నుంచి సొమ్మును రికవరీ చేస్తున్నారు. పీహెచ్డీ చేస్తున్న కొందరు విద్యార్థులకు ఫెలోషిప్ వస్తుందన్న సాకుతో పరిశోధన చేస్తున్న విద్యార్థులనూ మినహాయించడం గమనార్హం. కేంద్రం గుర్తించిన 183 విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్ చేయాలని నిర్ణయించారు. ఇంజనీరింగ్ ఫీజులనూ ఇష్టారాజ్యంగా పెంచేసి ప్రభుత్వం రూ.35వేలే చెల్లిస్తుందని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనల్లో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను సందర్శించి అక్కడే రాత్రి బస చేసినా వారి మెస్‌చార్జీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. రాజీవ్ యువకిరణాల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పిన కిరణ్ విజయవంతం కాలేకపోయారు. ప్రచారార్భాటం కోసం పెట్టిన ఈ పథకం ద్వారా మండలానికో నలుగురికి కంప్యూటర్ శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.అరకొరా హైదరాబాద్‌లోని సమీపంలో పరిశ్రమల్లో ఉద్యోగాలిప్పించినా వారు సరిగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో యువత అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితులను కూడా కల్పించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు వై‘ఎస్’ ‘పేదరికం కారణంగా అర్హుడైన ఏ విద్యార్థీ ఉన్నత విద్య కు దూరం కాకూడదు.’ అన్న సదుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే పూర్తిగా ఫీజు, స్కాలర్షిప్ వస్తుండగా (అవి కూడా రాష్ట్రం ఇచ్చేది కాదు... కేంద్రం నిధులనే పంచేవారు.) వైఎస్ వచ్చిన తర్వాత దానిని బీసీలకు, ఈబీసీలకు వర్తింపజేశారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం యేటా 26లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. - ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల వ్యవస్థను సమూలంగా మార్చి బీసీ, ఈబీసీలకూ రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేశారు. - వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు స్కాలర్షిప్లను 60శాతం మేర పెంచారు. - సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఆరేళ్లలో రెండు సార్లు 60శాతం మేర డైట్‌చార్జీలు పెంచారు. ఏడో తరగతిలోపు విద్యార్థులకు నెలకు రూ.338 ఉండ గా రూ. 475కు, ఏడు నుంచి ‘పది’విద్యార్థులకు రూ. 412 నుంచి రూ.535కు పెంచారు. అప్పటి వరకూ హాస్టల్ విద్యార్థులకు ఏడాదికి రెండు జతల యూనిఫారంలు ఇస్తుండగా, దానిని నాలుగు జతలకు పెంచారు వైఎస్. అలాగే బాలురకు రూ. 20గా ఉన్న కాస్మొటిక్ చార్జీలను రూ. 50కి, బాలికలకు రూ. 50 నుంచి రూ.75కుపెంచారు. - కులవివక్షను రూపుమాపేందుకు 120 ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను మంజూరు చేశారు. ఇందుకోసం ఒక్కో హాస్టల్‌కు రూ. 2.5 కోట్లు కేటాయించారు. - వైఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని శాచ్యురేషన్ పద్ధతిలోకి తీసుకెళ్లారు. 2011-12 విద్యాసంవత్సరంలో మైనార్టీలకు ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం కేటాయించిన మొత్తం రూ.250.40 కోట్లు. 2006-07లో రూ.14 కోట్లుకాగా ప్రస్తుతం రూ.165 కోట్లకు చేరింది. - వైఎస్ అధికారంలోకి రాక ముందు మైనార్టీ విద్యార్థులకు కేవలం స్కాలర్షిప్ మాత్రమే భరించేవారు. ట్యూషన్ఫీజును విద్యార్థుల తల్లిదండ్రులే భరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ లాంటి కోర్సుల్లో సైతం మైనార్టీ విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా చేరగలుగుతున్నారని, ఈ ప్రభావం కొన్నేళ్ల తర్వాత ముస్లింలలో గణనీయ ప్రగతి సాధిస్తుందని ముస్లిం పెద్దలే వ్యాఖ్యానిస్తున్నారు. 2006 నుంచి ఇప్పటిదాకా 14 లక్షల మందికి లబ్ధి పొందారు. ఏటా 50శాతం మందికి ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు వస్తున్నాయి. ఈ కోర్సులో మైనార్టీ బాలికల కోటా 38 శాతానికి చేరడం గమనార్హం. ప్రముఖ ఆర్థికవేత్త అబూసలేషరీఫ్ నివేదికలోనూ ముస్లిం విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్న వైఎస్సార్ కలల పథకం గురించి ప్రస్తావించడం గమనార్హం. ‘ఉపకారం’ లేని బాబు... - తానే హైటెక్‌సిటీ నిర్మించానని చెప్పుకునే చంద్రబాబుకు అప్పుడు పల్లెల్లోని పేదలు గుర్తురాలేదు. కనీసం బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లిచ్చేందుకు కూడా మనసు వచ్చేది కాదు. ఒక్కో కాలేజీలో 100 మంది పిల్లలుంటే 10 మందికో, 20 మందికో స్కాలర్షిప్ మాత్రమే ఇచ్చేవారు. అది కూడా మరుసటి ఏడాది వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి ఉండేది. ఏటా కేవలం పదుల కోట్లలో స్కాలర్షిప్లను పదిశాతంమంది విద్యార్థులకిచ్చి చేతులు దులుపుకునేవారు. - ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడుతుంటే విద్యార్థి సంఘాలు ఉద్యమించినప్పుడు... వాటిని రద్దు చేస్తానని బెదిరించడమే కాక తన పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాన్ని కూడా రద్దు చేశారు. స్కాలర్‌షిప్‌ల పెంపు కోసం బీసీ విద్యార్థులు ఉద్యమిస్తే వారిపై లాఠీచార్జి చేయించారు. - స్కాలర్షిప్ ఇవ్వడానికి సిద్ధపడని బాబు ప్రభుత్వం ఇంటర్ స్థాయి నుంచే విద్యను కార్పొరేటీకరణ చేసే ప్రయత్నం చేసింది. - చదువుకే కాదు..ఉపాధికల్పనలోనూ బాబు హయాం చీకటి యుగమే. బీసీ యువతకు స్వయం ఉపాధి కోసం ఇస్త్రీపెట్టెలు, మోకులు, సైకిళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. -
వైఎస్ఆర్సీపీలో 400కుటుంబాల చేరిక
అలమండ (జామి) న్యూస్‌లైన్: జామి మండలం శిరికిపాలెం, అలమండ గ్రామాల్లో కాంగ్రెస్,టీడీపీలకు చెందిన 400 కుటుంబాల వారు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కాకర్లపూడిసూరిబాబురాజు ఆధ్వర్యంలో బుధవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. శిరికిపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బోనిరామునాయుడు, అలమండ గ్రామానికి చెందిన పాత్రుడు బంగారయ్యతోపాటు పలువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ లో చేరినవారు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి కృషిచేస్తామన్నారు. కాకర్లపూడి సూరి బాబురాజు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు.పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే స్వర్ణయుగం వస్తుందన్నారు. అమ్మ ఒడి, మహిళా రుణాలు మాఫీ,రైతులకు గిట్టుబాటు ధర వంటి పథకాలు అమలవుతాయన్నారు. కార్యక్రమంలో గుడివాడ రాజేశ్వరరావు,కొత్తలి కృష్ణ, శిరిపురపు అప్పారావు,గేదెల వెంకటరావు,కొల్లు సత్యం, రొంగలి సత్యం,బొబ్బిలి వెంకటరావు, శివ, గుడివాడ చిన్నంనాయుడు,గుడివాడ ప్రభాకర్,గుడివాడ సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.