‘అమ్మఒడి అనేది పథకం కాదు.. విద్యా విప్లవం’ | YSRCP MLA Seediri Appala Raju Speech On Amma Vodi | Sakshi
Sakshi News home page

‘అమ్మఒడి అనేది పథకం కాదు.. విద్యా విప్లవం’

Published Tue, Jan 21 2020 2:18 PM | Last Updated on Tue, Jan 21 2020 2:20 PM

YSRCP MLA Seediri Appala Raju Speech On Amma Vodi - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ఓ విద్యా విప్లవమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు కొనియాడారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సందర్భంగా మంగళవారం అమ్మ ఒడి పథకంపై మాట్లాడుతూ.. అదొక విద్యా విప్లవంగా అభివర్ణించారు. విద్యారంగం సంస్కరణల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని ప్రశంసించారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన పథక మెనూను స్వయంగా జగన్‌ రూపొందించడం నిజంగా అభినందనీయమన్నారు. 

దాదాపు అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టిన ఘనత కూడా జగన్‌దేనన్నారు. దేశ చరిత్రలో అలాంటి సంస్కరణలో ఏ రాష్ట్రంలోనూ చేయలేదన్నారు. తన పాదయాత్రలో పేదల కష్టాలను జగన్‌ చూశారని ఈ సందర్భంగా అప్పలరాజు మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇక ఫీజు రియింబర్స్‌మెంట్‌ అనేది పేద విద్యార్థులకు వరం అని అప్పలరాజు పేర్కొన్నారు. ఇక డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. అమ్మఒడి పథకం పేదలకు ఒక భరోసా అన్ని అన్నారు. అంటే అమ్మ అని, ఆ అంటే ఆంధ్రప్రదేశ్‌ని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement