Appala raju
-
సిద్ధం సభపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది
-
ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు: మంత్రి సీదిరి
-
24 గంటల్లో మత్స్యకారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, శ్రీకాకుళం: మత్స్యకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన ఆదివారం బందరువానిపేట గ్రామానికి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుతో కలిసి వచ్చారు. పడవ బో ల్తా పడి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాల ను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు మేర ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదం జరిగిన ఒక్క రోజులోనే ఆర్థిక సాయం అందించడంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. మృతులు పుక్కళ్ల గన్నయ్య, పుక్కళ్ల గణేష్, రాయితీ సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు చెక్‌లను అందజేయడంతో పాటు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున నగ దు సాయం కూడా ఆ కుటుంబాలకు అందించారు. మృతుల కుటుంబానికి వైఎస్సా ర్ ఫించను కానుక త్వరితగతిన మంజూరు చేయాల ని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సూచించారు. కార్యక్రమంలో తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా మత్స్యకార సంఘ అధ్యక్షుడు కోనాడ నర్సింహులు, మత్స్యశాఖ జేడీ పీవీ శ్రీనివాసరావు, ఎఫ్డీఓ బగాది సురేష్‌కుమార్, మైలపల్లి జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకి ఒక హార్బర్ మంజూరు రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో గల ప్రతి జిల్లాకు ఒక హార్బర్ మంజూరు చేసినట్లు మంత్రి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు బుడగట్లపాలేంకు మంజూరు చేశామని, త్వరలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. మంచినీళ్లపేట వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే హార్బర్‌గా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా పనులు జరుగుతున్నాయని తెలిపారు. బందరువానిపేట లేదా కళింగపట్నం, ఇద్దివానిపాలేం, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రాళ్లపేటకు ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి నిపుణుల కమిటీ పర్యటన జరిగిందన్నారు. హార్బర్లు లేదా ఫ్లోటింగ్ జె ట్టీల నిర్మాణం తర్వాత అత్యాధునిక బోట్లు మంజూరు చేసి మత్స్య సంపద దొరికేలా ప్రణాళిక వేస్తున్నామని వెల్లడించారు. -
పాచిపోయిన లడ్డూలు పవన్‌కు రుచిగా ఉన్నాయా?
నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి సినిమా టికెట్లు తప్ప.. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు కనపడట్లేదని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు బడుగు, బలహీన వర్గాలంటే చిన్నచూపని అన్నారు. మంత్రి అప్పలరాజు ఆదివారం గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారికి డాక్టర్లంటే గౌరవంలేదని, అందుకే వారిని హేళన చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు రుచిగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. విభజన హమీలపై కేంద్రం మాటతప్పితే పవన్ ఇప్పుడేందుకు నోరు మూసుకున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందిస్తొందని అన్నారు. తాము 22 నెలల పాలనకాలాన్ని రెఫరెండంగా భావించి ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. టీడీపీకి ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొన్నారు. తాము తిరుపతి ఉపఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నామని అన్నారు. ఒకవేళ ‘ మేం ఓడిపోతే మా 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు.. టీడీపీ ఓడిపోతే నలుగురు ఎంపీలూ రాజీనామా చేస్తారా?’’ అంటూ పెద్దిరెడ్డి చేసిన సవాల్‌ను చంద్రబాబుకు స్వీకరించే దమ్ముందా! అని తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. -
గురుమూర్తి ఫై నారాలోకేష్ వ్యాఖ్యలు దారుణం
-
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు: మంత్రి అప్పలరాజు
సాక్షి, అమరావతి: బర్డ్ ఫ్లూతో రాష్ట్రంలో ఏ ఒక్క కోడి చనిపోలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండడంతో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. ఈవ్యాధి పట్ల ప్రజల్లో నెలకొన్న సందేహాలను, భయాందోళనలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 829 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలతో పాటు జిల్లాకో టాస్క్ ఫోర్స్ కమిటీ, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
‘అమ్మఒడి అనేది పథకం కాదు.. విద్యా విప్లవం’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ఓ విద్యా విప్లవమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు కొనియాడారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సందర్భంగా మంగళవారం అమ్మ ఒడి పథకంపై మాట్లాడుతూ.. అదొక విద్యా విప్లవంగా అభివర్ణించారు. విద్యారంగం సంస్కరణల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని ప్రశంసించారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన పథక మెనూను స్వయంగా జగన్ రూపొందించడం నిజంగా అభినందనీయమన్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన ఘనత కూడా జగన్‌దేనన్నారు. దేశ చరిత్రలో అలాంటి సంస్కరణలో ఏ రాష్ట్రంలోనూ చేయలేదన్నారు. తన పాదయాత్రలో పేదల కష్టాలను జగన్ చూశారని ఈ సందర్భంగా అప్పలరాజు మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇక ఫీజు రియింబర్స్‌మెంట్ అనేది పేద విద్యార్థులకు వరం అని అప్పలరాజు పేర్కొన్నారు. ఇక డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. అమ్మఒడి పథకం పేదలకు ఒక భరోసా అన్ని అన్నారు. అంటే అమ్మ అని, ఆ అంటే ఆంధ్రప్రదేశ్‌ని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. -
బాబును చూస్తే భయంగా ఉంది : ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి : చంద్రబాబు తీరు చూస్తుంటే భయంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు సేవలు చాలని, ఇక ఆయన రెస్టు తీసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. శాసనసభలో అప్పలరాజు మాట్లాడుతూ.. ‘ఈ సభలో మేం జూనియర్స్. చాలా నేర్చుకోవాల్సి ఉంది. స్పీకర్ పట్ల చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారు. స్పీకర్ గారిది మా ఊరు. వెనుకబడిన వర్గాలకు స్పీకర్ పదవి ఇవ్వడంతో చైర్లో కూర్చోబెట్టేందుకు కూడా చంద్రబాబు రాలేదు. బాబుది ఒక మానసిక వ్యాధి. ముందుగా ఆయనకు పరీక్షలు చేయించాలి. జబ్బు నయం అయ్యాక అసెంబ్లీలోకి తీసుకురావాలి. తనది రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం అని బాబు అన్నారు. ఆయన సేవలు చాలు. ఇక రెస్టు తీసుకోవచ్చు. మరొక ఆరు నెలల్లో చాలా చూస్తారని చంద్రబాబు బెదిరించారు. బాబు మాటలు వింటుంటే భయంగా ఉంది. మొన్న పార్లమెంట్‌కు వెళ్లినప్పుడు వంగి ఉన్నారు. నిన్న అమరావతి వెళ్లి పడుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దండ వేసుకున్నారు. ఆయనను చూస్తే భయంగా ఉంది. డాక్టర్‌కు చెప్పి ఆయనకు ఉన్న వ్యాధిని నయం చేయాలి. మా ఊరి నాయకుడి పట్ల అనుచితంగా మాట్లాడితే ఊరుకోం’అని అన్నారు. క్షమాపణ చెబితే గౌరంగా ఉంటుంది.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభకు క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఇవాళ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సభకు నాయకత్వం వహించి సభను చక్కగా నడిపిస్తున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. సభలో జరిగిన పరిణామాలను యావత్ ప్రజలు గమనిస్తున్నారు. చట్టసభలో ఏం నేర్చుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. మహానేత వైఎస్సార్ కలలను నెరవేర్చే అవకాశం వచ్చింది. అందరం మర్యాదగా నడుచుకోవాలి. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటే బాగుంటుంది’అని సూచించారు. -
కోడెల మృతికి చంద్రబాబు వేధింపులే కారణం
-
నిరసనలతో హోరెత్తిన వేపగుంట
స్వగ్రామం చేరుకున్న ఆర్మీ జవాను అప్పలరాజు మృతదేహం విశాఖపట్నం: ఆర్మీ జవాను అప్పలరాజు మృతదేహం మెహిదీపట్నం నుంచి రావడంతో విశాఖ జిల్లా వేపగుంటలో విషాదకర వాతావరణం నెలకొంది. అప్పలరాజుని ముమ్మాటికీ హతమార్చారని ఆరోపిస్తూ నిరసనలు వెల్లువెత్తాయి. అప్పలరాజు హైదరాబాదు మెహిదీపట్నం ఆర్మీ ఏరియాలో విధుల్లో ఉండగానే పిస్తోలుతో కాల్చుకుని మరణించాడని అక్కడి అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అప్పలరాజు మృతదేహం మంగళవారం వేపగుంట సమీపించే సరికి కుటుంబసభ్యులు, స్థానికులు భారీగా చేరుకున్నారు. అప్పలరాజు అమర్హ్రే... అంటూ నినాదాలిచ్చారు. మృతుని తల్లి ముత్యాలమ్మ, సోదరుడు ముత్యాలు, భార్య అనసూయ, పిల్లల రోదనలతో జనం చలించిపోయారు. వీరితోపాటు జనం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అప్పలరాజు ఆత్మహత్యకు పాల్పడేటంతటి పిరికివాడు కాడని... అతని మరణంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అప్పలరాజు భౌతికకాయానికి ఆర్మీఅధికారులు గౌరవవందనం ఏర్పాటు చేయకపోవడంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తని వేధించారు... ‘నా భర్తని ముమ్మాటికీ మానసికంగా హింసించే చంపారు...మరణానికి ముందు నుంచీ పోలీసులు, ఆర్మీ అధికారులూ ఆయనను వేధించారు’ అంటూ అప్పలరాజు భార్య అనసూయ కన్నీటి పర్యంతమయింది. మెహిదీపట్నం ఆర్మీ ఏరియాలో ముస్తఫా అనే బాలుని మృతిపై కొద్ది రోజులుగా విచారణ జరుగుతుండగా.... కేసు నుంచి బయట పడడానికి ఇద్దరు జవాన్లు తన భర్తపై నింద మోపారని చెప్పింది. చనిపోవడానికి మూడు రోజుల కిందటి నుంచీ పోలీసులు, ఆర్మీ అధికారులూ వేధించారని, ముస్తఫాని అప్పలరాజే చంపినట్లు బలవంతంగా ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తుండేవారని ఆరోపించింది. తన భర్త తుపాకీతో కాల్చుకుని మరణించే అవకాశం లేనే లేదని, ఎవరో ఆయనను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఆందోళన వ్యక్తం చేసింది. తన బావ అప్పలరాజు మరణంపై అనుమానాలున్నాయని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, జ్యుడీషియల్ విచారణ జరపాలని అప్పలరాజు బావమరిది శివరామకృష్ణ డిమాండ్ చేశారు. -
నిలిచిన ఆర్మీజవాన్ అప్పలరాజు అంత్యక్రియలు
విశాఖ : ఆర్మీ జవాన్ అప్పలరాజు అంత్యక్రియలు విశాఖ వేపగుంట శ్మశాన వాటికలో మంగళవారం నిలిపిపోయాయి. అధికార లాంఛనాల కార్యక్రమానికి ఆర్మీ అధికారులు ఎవరూ రాకపోవటంపై బంధువులు ఆందోళనకు దిగారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని వారు నిలిపివేశారు. 14 ఏళ్ల పాటు కుటుంబాన్ని వదిలి దేశసేవకు అంకితమైన ఆర్మీ జవాన్‌కు ఇచ్చే గౌరవం ఇదా? అంటూ అప్పల రాజు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మోహదీపట్నం ఆర్మీ క్యాంపస్‌లో సోమవారం తెల్లవారుజామున అప్పలరాజు పిస్టోలుతో కాల్చుకుని మరణించిన విషయం తెలిసిందే. -
విశాఖకు ఆర్మీ జవాన్ అప్పలరాజు మృతదేహం
విశాఖ : హైదరాబాద్ మోహదీపట్నంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాను అప్పలరాజు మృతదేహం మంగళవారం విశాఖ చేరింది. మృతుని బంధువులు, స్థానికులు రేగొండ జంక్షన్ వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఆందోళనకు యత్నించిన అప్పలరాజు భార్య అనసూయను ఆర్మీ సిబ్బంది అడ్డుకున్నారు. కాగా అప్పలరాజు స్వస్థలం వేపగుంట. జవాను అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మోహదీపట్నం ఆర్మీ ఏరియాలో గత నెల 8వ తేదీన ముస్తఫా అనే బాలుడు మృతి చెందాడు. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే అప్పలరాజును కూడా ఇటీవలే విచారించి వదిలిపెట్టారు. తరచు విచారణ పేరుతో అప్పలరాజును వేధిస్తుండటంతో మన స్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మిలటరీ అధికారుల భావిస్తున్నారు. కాగా ముస్తఫా కేసులో అప్పలరాజును నిందితుడిగా భావించరాదని మిలటరీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో న అప్పలరాజు ఆర్మీ క్యాంపస్‌లో సోమవారం తెల్లవారుజామున పిస్టోలుతో కాల్చుకుని మరణించటం మిస్టరీగా మారింది. -
మోహదీపట్నంలో ఆర్మీ జవాన్ ఆత్మహత్య
హైదరాబాద్ : మెహదీపట్నంలో ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పలరాజు అనే ఆర్మీ జవాన్ గత రాత్రి గారీసన్ ప్రాంతంలో రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బాలుడు ముస్తాఫా కేసులో సిట్ అధికారులు అప్పలరాజును ప్రశ్నించారు. మనస్తాపంతోనే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. కాగా గత నెల 8న మిలటరీ ఎక్యుప్మెంట్ ఏరియాలో ముస్తఫా కాలిన గాయాలకు గురై మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై ముస్తఫా మరణవాంగ్మూలం మేరకు గుర్తు తెలియని ఆర్మీ సిబ్బందిపై హుమాయున్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ముస్తఫాపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులకు శనివారం ఒక నివేదిక అందింది. ముస్తఫా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా మార్చురీ వైద్యులను సైతం సిట్ బృందం విచారించింది. వారు కొన్ని కీలక అంశాలను వెల్లడించినట్లు తెలిసింది. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెంలోని అయ్యప్ప హొటల్ సమీపంలో మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెం దగా, ఇద్దరు గాయూల పాలయ్యూరు. పట్టణ ఎస్సై వి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఒక హొటల్లో పనిచేస్తున్న మామిడి అప్పల రాజు, నోముల వెంకన్న, వీరెళ్ల బాబి అనేవారు మోటార్ సైకిల్‌పై తమ స్నేహితుడైన గంగాధర్ కుమారుడి పుట్టిన రోజు ఫంక్షన్‌కు వెళుతున్నారు. అయ్యప్ప హొటల్ సమీపానికి వచ్చేసరికి వెనుకనుంచి బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. మోటార్ సైకిల్‌పై వెనుక కూర్చున మామిడి అప్పల రాజు (24) అక్కడికక్కడే మృతిచెందగా, మధ్యలో కూర్చున నోముల వెంకన్నకు తీవ్రగాయాలయ్యా యి. మోటార్ సైకిల్ నడుపుతున్న బాబి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అప్పలరాజుకు ఇంకా వివాహం కాలేదు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న అప్పలరాజు మృతితో ఆ కుటుంబం రోడ్డునపడింది. అప్పలరాజు కష్టపడి చెల్లెల్ని ఇంటర్మీడియెట్ చదివి స్తున్నాడని అతని బంధువులు తెలిపారు. తాలూకా ఆఫీస్‌సెంటర్ సమీపంలో ఒక హొటల్లో అప్పలరాజు క్లీనింగ్ సెక్షన్లో, నోముల వెంకన్న వెజిటేరియన్ కుక్‌గా, బాబి సర్వర్‌గా పనిచేస్తున్నారు. ఎస్సై శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పనవీడులో గుర్తు తెలియని వ్యక్తి మృతి పెదపాడు : ఆగివున్న లారీని మరో లారీ ఢీకొట్టిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై తాడి వెంకటనాగరాజు చెప్పారు. ఆయన తెలి పిన వివరాల ప్రకారం అప్పనవీడు నుంచి కాకినాడ వైపు వెళ్తున్న సుద్ద లోడు లారీని కలపర్రు టోల్గేట్ సమీపంలో హెచ్చరికలు, సిగ్నల్స్ లేకుండా ఆది వారం రాత్రి 11.30 గంటల సమయంలో నిలుపుదల చేశారు. వెనుకనుంచి వేగంగా వస్తున్న పంచదార లారీ ఆగివున్న లారీని ఢీకొట్టింది. పంచాదార లోడు లారీలో ఉన్న బీహార్‌కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కలపర్రు వీఆర్వో గోపి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. మృతుని వివరాలు తెలియూల్సి ఉందన్నారు.