
సాక్షి, అమరావతి: బర్డ్ ఫ్లూతో రాష్ట్రంలో ఏ ఒక్క కోడి చనిపోలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండడంతో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. ఈవ్యాధి పట్ల ప్రజల్లో నెలకొన్న సందేహాలను, భయాందోళనలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 829 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలతో పాటు జిల్లాకో టాస్క్ ఫోర్స్ కమిటీ, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment