bird flue
-
బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో తొలిమరణం.. డబ్ల్యూహెచ్ఓ యూటర్న్
బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అంతలోనే యూటర్న్ తీసుకుంది. మరణించిన సదరు వ్యక్తిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, త్వరలో స్పష్టత ఇస్తామని వెల్లడించింది.ఇటీవల హెచ్5ఎన్2 బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి మరణించారని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.అయితే, మెక్సికో ఆరోగ్య మంత్రిత్వ శాఖ 59 ఏళ్ల వ్యక్తికి దీర్ఘకాలిక కిడ్నీ సమస్య, టైప్ 2 డయాబెటిస్, దీర్ఘకాలిక రక్తపోటు సమస్య ఉందని అధికారిక ప్రకటన చేసింది.బాధితుడిలో ఇతర అనారోగ్య సమస్యలు ఏప్రిల్ 17న జ్వరం, శ్వాస ఆడకపోవడం, విరేచనాలు, వికారం, సాధారణ అస్వస్థత వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించడానికి మూడు వారాల ముందు అనారోగ్యానికి గురయ్యాడు. అత్యవసర చికిత్స కోసం బాధితుడిని ఏప్రిల్ 24న మెక్సికోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రోజు మరణించాడు.బర్డ్ ఫ్లూ మరణం కాదుఈ తరుణంలో శుక్రవారం జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీర్ మాట్లాడుతూ..ఈ మరణం పలు రకాల అనారోగ్య సమస్యల వల్ల మరణించారని, హెచ్5ఎన్2కి సంబంధించిన మరణం కాదని చెప్పారు. బర్డ్‌ఫ్లూ గుర్తించాం.. అంతేవైద్యం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన వైద్యులు బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్ల కోసం పరీక్షలు చేయగా.. బాధితుడిలో హెచ్5 ఎన్2 వేరియంట్ గుర్తించామని లిండ్‌మీర్ చెప్పారు. అతనితో పరిచయం ఉన్న 17 మందికి టెస్ట్‌లు చేయగా నెగిటివ్‌గా తేలిందిత్వరలోనే స్పష్టత ఇస్తాంపరిశోధనలు కొనసాగుతున్నాయి. సెరోలజీ కొనసాగుతోంది. అంటే ముందుగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూడటానికి రక్త పరీక్ష అని లిండ్‌మీర్ చెప్పారు. అతనిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని, పూర్తి స్థాయిలో నిర్ధారించిన వెంటనే.. మరణంపై స్పష్టత ఇస్తామని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి లిండ్‌మీర్ పేర్కొన్నారు. -
కోళ్లు ఎందుకు చనిపోతున్నాయ్..?
సాక్షి, వికారాబాద్: ధారూరుమండల పరిధిలోని దోర్నాల్ గ్రామంలో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పర్యటించారు. వరుసగా గ్రామంలో కోళ్లు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. కోళ్ల ఎందుకు చనిపోతున్నాయని ఇన్చార్జి వెటర్నరీ డాక్టర్ హతీరాంను ప్రశ్నించారు. మూడు రకాల నట్టలు కోళ్లకు వ్యాపించడంతో మృతిచెందుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని డాక్టర్ వివరించారు. దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఏదని ఎమ్మెల్యే అడుగగా.. ఇంకా అందలేని, సాయంత్రం వరకు రావచ్చని వెటర్నరీ డాక్టర్ తెలియజేశారు. రిపోర్టు రావడానికి నాలుగు రోజుల సమయం సరిపోవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. (చదవండి : వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం) మృతిచెందిన కోళ్లను పాతిపెట్టకుండా, బహిరంగ ప్రదేశాల్లో పడేయడంతో కాకులు, కోళ్లు తినడంతో మిగతావి చనిపోతున్నాయని హతీరాం తెలిపారు. వ్యాక్సిన్, పౌడర్ సరఫరా చేయడంతో వ్యాధి అదుపులోకి వచ్చిందన్నారు. గ్రామంలో ఎవరెవరి ఇళ్లలో ఎన్ని కోళ్లు చనిపోయాయో.. వాటి వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అవసరమైతే పరిహారం కోసం ప్రయత్నం చేద్దామని డాక్టర్ ఆనంద్.. ఇన్చార్జి వెటర్నరీ డాక్టర్ హతీరాంకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ విజయకుమార్, జెడ్పీటీసీ సుజాత, సర్పంచ్ పట్లోళ్ల సుజా త, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ రాజునాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, చంద్రారెడ్డి ఫౌండేషన్‌చైర్మన్ హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం
సాక్షి, వికారాబాద్: జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. వింత జబ్బుతో... వందలాది కోళ్లు చనిపోవటం గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది. కోళ్లతోపాటు కాకులు కూడా చనిపోవటంతో బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. గత వారం రోజులుగా దారూర్ మండలం దోర్నాల, యాలాల మండలంలోని పలు గ్రామాల్లో భారీ సంఖ్యల్లో కోళ్లు చనిపోతున్నాయి. వాటిని పాతిపెట్టకుండా బయట పడేయడంతో అవి తిని కుక్కలు, కాకులు చనిపోతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు భయాంధోలనకు గురవుతున్నారు. వింత వ్యాధి విషయాన్ని పశు సంవర్ధక అధికారుల దృష్టి కి తీసుకెళ్లారు. -
కాకి చనిపోయింది.. కోట మూసేశారు
సాక్షి, న్యూఢిల్లీ: ఎర్రకోట మీద ఓ కాకి చనిపోయింది... పరీక్షలు నిర్వహిస్తే కాకికి బర్డ్‌ఫ్లూ సోకిందని తేలింది. దీంతో ఈ నెల 26 వరకు ఎర్రకోట మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ప్రకటన చేశారు. ఈ నెల 10న సుమారు 15 కాకులు ఎర్రకోట ప్రాంగణంలో మృతిచెందడాన్ని అధికారులు గుర్తించారు. జలంధర్‌లోని లేబరేటరీకి పరీక్షల నిమిత్తం వాటిని పంపించగా ఒక కాకికి బర్డ్‌ఫ్లూ సోకిందని తేలిందని ఢిల్లీ ప్రభుత్వ పశు సంరక్షణ విభాగం డైరెక్టర్ రాకేష్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే రోజైన ఈ నెల 26 వరకు సందర్శకులను ఎర్రకోట లోపలికి అనుమతించడం లేదని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఒక గూడ్లగూబ మృతదేహం పరీక్షించగా దానికి బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్థారణ అయిందని అధికారులు తెలిపారు. -
పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం వద్దు
న్యూఢిల్లీ: బర్డ్‌ఫ్లూ(ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా) కారణంగా మహారాష్ట్ర, హరియాణాలో పౌల్ట్రీ కోళ్ల వధ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబైలో, మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో కొత్తగా బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడ్డాయని తెలిపింది. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, గుజరాత్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించడం సరికాదని, దీనిపై పునరాలోచించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వ్యాధి ప్రభావం లేని రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర పశు సంవర్థక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో కోళ్లలోనే కాకుండా కాకులు, గుడ్లగూబలు, పావురాలలో ఈ వ్యాధి ఆనవాళ్లు బయటపడ్డాయని పేర్కొంది. బర్డ్‌ఫ్లూపై అనుమానం ఉంటే సమాచారం అందించడానికి మహారాష్ట్ర పశు సంవర్థక శాఖ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. తాజా పరిస్థితిపై అధ్యయనం చేస్తోంది. ఈ వ్యాధిపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, గందరగోళానికి గురికావొద్దని కేంద్ర పశు సంవర్థక శాఖ కోరింది. తప్పుడు ప్రచారం వల్ల పౌల్ట్రీ పరిశ్రమతోపాటు రైతులు సైతం నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. -
రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంచేశారు. చికెన్, గుడ్లు తింటే ఎలాంటి నష్టమూ జరగదన్నారు. దేశవ్యాప్తం గా వివిధ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డితో కలసి పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, వివిధ సంస్థల శాస్త్రవేత్తలు, ప్రొఫె సర్లు, పశువైద్యశాఖ అధికారులతో మంత్రి తలసాని సమీక్షించారు. బర్డ్ ఫ్లూపై ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ వ్యాధి కనిపించినట్లు సమాచారం అందగానే పశుసంవర్థక, వైద్య ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసినట్లు చెప్పా రు. నల్లగొండ, వరంగల్, పెద్దపల్లి జిల్లాలో కోళ్ల మృతిపై సమాచారం రాగానే 276 శాం పిల్స్ సేకరించామని, అలాగే గత మూడు రోజుల్లో వెయ్యి నమూనాలు పరీక్షించగా అన్నీ నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు. పౌల్ట్రీ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలు గా సహకరిస్తుందని తెలిపారు. మన రాష్ట్రానికి వచ్చే వలస పక్షుల సంఖ్య చాలా పరిమితమన్నారు. మంత్రి ఈటల మాట్లాడుతూ.. గతం లో బర్డ్ ఫ్లూ వల్ల పౌల్ట్రీ రంగం మాత్రమే నష్టపోయిందని, మనుషులకు నష్టం జరగలేదని తెలిపారు. మన శరీరానికి తక్కువ ఖర్చుతో అధిక విలువలువున్న ప్రోటీన్లను అందించే శక్తి చికెన్, గుడ్లకే ఉందన్నారు. భేటీలో అధికారులు అనితా రాజేంద్ర, రిజ్వీ, వాకాటి కరుణ, డా.శ్రీనివాస్ రావు, డా.వి.లక్ష్మారెడ్డి, డా.రాంచందర్, బ్రీడర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి.హర్షవర్ధన్ రెడ్డి, బ్రీడర్స్ ప్రధాన కార్యదర్శి జి.రమేశ్ బాబు, నెక్ సీఈవో కె.జి.ఆనంద్, చైర్మన్ ఏ.గోపాల్‌రెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు కె.మోహన్‌రెడ్డి, భాస్కర్‌రావు, చంద్రశేఖర్ రెడ్డి, స్నేహ చికెన్ డి.రాఘవరావు పాల్గొన్నారు. 25లోగా హాస్టళ్లకు బియ్యం సరఫరా సమావేశంలో గంగుల, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 25వ తేదీలోగా సన్నబియ్యం అందుబాటులో ఉంచాలని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. సన్నబియ్యంతో పాటు పప్పు, ఉప్పులు, నూనె, ఇతర రేషన్ సరుకులను అందుబాటులో ఉంచడంతో పాటు శానిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. 26 తర్వాత హాస్టళ్లలో వసతులపై మంత్రులు, శాసన సభ్యులు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. కలెక్టర్లతో ఈ నెల 18వ తేదీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 9, 10, ఇంటర్, డిగ్రీ, బీటెక్ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏర్పాట్లను మంత్రి గంగుల మంగళవారం తన కార్యాలయంలో శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దాదాపు 9 నెలల నుండి హాస్టళ్లు, స్కూల్స్ మూతపడి ఉన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యంగా శానిటేషన్‌పై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు పౌరసరఫరాల సంస్థ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోందని ప్రతినెల 8,500 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని చెప్పారు. దాదాపు 74వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అందుబాటులో ఉన్నాయని, ఈ నెల 25వ తేదీలోగా గోదాముల నుండి హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు రవాణా చేయాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు: మంత్రి అప్పలరాజు
సాక్షి, అమరావతి: బర్డ్ ఫ్లూతో రాష్ట్రంలో ఏ ఒక్క కోడి చనిపోలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండడంతో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. ఈవ్యాధి పట్ల ప్రజల్లో నెలకొన్న సందేహాలను, భయాందోళనలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 829 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలతో పాటు జిల్లాకో టాస్క్ ఫోర్స్ కమిటీ, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
9 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ పంజా
న్యూఢిల్లీ: ఇప్పటికే దేశంలోని 7 రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ విస్తరించినట్టుగా కేంద్రం నిర్ధారించింది. కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ ఫ్లూ వెలుగుచూసిన విషయం తెలిసిందే. బర్డ్ ప్లూ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బర్డ్ ఫ్లూ వెలుగుచూసిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపి దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ సోకిన రాష్ట్రాల సంఖ్య 9కి చేరింది. ఫ్లూ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాను నిలిపివేశాయి. మహారాష్ట్రలోని ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్బనీ ప్రాంతంలో రెండు రోజుల్లోనే దాదాపు 800 కోళ్లు, పక్షులు మృతిచెందాయని ఆ జిల్లా కలెక్టర్ మధుకర్ ముగ్లికర్ తెలిపారు. మురుంబా గ్రామంలో 8 కోళ్ల ఫారాలలో 8 వేల కోళ్లు ఉన్నాయని.. వాటిని చంపేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ మీడియాకు చెప్పారు. ఫ్లూ నేపథ్యంలో చత్తీస్గడ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తమ రాష్ట్రంలో ఫ్లూ ప్రబలిందేమోనని ప్రభుత్వ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఫ్లూ విస్తరిస్తున్ననేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. పార్లమెంటరీ వ్యవసాయ స్టాండింగ్ కమిటీ అధికారులు కేంద్ర పశు సంవర్ధక శాఖఅధికారులతో చర్చలు చేస్తున్నారు. నివారణ మందుపై సోమవారం (జనవరి 11) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు. మొట్టమొదటిసారిగా బర్డ్ ఫ్లూ 2006లో వెలుగులోకి వచ్చింది. చదవండి: టీకా పంపిణీలో ‘కోవిన్’ కీలకం -
బర్డ్‌ఫ్లూ కల్లోలం: 381 వలస పక్షులు బలి
న్యూఢిల్లీ: భారత్‌లో బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్8) పంజా విసురుతోంది. పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం 381 వలస పక్షులు ప్రాణాలు విడిచాయి. కర్ణాటకలో 6, గుజరాత్లో 4 కాకులు మరణించాయి. కేరళలో వేల సంఖ్యలో కోళ్లు, బాతులు మృతిచెందాయి. కేంద్ర బృందం కొట్టాయం, అలప్పుజా జిల్లాలో పర్యటిస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 9 కాకులు మరణించాయి. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి పెరుగుతుండడంతో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో హైఅలర్ట్ విధించారు. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల దిగుమతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పటివరకు కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌లో మాత్రమే బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. బర్డ్‌ఫ్లూతో మరణించిన పక్షులను దహనం చేసేందుకు పీపీఈ కిట్లు, ఇతర పరికరాలు సిద్ధం చేసుకోవాలని వెల్లడించింది. ఈ వ్యాధిపై, నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని కోరింది. పక్షులు, జంతు మాంసం తినేవారు బాగా ఉడికించిన తర్వాతే తినాలంది. కేరళలో రైతులకు నష్ట పరిహారం కేరళలోని అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో ఇప్పటిదాకా 69 వేలకు పైగా కోళ్లు, బాతులు మరణించాయి. వాటిని పెంచుతున్న రైతులకు నష్టపరిహారం అందజేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో బర్డ్‌ఫ్లూతో మరణించిన వలస పక్షుల సంఖ్య 3,409కు చేరింది. చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోనూ కాకులు ప్రాణాలు కోల్పోయాయి. కర్ణాటకలో మృతిచెందిన కాకుల నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు మంత్రి చెప్పారు. గుజరాత్ రాష్ట్రం మెహసానా జిల్లాలోని ప్రఖ్యాత సూర్య దేవాలయంలో 4 కాకులు మరణించినట్లు అధికారులు చెప్పారు. ఒడిశాలో బర్డ్‌ఫ్లూ అడుగు పెట్టకుండా కఠిన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?
పక్షులకు వచ్చే జలుబు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా టైప్ –ఏ వైరస్లు వ్యాధి కారకాలు. కోవిడ్–19 కారక కరోనా వైరస్‌లో మాదిరిగానే ఈ వైరస్‌లోనూ పలు రకాలు ఉన్నాయి. తక్కువ ప్రభావం చూపేవి కొన్ని.. అధిక ప్రభావం చూపేవి మరికొన్ని. రెండో రకం వైరస్లు కోళ్లు ఇతర పక్షులకు తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయి. సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్‌లను ‘‘హెచ్’’, ‘‘ఎన్’’రకాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఈ వైరస్లు మనుషుల్లోకి ప్రవేశించవు కానీ.. కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. ప్రాణాలు కోల్పోవడమూ సంభవమే. కోళ్లు ఇతర పౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. మనుషులకూ సోకుతుందా? మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు అరుదు. కానీ హెచ్5, హెచ్7, హెచ్9 రకాల వైరస్లు మాత్రం మనుషుల్లోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే రూఢీ అయ్యింది. వైరస్ సోకిన పక్షులను తాకడం, వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలను ముట్టుకోవడం ద్వారా మనుషులకూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బాగా వండిన కోడిగుడ్లు, చికెన్లతో వ్యాధి సోకే అవకాశాలు లేవు. ఇతరులకు సోకుతుందా? జలుబు లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో న్యుమోనియా, శ్వాస సమస్యలు, మరణమూ సంభవించవచ్చు. మనుషుల నుంచి ఇతరులకు బర్డ్‌ఫ్లూ సోకదు. ఎలాంటి పక్షులకు సోకుతుంది? కోళ్లు, బాతులు, హంసలు, నెమళ్లు, కాకుల వంటి పక్షులపై బర్డ్‌ఫ్లూ ప్రభావం ఉంటుంది. కోళ్లలో అతిసారం, కాలి పంజా ప్రాంతాలు వంకాయ రంగులోకి మారడం, తల, కాళ్లు వాచిపోవడం, వంటివి కనిపిస్తాయి. ముక్కు, ఊపిరితిత్తుల నుంచి వెలువడే ద్రవాల ద్వారా ఈ వ్యాధి పక్షుల్లో వ్యాపిస్తుంది. వ్యాధికి గురైన పక్షుల మలం తగిలినా చాలు. కలుషిత ఆహారం, నీరు ద్వారానూ వ్యాపిస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బాగా ఉడికించిన తరువాత మాత్రమే చికెన్, గుడ్లు వంటివి తినాలి. ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మేలు. పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారు వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా పాటించాలి. కోళ్లఫారమ్‌లలో పనిచేసేటప్పుడు చేతులకు కచ్చితంగా తొడుగులు వేసుకోవడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, ఎన్95 మాస్కులు ధరించడం, పీపీఈ కిట్లు, కళ్లజోళ్లు వాడటం ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. -
దేశంలో కొత్త విపత్తు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్ ఫ్లూ) వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. పక్షులకు ప్రాణాంతకమైన ఈ హెచ్5ఎన్1 వైరస్ కారణంగా రాజస్తాన్, కేరళ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో వివిధ రకాల పక్షులు చనిపోతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి కారణంగా అడవి బాతుల (వైల్డ్ గీస్) వంటి వలస పక్షులు చనిపోయినట్లు యంత్రాంగం నిర్ధారించింది. అలాగే రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో కాకులు, కేరళలో బాతులు చనిపోయినట్టు వివిధ వార్తాసంస్థలు తెలిపాయి. హరియాణాలో కొద్దిరోజులుగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడం వెనక కారణాలు ఇంకా తెలియరాలేదు. విపత్తుగా ప్రకటించిన కేరళ కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో ఈ వైరస్ ప్రభావం కనిపించింది. అలప్పుజ జిల్లాలోని కుట్టనాడ్ ప్రాంతంలో నేదుముడి, తకాళి, పల్లిప్పడ్, కరువత్తా తదితర నాలుగు పంచాయతీలలో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కేరళలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని విపత్తుగా ప్రకటించింది. ఈ కేసులు గుర్తించిన ప్రాంతాలకు ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న పెంపుడు కోళ్లు, బాతులను బుధవారం సాయంత్రం కల్లా చంపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది. ఒక్క కుట్టనాడ్ ప్రాంతంలోనే 34 వేల పెంపుడు పక్షులను చంపాల్సి ఉండగా, కొట్టాయం జిల్లా నీందూర్ పంచాయతీలో 3 వేల పక్షులను ఇప్పటికే చంపినట్లు యంత్రాంగం తెలిపింది. ఈ పంచాయతీలో 1,700 బాతులు వైరస్ బారిన పడి చనిపోయాయి. అలప్పుజ జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతంలో మాంసం, గుడ్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ ఆయా వ్యాపార కేంద్రాల మూసివేతకు ఆదేశించారు. మధ్యప్రదేశ్‌లోనూ.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వారం రోజుల్లో 155 కాకులు వైరస్ కారణంగా చనిపోయాయి. అయితే, ఈ వైరస్ ఇప్పటివరకు పౌల్ట్రీలో సంక్రమించలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజస్తాన్ నుంచి పక్షుల ద్వారా వైరస్ సంక్రమించినట్టు వచ్చిందని యంత్రాంగం అనుమానిస్తోంది. పొరుగునే ఉన్న రాజస్తాన్‌లోని దాదాపు 16 జిల్లాల్లో 625 పక్షులు చనిపోయినట్టు యంత్రాంగం వెల్లడించింది. ఝాల్వార్, కోటా, బారన్ జిల్లాల్లో వైరస్ జాడలు కనిపించాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో గల పాంగ్ డ్యామ్ సరస్సులో బర్డ్ ఫ్లూ కారణంగా 2,700 వలస పక్షులు చనిపోయాయి. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకడం వల్లే ఈ పక్షులు చనిపోయినట్టు నిర్ధారణయింది. అప్రమత్తమైన రాష్ట్రాలు రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, కేరళలో బర్డ్‌ఫ్లూ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిక జారీ చేశాయి. ఆయా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోవడంతో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. కేరళను కలిపే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టినట్లు తమిళనాడు తెలిపింది. మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్ మనుషులకు సోకినట్లు ఆధారాలు లేవని బాధిత రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. -
చైనాను వణికిస్తున్న మరో వైరస్
బీజింగ్ : కరోనా వైరస్‌తో ఇప్పటికే విలవిలలాడుతున్న చైనాను మరో ప్రాణాంతక వైరస్ భయపెడుతోంది. హానికర బర్డ్ ప్లూ వైరస్ ఆనవాళ్లను చైనాలో గుర్తించారు. ఈ విషయాన్ని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. దక్షిణ ప్రావిన్స్ హుహాన్‌లోని షావోయాంగ్ సిటీలో వెలుగు చూసిన H5N1 బర్డ్ ప్లూ కారణంగా ఇప్పటికే 4500 కోళ్లు చనిపోయాయి. 18వేలకు పైగా కోళ్లను ప్రభుత్వం చంపేసింది. ఇతర ప్రాంతాలకు బర్డ్ ప్లూ వ్యాప్తి చెందకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటి వరకైతే ఈ వైరస్ మనుషులకు సోకలేదు. కాగా, 2003లో వెలుగులోకి వచ్చిన బర్డ్‌ప్లూ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 455 మంది మృతి చెందారు. (చదవండి : కరోనా ఎఫెక్ట్ : భారత్ కీలక నిర్ణయం) మరోవైపు కరోనా వైరస్ బారిన పడి చైనాలో ఇప్పటికే 300 మందికి పైగా మృతిచెందారు. అలాగే 14,562 మందికి ఈ వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు. ఈ ప్రమాదకరమైన వైరస్ ఇప్పటివరకు 25 దేశాలకు విస్తరించింది. అందులో భారత్ కూడా ఉంది. భారత్‌లో రెండు కరోనా వైరస్ కేసులను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. -
మంకీ ఫీవర్ పంజా
బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ తరువాత మంకీ ఫీవర్ ప్రజలను వణికిస్తోంది. కోతుల నుంచి జంతువులకు, వాటి నుంచి మానవులకు వ్యాపించే ఈ జ్వరం ప్రాణాంతకంగా మారుతోంది. చిక్కమగళూరు, శివమొగ్గ తదితర జిల్లాల్లో తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. వ్యాప్తిని అరికట్టడానికి చిక్కమగళూరు జిల్లాలో ఏకంగా పర్యాటకుల రాకను నిషేధించారు. సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో పలుజిల్లాల్లో మంకీ ఫీవర్ (కోతి జ్వరం) వ్యాపిస్తోంది. చిక్కమగళూరు, శివమొగ్గ, ఉత్తర కన్నడ తదితర మల్నాడు జిల్లాల్లో విస్తరిస్తున్న ఈ వ్యాధి ఒక విదేశీ పర్యాటక మహిళకు సోకింది. ఇప్పటికే పదిమంది వరకూ బలి తీసుకున్న మంకీ ఫీవర్ ఉత్తర కన్నడ జిల్లా పర్యాటకానికి వచ్చిన నేపాల్ మహిళకు వ్యాపించింది. ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో కుమాటాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ మంకీ ఫీవర్ లక్షణాలు కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం మణిపాల్‌లోని కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. పై జిల్లాల్లో ఇప్పటివరకు 150 మందికి పైగా వైరస్ సోకింది. మరోవైపు మంకీ ఫీవర్ విస్తరించకుండా చిక్కమగళూరు జిల్లాలో పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. మంకీ ఫీవర్ అంటే? గతేడాది డిసెంబర్ నెలలో శివమొగ్గ జిల్లాలో ఈ మంకీ ఫీవర్ వెలుగులోకి వచ్చింది. తొలుత 1957లో ఒక కోతిలో ఈ వైరస్‌ను గుర్తించారు. శివమొగ్గ జిల్లా సొరబ తాలూకాలోని క్యాసనూరు గ్రామంలో తొలుత ఈ మంకీ ఫీవర్‌కు కారణమైన వైరస్‌ను గుర్తించారు. దీంతో ఆ వైరస్‌కు క్యాసనూర్ అని పేరు పెట్టారు. ఈ వైరస్ సోకిన కోతి నుంచి మానవులకు అంటుకుంటోంది. కోతుల్లోని ఈ వైరస్ గాలి ద్వారా పశువులకు, మనుసులకు సోకుతుంది. కానీ మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సోకదని నిపుణులు చెబుతున్నారు. ఇవీ లక్షణాలు ♦ వైరస్ సోకిన తర్వాత ఒక వారం వరకు ఎలాంటి లక్షణాలను చూపించదు. ♦ వారం తర్వాత విపరీతమైన జ్వరం, తలనొప్పి, నరాల బలహీనత, కండరాల తిమ్మిరి, వాంతులు కనిపిస్తాయి. ♦ వ్యాధి తీవ్రతరమయ్యాక నోరు, చిగుళ్లు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. ♦ బీపీ, ఎర్ర రక్తకణాలు బాగా తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. ♦ వ్యాధి ముదిరితే మతిస్థిమితం కోల్పోవచ్చు. ♦ ఈ వ్యాధి వస్తే మరణించే అవకాశాలు 3–5 శాతం ఉంటాయి. -
ఈ పక్షులకు ఏమైంది ?
మండ్య : మండ్య జిల్లా మద్దూరు తాలూకా లో కొక్కరె బెళ్లూరులో విదేశీ పక్షులు అస్వస్థతకు గురై మృతి చెందుతుండటం కలకలం రేపుతోంది. గురువారం నాలుగు ప క్షులు ఎగురుతూనే మృతి చెందాయి. కొ నప్రాణం ఉన్న పక్షిని పరిశీలించగా కొద్ది కాలంగా ఆహారం తీసుకున్నట్లు కనిపించకపోగా దానికి మళ్లీ ఎగిరే శక్తి లేకపో యింది. ఇదిలా ఉంటే ఈ పక్షులకు బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి పరిశోధనలు చేస్తున్నారు. బర్డ్ సోకినట్లు నిర్ధారణకు వచ్చిన విషయాన్ని బయటకు చెప్పడం లేదు. కొక్కరెబెళూరులో పక్షులు నివాసం ఉంటున్న గూళ్లకు ముందు జాగ్రత్త చర్యగా సిబ్బంది మందులు కూడా చల్లారు. బెంగళూరు పశుసంవర్ధక శాఖ జేడీ హలగప్ప నేతృత్వంలో అధికారుల బృదం పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా ఇక్కడి కారసవాడి పౌల్ట్రీ ఫారంలో వేలాది కోసం మృతి చెందాయి. వాటి నమూనాలు, పెలికాన్ నమూనాలు భోపాల్‌కు పంపిం చడంతో అక్కడి నివేదిక మేరకు కోళ్లు, పెలికాన్‌లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు ఉంది. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. -
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్ సేల్స్ ఢమాల్!!
దేశంలోనే అతిపెద్ద పౌల్ట్రీ హబ్ గా పేరొందిన రంగారెడ్డి జిల్లాలో కోళ్లు, కోడిమాంసం విక్రయాలు కుదేలవుతున్నాయి. బర్డ్‌ప్లూ కారణంగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతోపాటు, పలు గ్రామాల్లో చికెన్ సెంటర్లు వ్యాపారం లేక వెలవెలబోతున్నాయి. కోళ్లేకాదు.. కనీసం కోడి గుడ్లు కూడా కొనేందుకు కూడా జనం ఆసక్తి చూపడంలేదు. దీంతో పౌల్ట్రీఫాం, చికెన్ సెంటర్ల యాజమానులు తలలు పట్టుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూర్‌లో బర్డ్‌ప్లూ వ్యాధి వెలుగు చూడడంతో లక్షల కోళ్లను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు చికెన్ కొనేందుకు ఆసక్తి చూపడం లేదని, కోళ్ల పరిశ్రమ దెబ్బతినకుండా బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు వ్యాపారులు మొరపెట్టుకుంటున్నారు.