దోర్నాల్‌లో మృతిచెందిన కోడిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్ తదితరులు
సాక్షి, వికారాబాద్: ధారూరుమండల పరిధిలోని దోర్నాల్ గ్రామంలో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పర్యటించారు. వరుసగా గ్రామంలో కోళ్లు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. కోళ్ల ఎందుకు చనిపోతున్నాయని ఇన్‌చార్జి వెటర్నరీ డాక్టర్ హతీరాంను ప్రశ్నించారు. మూడు రకాల నట్టలు కోళ్లకు వ్యాపించడంతో మృతిచెందుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని డాక్టర్ వివరించారు. దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఏదని ఎమ్మెల్యే అడుగగా.. ఇంకా అందలేని, సాయంత్రం వరకు రావచ్చని వెటర్నరీ డాక్టర్ తెలియజేశారు. రిపోర్టు రావడానికి నాలుగు రోజుల సమయం సరిపోవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
(చదవండి : వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం)
మృతిచెందిన కోళ్లను పాతిపెట్టకుండా, బహిరంగ ప్రదేశాల్లో పడేయడంతో కాకులు, కోళ్లు తినడంతో మిగతావి చనిపోతున్నాయని హతీరాం తెలిపారు. వ్యాక్సిన్, పౌడర్ సరఫరా చేయడంతో వ్యాధి అదుపులోకి వచ్చిందన్నారు. గ్రామంలో ఎవరెవరి ఇళ్లలో ఎన్ని కోళ్లు చనిపోయాయో.. వాటి వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అవసరమైతే పరిహారం కోసం ప్రయత్నం చేద్దామని డాక్టర్ ఆనంద్.. ఇన్‌చార్జి వెటర్నరీ డాక్టర్ హతీరాంకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ విజయకుమార్, జెడ్పీటీసీ సుజాత, సర్పంచ్ పట్లోళ్ల సుజా త, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ రాజునాయక్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, చంద్రారెడ్డి ఫౌండేషన్‌చైర్మన్ హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment