
సాక్షి, వికారాబాద్: జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. వింత జబ్బుతో... వందలాది కోళ్లు చనిపోవటం గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది. కోళ్లతోపాటు కాకులు కూడా చనిపోవటంతో బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. గత వారం రోజులుగా దారూర్ మండలం దోర్నాల, యాలాల మండలంలోని పలు గ్రామాల్లో భారీ సంఖ్యల్లో కోళ్లు చనిపోతున్నాయి. వాటిని పాతిపెట్టకుండా బయట పడేయడంతో అవి తిని కుక్కలు, కాకులు చనిపోతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు భయాంధోలనకు గురవుతున్నారు. వింత వ్యాధి విషయాన్ని పశు సంవర్ధక అధికారుల దృష్టి కి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment