బీజింగ్ : కరోనా వైరస్‌తో ఇప్పటికే విలవిలలాడుతున్న చైనాను మరో ప్రాణాంతక వైరస్ భయపెడుతోంది. హానికర బర్డ్ ప్లూ వైరస్ ఆనవాళ్లను చైనాలో గుర్తించారు. ఈ విషయాన్ని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. దక్షిణ ప్రావిన్స్ హుహాన్‌లోని షావోయాంగ్ సిటీలో వెలుగు చూసిన H5N1 బర్డ్ ప్లూ కారణంగా ఇప్పటికే 4500 కోళ్లు చనిపోయాయి. 18వేలకు పైగా కోళ్లను ప్రభుత్వం చంపేసింది. ఇతర ప్రాంతాలకు బర్డ్ ప్లూ వ్యాప్తి చెందకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటి వరకైతే ఈ వైరస్ మనుషులకు సోకలేదు. కాగా, 2003లో వెలుగులోకి వచ్చిన బర్డ్‌ప్లూ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 455 మంది మృతి చెందారు.
(చదవండి : కరోనా ఎఫెక్ట్ : భారత్ కీలక నిర్ణయం)
మరోవైపు కరోనా వైరస్ బారిన పడి చైనాలో ఇప్పటికే 300 మందికి పైగా మృతిచెందారు. అలాగే 14,562 మందికి ఈ వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు. ఈ ప్రమాదకరమైన వైరస్ ఇప్పటివరకు 25 దేశాలకు విస్తరించింది. అందులో భారత్ కూడా ఉంది. భారత్‌లో రెండు కరోనా వైరస్ కేసులను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment