మండ్య : మండ్య జిల్లా మద్దూరు తాలూకా లో కొక్కరె బెళ్లూరులో విదేశీ పక్షులు అస్వస్థతకు గురై మృతి చెందుతుండటం కలకలం రేపుతోంది. గురువారం నాలుగు ప క్షులు ఎగురుతూనే మృతి చెందాయి. కొ నప్రాణం ఉన్న పక్షిని పరిశీలించగా కొద్ది కాలంగా ఆహారం తీసుకున్నట్లు కనిపించకపోగా దానికి మళ్లీ ఎగిరే శక్తి లేకపో యింది. ఇదిలా ఉంటే ఈ పక్షులకు బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి పరిశోధనలు చేస్తున్నారు. బర్డ్ సోకినట్లు నిర్ధారణకు వచ్చిన విషయాన్ని బయటకు చెప్పడం లేదు.
కొక్కరెబెళూరులో పక్షులు నివాసం ఉంటున్న గూళ్లకు ముందు జాగ్రత్త చర్యగా సిబ్బంది మందులు కూడా చల్లారు. బెంగళూరు పశుసంవర్ధక శాఖ జేడీ హలగప్ప నేతృత్వంలో అధికారుల బృదం పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా ఇక్కడి కారసవాడి పౌల్ట్రీ ఫారంలో వేలాది కోసం మృతి చెందాయి. వాటి నమూనాలు, పెలికాన్ నమూనాలు భోపాల్‌కు పంపిం చడంతో అక్కడి నివేదిక మేరకు కోళ్లు, పెలికాన్‌లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు ఉంది. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment