బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. అంతలోనే యూటర్న్ తీసుకుంది. మరణించిన సదరు వ్యక్తిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, త్వరలో స్పష్టత ఇస్తామని వెల్లడించింది.
ఇటీవల హెచ్5ఎన్2 బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి మరణించారని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.
అయితే, మెక్సికో ఆరోగ్య మంత్రిత్వ శాఖ 59 ఏళ్ల వ్యక్తికి దీర్ఘకాలిక కిడ్నీ సమస్య, టైప్ 2 డయాబెటిస్, దీర్ఘకాలిక రక్తపోటు సమస్య ఉందని అధికారిక ప్రకటన చేసింది.
బాధితుడిలో ఇతర అనారోగ్య సమస్యలు
ఏప్రిల్ 17న జ్వరం, శ్వాస ఆడకపోవడం, విరేచనాలు, వికారం, సాధారణ అస్వస్థత వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించడానికి మూడు వారాల ముందు అనారోగ్యానికి గురయ్యాడు. అత్యవసర చికిత్స కోసం బాధితుడిని ఏప్రిల్ 24న మెక్సికోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రోజు మరణించాడు.
బర్డ్ ఫ్లూ మరణం కాదు
ఈ తరుణంలో శుక్రవారం జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీర్ మాట్లాడుతూ..ఈ మరణం పలు రకాల అనారోగ్య సమస్యల వల్ల మరణించారని, హెచ్5ఎన్2కి సంబంధించిన మరణం కాదని చెప్పారు.
బర్డ్‌ఫ్లూ గుర్తించాం.. అంతే
వైద్యం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన వైద్యులు బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్‌ల కోసం పరీక్షలు చేయగా.. బాధితుడిలో హెచ్5 ఎన్2 వేరియంట్ గుర్తించామని లిండ్‌మీర్ చెప్పారు. అతనితో పరిచయం ఉన్న 17 మందికి టెస్ట్‌లు చేయగా నెగిటివ్‌గా తేలింది
త్వరలోనే స్పష్టత ఇస్తాం
పరిశోధనలు కొనసాగుతున్నాయి. సెరోలజీ కొనసాగుతోంది. అంటే ముందుగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూడటానికి రక్త పరీక్ష అని లిండ్‌మీర్ చెప్పారు. అతనిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని, పూర్తి స్థాయిలో నిర్ధారించిన వెంటనే.. మరణంపై స్పష్టత ఇస్తామని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి లిండ్‌మీర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment